నర్సయ్య (ఫైల్)
సిరిసిల్ల: నిజాం వ్యతిరేక పోరాటంలో ఉద్యమించిన సమరయోధుడు, సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు వంగరి నర్సయ్య(102) గురువారం కన్నుమూశారు. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించిన వంగరి నర్సయ్య పెద్దగా సుపరిచితులు. శతాధిక వృద్ధుడిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో గత పక్షం రోజులుగా మంచం పట్టారు.
సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం 2008లో సీఎం కేసీఆర్ రూ.50లక్షల నిధిని సమకూర్చగా.. ఆ నిధిని పేదలకు అందించే బాధ్యతను పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడిగా వంగరి నర్సయ్యకు అప్పగించారు. పేదలకు వడ్డీ లేని రుణాలు అందించి ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపించడంలో నర్సయ్య ముందున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూమార్తెలు ఉన్నారు. వంగరి నర్సయ్య మృతి పట్ల వివిధ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం పెద్దలు సంతాపం తెలిపి, నర్సయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment