నదిలో దిగి ఒకరి గల్లంతు | man missing in gostani river | Sakshi
Sakshi News home page

నదిలో దిగి ఒకరి గల్లంతు

Published Wed, Aug 19 2015 3:34 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man missing in gostani river

తగరపువలస (విశాఖపట్టణం): గోస్తనీ నదిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. విశాఖప్టణం జిల్లా భీమిలి పట్టణం వలందపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం తగరపువలస సమీపంలోని గోస్తనీ నదికి వెళ్లారు. లోపల దిగి స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.


నర్సింగరావు(35) అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోగా మిగతా ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. స్థానికుల సమాచారం మేరకు చిట్టివలస నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ప్రవాహ వేగం చూసి నీటిలోకి దిగలేకపోయారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలించేందుకు గజ ఈతగాళ్లను రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement