అదనపు జేసీగా నర్సింగరావు
Published Tue, Feb 4 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా సీహెచ్ నర్సింగరావు నియమితులయ్యారు. విశాఖపట్నంలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచే స్తున్న ఆయనను జిల్లా అదనపు జేసీగా బదిలీ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీఆర్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అదనపు జేసీగా నియమితులైన రెండో వ్యక్తి నర్సింగరావు. గతంలో అదనపు జేసీగా పనిచేసిన మిరియాల వెంకట శేషగిరిబాబు గతేడాది జూన్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జిల్లా రెవెన్యూ అధికారే
ఇన్‌ఛార్జి జేసీగా వ్యవహరిస్తున్నారు.
ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నర్సింగరావు ఎంఏ బీఈడీ చదివారు. తొలుత రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం గ్రూప్ పరీక్షల్లో సబ్ రిజిష్ట్రార్ పోస్టింగ్ వచ్చినప్పటికీ చేరలేదు. 1990లో మళ్లీ గ్రూప్-2 పరీక్ష రాసి రెవెన్యూశాఖలో ప్రవేశించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మార్వోగా తొలి పోస్టింగ్ పొందారు. 12 ఏళ్లపాటు అక్కడే పనిచేశారు. 2002లో డెప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. అనంతరం విశాఖపట్నం ఉడా సెక్రటరీగా, రంపచోడవరం, కావలి, కందుకూరుల్లో ఆర్డీవోగా, విజయవాడ-శ్రీకాకుళం(ఆరు జిల్లాల) ఎండోమెంట్ మల్టీజోనల్ ఆఫీసర్‌గా, తూర్పుగోదావరి జిల్లాలోని సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విశాఖ అర్బన్‌ల్యాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచే స్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. వారం రోజుల్లో విధుల్లో చేరనున్నట్టు ఆయన ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
Advertisement
Advertisement