jc
-
కలెక్టర్, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాల ఫోర్జరీతో భూములకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన వ్యవహారంలో కూడేరు పోలీసులు తీగ లాగితే డొంక కదులుతోంది. అనుమానితులను పుట్టపర్తి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కూడేరు మండలం కమ్మూరుకు చెందిన బోయ నారాయణప్ప పేరిట సర్వే నంబరు 525, 526లో 34.86 ఎకరాల భూమిని ఇటీవల అనంతపురం, ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాగార్జునరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, మరో ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఎకరా రూ.54 లక్షల ప్రకారం అగ్రిమెంటు చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు అగ్రిమెంటు మీద ఎక్కువ ధరతో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ భూమిలో కొంత భాగానికి 1954లో మంజూరైన డీ–పట్టా భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగింస్తే మరింత ఎక్కువ ధర దక్కుతుందన్న ఆశతో ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూడేరు తహసీల్దార్, అనంతపురం ఆర్డీఓ కార్యాలయాల్లో సంతకాలు పూర్తయిన తర్వాత ఫైలు కలెక్టర్ కార్యాలయానికి చేరి ఆగిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. గతంలో కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన మహబూబ్‌బాషాను ఆశ్రయించారు. రూ.10 లక్షలు ఇస్తే త్వరగా చేయించి ఇస్తానని వారితో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారు కొంత మొత్తాన్ని ముట్టజెప్పడంతో వారికి మహబూబ్‌బాషా ఎన్ఓసీ తెచ్చిచ్చారు. దానిని చూపి వ్యాపారులు అధిక ధరకు భూమిని విక్రయించేందుకు తోటి రియల్టర్లను కలిశారు. భూమి పత్రాలతో పాటు ఆ సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లో షేర్ చేశారు. అలా చక్కర్లు కొట్టిన ఆ పత్రాలు ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చేతికి చేరాయి. రెండు రోజుల క్రితం లేదన్న ఎన్ఓసీ ఇప్పుడు ఎలా వచ్చిందని ఆరా తీసిన ఆ ప్రజాప్రతినిధి చివరకు కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. దీంతో కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్ అని నిర్ధారణ అయింది. కలెక్టరేట్లో సహకరించిందెవరు? కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్ఓసీ సృష్టించిన వైనంపై కలెక్టరేట్లో మహబూబ్‌బాషాకు ఎవరు సహకరించారనే అంశంపై విచారణ మొదలైంది. సంబంధిత సెక్షన్‌లోని సిబ్బందిని పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో కీలక నిందితుడు కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్ఓసీ సృష్టించిన కీలక నిందితుడు మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూడేరు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మహబూబ్బాషాపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 420, 421, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. (చదవండి: ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...) -
పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఏకంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. వాటి ఆధారంగా నకిలీ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సృష్టించారు. దానిపై ఓ ప్రజాప్రతినిధికి అనుమానం రావడం, ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు. ప్రజాప్రతినిధికి అనుమానం రావడంతో.. సదరు ఎన్ఓసీ ఓ ప్రజాప్రతినిధి చేతికి వెళ్లింది. అంత త్వరగా ఎన్ఓసీ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ పరిశీలించి నకిలీదిగా నిర్ధారించారు. దీని సృష్టికర్తలెవరో తేల్చాలంటూ అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించారని ఆర్డీఓ కూడా నిర్ధారించారు. కంప్యూటర్ ఆపరేటర్ పనేనా? అనంతపురంలో పనిచేస్తున్న పుట్టపర్తి ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ ఎన్ఓసీని తయారు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సదరు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ హయాంలోనూ ఇలాంటి పని చేసి అప్పటి జేసీ చేతికి చిక్కినట్లు సమాచారం. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో విషయం బయటకు రాలేదు. (చదవండి: సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి) -
తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా?
కణేకల్లు: ‘ఏం తమాషా చేస్తున్నావా? డ్యూటీ అంటే లెక్క లేదా? పని చేయాలనుకుంటున్నావా? లేదా? డ్యూటీ పట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?’ అంటూ కణేకల్లు రెండో సచివాలయ ఏఎన్ఎం పర్థమ్మపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కణేకల్లు రెండో సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల గురించి ఏఎన్ఎం పర్థమ్మతో ఆరా తీశారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రికార్డులు పరిశీలించారు. అందులో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వెంటనే డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరరావుకు ఫోన్ చేసి సచివాలయ ఏఎన్ఎంల పనితీరుపై పర్యవేక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. చదవండి: బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పర్థమ్మకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన సరైన సమాధానాలు ఇవ్వని మహిళా పోలీస్‌పై మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సర్పంచ్ నిర్మల, వైస్ సర్పంచ్ నబీషా, తహసీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓఆర్డీ గూడెన్న, ఈఓ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. సేవలు మరింత విస్తృతం చేయండి.. బెళుగుప్ప: సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. బెళుగుప్ప మండలం హనిమరెడ్డిపల్లి సచివాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కాలువపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల తోటల పెంపకం వల్ల దీర్ఘకాలిక దిగుబడులు సాధించే అవకాశమున్నందున సన్న, చిన్న కారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముస్తాఫాకమాల్ బాషా, ఏపీఓ కృష్ణమూర్తి, వీఆర్ఓ చంద్ర, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..! -
నాన్నే స్ఫూర్తి
నాకు బచ్చల కూర పప్పు అంటే భలే ఇష్టం. వంట కూడా బాగా వండుతా. చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. సెల్ఫ్ కుకింగ్‌తో రిలాక్స్ కావొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నేనే వండుతా. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మమ్మీ కంటే డాడీనే బాగా వంట చేస్తారని మా పిల్లలు అంటుంటారు. మా నాన్న.. మా టీచర్.. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్. మా నాన్నే నాకు స్ఫూర్తి అని.. ఆయన అండ, సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టమని, సమయం దొరికితే కవితలు రాస్తుంటానని, కామెడీ, కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయని చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య విధుల్లో తలమునకలైన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపిగుర్తులు, మరుపురాని సంఘటనలు, ఇష్టమైన వంటకాలు, సినిమాలు, ఆటలు, స్నేహబంధంపై నగేష్ పర్సనల్ టైం ఆయన మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మా నాన్న రాంరెడ్డి రిటైర్డ్ టీచర్.. అమ్మ పద్మ హౌస్ వైఫ్. నాకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని తొర్లికొండకు చెందిన మమతతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాకు ఇద్దరు సంతానం. అబ్బాయి ధీరజ్ బీటెక్ తృతీయ సంవత్సరం.. అమ్మాయి లాస్య బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. విద్యాభ్యాసం.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్‌లో నాలుగో తరగతి వరకు చదివాను. హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని చందూర్‌లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసించాను. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ఉన్న మధుమలంచ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్.. నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఎల్ఐసీ, ఎంఏ–తెలుగు విద్యనభ్యసించాను. అది నాకు చేదు, తీపి జ్ఞాపకం వెల్కటూర్‌లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నన్ను మార్చేసింది. మా నాన్న ఆ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు. 30 ఏళ్లు అక్కడే టీచర్‌గా పనిచేశారు. సిన్సియర్ టీచర్‌గా పేరు సంపాదించారు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు తెలుగు నెలల పేర్లు చెప్పమంటే.. చెప్పాను. వరుస క్రమంలో చెప్పకపోవడంతో అందరి ముందు బెత్తంతో బాదారు. ఆ తర్వాతే నేను చదువు మీద దృష్టిసారించాను. ఇది నాకు చేదు, తీపి జ్ఞాపకంగా మిగిలింది. గాంధీ ఆటోబయోగ్రఫీ మరువలేను నేను హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్నా. స్కూల్లో ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో నేనే ఫస్ట్ వచ్చా. నాకు జాతిపిత మహాత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ ఉన్న పుస్తకం, ఒక డిక్షనరీ ప్రజెంట్ చేశారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. హ్యాపీ మూమెంట్.. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో నాకు గ్రూప్–3 ఉద్యోగం వచ్చింది. 1994లో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా నా తొలి పోస్టింగ్. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం. ఓ హోటల్లో అందరం భోజనం చేసి.. స్వీట్లు తిన్నాం. అది నాకు హ్యాపీ మూమెంట్. మూడు సంఘటనలు మరిచిపోలేనివి కామారెడ్డిలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించాను. ఓ సంధులోని పాత ఇంట్లో ఆ స్కూల్ ఉంది. గాలి, వెలుతురు రాకపోవడంతోపాటు వసతులు సరిగా లేవు. పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకుంటే చాలా బాధేసింది. వెంటనే మార్చాలని నిర్ణయానికి వచ్చా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏఎస్‌డబ్ల్యూ ఆఫీస్‌లోకి మార్చా. ఈ ఆఫీస్‌ను అంతకు మునుపే కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనంలోకి తరలించారు. దీంతో కేజీబీవీని అక్కడికి తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించా. ఏడు, ఎనిమిది గదులను అప్పటికప్పుడు శుభ్రం చేసి బాలికల విద్యాలయాన్ని అక్కడికి మార్చాం. ఒక్క రోజులోనే ఇదంతా చేశాం. ఈ ప్రాంతం జనావాసాలకు కొంత దూరంగా ఉండడంతో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సూచించా. ఇందుకోసం పోలీసులు ప్రతి రాత్రి సంతకం చేసేలా బుక్ పెట్టాం. ఈ నేపథ్యంలో విద్యార్థినులు చాలా హ్యాపీగా ఫీల్ కావడం.. నాకు సంతోషాన్నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. 2015–16 అనుకుంటా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ అనే అమ్మాయి అప్పుడు అక్కడే చదువుతోంది. ఈ పాఠశాల గుట్టమీద ఉండడంతో తాగునీటికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. వెంటనే గుట్ట కింద ఉన్న బావి వారితో మాట్లాడి పూడిక తీయాలని సంకల్పించా. వెంటనే జేసీబీతో బావి పూడిక తీయడంతోపాటు గుట్టపైకి పైపులైన్ వేసి విద్యార్థుల నీటి కష్టాలు తీర్చాను. విద్యార్థులు వచ్చి థ్యాంక్స్ సర్ అని చెప్పడంతో ఆనందమేసింది. కామారెడ్డిలో ఆర్డీఓగా ఉన్న సమయంలో 2016లో సుమారు పది వేల మందికి పౌతి చేసి రికార్డ్ సృష్టించాం. చనిపోయిన వారి వారసులకు సంబంధించిన భూములను గ్రామ సభలు నిర్వహించి గుర్తించాం. సుమారు పదేళ్లుగా వారు పట్టాపాస్ బుక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వారి గ్రామాల్లో చెట్ల కింద పౌతి ప్రక్రియ పూర్తి చేసి వారి ఇంటి వద్దకు వెళ్లి పాస్‌బుక్కులు అందజేశాం. దీనికి సంబంధించి ఆయా గ్రామస్తులు అభినందించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. బుక్స్ రీడింగ్ ఇష్టం నాకు బుక్స్ చదవడమంటే ఇష్టం. ఇప్పటివరకు సుమారు 1000 నుంచి 1,200 వరకు బుక్స్ కలెక్ట్ చేశాను. దీంతోపాటు సాహిత్యం, కవితలపై ఇంట్రస్ట్ ఎక్కువ, అప్పడప్పుడు కవితలు రాస్తుంటా. సినిమాలు చాలా తక్కువగా చూస్తా. హిట్ టాక్వచ్చి.. ఫ్యామిలీ సినిమా అయితేనే వెళతాం. రెండు, మూడు నెలలకోసారి ఫ్యామిలీతో సహా సినిమా చూస్తాం. మా ఇంట్లో కామెడీ సినిమాలే ఇష్టపడతారు. నేను చూసిన వాటిలో ‘కిక్’ సినిమా చాలా బాగుంది. స్నేహబంధంలో ప్రత్యేక అనుభూతి.. స్నేహ బంధంలో మరపురాని అనుభూతి ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతోపాటు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇటీవల ఎస్సెస్సీ బ్యాచ్ వాళ్లు గెట్ టుగెదర్ పెట్టారు. నేను బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. దసరా వంటి పండుగలకు ఊరెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌ను తప్పనిసరిగా కలుసుకుంటా. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి.. పుస్తకాలు చదివించడం నేర్పించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేలా వారిలో తల్లిదండ్రులు స్ఫూర్తి నింపాలి. విధులు ఇలా.. నా తొలి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌గా.. నిజామాబాద్‌లో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా, భువనగిరిలో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అనంతరం కామారెడ్డి ఆర్డీఓగా, నిర్మల్ డీఆర్వోగా, ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్‌గా 2017 నవంబర్ నుంచి పని చేస్తున్నాను. -
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 90.39 శాతం ఓట్లు పోలయ్యాయి. 5691 ఓటర్లు ఉండగా 5144 ఓట్లు పోలయ్యాయి. 3703మంది పురుషులు, 1441మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఈనెల 26న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల సరికే 28.43 శాతం ఓట్లు పోలవగా 12 గంటల సరికి 68.52 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయమైన 4 గంటల సరికి 90.39 శాతం ఓట్లు నమోదయ్యాయి. వీరఘట్టం మండలంలో 75 ఓట్లు, భామిని మండలంలో 38, కొత్తూరుమండలంలో 90, పాతపట్నం మండలంలో 233, మెళియాపుట్టి మండలంలో 88, హిరమండలంలో 36, పాలకొండ మండలంలో 289, వంగరలో 27, రేగిడిలో 64, సారవకోటలో 50, సంతకవిటిలో 93, రాజాంలో 261, సీతంపేటలో 115 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎల్ఎన్ పేటలో 22, సరుబుజ్జిలిలో 38, బూర్జలో 29, జి. సిగడాంలో 38, ఆమదాలవలసలో 277, నరసన్నపేటలో 172, పోలాకిలో 58, గారలో 53, శ్రీకాకుళంలో 559, శ్రీకాకుళం బూత్–2లో 693, పొందూరులో 150, లావేరులో 39, రణస్థలంలో 49, ఎచ్చెర్లలో 106, పలాసలో 252, మందసలో 133, కంచిలిలో 66, ఇచ్ఛాపురంలో 106, కవిటిలో 71, సోంపేటలో 202, వజ్రపుకొత్తూరులో 50, నందిగాంలో 36, టెక్కలిలో 267, సంతబొమ్మాళిలో 42, కోటబొమ్మాళిలో 98, జలుమూరులో 79 ఓట్లు పోలయ్యాయి. దివ్యాంగులకు ప్రత్యేక అవకాశం పోలింగ్‌లో పాల్గొన్న దివ్యాంగులు క్యూలో నిలబడకుండా ప్రత్యేక అనుమతిని కల్పించారు. అంధులైన వారికి సహాయకులతో ఓటు వేసే అవకాశం ఇచ్చారు. గర్భిణులు, శస్త్ర చికిత్సలు జరిపించుకున్న వారికి కూడా ఇటువంటి ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ, డీఆర్ఓ శ్రీకాకుళం నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు, డీఆర్ఓ నరేంద్రకుమార్‌లు సందర్శించారు. ఓటింగ్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డీఎస్పీ చక్రవర్తి, సీఐ ఎం.మహేష్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి బందోబస్తును పర్యవేక్షించారు. -
రైతులంటే ఇంత అలుసా..?
రైతులంటే ఇంత అలుసా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు విడతల రైతుబంధు పథకం పూర్తయింది... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది... అయినా ఇంతవరకు జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు... దీంతో రైతుబంధు పథకంతో పాటు రైతుబీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది... వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లిప్తత వీడాలి...? అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జేసీ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, జయశంకర్భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావుతో పాటు ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటగా ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరజవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హుస్నాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు రాయిరెడ్డి రాజిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తోట ఆగయ్య ఆమరజవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుపై చర్చ జరిగింది. సాక్షిప్రతినిధి,కరీంనగర్: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్‌రావు మాట్లాడుతూ..రైతుబంధు,రైతుబీమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం మం డలాల్లో 70 శాతానికిపైగా భూరికార్డులు సరిగ్గా లేవని ఆరోపించారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు మాట్లాడుతూ మండలంలో 700మందికిపైగా రైతులకు పాసుపుస్తకాలు అందలేదన్నారు. మానకొండూర్, బోయిన్పల్లి, శంకరపట్నం జెడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆత్మ పథకంపై అవగాహన సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ గుండి గ్రామంలో సిలివేరి సత్తయ్య అనే రైతు మరణించాడని పాస్‌బుక్ లేకపోవడంతో రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయాడని ఇలాంటి ఘటనలు కొకొల్లాలుఅని సభదృష్టికి తెచ్చారు. వేములవాడ జెడ్పీటీసీ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు చెందిన భూమికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. మల్యాల జెడ్పీటీసీ శోభరాణి మాట్లాడుతూ బల్వంతపూర్ గ్రామంలో రైతు మరణిస్తే అర్హతలు ఉన్న రైతుబంధు చెక్కు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని సభదృష్టికి తెచ్చారు. ‘మిషన్‌భగీరథ’పనులపై అసంతృప్తి... మిషన్ భగీరథ పథకం పనులపై సభ్యులు మండిపడ్డారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ అయిలయ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని ట్యాం కులు నిర్మించారు...ఎక్కడెక్కడ పైపులు వేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లన్ని అస్థవ్యస్థంగా తయారవుతున్నాయని, పైపులు వేసిన చోట గుంతలు పూడ్చటం లేదని ఒకే కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో ట్యాంకులను కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గిందని కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. విద్యశాఖ తీరుపై ఆసక్తికర చర్చ... విద్యశాఖలో సమస్యలను ప్రతి సమావేశంలో విన్నవిస్తున్నా పరిష్కారానికి మోక్షం లభించడం లేదని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్ మాట్లాడుతూ.. కొత్తపల్లి మండల కేంద్రంలో వ్యాయమా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ 18 ఏళ్లుగా ఒకేస్కూల్లో పనిచేస్తున్నాడని, తనకున్న పలుకుబడితో విధులు నిర్వహించకుండా రాజకీయాలకే పరిమితమవుతున్నాడని ఆరోపించారు. మహాముత్తారం జెడ్పీటీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ల పోస్టులను భర్తీ చేయాలని , ప్రహరీ గోడలు ,అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని గత ఘటన ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వర్ల మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందిస్తున్నామని సమాధానం ఇవ్వబోతుండుగా.. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి అడ్డుపడి కొడిమ్యాల మండల కేంద్రంలో గత సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షల సందర్భంగా జరిగిన మాస్ కాపీయింగ్ వ్యవహారంలో పది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఒక్కరికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వడం లేదని డీఈవోను ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడి పరిధి మోడల్ స్కూల్ సొసైటీలో ఉందని డీఈవో సమాధానం ఇచ్చారు. మల్యాల ఎంపీపీ శ్రీలత, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ , మంథని జడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని సభ దృష్టికి తెచ్చారు. వైద్య శాఖ పై గరంగరం... జిల్లాలో వైద్యశాఖ తీరు మారడం లేదని, ప్రతి సమావేశంలో చెప్పిన విషయాలను చెప్పడమే తప్ప సమస్యలకు మోక్షం లభించడం లేదని వైద్యశాఖ అధికారుల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పోస్టుమార్టం భవనం పూర్తయిన ప్రారంభానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్తో పాటు తదితరులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. పోస్టుమార్టం భవనానికి దారి లేదనే నెపంతో వాయిదా వేయడం తగదని, కేవలం ప్రహరీ గోడ కూల్చేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకుల ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని, మంథని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాలని చల్లా నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఐసీడీఎస్ అవినీతిపై మల్యాల జెడ్పీటీసీ బైఠాయింపు... జగిత్యాల జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లు వంటి వాటిలో రెండున్నర కోట్ల కుంభకోణం జరిగిందని రెండేళ్లుగా పత్రికలు కోడైకూస్తున్నా చర్యలు లేవని మల్యాల జెడ్పీటీసీ శోభారాణి అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా అధికారులు ఎవరూ సమావేశంలో లేకపోవడంతో అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు నేలపై కూర్చుంటానని చెబుతూ సమావేశం పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జోక్యం చేసుకోని సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవినీతి ఆరోపణల విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని చెప్పడంతో శోభారాణి శాంతించారు. 15రోజుల్లో పాసుపుస్తకాలు అందజేస్తాం 15 రోజుల్లో అర్హత గల రైతులందరికి పాసుపుస్తకాలు అందజేస్తాం. మిగిలిన చోట్ల భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 2వేల పాసుపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అర్హత గల రైతులందరికీ పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకం అందుతుంది. – శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ జాయింట్ కలెక్టర్ మార్చి 31లోగా ఇంటింటికీ నీరు పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు మార్చి 31లోపు మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీరు అందిస్తాం. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశాం. పైపుల కోసం వేసిన గుంతలు పూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లదే. దేశంలో పంజాబ్ రాష్ట్రం 70 శాతం ఇంటింటికి నల్లానీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వందశాతం భగీరథ నీళ్లు ఇంటింటికి అందజేస్తుంది. – శ్రీదేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులది అంతే బాధ్యత ఉంటుంది. సమావేశాలకు అధికారులు జవాబుదారీతనంతో పాటు సమగ్ర నివేదికలతో రావాలి. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు వ్యవహరించడం సరికాదు. – తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ -
తాడిపత్రిలో జేసీ వర్గీయుల దౌర్జన్యం
-
తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యం
-
కీలక పోస్టులు ఖాళీ..!
విజయనగరం గంటస్తంభం : జిల్లాలో ఒకేసారి కీలక అధికారుల పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ తర్వాత స్థానంలో ఉన్న జేసీ పోస్టు ఖాళీగా ఉండగా వేర్వేరు కారణాలు రీత్యా ఆ తర్వాత కేడరు పోస్టులు జేసీ–2, డీఆర్వో పోస్టులు ఖాళీ ఏర్పడనున్నాయి. ఆయా పోస్టులు వెంటవెంటనే భర్తీ చేయకుంటే పాలన గాడి తప్పుతుందన్న ఆందోళన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది. పోస్టులు ఖాళీ అవుతున్నా... జిల్లా పరిపాలనా కేంద్రానికి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. తర్వాత స్థానంలో సంయుక్త కలెక్టర్(జేసీ) ఉంటారు. కలెక్టర్ తర్వాత దాదాపు అన్ని వ్యవహారాలు జేసీ చక్కబెట్టాలి. రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ వంటి కీలక వ్యవహారాలు ఆయనే చూడాలి. అయితే, జిల్లా జేసీగా పనిచేసిన శ్రీకేష్ బి.లఠ్కర్‌ను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ చేసి నెలరోజులవుతున్నా ఆ పోస్టులో కొత్తగా ఎవరినీ నియమించ లేదు. దీంతో కలెక్టరపై అదనపు భారం పడింది. దీంతో జేసీ బాధ్యతలను జేసీ–2 కె.నాగేశ్వరరావుకు ఆయన అప్పగించారు. కలెక్టర్ తర్వాత జేసీ–2 కీలకం కావడంతో ఆయనే దాదాపు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడడం, కోర్టులో హాజరు పరచడం, రిమాండ్‌కు తరలించడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో ఆయన సస్పెన్షన్ దాదాపు ఖాయం. ఈ వ్యవహారాన్ని కలెక్టరు వివేక్‌యాదవ్ ప్రభుత్వానికి నివేదించారు. నేడే రేపో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆ పోస్టు ఖాళీ కానుంది. ఆ స్థానంలో ప్రభుత్వం వెంటనే ఎవరినో ఒకరిని నియమించకపోతే రెండు కీలక పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో జేసీ, జేసీ–2 బాధ్యతలు కలెక్టర్‌పైనే పడ్డాయి. దీంతో జేసీ–2గా ఇన్చార్జి బాధ్యతలు డీఆర్డీఏ పీడీ సుబ్బారావుకు అప్పగించారు. మరోవైపు ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ సదస్సుకు కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా వెళ్తారోలేదో తెలియని పరిస్థితి. తక్షణమే జేసీ, జేసీ–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. డీఆర్వో రిటైర్మెంట్తో మరో సమస్య.. ఈ పరిస్థితుల్లో జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టులో ఎవరో ఒకరు ఉంటే పాలన కొంతవరకైనా నెట్టుకు రావచ్చు. ఈ పోస్టు కూడా ఖాళీకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న డీఆర్వో ఆర్.ఎస్.రాజ్‌కుమార్ ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు నాటికి ఎవరినో ఒకరిని ఆపోస్టులు నియామకం చేస్తే సమస్య ఉండదు. అయితే, పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతుండడంతో డీఆర్వో పోస్టును కూడా వెంటనే భర్తీ చేస్తారన్న నమ్మకం జిల్లా వాసులకు కలగడంలేదు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పోస్టుల భర్తీపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం కూడా జిల్లా గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నగరంలో ఏసీబీ సోదాలు
విశాఖ క్రైం : విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారుల్లో గుబులురేగుతోంది. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖ నగరంలో ఆరుచోట్ల, బెంగళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది విజయనగరంతోపాటు విశాఖపట్నంలోని పెదవాల్తేరు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినా... మార్కెట్లో వాటి విలువ రూ.20కోట్లకు పైనే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. జేసీ –2గా కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు. వెలుగుచూసిన ఆస్తులివీ... విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలోని 775 చదరపు అడుగుల ఖాళీ స్థలం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల స్థలం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కండతామరాపల్లిలో 52సెంట్ల భూమి. అదే గ్రామంలో మరో రెండు చోట్ల 61 సెంట్ల భూమి. కుటుంబ సభ్యుల పేరిట స్థలాలు కుమారుడు రాజేష్‌చంద్ర పేరు మీద తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 14 సెంట్ల ఖాళీ స్థలం, నగరంలోని రేసపువానిపాలెంలో కృష్ణా అపార్ట్మెంట్లో ఒక ప్లాటు, తల్లి ధనలక్ష్మి పేరు మీద సూర్యారావుపేట శశికాంత్‌నగర్‌లో 1250 చదరపు అడుగుల ఇల్లు, ఎండాడలో ఎన్ఎస్ఎన్ రెడ్డి లే అవుట్లో 633 చదరపు గజాల స్థలం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో ఎకరం భూమి, మధురవాడ దరి ఎండాడలో 389 చదరపు గజాల ఖాళీ స్థలం, ఎండాడలోనే 231 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 485 చదరపు గజాల స్థలం వుంది. సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్లో రూ.68లక్షల విలువ చేసే ప్లాట్ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. బినామీల పేరిట రెండు ఫ్లాట్లు: పెదవాల్తేరు విజయనగర్ప్యాలెస్ లే అవుట్లో 511వ నంబరు గల ఫ్లాట్ శ్రీరామకృష్ణరాజు పేరు మీద వుంది. అదే ప్యాలెస్‌లో మరో ఫ్లాటు రమణమూర్తి రాజు పేరిట వుంది. 705 గ్రాముల బంగారు ఆభరణాలు, 5567 గ్రాముల వెండి, రూ.19.91లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.12.75లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లు, రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు. మే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. సోదాలలో డీఎస్పీలు రామకృష్ణప్రసాద్, కరణం రాజేంద్ర, షఖీలా బాను, సీఐలు గణేష్, లక్ష్మాజీ, గొలగాని అప్పారావు, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూలో కలకలం
ఆయనో ఉన్నతాధికారి. ఆయనకు ఉద్యోగులంటే ఎంతో అభిమానం. అందరితో నూ సౌమ్యంగా మెలిగేవారు. పరిపాలనా పరంగా మంచి అధికారిగానే గుర్తింపు ఉంది. వృత్తి రీత్యా ఎంతో అనుభవం కలిగి ఉండటం అదనపు ప్రత్యేకత. ఇదీ ఇప్పటివరకూ జిల్లా జేసీ–2 నాగేశ్వరరావుపై జిల్లా యంత్రాంగానికి ఉన్న అభిప్రాయం. కానీ బుధవారం ఏసీబీ తనిఖీలతో వారంతా విస్తుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కోవడంతో అంతా కలవరపడ్డారు. శాఖలో ఎక్కడా దీనిపైనే చర్చ. ఈ సంఘటన మిగిలిన అధికారుల్లోనూ గుబులు రేగేలా చేసింది. విజయనగరం గంటస్తంభం : జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో మంచి అధికారిగా గుర్తింపు పొందినా తాజాగా వెలుగు చూసిన కొత్త కోణం ఆయన ప్రతిష్ట దిగజారడానికి కారణమయింందని చెప్పక తప్పదు. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లా అధికారుల్లో గుబులురేగుతోంది. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు కనుగొన్నా... మార్కెట్లో వాటి విలువ రూ. 20కోట్లకు పైగానే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి జిల్లా కలెక్టర్, జేసీ తర్వాత మూడోస్థానం జేసీ–2దే. అభివృద్ధి, సంక్షేమ పథకాల జేసీగా గుర్తింపు పొందిన ఈ పోస్టులోకి కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు. అంతకుముందు పని చేసిన యు.జి.సి నాగేశ్వరరావు బదిలీ కావడంతో విధుల్లోకి చేరిన తక్కువ కాలంలోనే ఈయన మంచి అధికారిగా గుర్తింపు పొందారు. పోస్టు పరంగా అధిక శాఖల కార్యకలాపాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఐదారుశాఖలు మినహా అన్నిశాఖలు ఫైళ్లు తప్పనిసరిగా ఈయన వద్దకే వెళ్లాలి. జిల్లాలో జేసీ–2గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. కలెక్టర్ దృష్టిని ఆకర్షించిన పనితీరు జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ, సమీక్షలు చేస్తుండటంతో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు అత్యంత నమ్మకమైన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో సంయుక్త కలెక్టర్‌గా ఉన్న శ్రీకేష్ లఠ్కర్ పాలనాపరంగా కొంత అంటీ ముట్టనట్టు ఉండటం, తన పరిధిలో పనిపై మాత్రమే ఆయన దృష్టిసారించడంతో అంతగా గుర్తింపు పొందలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కలెక్టర్ తాను స్వయంగా చూడలేని పనులు, చేయలేని సమీక్షలు జేసీ–2 నాగేశ్వరరావు ద్వారా చేయించుకునే వారు. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడంతో ఇతర అధికారుల వద్ద, ప్రజల్లో గుర్తింపు, గౌరవం పొందారు. మరోవైపు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. కోపం వస్తే మాటలు విసిరినా పాలనపరంగా అధికారులు, సిబ్బందికి హాని చేయకపోవడం, కష్టసుఖాలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో మంచి అధికారిగానే అన్ని వర్గాల్లో గుర్తింపు పొందారు. ఆరోపణలు మరోకోణం జిల్లాలో ఆయన బాధ్యతలు స్వీకరించి కేవలం 10నెలలు కావడంతో ఆయనపై పెద్దగా విమర్శలు, అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇళ్లల్లో సోదాలు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి రావడంతో ఆయనలో అవినీతి కోణంపై చర్చ మొదలైంది. ఆయన అవినీతి జిల్లాలో ఏ మేరకు ఉంది? ఇతర జిల్లాలో పని చేసినపుడు పరిస్థితేమిటన్న ఆరా అందరూ తీస్తున్నారు. వాస్తవానికి మంచి అధికారిగా గుర్తింపు ఉన్నా అవినీతిపరంగా మరోకోణం ఉందనే చెప్పాలి. జిల్లాలో బహిరంగంగా ఆరోపణలు వచ్చినంత అవినీతి చేయకపోయినా పని చేసి డబ్బులు తీసుకుంటారన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఏసీబీ దాడులు నేపథ్యంలో ఇది నిజమే కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈయన పని చేసిన చోట కూడా ఆయనపై ఆరోపణలున్నాయన్న చర్చ జరుగుతోంది. అధికారుల్లో గుబులు కలెక్టర్ తర్వాత స్థానంలో ఉన్న అధికారి ఏసీబీ కేసులోఓ్ల చిక్కడంతో జిల్లా అధికారుల్లో గుబులు మొదలైంది. అధికారులు పెద్ద తలకాయలను టార్గెట్ చేయడంతో అవినీతికి పాల్పడే అధికారుల్లో ఆందోళన మొదలైంది. మరో ముగ్గురు జిల్లా అధికారులు ఏసీబీ లిస్టులో ఉన్నారన్న ప్రచారం ఉండడంతో వారెవరన్న చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా జేసీ–2 బంగ్లాలో ఏసీబీ సోదాలు జరగడంతో ఇతర అధికారులు చాలా మంది కార్యాలయాలకు రాలేదు. కలెక్టరేట్లో దాదాపు సగం మంది అధికారులు బుధవారం ఉదయం కార్యాలయంలో లేకపోవడం విశేషం. డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ... ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. తహసీల్దారుగా మేరుడుబిల్లి, పెద్దాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాకినాడలో పనిచేశారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు. మే నెలలో పదవీవిరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. గుర్తించిన ఆస్తులివే... రాష్ట్రంలోని పదిచోట్ల బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరంలో ఏసీబీ డీఎస్పీ షకీలాభాను ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లు, బ్యాంకు లాకర్లలో 705 గ్రాముల బంగారం, 5567.50 గ్రాముల వెండి వస్తువులు, రూ.19,91,186ల బ్యాంకు బ్యాలెన్సు, రూ.12,75,000ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.10,72,250ల విలువైన గృహోపకరణాలు గుర్తించారు. విశాఖ పెదవాల్తేరులో రామకృష్ణరాజు పేరుమీద విజయనగర ప్యాలెస్ లేఅవుట్లో ఫ్లాట్, రమణమూర్తిరాజు పేరుతో 514ఫ్లాట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎఫ్డబ్లూడీ బీఎస్ఐవీ మోటార్ కారు, విశాఖలోని ఆనందపురంలో 774.5 గజాల ఖాళీ స్ధలం, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల ఇంటి స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో 10.32ఎకరాల వ్యవసాయ భూమి, మరోచోట 52 సెంట్లు, 15 సెంట్లు, 56 సెంట్ల వ్యవసాయ భూమి గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 14 సెంట్లకుపైగా ఖాళీ స్థలం, విశాఖలోని రేసపువానిపాలెంలో కుమారుడు కాకర్ల రాజేష్ చంద్ర పేరుతో కృష్ణసాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్, కాకినాడలోని సూర్యాపేట, శశికాంత్ నగర్లో 1250 చదరపు అడుగుల స్లాబ్ ఇల్లు, విశాఖలోని ఎండాడలో ఎన్ఎస్ఎన్ రెడ్డి లేఅవుట్లో తల్లి కాకర్ల ధనలక్ష్మి పేరుతో 633 చదరపు గజాల స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి, విశాఖ మధురవాడలో 389 చదరపు గజాల ఖాళీ స్ధలం, అక్కడకు సమీపంలో 231 చదరపు గజాల స్ధలం, పశ్చిమగోదావరి జిల్లా అమలాపురంలో 484 చదరపు గజాల ఇంటిని గుర్తించారు. విశాఖలోనూ... విశాఖ క్రైం : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయనగరం జాయింట్ కలెక్టర్ – 2 నాగేశ్వరరావు బంధువులకు చెందిన విశాఖలోని ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదా లు నిర్వహించారు. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖలో ఆరుచోట్ల, బెంగుళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది పెదవాల్తే రు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు. పదవీ విరమణకు నెల రోజుల ముందే... నాగేశ్వరరావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అతని తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగరం జిల్లా ఎస్.కోటలో స్థిరపడ్డారు. 1990లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ప్రస్తుతం విజ యనగరం జేసీ–2గా చేస్తున్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోకుంటే మోసపోయే ఆస్కారముందని జాయింట్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సదస్సును జేసీ ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులతో వస్తు సేవలు, కొనుగోళ్ల సందర్భంగా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తు సేవలు, కొనుగోలు వ్యవహారాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ వస్తువుకు రశీ దు తీసుకోవాలని సూచించారు. డీఎస్ ఓ శారదాప్రియదర్శిని మాట్లాడుతూ వినియోగదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, బా ధ్యతలు తెలుసుకోవాలన్నారు. వినియోగదారుల వ్యవహారాల నిపుణు లు, ఎంవీఎస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ మాట్లాడు తూ వినియోగదారులు ప్రశ్నించే తత్వా న్ని అలవర్చుకోవాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ దినేష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్, మున్సిపల్ కమీషనర్ సురేందర్, వినియోగదారుల క్లబ్ కన్వీ నర్ బాల్‌లింగయ్య పాల్గొనగా.. రెవె న్యూ సమావేశ మందిరం ఎదుట పలు శాఖల స్టాళ్లు ఏర్పాటుచేశారు. -
అంతా చట్ట ప్రకారమే
ప్యాకేజీలో అర్హుల వివరాలు పక్కా అవార్డు జరిగిన తేదీనే కటాఫ్ తప్పుడు పత్రాలతో ప్యాకేజీ పొందితే శిక్షార్హులే ప్రతి ఫిర్యాదూ నమోదు అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై జేసీ కోటేశ్వరరావు ఏలూరు (మెట్రో): ఆందోళనలు... ఆత్మహత్యా యత్నాలు... అలజడులు.. ఇవీ గత నెల రోజులుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కనిపిస్తున్న సంఘటనలు. ఒక వైపు ప్యాకేజీ సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో పడి కొందరు ఆనంద పడుతుంటే, తమకు రావాల్సిన ప్యాకేజీ రాలేదని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌ఛార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పులిపాటి కోటేశ్వరరావు ’సాక్షి’తో మాట్లాడారు. భూముల సర్వేపై ః పోలవరం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాలు భూములు ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్ ఆధారంగానే ముంపు ప్రాంతాలను గుర్తించాం. మ్యాప్‌కు అనుగుణంగానే తాము వ్యవహరించాలి తప్ప కనీసం ఒక్క అడుగు కూడా అధికంగా సేకరించేందుకు వీల్లేదు. చాలామంది తమ భూములు ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అంచనాల మేరకు తాము ముంపు ప్రాంతాలను గుర్తించాం. ఆర్ అండ్ ఆర్ చట్టం వివరిస్తూ ః చట్టంలో ఏదైతే పొందుపరిచారో అదే అమలు చేయాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిమీదనైనా చర్యలు తప్పవు. చట్టం బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది. చట్టం ప్రకారమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చేశాం. 2013 భూసేకరణ చట్టం 3 సెక్షన్ సి 2 ప్రకారం నిర్వాసితులకు (నిర్వాసిత గ్రామాల్లో 3 సంవత్సరాలుగా నివాసం ఉంటూ, ముంపు ప్రాంతాలపైనే, ముంపునకు గురయ్యే పొలాలు, స్థలాలపై ఆధారపడి జీవిస్తేనే) తప్పక పరిహారాన్ని అందిస్తాం. చట్టంలోని చాప్టర్ 12లోని 84 (1) ప్రకారం అనర్హులైన వారు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందినా, అధికారులను మోసం చేసినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా చేసిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాను కూడా విధించాలని చట్టంలో పొందు పరిచారు. అన్యాయంపై ః ఎవరివల్లో నిర్వాసితులు అన్యాయానికి గురయ్యారని చెప్పడానికి అవకాశం లేదు. ఒక రేషన్‌డీలర్ ద్వారా కాని, ఒక వీఆర్ఓ ద్వారా కాని అర్హులను అనర్హులుగా మార్చే అవకాశం లేదు. రేషన్ డీలరు, వీఆర్ఓ వంటి వారి ద్వారా పొందాల్సిన డేటా తమ వద్దే ఉంటుంది. ఈ విషయంలో నిర్వాసితులు అపోహలకు గురి కావద్దు. ఇదీ కటాఫ్ తేదీ ః అవార్డు పాస్ చేసిన జూన్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు కటాఫ్‌గా నిర్ణయించాం. దీనికి మించి ఒక్క రోజు తగ్గినా కుటుంబ ప్యాకేజీ రాదు. ఫిర్యాదులు ఇక పక్కాః ప్రతి ఫిర్యాదునూ నమోదు చేయిస్తున్నాం. పూర్తిస్థాయిలో, లోతుగా విచారణ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. విచారణకు ఎన్నిరోజులు సమయం పట్టినా న్యాయం చేసే తీరుతాం. విచారణలో ఫిర్యాదు దారులనూ ప్రశ్నించి నిజాలు తేలుస్తాం. -
సూట్‌పేరుతో మోసం చేస్తే చర్యలు
యార్డు సెక్రటరీల సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ అనంతపురం అగ్రికల్చర్: రైతుబంధు పథకం అమలు, ఫీజు వసూళ్ల సాధనలో మార్కెటింగ్‌శాఖ పనితీరు బాగోలేగని జేసీ–2 ఖాజా మొహిద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ కార్యాలయంలో ఏడీ హిమశైలతో కలిసి మార్కెట్‌యార్డు సెక్రటరీలు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వెన్నుదున్నుగా నిలవడంలో మార్కెటింగ్‌శాఖ కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. చీనీ, ఇతర పండ్ల ఉత్పత్తులు పండిస్తున్న రైతులను సూట్లు (తరుగు) పేరుతో వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున... తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను మోసం చేసే వారిపై మార్కెటింగ్, పోలీసు చట్టాలు ప్రయోగించి శిక్షించాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.2.86 కోట్లు కేటాయించినా కేవలం రూ.11.24 లక్షలు మాత్రమే ఖర్చు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో 13 మార్కెట్‌యార్డుల ద్వారా రూ.14.11 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం నిర్దేశించుకోగా... ఇప్పటివరకు కేవలం రూ.3.14 కోట్లు వసూలైందన్నారు. అందులోనూ తనకల్లు, ధర్మవరం, రాయదుర్గం లాంటి కొన్ని యార్డుల్లో వసూళ్లు బాగా పడిపోవడంపై కారణాలు ఆరాతీశారు. రానున్న రోజుల్లో ఆకస్మిక తనిఖీల్లో కొనసాగిస్తామని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
తాగునీటి కాలుష్యం వల్లే చాపరాయి మరణాలు
జేసీ ఎ.మల్లికార్జున రంపచోడవరం: తాగునీరు కలుషితం కావడం వల్లే చాపరాయి గ్రామంలో 16 మంది మృతి చెందినట్టు పరిశోధనలో తేలినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఓ దినేష్‌కుమార్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాపరాయి గ్రామంలోని వాగులో ఆవు చనిపోయిందని, దాంతో ఆనీరు కలుషితం అయ్యిందన్నారు. ఆనీటిని తాగడం వల్లే 16 మంది అనారోగ్యం పాలై మరణించారని తెలిపారు. గిరిజన కుటుంబాల్లో ఆహారపు అలవాట్లు, తాగునీటి వినియోగంపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 275 వాటర్ ఫిల్టర్లను అందజేశామన్నారు. మరో 275 ఫిల్టర్లను త్వరలో అందిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో ‘చంద్రన్న సంచార వైద్యసేవ’లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ఈశాట్, శాటిలైట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చి స్థానిక గిరిజన యువకుల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో నెలకొన్న పరిస్థితుల దృష్టా ్య అధికారులెవరూ సెలవులు పెట్టవద్దన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీములను నియమించి పారిశుద్ధ ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తామన్నారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో దోమల నిర్మూలకు కిటికీలకు దోమల మెష్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డీసీహెచ్ఎస్ జి.రమేష్‌కిషోర్, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఈఈ పీకే నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, డీఎల్పీఓ రాజ్యలక్ష్మి,డీఎంఓ జోగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి లక్ష్యంగా నైపుణ్యాల శిక్షణ
జాయింట్ కలెక్టర్ మల్లికార్జున వికాస, టీసీఎస్ సంస్థలతో సమీక్ష కాకినాడ సిటీ : వికాస, టాటా కన్సెటెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జిల్లాలోని మూడువేల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. గురువారం జేసీ తన చాంబర్లో వికాస, టీసీఎస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎఫర్మేటీవ్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని నిరుద్యోగ యువతకు బిజినెస్ ప్రోమోషన్ సర్వీసెస్ శిక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను అందుకునేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్ డెవలెప్మెంట్, అనలిటికల్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాల్లో జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇందుకు జిల్లాలో 10 శిక్షణా కేంద్రాలను వికాస ద్వారా ఏర్పాటు చేసి, టీసీఎస్ నిపుణుల సహకారంతో శిక్షణ నిర్వహిస్తారన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ కల్పిస్తారని, శిక్షణ అనంతరం 10 నుంచి 20 శాతం ప్రతిభావంతులైన అభ్యర్థులకు టీఏసీఎస్ నియామకాలు కల్పిస్తుందని, మిగి లిన వారికి వికాస ద్వారా ఇతర సంస్థల్లో ఉపాధి అవకాశాలను అన్వేషించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సిద్ధమైన కాకినాడ, తుని కేంద్రాలలో జూలై 3 నుంచి తొలి బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందన్నారు. త్వరలోనే సామర్లకోట, రంపచోడవరం, అమలాపురంలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రతి బ్యాచ్‌లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయిస్తారన్నారు. 2016–17 సంవత్సరాల్లో పాసైన గాడ్యుయేట్లు మాత్రమే అర్హులని, అంతకు ముందు పాసైన వారు, కరస్పాండెన్స్ కోర్టులు చేసిన వారు అర్హులు కారన్నారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ వీఎన్ రావు, టీసీఎస్ కన్సల్టెంట్ సరస్వతి పద్మనాభన్ పాల్గొన్నారు. కొబ్బరితాళ్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు ప్రధాన మంత్రి ఉపాధికల్పన కింద నాబార్డు సహకారంతో స్వయం సహాయ బృందాల మహిళలకు కొబ్బరి తాళ్ల యూనిట్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు మంజూరు చేయనున్నామని జేసీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, డీఆర్డీఏ, బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఉపాధి యూనిట్ల మంజూరుపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం ప్రసాద్, పరిశ్రమల శాఖ డీడీ శ్రీపతి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేడు జేసీగా ప్రసన్నవెంకటేష్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇంతవరకు కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను ప్రభుత్వం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన తొలుత పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. జాయింట్ కలెక్టర్‌గా ఆయనకు ఇది మొదటి పోస్టింగ్. కర్నూలు జేసీగా ఆయన ఎన్ని గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
రెవెన్యూ శాఖలో అలజడి
♦ రేపల్లెలో ‘భూ’పాలుడు కథనానికి స్పందన ♦ అధికారులతో సమీక్షించిన జేసీ ♦ విశ్రాంత తహసీల్దారు ప్రమేయంతోనే భూ కుంభకోణానికి తెరతీసినట్లు నిర్ధారణ సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు వెస్ట్/రేపల్లె రూరల్: ‘రేపల్లెలో ‘భూ’పాలుడు!’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుయా యులు కొందరు రెవెన్యూ యం త్రాంగంతో కలసి 508 ఎకరాల ప్రభు త్వ భూమిని స్వాహాచేసిన వైనం వెలుగు చూడ టంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్త మయ్యారు. ఈ కథనానికి స్పందించి న గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్.. ప్రభుత్వ భూముల తోపాటు మడ అడవుల అన్యాక్రాంతంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. దీంతో రెవెన్యూశాఖ అధికారులు ఆదివారం ఉరు కులు పరుగులు పెడుతూ నిజాంపట్నం తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ (జేసీ) కృతికా శుక్లా దాదాపు 45 నిమిషాలపాటు అధికారులతో సమీక్షిం చారు. పలు రికార్డులు పరిశీలించాల ని తెనాలి ఆర్డీవో నరసింహులును ఆదేశిం చారు. కార్యాలయ సిబ్బంది కూడా దీనిపై జేసీకి కొంత సమాచారం అందించారు. ఇదిలా ఉండగా రెవెన్యూ రికార్డుల్లో పేర్ల నమోదుకు సంబంధించి తనకుగాని, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కుగాని ప్రమేయం లేదని కూచినపూడి మార్కెట్ యార్డు చైర్మన్ పంతాని మురళీధరరావు ఆదివారం రేపల్లెలోని ఎమ్మెల్యే అనగాని నివాసంలో విలేకరులతో చెప్పారు. -
కలెక్టర్‌గా వీరపాండ్యన్
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) జిల్లా కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ కోన శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరపాండ్యన్ ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈయన 2008 ఐఏఎస్ బ్యాచ్‌లో ఆలిండియా 53వ ర్యాంకు సాధించారు. 2009 ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకూ ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ ట్రైనీ కలెక్టర్‌గా 2010 జూన్ 25 నుంచి 2011 జూన్ 11 వరకూ పనిచేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా 2012 ఆగస్టు 8 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకూ విధులు నిర్వర్తించారు. తర్వాత శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2015 జనవరి 9 నుంచి ఇప్పటి వరకూ విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా ఉన్నారు. వీరపాండ్యన్‌కు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. గుంటూరు కలెక్టర్‌గా శశిధర్ కోన శశిధర్ అనంతపురం కలెక్టర్‌గా 2015 జనవరి 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 27 నెలలపాటు సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా జిల్లా అధికారులలో బాధ్యతను పెంచారు. పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక దృ ష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చొరవ తీసుకున్నారు. ఇందుకుగాను ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛఅనంత అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కృష్ణా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా 2015 జనవరి 9న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించేందుకు దాతల సహకారం తీసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. నేషనల్ ఈ –గవర్నెన్స్‌పై మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ఏపీకి మొదటి బహుమతి తీసుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలో ఇంటర్నేషనల్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ జార్జియా దేశంలో జరిగే కాన్ఫరెన్స్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీకాంతానికి కృష్ణా కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ‘అనంత’ను జీవితంలో మరవలేను: కోన శశిధర్, కలెక్టర్ అనంతపురం జిల్లా ప్రజలు నన్ను బాగా ఆదరించారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు. ఈ జిల్లా ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నేను ఎక్కడున్నా ఈ జిల్లా నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. నాకు ప్రధానమంత్రి అవార్డును తెచ్చిపెట్టింది. గొల్లపల్లికి రిజర్వాయర్‌కు నీళ్లు ఇచ్చేందుకు నా వంతు కృషి చేశా. ఫారంపాండ్లు తవ్వించాం. జీవితంలో ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా జిల్లా రుణం తీర్చుకుంటా. అమితానందాన్నిచ్చింది: లక్ష్మీకాంతం, జేసీ అనంతపురం జిల్లా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవి మరింత కష్టపడేందుకు అవకాశం కల్పించాయి. ఈ జిల్లా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనది. -
వాడపల్లి తీర్థాన్ని విజయవంతం చేయాలి
- వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలపై సమీక్షలో జేసీ వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. వాడపల్లి తీర్థం ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అధ్యక్షతన వెంకన్న సన్నిధిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన, అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉత్సవాలు కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఏడాది స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యుత్ తీగలు తగలకుండా, రహదారులు కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత ఇంజినీర్లతో సమీక్షించారు. రహదార్లకు ఎటువంటి ఇబ్బందీ లేదని వారు తెలిపారు. రథానికి విద్యుత్ తీగలు తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఏడీఈ డేవిడ్ తెలిపారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నామని డీఎల్పీఓ జెవీవీవీఎస్ శర్మ చెప్పారు. 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని వైద్యాధికారులు శ్రీనివాసవర్మ, ఝున్సీ వివరించారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు తెలిపారు. జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో చలువ పందిళ్లు వేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తుల దాహార్తి తీర్చాలని సూచించారు. ఈ నెలాఖరుకు అన్ని పనులూ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కళ్యాణోత్సవాల పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీ రమణమూర్తి సమావేశంలో వివరించారు. అనంతరం జేసీ, ఆర్డీఓలు స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహరావు జేసీ, ఆర్డీఓలకు స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్రిపోతు విమల, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ప్రసాద్, ఈఓ పీఆర్డీ డీవై నారాయణ, జేఈలు రంగనాయకులు, మణికుమార్, వీరభద్రరాజు, కృష్ణమూర్తి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
సెలవుల్లో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వ్యక్తిగత పనులపై గురువారం నుంచి మూడు రోజులు సెలవుల్లో వెళ్లానున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్లారు. మూడు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి డయల్ యువర్ జేసీ నిర్వహించగా 18 ఫోన్లు వచ్చాయి. ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయా ఫోన్‌కాల్స్‌కు జేసీ సమాధానమిచ్చి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ జూన్ నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారందరూ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఎస్ఓ వి.రవికిరణ్, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, డీఆర్డీఏ ఏపీడీ సోమేశ్వరరావు పాల్గొన్నారు. టెలీకాన్ఫెరెన్స్ పౌరసరఫరాల అంశాలపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ శనివారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంఎస్ఓలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నగదురహిత లావాదేవీలు ద్వారానే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉదయం, సాయంత్రం షాపులను తెరచి ఉం చాలని డీలర్లకు సూచించారు. ఉగాది సందర్భంగా కార్డుదారులకు అదనంగా అరకిలో పంచదార పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్లో పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్ పాల్గొన్నారు. -
‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించండి’
అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎన్నికలను సజావుగా జరిపేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకూడదన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 21న విడుదలవుతుందని 28 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జడ్పీ, మండల, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24వ తేదీలోగా రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. వాటిపై జడ్పీ సీఈఓ, మునిసిపల్ కమిషనర్ ద్వారా విచారణ చేయిస్తామన్నారు. 26న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన మార్చి 1న నిర్వహిస్తామని, ఉపంసహరణకు 3వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికలు మార్చి 17వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు 20న ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమలు కావాలన్నారు. -
కర్నూలు సబ్ రిజిస్రా్టర్పై చర్యలు తీసుకోండి
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి జేసీ రిపోర్టు కర్నూలు (అగ్రికల్చర్): ప్రభుత్వ భూమిగా గుర్తించి సెక్షన్ 22(ఎ)లో పెట్టి లావాదేవీని నిషేధించిన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన కర్నూలు సబ్ రిజిష్ట్రార్ మహబూబ్బాషాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు తెలిసింది. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 234/1,2,3,4లోని ప్లాట్లను ప్రభుత్వ భూములుగా గుర్తించి క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ భూముల జాబితా అనెగ్జర్ –2లో పెట్టింది. అయితే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ బాషా 21, 22 ప్లాట్లను 2015లో ఒకరి పేరుమీద, 2016లో మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించారు. ఈయన విచారణ జరిపి అక్రమాన్ని నిర్ధారించినట్లు సమాచారం. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
కుల ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): కుల ధ్రువీకరణ పత్రాల జారీపై జాయింట్ కలెక్టర్ హరికరణ్ విచారణ జరిపారు. తమకు తహసీల్దార్లు మదాసి కురువ ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఐదుగురు జేసీ కోర్టులో అఫీల్ చేశారు. వీటిపై డీఎల్ఎస్సీ కమిటీ సమావేశంలో విచారణ నిర్వహించారు. మహేశ్వరమ్మ, రాఘవేంద్ర, భీమయ్య, రామాంజనేయులు, మల్లయ్యలు చేసుకున్న అపీళ్లపై విచారణ జరిపారు. కృష్ణ సాయి అనే యువకుడు తొగట కులం కింద బీసీ–బి సర్టిఫికెట్తో ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులకు అనుమానం రావడంతో విచారణ జరుపాలని జిల్లా కలెక్టర్‌కు సర్టిపికెట్‌ను పంపారు. దీనిపై కూడా జేసీ విచారణ నిర్వహించారు. లింగమూర్తి అనే వ్యక్తికి జారీ చేసిన మాలదాసరి సర్టిఫికెట్‌పై కూడా విచారణ నిర్వహించారు. అయితే వీటిపై నిర్ణయం తీసుకోలేదు. అన్నిటిని వాయిదా వేశారు. -
ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ
సీతానగరం (రాజానగరం) : ఓటర్లుగా నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియని జాయింట్ కలెక్టర్ టు, నియోజకవర్గ ఓటర్లు నమోదు అధికారి జే రాధాకృష్ణమూర్తి తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచదేశాలు మనవైపు చూస్తున్నాయని, 20 నుంచి 35 ఏళ్ల యువకులు మన దేశంలో 30 శాతానికి పైగా ఉన్నారని, దేశాభివృద్ధి యువకుల సారధ్యంలోనే సాధ్యమన్నారు. ఫారమ్ 6ను నింపి, రెండు ఫొటోలు, ఆధార్, రేష¯ŒSకార్డు, టె¯ŒS్తక్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ అందించి, ఓటరుగా నమోదు కావాలన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఆయా పోలింగ్ స్టేష¯ŒSల వద్ద బూత్‌లెవెల్ ఆఫీసర్లకు నేరుగా ఫారమ్ 6 అందించవచ్చని తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకునే సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదన్నారు. ఓటుహక్కు వినియోగించుకునే విధానంపై గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తమ ఓటుహక్కు ఎంత పవిత్రమైనదో అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పి.ప్రసన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ చదువుకోనివారు తమ ఆధార్, రేష¯ŒSకార్డులలోని వయసును పరిగణలోకి తీసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 99.9శాతం రేష¯ŒSకార్డులు, 95శాతం నుంచి 98 శాతం మంది ఆధార్ తీసుకున్నవారు ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటుహక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని జేసీ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో బాలురకు రెండు మరుగుదొడ్లు నెలకొల్పాలని కోరగా, దానికి జేసీ–2 రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారు. రాజానగరం నియోజకవర్గం ఎన్నికల డీటీ సత్యనారాయణ, సీతానగరం డిప్యూటీ తహసీల్దార్ రామారావు, ఆర్ఐ సుధాకర్, ఎంఈవో టి.ముత్యాలు, ఏఎస్వో భగవా¯ŒSదాస్ పాల్గొన్నారు -
రేషన్ దుకాణాల్లో ’నగదు రహితం’
జిల్లాలో 1,932 షాపుల్లో అమలు జేసీ కోటేశ్వరరావు కొవ్వూరు: జిల్లాలోని 1,932 రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీని పరిశీలించేందుకు బుధవారం ఆయన కొవ్వూరులో పర్యటించారు. పట్టణంలో మసీదు వీధిలోని ఏడో నెంబర్ చౌక దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమిమా ఊరు కార్యక్రమంలో అందిస్తున్న కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారులకు కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందిస్తున్నామన్నారు. జిల్లాకు 20 శాతం సరుకులు అదనంగా కేటాయించినందున పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు. సర్వర్లలో సాంకేతిక లోపాల కారణంగా సరుకులు పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. 37 శాతం సరుకుల పంపిణీ పూర్తి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు చౌకదుకాణాల్లో సరుకుల పంపిణీ 37.26 శాతం, చంద్రన్న కానుకల పంపిణీ 27.92 శాతం పూర్తయ్యిందని జేసీ చెప్పారు. కొత్త రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతైన వారి వివరాలను తహసీల్దార్ల ద్వారా చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 67 వేల కొత్త రేషన్‌కార్డులు జిల్లాలో కొత్తగా 67 వేల రేషన్‌కార్డులు అందిస్తున్నామని జేసీ చెప్పారు. మొదటి విడతలో ప్రింటింగ్ ప్రకియ పూర్తయిన వాటిని అందించామని, మిగిలిన ప్రాంతాలకు బుధవారం పంపిణీ చేశామని చెప్పారు. డిసెంబర్ 29 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి తొలుత 49,700 కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. మరికొంత మంది లబ్ధిదారులు ఉండటంతో జనవరి 2 వరకు ఆన్లైన్ చేసిన వారిలో అర్హత గల వారందరికీ కార్డులు అందిస్తామని చెప్పారు. జిల్లాలోని రేషన్‌దుకాణాల్లో ఈ నెలలో రూ.49 వేల లావాదేవీలు నిర్వహించామన్నారు. నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు జిల్లాలో 1,932 చౌకదుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జేసీ చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములుండి, ఖాతాలకు ఆన్లైన్ అనుసంధానం అయి ఉంటే వేలిముద్రల ద్వారా రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు చంద్రన్న కానుకలు కూడా అందించాలని ఆదేశించారు. డీలర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం దొమ్మేరులో ఆయన పర్యటించారు. తహసీల్దార్ కె.విజయకుమార్, సీఎస్‌డీటీ ఎం.కమల్ సుందర్, ఆర్ఐ పి.రమేష్ ఆయన వెంట ఉన్నారు. -
త్వరగా భూసేకరణ
సమీక్ష సమావేశంలో జేసీ సూచన కాకినాడ సిటీ : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఏలేరు పరిధిలో భూసేకరణకు 12 గ్రామాలకు ప్రిలిమినరీ నోటిఫకేషన్ విడుదల చేసినందున రైతులతో సమావేశాలు జరిపి ఈనెల 18వ తేదీ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిర్లంపూడిలోని నాలుగు గ్రామాలకు సంబంధించి మార్పుల ప్రతిపాదనలను తక్షణం ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆర్డీవోలకు సూచించారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డుకు సంబంధించి ఈనెల 20వ తేదీ నాటికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌కు సూచించారు. రంగంపేటలోని 13 గ్రామాలకు గానూ 7 గ్రామాలకు ప్రిలిమినరీæ నోటిఫికేషన్ జారీచేశామని, మిగిలిన ఆరు గ్రామాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో ప్రజాసాధికార సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేటా నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ కలెక్టరేట్ నుంచి పాల్గొని సర్వే పురోగతి, చేపట్టిన చర్యలను వివరించారు. సీసీఎల్ఏ మాట్లాడుతూ సర్వేకు సంబంధించి ఎటపాక, చింతూరు మండలాల్లో ప్రగతి మందకొడిగా ఉందని వేగంగా చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
నిధుల విడుదలకు ప్రభుత్వానికి దివేదిస్తాం
నంద్యాల రూరల్: ప్రత్యేక అవసరాల పాఠశాలలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి దివేదిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మండల పరిధిలోని అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ మూగ, చెవిటి పిల్లల, క్రాంతినగర్‌లోని లూయిస్ బ్రెయిల్ అంధుల పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాల యాజమాన్యం ఆర్థిక పరంగా రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి విన్నవించుకోగా, వాటిని విచారించి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి నెల నగదు రూపంలో వికలాంగులకు అందుతున్న పెన్షన్ ఈనెల అందలేదని, వికలాంగ చిన్నారులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా బ్యాంకుల ద్వారా పెన్షన్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవజీవన్, లూయిస్ బ్రెయిలీ స్కూల్లో వికలాంగులకు అందుతున్న విద్య, వసతులను అడిగి తెలుసుకొని జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యలూరు మెట్ట వద్ద కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నాలుగు లైన్ల రోడ్డు అనుసంధానం కావడంతో అమరావతి, తిరుపతి, కర్నూలు వైపు వెళ్లే సర్కిల్‌ను ఆధునీకరించేందుకు అవసరమైన భూసేకరణ నిమిత్తం రైతు బుగ్గరామిరెడ్డికి చెందిను 16సెంట్ల స్థలాన్ని సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈయన వెంట నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్నారు. -
విలేజ్ మాల్స్ నిర్వహణకు టెండర్లు
కర్నూలు(అగ్రికల్చర్): విలేజ్ మాల్స్‌కు సరుకుల సరఫరాకు శనివారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కాంట్రాక్టర్లతో నెగోషియస్ నిర్వహించారు. కంది పప్పు, ఎండు మిర్చి పౌడర్, అయోడైజ్డ్ ఉప్పు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాఖలు చేసిన టెండర్లనే జేసీ తెరిచారు. 8 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇందులో ముగ్గురుకి మాత్రమే అర్హత లభించింది. వీరితో జేసీ ధరలను ఖరారు చేసేందుకు నెగోషియస్ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇది కొలిక్కి రాలేదు. చౌకదుకాణాల ద్వారా మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు సరకులు పంపిణీ చేసేందుకు జేసీ చర్యలు తీసుకున్నారు. డిసెంబరు నెలలో మొత్తం కార్డులలో 20 శాతం కార్డులకు అదనపు సరుకులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. -
భూసేకరణ పూర్తిచేయాలి
ఏలేరు ఆధునికీకరణపై జేసీ ఆదేశం కాకినాడ సిటీ : ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్అండ్బీ ఇంజనీర్లతో ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏలేరు పరిధిలో మిగిలిన ఐదు గ్రామాలలో భూసేకరణ పనులు సత్వరం పూర్తిచేయాలన్నారు. ఏడీబీ రోడ్డు విస్తరణ, ఎన్‌హెచ్–16కు దివాన్‌చెరువు లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, జొన్నాడ జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలన్నారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డు, కాకినాడ– రాజమహేంద్రవరం కెనాల్ రోడ్‌కు సంబంధించి సోషల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ టీమ్ ఇచ్చిన నివేదికను ఎక్స్పర్ట్ టీమ్‌కు రిఫర్ చేశామని నివేదిక వచ్చాక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు భూసేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయమీనన్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్అండ్బీ ఇంజనీర్ల, తహసీల్దార్లు పాల్గొన్నారు. నగదు రహిత బదిలీకి పోస్ మిషన్లు ఏర్పాటుకు చర్యలు నగదు రహిత బదిలీకి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జేసీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఈ–పోస్ ఏర్పాటుకు వ్యవసాయ, కార్మిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మందులు, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ డీడీ సీహెచ్ లక్ష్మణరావు, కార్మికశాఖ డీసీ కృష్ణారెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ ఏడీ, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, డీఎం కృష్ణారావు, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సాయిబాబు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..
జేసీగా బాధ్యతలు స్వీకరించిన కేవీఎన్ చక్రధర బాబు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జేసీ కేవీఎన్ చక్రధరబాబు అన్నారు. జేసీగా బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్లో మాట్లాడారు. ప్రజలు, జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, జిల్లా అధికారులను సమన్వయపరచి అభివృద్ధి దిశగా సాగుతామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, భూసేకరణ శాఖల సేవలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లాలో కొన్ని రోజులు పనిచేశానన్నారు. అనంతరం కలెక్టర్ పిలక్ష్మినరసింహంను ఆయన కాంపు కార్యాలయంలో గౌరవ ప్రదంగా కలిశారు. తరువాత శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంను సందర్శించారు. నరగపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా జేసీయే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతక ముందు ఆయన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు. అభినందనలు తెలిపిన ఇన్చార్జి డీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది కొత్తగా బాధ్యతలు జేపట్టిన జేసీకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, ఇన్చా ర్జి జిల్లా రెవెన్యూ అధికారి జీసీ కిశోర్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామారావు, రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలి పారు. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు సారుురాంలు గౌరవ ప్రదంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. -
అవకాశం కల్పించండి
మీ కోసంలో జేసీకి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ల వినతి అనంతపురం అర్బన్: వర్క్ ఇన్స్పెక్టర్లుగా తమకు తిరిగి అవకాశం కల్పించాలని ఇటీవల హౌసింగ్ శాఖలో తొలగించబడిన కాంట్రాక్ట్ ఇన్స్పెక్టర్లు జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతంను వేడుకున్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్‌కు మాజీ వర్క్ ఇన్స్పెక్టర్లు రమేశ్‌నాయక్, నరసింహులు, నాగరాజు, రాజూనాయక్, ఎర్రిస్వామి, అంజి, తదితరులు తమ గోడు వినిపించారు. నెల రోజుల కిందట తమను విధుల నుంచి తొలగించడతో వీధిన పడ్డామన్నారు. అదే శాఖలో ప్రస్తుతం తిరిగి వర్క్ ఇన్స్పెక్టర్ల నియామకం చేపట్టారన్నారు. ఇందుకు సంబంధించి ఇతర జిల్లాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇక్కడ మాత్రం ఇచ్చారన్నారు. తమకు తిరిగి ఉపాధి కల్పించి ఆదుకోవాలని తొలగింపబడిన వర్క్ ఇన్స్పెక్టర్లు రమేశ్‌నాయక్, నరసింహులు, నాగరాజు తదితరులు కోరారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు : తన భర్త, అత్త, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం తనను వేధిస్తునారని కదిరి పట్టణం మూర్తిపల్లికి చెందిన టి.సూర్యకాంతమ్మ జాయింట్ కలెక్టర్‌కు విన్నవించింది. తన భర్త మైనర్ బాలికతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు పట్టుకుపోయారని, ఈ తతంగాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేయగా పోలీసులు సెల్‌ఫోన్ తీసుకొని వీడియోను తొలగించారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. పోలానికి వెళ్లకుండా కంపవేశారు : మా పొలానికి వెళ్లకుండా కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డుగా కంపవేసి దాడి చేశారని కదిరికి చెందిన లలితాబాయి జేసీకి అర్జీ అందజేసింది. కులంపేరుతో దూషించిన వారిపై కదిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని పేర్కొంది. అనంతనం వారిని వదిలి వేయడంతో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ఆమె కోరారు. భూమి లాక్కున్నారు : తనకు రావాల్సిన భూమికి లాక్కున్నారని, ఈ విషయంపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యురాలు కమలమ్మకువిన్నించినా న్యాయం జరగలేదని అనంతపురం ప్రకాశ్ రోడ్డుకు చెందిన భాగ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
సెలవుల్లో వెళ్లిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ 8, 9 తేదీల్లో వ్యక్తిగత పనులపై సెలవు పెట్టి సోమవారం సాయంత్రమే హైదరబాదు వెళ్లారు. తిరిగి 10వ తేదీ విధులకు హాజరవుతారు. రెండు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
అక్రమాలపై జేసీ విచారణ
గోనెగండ్ల: మండల కేంద్రంలో మీసేవా నిర్వాహకుడు మునిస్వామి, వీబీకే రంగన్నలు పాల్పడిన అక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.బతికి వున్న వారి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమ్ఆద్మీ పథకం కింద బీమా సొమ్మును కాజేశారని, మీసేవా కేంద్రం, ఆధార్ కేంద్రాల్లో పలు అక్రమాలు పాల్పడటమే కాకుండా భూ అక్రమాలకు తావిచ్చారని మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు ఫిర్యాదులు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు జేసీ గత నెల18వ తేదీన విచారణ జరపాల్సి ఉంది. అనివార్య కారణాలతో విచారణ వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం జేసీ బహిరంగ విచారణ చేశారు. భూములు కోల్పోయిన రైతులను ఒక్కొక్కరిని విచారించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. మీసేవా నిర్వాహకులు, కావేరి గ్రామైక్య సంఘం సభ్యులు, వీబీకేలపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ విచారణ చేశామని, బాధితులు కొన్ని ఆధారాలు ఇచ్చారన్నారు. కొన్ని అక్రమాలున్నయని దీనిపై మరింత విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని జేసీ పేర్కొన్నారు. విచారణలో అక్రమాలు తేలితే మీసేవా కేంద్రాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో మీసేవా ఏఓ లక్ష్మిదేవి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
కాకినాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ చార్జిలదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌భవన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పౌరసరఫారాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడానికి కేంద్రాల ఇన్ చార్జిలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాల్లో రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పారు. ధాన్యం సాధరణ రకం 75కిలోలు రూ.1102.50పైసలు, వంద కిలోలు రూ.1470, గ్రేడ్–ఎ రకం 75కిలోలు రూ.1132.50పైసలు, వంద కిలోలు రూ.1510 మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 251 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు, గణేష్‌కుమార్, విశ్వేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ డీఎం కె.కృష్ణారావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం కాకినాడ సిటీ: కాట¯ŒS కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా(గుంటూరు) ఆధ్వర్యంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కనీస మద్దతు ధర, ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండోవారంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని ఇందుకు మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర రూ.4160 ఉందన్నారు. అలాగే ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్, కెనాల్‌రోడ్ భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. రాజానగరం– సామర్లకోట ఏడీబీరోడ్డు భూసేకరణకు సర్వే పూర్తయిందని, వారం రోజుల్లో ప్రిలిమినరీ నోటిఫికేష¯ŒS జారీ చేయాలని పెద్దాపురం ఆర్డీఓను ఆదేశించారు. -
ముగిసిన ప్రజాసాధికార సర్వే
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే ముగిసిందని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే చేయని కుటుంబాలు.. సర్వేకోసం రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వవచ్చని.. ఈ విధంగా మూడు రోజుల పాటు అంటే నవంబర్ 3 వరకు గడువు ఉందన్నారు. వినతులు ఇచ్చిన వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే చేస్తారని వివరించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో 43,42,629 మందిని సర్వే చేయాల్సి ఉండగా 33,49,817 మందిని మాత్రమే సర్వే చేశారు. మొత్తంగా 77.4 శాతం మాత్రమే సర్వే జరిగింది. -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
–జేసీ కోటేశ్వరరావు ఏలూరు (మెట్రో): రాబోయే ఖరీఫ్ సీజనులో మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లా రైస్‌మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లయీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో వచ్చేనెల 1 నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు వెలుగు విభాగం ద్వారా 160 ఐకేపీ, సహకార సొసైటీల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రా రైస్ 67 శాతం, బాయిల్డ్ రైస్ 68 శాతం సరఫరా అవుతుందని, బ్రాస్ రైస్, బ్రొకెన్ రైస్ ఎంత శాతం నమోదైందన్న వివరాలు కూడా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. మిల్లర్లు కొన్న ధాన్యానికి తప్పనిసరిగా లెక్కలుండాలని, పారదర్శకంగా మిల్లర్లు పనిచేయాలని, రైతులకు ధాన్యం ధరను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తామని చెప్పారు. సివిల్ సప్లయీస్ అధికారి డి.శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ వెంగప్ప, అసిస్టెంట్ మేనేజర్ జనరల్ షర్మిల, రైస్‌మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్బీఎస్వీ ప్రసాద్, సెక్రటరీ ఎన్బీకే ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ కె.హరిబాబు, జాయింట్ సెక్రటరీ బాబి, ట్రెజరర్ చక్కా సత్యనారాయణ పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే సంబంధిత అధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ సబ్‌ప్లాన్‌పై అధికారులతో జేసీ సమీక్షించారు. సబ్‌ప్లాన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. మున్సిపాల్టిలో 40 శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. 2014–15కు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై సబ్‌ప్లాన్ కింద చేస్తున్న పనులపై రెగ్యులర్‌గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాద్ రావు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణపై జేసీ హరికిరణ్ శుక్రవారం విచారణ నిర్వహించారు. జేసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది. రైల్వేలో ఎస్టీ సర్టిఫికెట్‌పై ఉద్యోగం చేస్తున్న తిమ్మప్ప ఇప్పటికే రెండు, మూడు సార్లు విచారణకు రాకపోవడంతో.. ఈ విచారణకు విధిగా హజరు కావాలని ఆదేశించినా గైర్హాజరయ్యారు. కాగా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో బైండర్‌గా పనిచేస్తున్న రాముడు యాదవ్ అయితే సుగాలి సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. దీనిపై రాముడు కులాన్ని నిరూపించుకునేందుకు భార్య తరపు వారిని విచారణకు తీసుకొచ్చారు. అయితే దీనిపై జేసీ సంతృప్తి చెందలేదు. వీటిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. విచారణలో డీఎల్ఎస్సీ కమిటీ సభ్యులు, సి సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు బద్దూనాయక్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిరుధాన్యాల కొనుగోలుకు చర్యలు
– జిల్లా వ్యాప్తంగా 15 కౌంటర్లు – వచ్చేవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం – జేసీ హరికిరణ్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): చిరు ధాన్యాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జేసీ తన చాంబర్లో జొన్న, సద్దలు, కొర్రల కొనుగోలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే వారం నుంచి కోనుగోళ్లు చేపట్టాలన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆళ్లగడ్డ, ఆస్పరి, చాగలమర్రి, కోడుమూరు, కోవెలకుంట్ల, ఆత్మకూరు, గోనెగండ్ల, కొలిమిగుండ్ల, డోన్, పగిడ్యాల, పత్తికొండ, నంద్యాల, ఆదోని, ప్యాపిలి, పాణ్యంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన చేయూతనివ్వాలని మార్కెటింగ్ అధికారులను జేసీ ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్క్పెడ్ డీఎం పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాధాన్యతా రంగాలపై త్వరలో ఎగ్జిబిషన్
ఏలూరు (మెట్రో) జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాధాన్యతా రంగాల శాఖలతో డిసెంబరు నెలలో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వ్యవసాయం, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పశుసంవర్ధక శాఖ, ఏపి డైయిరీ, మార్కెటింగ్ ప్రాధాన్యతా రంగాల అధికారులతో ఎజెసి షరీఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్యశాఖ రైతులకు ఉపయోగపడే విధంగా ఉపకరణాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివిధ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. కంపెనీలు ఎగ్జిబిషన్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్టాల్స్ ఏర్పాటు చేసి అందించనున్నట్లు చెప్పారు. అధికారులు కిందిస్థాయి సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవసమరైన సహాయ సహకారాలు సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా తరచూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఒ డిడీ సాంబశివరావు, వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి, పశుసంవర్ధకశాఖ జెడి జ్ఞానేశ్వర్, ఫిషరీస్ డిడి జాకబ్ భాషా, ఉద్యానవనశాఖ ఎడిలు విజయలక్ష్మి, దుర్గేష్, మార్కెఫెడ్ జిల్లా మేనేజరు నాగమల్లిక పాల్గొన్నారు. -
జిల్లాల్లో గ్రూప్-2 నిర్వహణ బాధ్యత జేసీలదే
• కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ • పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పనులను దగ్గరుండి చూసుకునే బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించాలని, జిల్లాల్లో జేసీలే పరీక్ష నిర్వహణ అధికారులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని.. నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. ఇన్విజిలేటర్ల సమస్య ఉన్నచోట రిటైర్డ్ లెక్చరర్లను నియమించాలని, భవనాల సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు భవనాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రాలకు సంబంధించిన విద్యా సంస్థలకు ఆ రెండు రోజులు సెలవులివ్వాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీసు శాఖ అవసరమైన బందోబస్తు కల్పించాలని, బస్సు సదుపాయాలను ఆర్టీసీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలన్నింటిపై బుధ గురువారాల్లో లిఖిత పూర్వకంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల గుర్తింపు పూర్తయిందని, మరో రెండు రోజుల్లో ఆ జిల్లాల్లోనూ పూర్తవుతుందని సీఎస్‌కు కలెక్టర్లు వివరించారు. సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లుగా నమోదు కండి
–జిల్లా అధికారులకు, సిబ్బందికి జాయింట్‌కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది శాసనమండలి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లుగా నమోదు కావాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పట్టభద్రులు ఉన్నారన్నారు. 2011లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని అప్పుడు పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారు చేశామని అయితే ఆ జాబితా ఈ ఎన్నికలకు చెల్లుబాటు కాదని చెప్పారు. 2013 అక్టోబరు31 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులేనన్నారు. ఫారం–18 దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్‌కాపీ, రెండు కలర్ పాస్‌ఫొటోలు జత పరచి ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తున్నారని అయనకు పూరించిన దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఒక్కో జిల్లా అధికారికి 20 ప్రకారం ఫారం–18 దరఖాస్తులను పంపిణీ చేశారు. ఓటరు నమోదుపై అనుమానాలు ఉంటే 08518–220125కు ఫోన్ చేయవచ్చని వివరించారు. కాగా ఈ– ఆఫీసుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించాలి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసే ఆర్డీఓ కార్యాలయంలోని సౌకర్యాలను గురువారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయ భవనంలో అన్ని గదులను కలియదిరిగి చూశారు. కార్యాలయం ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం ముందు గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ.. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించినపనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల 11న కార్యాలయం ప్రారంభం కానుందని తెలిసినా పనులు చురుకుగా సాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి రానున్నందున ఈ నెల 10వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, కోదాడ తహసీల్దార్ వి.శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరశర్మ, ఆర్ఐ జానకిరామిరెడ్డి, పలువురు వీఆర్ఓలు పాల్గొన్నారు. -
46 మండలాల్లో మినీ రైతు బజార్లు
బుట్టాయగూడెం: జిల్లాలోని చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం అన్ని మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం మండలంలో మినీ రైతు బజార్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం బుట్టాయగూడెంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎంఆర్వో సంత మార్కెట్ వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 20 మండలాల్లో స్థల పరిశీలన పూర్తికాగా 19 రైతు బజార్ల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో స్థలాల్లో పరిశీలించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి మొదటి దశలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులు పూర్తి చేశామని తెలిపారు. రెండో దశ పనులను అక్టోబర్ నెలలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఇళ్ల స్థలాలు, భూమికి భూమి సంబంధించి అధికారులు పనులలో నిమగ్నమయ్యారన్నారు. రెండో దశలో 2,200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లాలో ప్రజాసాధికారిక సర్వే 96 శాతం పూర్తయ్యిందని చెప్పారు. మిగిలిన 4 శాతం సరైన సిగ్నల్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆలస్యమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ ఏజీ చిన్నికష్ణ, ఏవో బి.సుమలత పాల్గొన్నారు. -
13 నుంచి ఈ– ఫైల్స్
– డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ కర్నూలు సిటీ: ఈ నెల 13వ తేదీ నుంచి అన్ని శాఖలకు చెందిన అధికారులు ఈ – ఫైల్స్ (పేపరు రహిత ఫైల్స్)ను పంపించాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వినతులను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంకు వచ్చిన సమస్యల్లో అత్యధికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాలు, జెడ్పీ, డీపీఓ, జల వనరుల శాఖ, ఎకై ్సజ్ శాఖల్లో అధికంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. – ఓర్వకల్లు సమీపంలో జాతీయ రహదారి విస్తరణలో తమ భూమి పోయిందని, ఇంత వరకు పరిహారం రాలేదని ఓ రైతు ఫిర్యాదు చేశారు. – వెల్దురి మండలం శ్రీరంగాపురం, చిన్న కొముల పల్లె గ్రామంలో గొర్రెల పెంపకదారులు అధికంగా ఉన్నారని, పశువైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. – మద్దికెరలో 554 సర్వే సెంబరులో 17 ఎకరాల భూమిని మా తండ్రి కొనుగోలు చేస్తే, స్థానిక వీఆర్ఓ తన తమ్ముని పేరు మీద 33 సెంట్ల భూమి రాయించి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నారని ఓ రైతు జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ స్పందించి ఆదోని ఆర్డీఓను విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కలెక్టరేట్లో స్వచ్ఛభారత్
– అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో దోమలపై దండయాత్ర – చీపురు పట్టి చెత్త ఊడ్చిన జేసీ కర్నూలు(అగ్రికల్చర్): దోమలపై దండయాత్రలో భాగంగా శనివారం కలెక్టరేట్లో స్వచ్ఛ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు జేసీ స్వచ్ఛ కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు స్వయంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. కలెక్టరేట్లో ఎటుచూసినా చెత్త చెదారం పేరుకుపోయాయి. నిరంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కర్నూలు అంటున్నా కలెక్టరేట్లో ఇప్పటి వరకు స్వచ్ఛత అనేదే లేకుండా పోయింది. దీనిని గుర్తించిన జేసీ అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో పెద్దఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. కలñ క్టరేట్లోని అన్ని వైపులా కలియదిరిగి చెత్త చెదారాన్ని తొలగించారు. ఇక నుంచి ప్రతి శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖాధికారులు మల్లికార్జునరావు, అనురాధరెడ్డి, శారద, గిరీష్, పణిశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరకు రైతుల కష్టాన్ని గుర్తించండి
ఏలూరు (మెట్రో): చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015–16లో రైతులకు చెల్లించాల్సిన రూ.28 కోట్ల బకాయిలను రెండు వారాల్లో చెల్లించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును చెరకు రైతు సంఘ సభ్యులు కోరారు. కలెక్టరేట్లో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో శ్రీనివాసరావు, జేసీ పాల్గొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా, వ్యయ ప్రయాసలు కోర్చి చెరకు పండిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఉత్తర్వులు మేరకు గతంలో కొన్ని బకాయిలను చెల్లించారని 2015–16లో బకాయిలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించేలా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని జేసీ కోటేశ్వరరావు చెప్పారు. చాగల్లు జైపూర్ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ డి.భాస్కరరావు మాట్లాడుతూ వచ్చేనెలాఖరుకు పూర్తి బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు రెండు వారాలు మాత్రమే గడువు ఇచ్చారని, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీసుకుంటారని, కమిటీ ప్రతినిధులతో సంప్రదించి రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య సమన్వయం కుదిర్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ ఏజీఎం జీవీ చౌదరి, డిస్టిలరీ ఫ్యాక్టరీ ఏజీఎం శివకుమార్, చెరకు రైతు కమిటీ సభ్యులు పోసిన రాజారావు, గారపాటి శ్రీనివాసరావు, వల్లభనేని శ్రీనివాసరావు, ఉండవల్లి బుచ్చయ్య, ముళ్ళపూడి కాశీ, యనమదుల రామారావు, వట్టికూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జిల్లా ముందంజ
400 పాఠశాలల్లో డిజిటల్ బోధన డిజిటల్ ఇండియా ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇందూరు : సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వలన పాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. ఇందులో మన జిల్లా ముందుందన్నారు. ప్రస్తుతం 400 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యబోధన అమలు జరుగుతోందన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి డిజిటల్ ఇండియా –డిజిటల్ తెలంగాణ ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పౌర సేవలు, బ్యాంకింగ్ బీమా సదుపాయాలు, బిల్లుల చెల్లింపులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 18 రోజుల పాటు రోజుకు మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే గ్రామసభల్లో డిజిటల్ ఇండియపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.S 40 గ్రామ పంచాయతీలలో పౌర సేవలను డిజిటల్ ఇండియాతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ఎన్ఐసీ అధికారి రాజగోపాల్, సమాచార శాఖ ఎడీ వెంకటేశ్వర్లు, ఐటీ కోఆర్డినేటర్లు ప్రవీణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
సమాచారంతో సిద్ధంగా ఉండాలి
నల్లగొండ : విద్యాశాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ తన చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం సమీక్షించే విద్యాశాఖకు సంబంధించిన విద్యా, మాద్యమిక, ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు, సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులు నివేదికలు తయారు చేసుకుని సూచించారు. అదే విధంగా అదనపు తరగతి గదులు, రిపేర్లు, సీసీ కెమెరాలు తదితర పూర్తి వివరాలు అందుకు అవసరమైన నిధులపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిచే వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాఠశాల విద్యపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి, డీఈఓ చంద్రమోహన్, ఎస్ఎస్ఏ అధికారి కిరణ్, ఆర్ఐఓ, మైనార్టీ అధికారి పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రాంనగర్ : వివిధ శాఖల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు ఇచ్చే వినతులకు అధికారులు అధిక ప్రాధాన్యతమిచ్చి సత్వరమే పరిష్కరించాలని, పరిష్కరించలేని, ఆస్కారం లేని ఫిర్యాదులు బాధితులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 15 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున నూరు శాతం జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లా పునర్వి విభజన ఉన్నందు వల్ల తెలంగాణకు హరితాహారం జిల్లాల వారీగా విభజిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డీఆర్వో రవి, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి భవనాలను పరిశీలించిన కలెక్టర్, జేసీ
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కానున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్య సింగరేణి భవనాలను సోమవారం పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈఆర్పీ సింగరేణి భవనాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఉపయోగించనున్న నేపథ్యంలో ఆ భవనం లోపల గదులు, సౌకర్యాలను పరిశీలించారు. సింగరేణి ప్రదానాస్పత్రి ఏరియాలోని సింగరేణి డిస్పెన్సరీని ఎస్పీ కార్యాలయానికి వినియోగించనున్న నేపథ్యంలో చిన్నాస్పత్రి భవనం, పక్కన ఉన్న రెసిడెన్సీ భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్, జేసీ వెంట ఆర్డీఓ రవీంద్రనాథ్, తహశీల్దారు అశోక్‌చక్రవర్తి, సింగరేణి అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రోత్సాహంతో క్రీడా వికాసం
– చిన్నారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి – భవిష్యత్ క్రీడలకు పెద్దపీట వేయనున్న ప్రభుత్వం – జాతీయ కీడాదినోత్సవ సభలో జేసీ హరికిరణ్ కల్లూరు: ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతోనే క్రీడా వికాసం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. సోమవారం 22వ జాతీయ క్రీడాదినోత్సవాన్ని (ధ్యాన్‌చంద్ జయంతిని) నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియం బాస్కెట్‌బాల్ కోర్టు ఆవరణలో డీఎస్డీఓ మల్లికార్జున అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అంతకు ముందు ధ్యాన్‌చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఒలింపిక్స్ విజేతలు సింధూ, సాక్షి మాలిక్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడలతో శారీరక ఆర్యోగంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. స్నేహ సంబంధాలు మెరుగుపడి, క్రీడాకారులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. జిల్లా నుంచి రెండు వేల మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొన్నారని డీఎస్డీఓ మల్లికార్జున వెల్లడించారు. క్రీడాభివద్ధికి ప్రభుత్వాలు తగిన చేయూత ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రుల తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ తర్ఫీదు ఇప్పించాలన్నారు. గెలుపునకు ఓటమి పునాది వంటిదని, క్రీడాకారులు గెలుపోటమలును సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని స్పెషల్ కలెక్టర్ బీవీ సుబ్బారెడ్డి అన్నారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నట్లు చెప్పారు. ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, రామాంజనేయులు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో హాకీ జిల్లా కార్యదర్శి సుధీర్, సెపక్తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం రన్నరప్‌గా రెవెన్యూ జట్టు వరంగల్æ: విధి నిర్వహణలో ఉద్యోగులకు ఎదురయ్యే ఒత్తిళ్లు అధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్షణ్ అన్నారు. హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మం గళవారం జరిగిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ – జిల్లా రెవెన్యూశాఖల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన కొద్ది సేపు బ్యాటింగ్, బౌ లింగ్ చేశారు. కమిషనరేట్ జట్టుకు సీపీ సుధీర్‌బాబు, రెవెన్యూ జట్టుకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నాయకత్వం వహించారు. టాస్ గెలిచి పోలీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. బౌలింగ్‌లో కమిషనర్ సుధీర్‌బాబు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 15.5 ఓవర్లలో 119 పరుగులు చేసి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. ఆఖరు ఓవర్లో మెుత్తం ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరు బాల్‌కు ఆరు పరుగులు కావాల్సి ఉండగా కోర్ టీం కానిస్టేబుల్ ఖాలిద్ సిక్సర్ కొట్టడంతో విజయం సాధించారు. ఖాలిద్ 76 పరుగులు చే సి కమిషనరేట్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం పోలీస్ కమిషనరేట్, ఎలక్ట్రానిక్ మీడియా జట్ల మధ్య మరో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఇందులో పోలీస్ జట్టు మీడియా జట్టుపై విజయం సాధించింది. కార్యక్రమంలో ఏసీపీలు మహేందర్, శోభన్‌కుమార్, జనార్ధన్, సురేంద్రనాథ్, ఈశ్వర్రావు, రవీందర్రావు, తహశీల్దార్లు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తిలు పాల్గొన్నారు. -
అక్రమ రవాణాకు ‘చెక్’ పెడతాం: జాయింట్ కలెక్టర్
ఖమ్మం జెడ్పీసెంటర్: నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్య తెలిపారు. పౌరసరఫరాలు, పోలీసు, ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారులతో ఈ చెక్‌పోస్టుల ఏర్పాటుపై కలెక్టరేట్లోని ప్రజా ్ఞసమావేశ మందిరంలో మంగళవారం ^è ర్చించారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పౌరసరఫరాలతో పాటు ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, మోటారు వాహనాల తనిఖీ, అటవీశాఖ, గనులశాఖ అధికారులందరూ ఒకే చెక్ పోస్టులో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆయా శాఖలు ఇప్పటి వరకు నిర్వహిస్తున్న చెక్‌పోస్టుల వివరాలను జేసీ తెలుసుకున్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు, అడిషనల్ ఎస్పీ సాయిక్రిష్ణ, డీఎస్పీ సురేష్, మార్కెటింగ్ ఏడీ వినోద్, ఏఎస్ఓ లక్ష్మణ్, వాణిజ్య పన్నుల అధికారి వెంకటేశ్వర్లు, గనుల శాఖ ఏడీ కె. నర్సింహారెడ్డి, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.వి. శ్రీనివాసరావు, ఎక్సైజ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
కళలు మానసిక వికాసాన్ని న్ని పెంపొందిస్తాయి
అదనపు జేసీ నాగేంద్ర కరీంనగర్‌కల్చరల్: కళలు విద్యార్థులలో మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. సోమవారం కళాభారతిలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళలతో విద్యార్థులలోని ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా కళలలో కూడా ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాసాచారి, జిల్లా పౌరసంబంధాల అధికారి ప్రసాద్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం.. కలెక్టర్ నీతూప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం ఏర్పాటు చేశారు. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎస్పీ జోయల్ డేవిస్, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, అదనపు జేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేబీ.శర్మ బృందం ఆలపించిన శాస్త్రీయ, దేశభక్తి గీతాలు అలరించాయి. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయం, డీఐజీ కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్ క్వార్టర్స్‌లలో సోమవారం ఎస్పీ జోయల్ డేవిస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వర్రావు, ఆర్ఐలు గంగాధర్, శశిధర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసు శిక్షణ కేంద్రంలో... జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ) జరిగినస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇన్చార్జీ ప్రిన్సిపాల్ జిల్లా ఎస్పీ జోయల్‌డేవిస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భీంరావు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు అన్ని సౌకర్యాలు : జేసీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పుష్కర ఘాట్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జేసీ రాంకిషన్ తెలిపారు. శనివారం బీచుపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పుష్కరఘాట్లు భక్తజనసంద్రంగా మారాయన్నారు. అలంపూర్, బీచుపల్లి, సోమశిలలో అంచనాలకు మించి భక్తులు స్నానాలు ఆచరించారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, స్నాన ఘట్టాల్లో ఉన్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి పుష్కరఘాట్‌కు ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. గొందిమళ్ల ఘాట్‌లో స్నానమాచరించే వారి సంఖ్య లక్షకు చేరుకుందన్నారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్ఓ రాజారావు, బీచుపల్లి ఘాట్ ప్రత్యేకాధికారి రంగారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి గౌతం ఫక్రూ, డీఎస్పీ బాలకోటి, ఓఎస్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
∙జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిభింబించే విధంగా 30 నిమిషాల నిడివిలో నాలుగు పాటలు ఉండేవిధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. బారీ కేడింగ్, తాగునీరు, కుర్చిల ఏర్పాటు విషయంలో వీక్షకులకు, అతిథులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖలు స్టాళ్ల ఏర్పాటు, శకటాలు ప్రదర్శించాలని అన్నారు. సమావేశంలో డీఆర్వో శోభ, డీపీఆర్వో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భూములపై హక్కులు కల్పించాలని వినతి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తాము 30ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డితో భూములు కనుగోలు చేసి సాగు చేస్తున్నామని, తమకు ఇట్టి భూములపై హక్కు కల్పించాలని కోరుతూ అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికిSచెందిన దళితులు, గిరిజనులు జేసీ రాంకిషన్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్లో బాధితులతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో సమస్యను జేసీకి వివరించారు. గ్రామంలోని సర్వే నంబర్ 96, 207, 99లలో గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డితో భూములను కొనుగోలు చేశామని, సాదా కాగితంపై రాసుకొని భూములను సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 100ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రైతులు తమకు పట్టా చేయాలని కోరారు. సాదా బైనామా కింద భూములను క్రమబద్ధీకరిస్తామని జేసీ తెలిపారు. -
మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు తొలగిన అడ్డంకి
అనంతపురం అర్బన్: పంచాయతీల పరిధిలో 158 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 7న ‘‘వెబ్సైట్ లాక్’’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి సాంకేతిక అవాంతరాలు తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ap.mee seeva.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 158 మీ సేవ కేంద్రాలకు సంబంధించి పంచాయతీల జాబితా వివరాలనుwww.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. -
పుష్కరపనులు పరిశీలించిన జేసీ
బుగ్గమాధవరం(మేళ్లచెర్వు) మండలంలో కృష్ణాపుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బగ్గుమాధవరం,వజినేపల్లి ,కిష్టాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదు పాయాలను పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను నేటితో పూర్తి చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 ఘాట్ల పరిధిలో 1400 మంది ప్రభుత్వ అధికారులు, 8000 మంది ప్రైవేట్ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. వారికి 9,10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి,ఆర్డీఓ నారాయణరెడ్డి,తహసీల్దార్ శ్రీదేవి,ఐబీ డీఈ స్వామి, ఎంపీడీఓ శాంతకుమారి పాల్గొన్నారు. -
పోర్టు డైరెక్టర్‌గా జేసీ బాధ్యతల స్వీకరణ
కాకినాడ సిటీ : జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పోర్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 1653 ప్రకారం, ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత పత్రాలపై జేసీ సంతకాలు చేశారు. అనంతరం పోర్టు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. డైరెక్టర్ ఆఫ్ పోర్ట్సు పరిధిలో ఉన్న 14 పోర్టులకు సంబంధించి పూర్తి సమాచారం, కార్యకలాపాల వివరాలు తెలుసుకుని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మెరైన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ డి.వెంకటేశ్వరరావు, పీఎస్ టూ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ బెనర్జీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ పంపిణీ వేగవంతం చేయండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రెండు రోజులుగా 4 లక్షల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ సరఫరా చేశామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు, రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలోని సివిల్ సప్లైస్ అధికారులు, ఆర్డీవోలు, స»Œ æకలెక్టర్లు, మండల తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లతో మాట్లాడారు. జిల్లాలో 5వ తేదీ నాటికి 100 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి రేషన్ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల్లో రేషన్ ప్రక్రియ ప్రారంభమైనా పంపిణీ మందకొడిగా సాగడాన్ని ఆయన ప్రశ్నించారు. సర్వే సమస్యలను అందరికీ తెలపండి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే వల్ల వచ్చే సమస్యలను సర్వే సిబ్బంది అందరికీ తెలపాలని, కొత్త సమస్యలు ఎదురైతే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయో అనే విషయాలు ఒకరికొకరు తెలియజేయాలన్నారు. దీని కోసం గ్రూపు మెసేజ్‌లను, లేదంటే వాట్సప్లను ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో దీపం పథకం నూరు శాతం ప్రతి ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు లేని వారి సమాచారాన్ని సేకరించాలని జేసీ కోటేశ్వరరావు ఆదేశించారు. -
మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ
అనంతపురం అర్బన్: స్మార్ట్ సర్వే, మరుగుదొడ్లతో పాటు రెవెన్యూ శాఖలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిరే్ధశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అ«ధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రజాసాధికార సర్వే, రెవెన్యూ, పౌర సరఫరాల అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండంలోనూ రెండు గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్ధాలన్నారు. అధికారుల కృషి కారణంగా సివిల్ సప్లై మేనేజ్‌మెంట్‌లోనూ, బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ)లోనూ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని చెబుతూ అభినందించారు. -
జేసీ వివేక్‌యాదవ్ బదిలీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌కు బదిలీ అయింది. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2008 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్ యాదవ్ 1981 డిసెంబర్ 13న లక్నోలో జన్మించారు. భార్య రోలీ యాదవ్, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ పురపాలక సంఘం కమిషనర్‌గా, మంచిర్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. తరువాత గుంటూరు జాయింట్ కలెక్టరుగా విధులు నిర్వహించి .. శ్రీకాకుళం జేసీగా 2014 అక్టోబర్ 15వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాంధ్రాను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాను సమయంలో వచ్చిన ఆయన బాధితులకు సహాయచర్యలు పక్కాగా అందేలా కృషి చేశారు. తుపాను నిధుల వినియోగం, పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో చురుగ్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. మీ–సేవా నిర్వహణ, భూరికా ర్డు సంస్కరణలు, ప్రధానంగా అడంగల్ కంప్యూటరీకరణ, yì జిటల్ ఇండియా నిర్వహణ, వెబ్‌ల్యాండ్ అమల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తాజాగా ఈ– ఆఫీసు ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిం చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పం దించడంతోపాటు, కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారి అభిమానం చూరగొన్నారు. డిజిట ల్ ఇండియా నిర్వహణలో కేంద్ర మంత్రి నుంచి అవార్డును కూడా తీసుకున్న వివేక్‌యాదవ్ గురువారం ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. కాగా జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. -
పుష్కరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాల్లో యాత్రికుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.రాంకిషన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ముఖ్యమైన 10 పుష్కర ఘాట్ల లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహించారు. 20 మంది టెండర్లు దాఖలుచేయగా 15 తిరస్కరణకు గురయ్యాయి. ఐదు దరఖాస్తులు టెండర్లకు అర్హత సాధించాయి. అందులో తక్కువ ధరలకు సమ్మతించిన సంస్థలకు టెండర్లు ఖరారుచేశారు. టెండర్‌దారులు ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏజేసీ రంజిత్‌ప్రసాద్, అడిషనల్ ఎస్పీ కల్మేశ్వర్ షింగేనవర్, డీఆర్వో భాస్కర్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ రాములు, మల్లేశం పాల్గొన్నారు. -
హాంఫట్
ఖాజీపేట: వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి నీటిచుక్క రైతులకు సద్వినియోగం కావాలని పూర్వం మన పెద్దలు ఆలోచించి చెరువులను తవ్వించారు. ఆ చెరువుల నుంచి వచ్చే నీటిని సాగునీటిగా ఉపయోగించుకుని రైతులు పంటలు పండించేవారు. కానీ నేడు తమ పూర్వీకులు మనకు అందించిన చెరువులను బాగుచేయక పోగా ఉన్న చెరువులను ఆక్రమించి చెరువు ఉనికిని ప్రశ్నర్థకంగా మారుస్తున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో రైతుల సాగునీటి కోసం పూర్వీకులు చెరువును తవ్వించారు. చెరువు 67.07ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ చెరువును గత కొన్ని సంవత్సరాలుగా కొందరు 17 ఎకరాల మేరకు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. చెరువులో నీటినిల్వ బాగాతగ్గిపోయింది. కొద్దిపాటి నీటికే చెరువు నిండిపోవడంతో చెరువు కింద రెండుకార్లు పంటలు సాగుచేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణ తొలగించాలని ఎమ్మెల్యేఫిర్యాదు చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైందని.. ఆక్రమణను తొలగించి చెరువును పరిరక్షించాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జిల్లా కలెక్టర్ మొదలుకుని ఉన్నతాధికారులందరికి గత ఏడాది జనవరి 9న ఫిర్యాదు చేశారు. గత ఏడాది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారు. కానీ రెవెన్యూ అధికారులు కొందరు స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆక్రమణను తొలగించకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలుపంపుతూ వచ్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చెరువులను పరిశీలించిన అధికారులు దుంపలగట్టు చెరువును ఆక్రమించారని గత కొంతకాలంగా చాలామంది ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఆక్రమణపై 2005లో జిల్లాస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ పరిశీలించి ఆక్రమణకు గురైన స్థలాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. చెరువులోని బోరును తొలగించాలని, హద్దులు నిర్ణయించి కరకట్ట నిర్మించాలని సూచించారు. చాలామంది ఆర్డీఓలు వచ్చి చెరువును పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు కానీ చెరువు ఆక్రమణ తొలగింపుపై ఎవరూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. నిధులు మంజూరైనా నిష్ప్రయోజనమే.. చెరువు అభివృద్ధికిడీఆర్డీఏ ద్వారా 2015 మార్చిలో రూ.1,52,237 నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆ నిధులు వినియోగించలేదు. చెరువు ఆక్రమణలను తొలగించలేదు. నిద్రపోతున్నారా అంటూ అధికారులపై జేసీ ఆగ్రహం ఎమ్మెల్యే ర ఘురామిరెడ్డి ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ శ్వేతా బుధవారం దుంపలగట్టు చెరువును పరిశీలించారు. చెరువు పరిస్థితిపై అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి వారి పనితీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చెరువు ఆక్రమణలు తొలగించాం.. అంతా తమ ఆధీనంలో ఉందన్నారు.. ఇక్కడచూస్తే చెరువు భూమిలో అరటి పంట సాగులో ఉంది.. ఇలాగే పనిచేస్తారా.. అందరూ నిద్రపోతూ పనిచేస్తున్నారా.. నివేదికలు ఇలాగే ఇస్తారా’ అంటు ఆర్డీఓ చిన్నరాముడు, తహశీల్దార్ శివరామయ్యలపై అసహనం వ్యక్తంచేశారు. ఆక్రమణ భూమిలో సాగుచేసిన పంటను తొలగించి హద్దులు నిర్ణయించండి.. అందుకు తగ్గట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆమె వారిని ఆదేశించారు. -
రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలు!
♦ వికారాబాద్ కేంద్రంగా జిల్లా తథ్యం ♦ తూర్పు, ఉత్తరాది మండలాల తో కొత్త జిల్లాలు ♦ కొత్త కలెక్టరేట్లపై కలె క్టర్, జేసీలతో ప్రభుత్వం చర్చలు ♦ రెండు లక్షల చదరపు అడుగులు అవసరమని నివేదిక ♦ జూన్ 2 నాటికి తేలనున్న జిల్లా భవితవ్యం కొత్త జిల్లాల స్వరూపం.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా(అంచనా) వికారాబాద్/రంగారెడ్డి(పశ్చిమ): వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు తూర్పు: రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఉత్తరం: కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి మరో నెల రోజుల్లో జిల్లా మూడు ముక్కలు కానుంది. ప్రస్తుత జిల్లా పరిధినే మూడు జిల్లాలుగా విడగొట్టనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త జిల్లాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో నయా జిల్లాల ముఖచిత్రం దాదాపుగా ఖరారైనట్లు కనిపిస్తోంది. వికారాబాద్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆవిర్భావంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సర్కారు.. మరో రెండు జిల్లాలను కూడా ఏర్పాటుచేసే దిశగా కసరత్తును కొలిక్కి తెచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా నైసర్గిక స్వరూపం, జనాభా, ఆదాయ వనరులు తదితర సమాచారాన్ని ఇదివరకే సేకరించిన సర్కారు.. తాజాగా కలెక్టరేట్, పోలీసు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాల స్థల విస్తీర్ణం, మౌలిక వసతులపై చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో సీఎం కార్యదర్శులు శాంతికుమారి, స్మితాసబర్వాల్.. జిల్లా జాయింట్ కలె క్టర్లు రజత్‌కుమార్ సైనీ, కాట ఆమ్రపాలితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ రఘునందన్‌రావు హాజరయ్యారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు ఎన్ని చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుందనే అంశంపై విస్తృతంగా చర్చించారు. పునర్వ్యస్థీకరణలో భాగంగా జిల్లాను ఎన్ని ముక్కలుగా విభజిస్తున్నారనే అంశ ంపై గోప్యతను ప్రదర్శిస్తున్న ప్రభుత్వం.. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన స్థల విస్తీర్ణంపై మాత్రం సమాచారాన్ని తీసుకుంది. ప్రస్తుతం లక్డీకాపూల్‌లో కొనసాగుతున్న కలెక్టరేట్ ప్రాంగణంలోని స్ఫూర్తి (73,236 చ.అ), స్నేహా భవన్ (46430 చ.అ)లో ఆఫీసులు కొలువుదీరాయని, 48 విభాగాలు నగరంలో వివిధ చోట్ల పనిచేస్తున్నాయని ప్రభుత్వానికి నివేదించింది. ఈ లెక్కన కొత్త కలెక్టరేట్లో అన్ని కార్యాలయాలను ఒకే చోటకు చేరిస్తే 2-2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 25 ఎకరాల భూమి అవసరమవుతుందని జిల్లా యంత్రాంగం తేల్చింది. వికారాబాద్ ఖాయం! భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యం ఆధారంగా నయా జిల్లాలకు తుది రూపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా (పశ్చిమ) కొనసాగ నుందని తెలుస్తోంది. దీని పరిధిలో వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇకఇబ్రహీంపట్నం కేంద్రంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ తూర్పు భాగమంతా ఒక జిల్లాగా ఏర్పడనుంది. అలాగే ఉత్తరాన ఉన్న మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్పల్లి సెగ్మెంట్లతో మరో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ మేరకు పాలనాపరమైన సౌలభ్యం, భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఉత్తర ప్రాంతాన్ని ఒక జిల్లాగా, తూర్పు వైపు మండలాలతో మరో జిల్లాగా మార్చే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్రామీణ మండలాల (పశ్చిమ ప్రాంతం)తో వికారాబాద్ (రంగారెడ్డిజిల్లా)ను జిల్లాగా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సర్వత్రా ఉత్కంఠ! జిల్లాల విభజనపై స్పష్టమైన సమాచారం రాకపోవడంతో ప్రజాప్రతినిధులు గందరగోళ ంలో పడ్డారు. అధికారుల నివేదికలను ప్రామాణికంగా చేసుకొని జిల్లాలను ఏర్పాటు చేస్తుండడాన్ని తప్పుబడుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలుంటాయని.. ఈ క్రమంలో భువనగిరి(యాదాద్రి) పరిధిలోకి ఇబ్రహీంపట్నం వెలుతుందనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. ఈ వార్తలతో ఉలిక్కిపడ్డ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఉప్పల్ సెగ్మెంట్లతో కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని సీఎంను అభ్యర్థించారు. మరోవైపు రాజేంద్రనగర్‌ను వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో విలీనం చేస్తారనే అంశంపై అక్కడి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ విభేదిస్తున్నారు. మొయినాబాద్ మండల ప్రజాప్రతినిధులు కూడా పశ్చిమ జిల్లాలో కలిసేందుకు ససేమిరా అంటున్నారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం వికారాబాద్, మల్కాజిగిరి పేరిట రెండు జిల్లాలు మాత్రమే ఉంటాయని, మల్కాజిగిరిలో ఇబ్రహీంపట్నం కలుస్తుందని స్పష్టం చేశారు. ఏదిఏమైనా మరో 25 రోజుల్లో ఏ నియోజకవర్గం.. ఏ జిల్లా పరిధిలోకి వెళుతుందనేది తేలిపోనుంది. -
పండ్లకు కాల్షియం కార్బైడ్ వద్దు : జేసీ
కాకినాడ సిటీ : కాల్షియం కార్బైడ్‌ను పండ్లకు వాడడం ద్వారా ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. పండ్లను పక్వానికి తెచ్చేలా దీని వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టరేట్లో శనివారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే, దాడులు జరిపి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, అంబాజీపేటలో 11 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపారు. రాజమండ్రిలో యాపిల్, అరటి, బత్తాయి తదితర పండ్లకు సంబంధించి 5 శాంపిళ్లలో కాల్షియం కార్బైడ్ వాడినట్టు నివేదిక వచ్చిందని, ఆ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాకినాడలో బత్తాయి, నిమ్మ, ఫైనాపిల్కు సంబంధించి మూడు శాంపిళ్లలో కూడా దానిని వాడినట్టు నివేదిక వచ్చిందని, వారిపై కూడా కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఏ వ్యాపారైనా పండ్లలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే ప్రజలు 90320 50351కు, 94402 75889 సెల్‌నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. హోల్‌సేల్ పండ్ల వర్తకులు తప్పనిసరిగా లెసైన్సు తీసుకోవాలని, రిటైల్, చిన్నవ్యాపారులు విధిగా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ కింద రిజిస్టర్ కావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బీవీఎస్ఆర్కే ప్రసాద్‌తో పాటు మార్కెటింగ్ ఏడీ, వివిధ మున్సిపల్ అధికారులు, పంచాయతీ, రవాణా, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'హోదా వస్తుందంటే నాతో పాటు 10 మంది రెడీ'
-
మహాసంకల్ప సభకు 150 బస్సులు : జేసీ
కాకినాడ సిటీ : గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్ప దినోత్సవ సభా కార్యక్రమానికి జిల్లా నుంచి ఆసక్తి ఉన్న ప్రజలు తరలి వెళ్లేందుకు 150 బస్సులు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ సంయుక్తంగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న ఈ సభను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసే చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లో జిల్లా నుంచి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి సుమారు ఏడు వేల నుంచి పది వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు. వీరికోసం మండలానికి రెండు, మున్సిపాలిటీకి రెండు చొప్పున 150 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సభకు తరలి వెళ్లే ప్రజలకు మధ్యాహ్న భోజనం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించేందుకు లైజన్ అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 డి.మార్కండేయులు, సీపీఓ విజయలక్ష్మి, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా నుంచి 26 వేల మంది : డిప్యూటీ సీఎం పెద్దాపురం : గుంటూరు జిల్లాలో సోమవారం జరిగే మహాసంకల్ప దీక్షకు జిల్లా నుంచి 26 వేల మంది వివిధ వాహనాల్లో తరలివెళ్లినట్టు డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం మహాసంకల్ప దీక్ష ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ఈ సంకల్పదీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్టు ఆయన తెలిపారు. -
ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జేసీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని ఇందిరానగర్‌లోని ప్రభుత్వ భూమిలో కొంత మంది వ్యక్తులు నిర్మించుకున్న ఇళ్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గురువారం పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకున్న వారు జీఓ నంబర్ 58, 59 ప్రకారం అసైన్మెంట్ పట్టాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ 125 గజాలలో 2014 జూన్ 2 నాటికి ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ఉచితంగా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశంతో పాటు ఐబీ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కట్టంగూర్ అంగన్వాడీ సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. గురువారం కట్టంగూర్‌లో అంగన్వాడీ కేంద్రం-3ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. సరుకుల నాణ్యతను పరిశీలించిన అనంతరం వంటలు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రమీల, ఆర్ఐ పద్మ, వీఆర్ఓ వహీద్ తదితరులు ఉన్నారు. -
'జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పారు'
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లేక్‌వ్యూ అతిథిగృహంలో కలిశారు. తన వ్యాఖ్యలపై ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. 'రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎవరికీ సానుభూతి లేదని, ఎన్ని చేసినా ప్రయోజనం కనిపించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలను సోమరిపోతుల్లా తయారు చేస్తోందని జేసీ దివాకర్ రెడ్డి గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే'. తాను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలను కించపరచలేదని, వ్యవస్థలో ఉన్న లోపాల గురించే మాట్లాడానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తనకు సూచించారని ఆయన తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన జేసీ
ఏలూరు :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులిపాటి కోటేశ్వరరావు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులంతా సమన్వయంతో పని చేయూలని కోరారు. పేదలకు సత్వర న్యాయం జరిగినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు జాయింట్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు జి.సోమశేఖర్, ఏలూరు ఎన్జీవో అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, నాయకులు కె.రమేష్‌కుమార్, నరసింహమూర్తి, ఐవీఎస్‌ఎన్ రాజు, కె.సునీత, హరిబాబు జేసీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. -
అర్హులందరికీ ‘ఆహారభద్రత’
రాంగనర్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం నిర్వహించిన జేసీ ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హాలియ, త్రిపురారం, దేవరకొండ, నకిరేకల్, మోత్కూర్ తదితర ప్రాం తాల నుంచి ఫోన్ చేసిన పలువురు.. ఆహారభద్రత కార్డుల మంజూరులో కింది స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఆహారభద్రత కార్డులు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని, అర్హత ఉంటే తప్పనిసరిగా ఇస్తామన్నారు. జాబితాలో పేరు వచ్చిన వారికి రేషన్ సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంతరాలు కలుగజేయకుండా దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారభద్రత కార్డులు ఇవ్వదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. -
జాకీచాన్‌కు ‘సన్’ స్ట్రోక్!
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌కు ఇప్పుడు ఊహించని తలనొప్పి ఎదురైంది. చైనాలో మాదక ద్రవ్యాల వినియోగం విషయంలో ఆయన కుమారుడు తాజాగా అభిశంసనకు గురవడంతో ఆయనకు తల కొట్టేసినంత పని అయింది. అయితే, ఈ వ్యవహారం నుంచి తన కుమారుణ్ణి బయట పడేయడానికి రాజకీయ అనుబంధాలేమీ వాడుకోలేదంటూ ఆయన తాజాగా వివరణనిచ్చుకోవాల్సి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే, మూడు నెలల క్రితం బీజింగ్‌లో తమ ఇంట్లో స్నేహితుల బృందంతో కలసి మాదకద్రవ్యాలు పీలుస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు - జాకీ చాన్ కుమారుడైన 32 ఏళ్ళ జేసీ. మాదక ద్రవ్యాల వినియోగదారులకు వేదిక కల్పించారనే నేరంపై అతగాడికి ఏకంగా మూడేళ్ళ జైలు శిక్ష పడే ప్రమాదం తలెత్తింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన జాకీచాన్ ఏకైక కుమారుడైన జేసీ కూడా వృత్తి రీత్యా నటుడు, గాయకుడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడి జరిపి జేసీనీ, ఆయన మిత్రబృందంలో సభ్యుడైన తైవాన్‌కు చెందిన సినీ తార అయిన 23 ఏళ్ళ కోచెన్-టుంగ్ను కూడా అరెస్ట్ చేశారు. జేసీ నివాసంపై జరిపిన దాడిని చైనా ప్రభుత్వ నిర్వహణలోని సి.సి. టి.వి.లో కూడా ప్రసారం చేశారు. ఎనిమిదేళ్ళుగా తాను మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు జేసీ సైతం పోలీసుల వద్ద అంగీకరించారు. చైనాలో బోలెడంత పలుకుబడి గల రాజకీయవేత్త కూడా అయిన జాకీచాన్ తన కొడుకు చేసిన తప్పుతో తలెత్తుకోలేకుండా ఉన్నానంటున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహనను పెంపొందించడం కోసం చైనాలో 2009లో ఏర్పాటైన చైనా జాతీయ యాంటీ - డ్రగ్ కమిటీకి జాకీచాన్ గుడ్‌విల్ అంబాసడర్ కావడం విశేషం. కొడుకు అరెస్ట్‌తో ఆయన ఇప్పటికే అందరికీ క్షమాపణలు చెప్పారు. కాగా, తన లాగే తన కుమారుడు కూడా ఏదో ఒక రోజుకు మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ఉద్యమానికి అంబాసడర్‌గా నిలుస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
చేయి తడిపితే.. ‘పరీక్ష’ లేదు!
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్‌తో పాటు జేసీ సందర్శించి 24గంటలు కూడా కాలేదు... వారు సీసీఐ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, ఇచ్చిన సూచనల అమలు మాటేమో కానీ... తాజాగా సీసీఐ గుమస్తాల చేతివాటం వెలుగు చూసింది. రైతులు తీసుకొచ్చే పత్తిని సక్రమంగా కొనుగోలు చేయాలని, తేమ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్న అధికారుల ఆదేశాలు అమలుకు నోచుకోని వైనం కూడా బయటపడింది. సీసీఐ గుమస్తాలపై పర్యవేక్షణ కరువవడంతో వారు ఆ డిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. వారి వైఖరి కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. డబ్బు ఇస్తే ఓకే... వరంగల్ మార్కెట్‌కు శుక్రవారం 15వేల బస్తాల వరకు పత్తి అమ్మకానికి రాగా, 80కి పైగా వాహనాల్లో లూజ్ పత్తిని రైతులు తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చే పత్తిని ఎక్కువ భాగం సీసీఐ అధికారులే కొనుగోలు చేయాలన్న ఉన్నతాధికారులను ఆదేశాలతో అధికారులు గుమస్తాలను శుక్రవారం గేట్ వద్దే మొహరించారు. వచ్చిన వాహనాల్లోని పత్తి తేమ శాతాన్ని అక్కడికక్కడే పరీక్షించడం, దాని ప్రకారం ధర ఖరారు చేసి సీసీఐ లీజ్‌కు తీసుకున్న మిల్లులకు పంపడం ప్రారంభించారు. ఇక్కడే గుమస్తాలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. లూజ్ పత్తి తీసుకొచ్చిన రైతుల్లో ఎవరైనా తమకు డబ్బులు ఇస్తే తేమ శాతాన్ని తక్కువగా నమోదు చేసి ధర ఖరారు చేస్తుండడాన్ని కొందరు రైతులు గుర్తించారు. కొన్ని వాహనాల్లో 30 శాతం తేమ ఉన్నా క్వింటాల్‌కు రూ.4010గా ధర నిర్ణయించడం, కొన్ని వాహనాల్లో 15లోపు తేమ శాతం ఉన్నా డబ్బు ఇవ్వని పక్షంలో క్వింటాల్‌కు రూ.3800గా ధర నిర్ణయించడంతో పాటు పలువురు రైతులు గుమస్తాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్కెట్ గ్రేడ్-2 కార్యదర్శి రాహుల్ వెంకట్‌కు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్నారు. మరోసారి రైతులు వాహనాల్లో తీసుకొచ్చిన పత్తి తేమ శాతాన్ని పరీక్షించడంతో రైతులు శాంతించారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు మార్కెట్‌ను సందర్శించి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిరంతరం మార్కెట్, సీసీఐ ఉద్యోగుల తీరుపై నిఘా ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. -
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాలి: జేసీ
జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు మహబూబ్‌నగర్ కల్చరల్: బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నా రు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రతిగ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించి నట్లు తెలిపారు. ప్రపంచదేశాలు సైతం తెలంగాణ సంస్కృతిని ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రారంభమైన ఈ వేడుకలు 26న మండలస్థాయిలో, 28న డివిజన్ స్థాయిలో, అక్టోబర్ 1న జిల్లాస్థాయిలో నిర్విహ ంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మహిళా టీచర్స్ ఫెడరేషన్‌కు చెందిన ఉపాధ్యారుునులు, స్థానిక తేజ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఎంగిలిబతుకమ్మను సిద్దం చేసి పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు చంద్రశేఖర్‌రెడ్డి, హరిత, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
రేషన్ డిపోల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం రూరల్/సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: రేషన్ డిపోల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని డీసీఎంఎస్ పాయింట్(డిపో నంబరు-52), ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని పలు డిపోలను తనిఖీ చేశారు. డీసీఎంఎస్ పాయింట్ డిపోలో సుమారు 20 నిమిషాలు పాటు రికార్డులు, స్టాక్‌ను సరిచూశారు. గ్రాండ్ స్టాక్ బ్యాలెన్సును పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతీ రేషన్ డిపోలో కచ్చితంగా ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను వినియోగించాలని డీలర్లను ఆదేశించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాం తాల్లోని డిపోల్లో ప్రభుత్వం నియమించిన డీలర్లు కాకుండా అనాధికార వ్యక్తులు డీలర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా ఎక్కడైనా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డిపోల డీలర్లు స్టాక్, సేల్స్ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పై నిబంధనలు తక్షణమే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డీఎస్వో ఆనందకుమార్‌ను ఆదేశించారు. తరుగు వస్తే సహించేదిలేదు చౌకధరల డీలర్లకు సరఫరా చేసే సరకుల్లో తరుగు వస్తే సహించేదిలేదని జేసీ హెచ్చరించారు. పౌరసరఫరాల గొడౌన్‌తోపాటు, పలు రేషన్ డిపోలపై ఫిర్యాదులు రావడంతో సరుబుజ్జిలి మండలంలోని గొడౌన్‌తోపాటు మర్రిపాడు రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మర్రిపాడు డిపోలో సరకుల వివరాలు, ధరలు, స్టాకుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే మండల పౌరసరఫరాల గొడౌన్లో సరకులు నిల్వచేసే పద్ధతులను, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. డిపోలకు సరఫరా చేసే సరకుల్లో తరుగులు వస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని గొడౌన్ ఇన్చార్జిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో పౌరసరఫరాల జిల్లా మేనే జర్ లోక్‌మోహన్, తహశీల్డార్లు పాల్గొన్నారు.