జేసీ వివేక్‌యాదవ్‌ బదిలీ | jc transfer | Sakshi
Sakshi News home page

జేసీ వివేక్‌యాదవ్‌ బదిలీ

Published Thu, Jul 28 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

jc transfer

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌కు బదిలీ అయింది. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2008 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వివేక్‌ యాదవ్‌ 1981 డిసెంబర్‌ 13న లక్నోలో జన్మించారు. భార్య రోలీ యాదవ్, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరంగల్‌ పురపాలక సంఘం కమిషనర్‌గా, మంచిర్యాల సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. తరువాత గుంటూరు జాయింట్‌ కలెక్టరుగా విధులు నిర్వహించి .. శ్రీకాకుళం జేసీగా 2014 అక్టోబర్‌ 15వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాంధ్రాను అతలాకుతలం చేసిన హుద్‌హుద్‌ తుపాను సమయంలో వచ్చిన ఆయన బాధితులకు సహాయచర్యలు పక్కాగా అందేలా కృషి చేశారు. తుపాను నిధుల వినియోగం, పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో చురుగ్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. మీ–సేవా నిర్వహణ, భూరికా ర్డు సంస్కరణలు, ప్రధానంగా అడంగల్‌ కంప్యూటరీకరణ, yì జిటల్‌ ఇండియా  నిర్వహణ,  వెబ్‌ల్యాండ్‌  అమల్లో  ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తాజాగా ఈ– ఆఫీసు ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిం చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పం దించడంతోపాటు, కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారి అభిమానం చూరగొన్నారు. డిజిట ల్‌ ఇండియా నిర్వహణలో  కేంద్ర మంత్రి నుంచి అవార్డును కూడా తీసుకున్న వివేక్‌యాదవ్‌ గురువారం ఇక్కడ నుంచి రిలీవ్‌ కానున్నారు.  కాగా జిల్లాకు కొత్త జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement