సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జిల్లా ముందంజ | District lead in the use technology | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జిల్లా ముందంజ

Published Mon, Sep 26 2016 10:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జిల్లా ముందంజ - Sakshi

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జిల్లా ముందంజ

  •  400 పాఠశాలల్లో డిజిటల్‌ బోధన
  •  డిజిటల్‌ ఇండియా ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ 
  • ఇందూరు :
    సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వలన పాలనలో వేగం,  పారదర్శకత పెరుగుతుందని  కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా అన్నారు. ఇందులో మన జిల్లా ముందుందన్నారు. ప్రస్తుతం 400 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యబోధన అమలు జరుగుతోందన్నారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి డిజిటల్‌ ఇండియా –డిజిటల్‌ తెలంగాణ ప్రచార వాహనాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పౌర సేవలు, బ్యాంకింగ్‌ బీమా సదుపాయాలు, బిల్లుల చెల్లింపులను ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 18 రోజుల పాటు రోజుకు మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే గ్రామసభల్లో డిజిటల్‌ ఇండియపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.S 40 గ్రామ పంచాయతీలలో పౌర సేవలను డిజిటల్‌ ఇండియాతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఎన్‌ఐసీ అధికారి రాజగోపాల్, సమాచార శాఖ ఎడీ వెంకటేశ్వర్లు, ఐటీ కోఆర్డినేటర్‌లు ప్రవీణ్, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement