నిధుల విడుదలకు ప్రభుత్వానికి దివేదిస్తాం
నిధుల విడుదలకు ప్రభుత్వానికి దివేదిస్తాం
Published Wed, Dec 7 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
నంద్యాల రూరల్: ప్రత్యేక అవసరాల పాఠశాలలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి దివేదిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మండల పరిధిలోని అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ మూగ, చెవిటి పిల్లల, క్రాంతినగర్‌లోని లూయిస్ బ్రెయిల్ అంధుల పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాల యాజమాన్యం ఆర్థిక పరంగా రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి విన్నవించుకోగా, వాటిని విచారించి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి నెల నగదు రూపంలో వికలాంగులకు అందుతున్న పెన్షన్ ఈనెల అందలేదని, వికలాంగ చిన్నారులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా బ్యాంకుల ద్వారా పెన్షన్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవజీవన్, లూయిస్ బ్రెయిలీ స్కూల్‌లో వికలాంగులకు అందుతున్న విద్య, వసతులను అడిగి తెలుసుకొని జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యలూరు మెట్ట వద్ద కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నాలుగు లైన్ల రోడ్డు అనుసంధానం కావడంతో అమరావతి, తిరుపతి, కర్నూలు వైపు వెళ్లే సర్కిల్‌ను ఆధునీకరించేందుకు అవసరమైన భూసేకరణ నిమిత్తం రైతు బుగ్గరామిరెడ్డికి చెందిను 16సెంట్ల స్థలాన్ని సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈయన వెంట నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement