భూములపై హక్కులు కల్పించాలని వినతి | demand for right on land | Sakshi
Sakshi News home page

భూములపై హక్కులు కల్పించాలని వినతి

Published Tue, Aug 9 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే, జేసీ

గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే, జేసీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : తాము 30ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డితో భూములు కనుగోలు చేసి సాగు చేస్తున్నామని, తమకు ఇట్టి భూములపై హక్కు కల్పించాలని కోరుతూ అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికిSచెందిన దళితులు, గిరిజనులు జేసీ రాంకిషన్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో బాధితులతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో సమస్యను జేసీకి వివరించారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 96, 207, 99లలో గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డితో భూములను కొనుగోలు చేశామని, సాదా కాగితంపై రాసుకొని భూములను సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 100ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రైతులు తమకు పట్టా చేయాలని కోరారు. సాదా బైనామా కింద భూములను క్రమబద్ధీకరిస్తామని జేసీ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement