demand
-
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గిన డిమాండ్
తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్ టు సేమ్.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్మెంట్లకు క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్‌కు గిరాకీ పెరిగిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. 19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్‌లు.. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌ల్లో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. -
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
చమురు, గ్యాస్‌కు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీయంగా చమురు, గ్యాస్‌లకు పటిష్ట డిమాండ్ కనిపించనున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. అయితే ప్రపంచస్థాయిలో డిమాండ్ నీరసించే వీలున్నదని, దీంతో చమురు శుద్ధి(రిఫైనింగ్) మార్జిన్లు బలహీనపడవచ్చని పేర్కొంది.పెట్రోలియం ప్రొడక్టులకు నెలకొనే భారీ డిమాండ్ కారణంగా డౌన్‌స్ట్రీమ్(రిఫైనింగ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మందగించినప్పటికీ బలమైన మార్కెటింగ్ మార్జిన్లు కంపెనీలకు అండగా నిలవనున్నట్లు తెలియజేసింది. వెరసి పటిష్ట నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే వీలున్నట్లు అంచనా వేసింది.నిర్మాణంలో ఉన్న రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలన్నిటికీ అదనపు రుణ భారానికి అవకాశమున్నట్లు వివరించింది. అయితే చమురు ఉత్పాదక(అప్‌స్ట్రీమ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ ముడిచమురు ధరలపై ఆధారపడనున్నట్లు 2025–26 ఆయిల్ అండ్ గ్యాస్ ఔట్‌లుక్‌పై విడుదల చేసిన నివేదికలో రేటింగ్ సంస్థ ఇండియారేటింగ్స్ వివరించింది. ఇబిటాకు ఆధారం రేటింగ్ సంస్థ నివేదిక ప్రకారం చమురు ధరల ఒత్తిడి, పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో అప్‌స్ట్రీమ్ కంపెనీల ఇబిటా క్షీణించవచ్చు. అయితే కొత్త డిస్కవరీల నుంచి చమురు ఉత్పత్తి పెరగడం, ఉత్పాదకతపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ తొలగింపు వంటి అంశాలు చమురు ధరల క్షీణత ప్రభావానికి చెక్ పెట్టే వీలుంది.దేశీయంగా చమురు, గ్యాస్‌కు భారీ డిమాండ్ నెలకొనవచ్చని, ఇది రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాల విస్తరణకు దారి తీసే వీలున్నదని ఇండియారేటింగ్స్ కార్పొరేట్స్ విభాగం అసోయేట్ డైరెక్టర్ భాను పట్ని పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో రిఫైనరీ సామర్థ్యం 22 శాతం బలపడవచ్చని అంచనా వేశారు. చమురు, గ్యాస్ విభాగాలలో పెట్టుబడి నిర్ణయాలను డిమాండ్ ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. జీఆర్‌ఎంలు వీక్ ఈ ఏడాది తొలి అర్ధభాగాన్ని ప్రతిఫలిస్తూ వచ్చే ఏడాది జీఆర్‌ఎంలు మందగించవచ్చు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ నీరసించడం ప్రభావం చూపే వీలుంది. చైనాను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటికితోడు గ్లోబల్‌స్థాయిలో రిఫైనరీ సామర్థ్యాలు పెరగడం కారణంకానున్నాయి. దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు డిమాండ్ కొనసాగనుంది. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీకి బల్క్ డిమాండ్ కనిపించనుంది.చమురు ధరల క్షీణత, నిలకడైన రిటైల్ ధరల కారణంగా సమీకృత కార్యకలాపాలుగల ఓఎంసీలకు ఈ తొలి అర్ధభాగంలో లభించిన మార్కెటింగ్ మార్జిన్లు మద్దతివ్వనున్నాయి. సమీకృత రిఫైనర్స్, స్టాండెలోన్ పెట్‌కెమ్ సంస్థల ఇబిటా వచ్చే ఏడాది మెరుగుపడనుంది. 2024 ఒత్తిడి తదుపరి ఈ ఏడాదిలోనే పెట్‌కెమ్ ఇబిటా బలపడటం మొదలైంది. బ్యారల్ ధర 65 డాలర్లకు ఎగువన కొనసాగితే అప్స్ట్రీమ్కంపెనీలు పటిష్ట మార్జిన్లు ఆర్జించే వీలుంది.ఒక్కో బ్యారల్‌పై 40–45 డాలర్లస్థాయిలో ఉత్పత్తి వ్యయాల బ్రేక్ఈవెన్కు చాన్స్ ఉంది. దీంతో బ్యారల్‌పై 20–30 డాలర్ల ఇబిటా ఆర్జించవచ్చు. ముడిచమురు ధరలు ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి కదులుతాయి. మరోవైపు డిమాండ్, ఒపెక్ దేశాల ఉత్పాదక లక్ష్యాలు సైతం ప్రభావం చూపుతాయి. దేశీయంగా విండ్‌ఫాల్ పన్ను తొలగింపుతో చమురు ధరల క్షీణత దేశీ అప్‌స్ట్రీమ్ కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదు. సిటీ గ్యాస్ ఓకే వచ్చే ఏడాది దేశీ చౌక గ్యాస్ కేటాయింపులు తగ్గిన తదుపరి రానున్న ఏడాదిలో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) సంస్థల క్రెటిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగవచ్చని ఇండియారేటింగ్స్ నివేదిక పేర్కొంది. మూలధన పెట్టుబడులపై రాబడి మందగించవచ్చు. అయితే పటిష్టస్థాయిలోనే నమోదయ్యే వీలుంది. కొత్త ప్రాంతాలలో పెట్టుబడుల వెచ్చింపుపై కొంతమేర ఒత్తిళ్లు నెలకొనవచ్చు.పెట్టుబడి వినియోగ అంతర్గత వనరులు తగ్గే వీలుంది. క్రాక్ స్ప్రెడ్స్(మార్జిన్ల అంతరం) మెరుగుపడటం, అధిక సరఫరా పరిస్థితులు ఉపశమించడం వంటి కారణాలతో విడిగా(స్టాండెలోన్) పెట్రోకెమికల్ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించే వీలుంది. 2019–24 మధ్యకాలంలో ప్రధానంగా చైనా నుంచి భారీ సామర్థ్యాలు జత కలవడం అధిక సరఫరాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
మన్యం అతిథి గృహాలు హౌస్‌పుల్
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సంవత్సరాంత వేడుకల జోష్‌ను పులుముకున్నాయి. డిసెంబర్ 31తో పాటు ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 వేడుకలను సంతోషంగా చేసుకునేందుకు పర్యాటకులు మన్యంలోని పర్యాటక ప్రాంతాలను ఎంచుకున్నారు. జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, పాడేరు, వంజంగి, చింతపల్లి, లంబసింగి, మోతుగూడెం, మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లోని అతిథి గృహాలను పర్యాటకులు, వివిధ వర్గాల ప్రజలంతా మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు. అతిథి గృహాలన్నీ హౌస్పుల్పర్యాటక శాఖకు చెందిన అన్ని అతిథి గృహాలు, రిసార్ట్లు ఆన్లైన్లోనే హౌస్‌పుల్ అయ్యాయి. అనంతగిరిలోని టైడా జంగిల్ బెల్స్‌లో 24, అనంతగిరి హరితలో 28, అరకులోయ మయూరిలో 85, హరితలో 58, లంబసింగిలో 15 గదులు రెండు రోజుల పాటు బుక్ అయ్యాయి. టూరిజం శాఖకు చెందిన అన్ని రిసార్ట్‌లలో రెస్టారెంట్ల సౌకర్యం ఉండడంతో ఈ గదులకు అధిక డిమాండ్ ఉంది.ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లకూ ఆదరణఅనంతగిరి, అరకులోయ, వంజంగి, కొత్తపల్లి, లంబసింగి టూరిజం కారిడార్‌గా పర్యాటకుల ఆదరణ మూడేళ్లలో అధికమైంది. దీంతో పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగానే హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణాలు భారీగానే జరగ్గా.. వాటికీ ఆదరణ పెరిగింది. టెంట్ సౌకర్యాలు కూడా పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అనంతగిరి మండలంలో 200, అరకులోయలో 1,200, పాడేరు 100, వంజంగి 100, లంబసింగిలో 200 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. అంతే స్థాయిలో టెంట్లను కూడా వేస్తున్నారు. సంవత్సరాంత వేడుకలతో అతిథి గృహాలు, రిసార్ట్లు, టెంట్ ప్రాంతాలని్నంటినీ నిర్వాహకులు ముస్తాబు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా విద్యుత్ దీపాల అలంకరణలో కళకళలాడుతున్నాయి.గోదారి తీరంలోనూ..కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్సాక్షి, అమలాపురం: మెట్రోపాలిటన్ నగరాల నుంచి సంక్రాంతికి మాత్రమే గోదావరి జిల్లాలకు వచ్చే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు ఈసారి ముందుగానే గోదావరి తీరంలో.. ప్రకృతి ఒడిలో.. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తరలివస్తున్నారు. వీరందరి రాకతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్టులు నిండిపోయాయి. స్థానిక రిసార్టుల్లోని రూములన్నీ డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు రెండు నెలల క్రితమే బుకింగ్ అయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన సరోవర్ పోర్టికో, సముద్రా రిసార్ట్లు, కాకినాడ జిల్లా గోవలంక వద్ద ఉన్న యానాం రిసార్టు, గోదావరి నదిని, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా నిండిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లోని రిసార్ట్లు, ప్రధాన హోటళ్లు పర్యాటకులతో సందడిగా మారాయి.న్యూ ఇయర్ ఇక్కడేపర్యాటక ప్రాంతం అరకులోయ, వంజంగి హిల్స్ ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ముందుగానే చేరుకున్నాం. గతంలోనే అరకులోయలో ప్రైవేట్ అతిథి గృహాన్ని బుక్ చేసుకున్నాం. కుటుంబ సభ్యులతో వచ్చాం. రెండు రోజులు ఇక్కడే ఉంటాం. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి. – అర్ణబ్, పర్యాటకుడు, కోల్‌కతా -
ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి? సంభల్, జ్ఞానవాపితో లింకేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్ఐ సర్వేకు అనుమతినిచ్చింది.పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలుతదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ హింసాకాండలో కొందరు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో చెలరేగిన వివాదం ఇంకా ముగియనే లేదు. ఈ అంశం కూడా కోర్టులో ఉంది. ఇటీవల జరిగిన ఈ వివాదాలు ఉదాహరణ మాత్రమే. దీనికి ముందు, మథురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు కూడా తరహాలోని హై ప్రొఫైల్ కేసులు. ఈ వివాదాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడివున్నాయి.చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పిటిషన్లుప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఏదో ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకుండా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చట్టాలనికి గల చట్టపరమైన చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి.ప్రార్థనా స్థలాల చట్టం-1991లో ఏముంది?1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15కు ముందు అంటే దేశ స్వాతంత్య్రానికి ముందు ఉన్న ఏదైనా మతపరమైన ప్రార్థనా స్థలం యథాతథ స్థితిని కొనసాగించడానికి అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఆయా ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని కూడా నిరోధిస్తుంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు చేర్చారు.ప్రార్థనా స్థలం చట్టం సెక్షన్- 21947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మతపరమైన స్థలంలో మార్పులకు సంబంధించి కోర్టులో ఏదైనా పిటిషన్ పెండింగ్‌లో ఉంటే, దానిని కొట్టివేస్తారని ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్- 2 చెబుతోంది.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 3మతపరమైన స్థలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మరొక మతంలోకి మార్చడానికి అనుమతి లేదు. 1947 ఆగస్టు 15న ఏ విధంగా ఉన్న మత స్థలాలు యధాతథంగా ఉంటాయి. నాడువున్న మతస్థలం అంతకుముందు ఎప్పుడైనా కూల్చివేసి, మరో మతస్థలం నిర్మించినట్లు రుజువైనా, దాని ప్రస్తుత రూపాన్ని మార్చేందుకు అవకాశం లేదు.ప్రార్ధనా స్థలం చట్టంలోని సెక్షన్- 4(1)సెక్షన్ 4(1) ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి అన్ని మతాల ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలి.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 4(2)ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్- 4 (2) ప్రకారం, ప్రార్థనా స్థలాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీన పెండింగ్‌లో ఉన్న దావాలు, చట్టపరమైన చర్యలను నిలిపివేయడం గురించి ఇది తెలియజేస్తుంది. అంటే 1947 ఆగస్టు 15కు ముందు ఉన్న వివాదంపై తిరిగి విచారణ ఉండదు.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 5ఈ సెక్షన్ కింద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పక్కన పెట్టారు. అంటే అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఈ ప్రార్థనా స్థలాల చట్టంలోని ఎలాంటి నిబంధనలు వర్తించవు.చట్టం ఎందుకు అవసరమయ్యింది?అయోధ్యలో రామమందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఈ చట్టం వచ్చింది. ఈ వివాదం దేశమంతటిపై ప్రభావం చూపింది. దేవాలయాలు, మసీదులకు సంబంధించిన వివాదాలు తెరపైకి రావడం మొదలయ్యింది. మతపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. ఇలాంటి వివాదాలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకు వచ్చి, 1947 ఆగస్టు 15కి ముందు మత స్థలాల యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
2025లో ఆ కార్లకే డిమాండ్!
భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంతంగా కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సరసమైన చిన్న కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉంటుందని.. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన నివేదికలో పేర్కొంది.డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికా, జపాన్ కంపెనీలు చిన్న కార్లను విరివిగా తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మార్కెట్లో చిన్న కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎస్‌యూవీలు, ప్రీమియం కార్ల ధరలు పెరగడంతో.. వాహన కొనుగోలుదారుల చూపు చిన్న కార్ల మీద పడింది. సీఎన్జీ కార్ల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.చిన్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నోమురా తన నివేదికలో వెల్లడించింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండేది కాదు.. అయితే నేడు ఎక్కువమంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.కరోనా మహమ్మారి సమయంలో గ్లోబల్ మార్కెట్లో వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆ తరువాత ఆటోమొబైల్ కంపెనీలు కోలుకున్నప్పటికీ.. డిమాండుకు తగ్గ సరఫరా చేయడంలో కొంత విఫలమయ్యాయి. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వేగవంతమైంది. వచ్చే ఏడాది డిమాండుకు తగిన విధంగా డెలివరీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌పై.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రభావం కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఐరోపాలో ఉద్యోగ నష్టాలు.. ఫ్రాన్స్ & జర్మనీలలో రాజకీయ గందరగోళం వంటివి ఐరోపాలో మొత్తం డిమాండ్ రికవరీని ప్రభావితం చేసిందని నోమురా నివేదిక ద్వారా తెలిసింది. యూఎస్ ట్యాక్స్, అధిక ధరలు వంటివి కూడా కార్ల అమ్మకాల మీద ప్రభావం చూపినట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో రిటైల్ స్పేస్‌కు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.హైదరాబాద్‌లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్‌ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు. -
సగానికి పడిపోయిన పండుగ డిమాండ్
ముంబై: ప్రస్తుత ఏడాది పండుగల సందర్భంగా డిమాండ్ సగానికి క్షీణించి 15 శాతంగా ఉన్నట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. 2023లో పండుగల సీజన్లో డిమాండ్ 32 శాతం పెరగ్గా, 2022లో 88 శాతం వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ అమ్మకాలు పండుగల సీజన్లో పెరిగినప్పటికీ, మొత్తం మీద వృద్ధి నిదానంగానే ఉన్నట్టు పేర్కొంది.గ్రామీణ ప్రాంతాలు, టైర్–2, 3 పట్టణాల్లో డిమాండ్ స్థిరంగానే ఉండగా.. మెట్రోల్లో, పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. పట్టణ డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం ప్రకటించడం గమనార్హం. డిసెంబర్ నెలలో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడం డిమాండ్‌కు ఊతం ఇవ్వొచ్చని నోమురా అంచనా వేస్తోంది. రిటైల్ అమ్మకాల వృద్ధి 2023లో ఉన్న 36.4 శాతం నుంచి.. 2024లో 13.3 శాతానికి పరిమితం కావొచ్చన్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనాలను తన నివేదికలో నోమురా ప్రస్తావించింది.మరోవైపు రిటైల్ ఆటో విక్రయాలు 14 శాతం పెరగ్గా.. హోల్సైల్ వైపు ప్యాసింజర్ అమ్మకాలు, మధ్యశ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక మందగమనం కొనసాగుతోందంటూ.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉండొచ్చన ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావాహంగా ఉన్నట్టు నోమురా అభివర్ణించింది. -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఎయిర్ ప్యూరిఫయర్లకు (గాలిని శుద్ధి చేసే పరికరాలు) డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలకు చేరడం ఇందుకు నేపథ్యమని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు గతేడాది ఇదే సీజన్‌తో పోలి్చనప్పుడు 50 శాతం పెరిగినట్టు కెంట్ ఆర్వో సిస్టమ్స్, షావోమీ, ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా వెల్లడించాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల కోసం గడిచిన 2–3 వారాలుగా విచారణలు పెరిగాయని, గాలి నాణ్యత సూచీ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోనున్న (శీతాకాలం కావడంతో) దృష్ట్యా వీటి అమ్మకాలు ఇంకా పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల విభాగం పరిమాణం పరంగా చాలా చిన్నది కావడం గమనార్హం. ఏటా అక్టోబర్–నవంబర్ కాలంలో వీటి అమ్మకాలు గరిష్టానికి చేరుతుంటాయి. ఆ సమయంలో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. దీపావళి వేడుకలకుతోడు పంట వ్యర్థాల దహనం ఇందుకు కారణం. ఒక్కసారిగా డిమాండ్.. ‘‘ఢిల్లీ అత్యంత కాలుష్యంతో కూడిన సీజన్‌ను ప్రస్తుతం చూస్తోంది. దీంతో అక్కడ ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్ ఏర్పడింది’’అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చిత్కార తెలిపారు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిని దాటిపోతే అప్పుడు కాలుష్య కారకాలు పీఎం 2.5 పారి్టకల్స్ కంటే సూక్ష్మంగా ఉంటాయని, వీటిని వడగట్టడం కూడా కష్టమేనన్నారు. శీతాకాలంలో వాయునాణ్యత క్షీణించడం వల్ల ఎయిర్ ప్యూరిఫయర్లు, ఫిల్టర్ల అమ్మకాలు సహజంగానే పెరుగుతుంటాయని కెంట్ఆర్వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్తా తెలిపారు. ఉత్తరాది ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరడంతో తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వినియోగదారులు ఎయిర్ ప్యూరిఫయర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు వివరించారు. ఇప్పటికే అమ్మకాలు 20–25 శాతం మేర అధికంగా నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే 50 శాతం మేర అధికంగా ఎయిర్ ప్యూరిఫయర్, ఫిల్టర్ల అమ్మకాలు పెరిగినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి సైతం వెల్లడించారు. 2023 నాటికి ఎయిర్ ప్యూరిఫయర్ల మార్కెట్ విలువ రూ.778 కోట్లు ఉన్నట్టు.. 2024 నుంచి 2032 వరకు ఏటా 16 శాతం కంటే ఎక్కువే వృద్ధిని నమోదు చేస్తుందని ఒక అంచనా. ‘‘కాలుష్యం అదే పనిగా పెరిగిపోతుండడంతో హానికారకాల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. అందుకే చాలా మంది కాలుష్యం నుంచి రక్షణగా ఈ కాలంలో బయటకు వెళ్లడానికి బదులు ఇళ్లల్లో ఉండేందుకే ప్రాధాన్యమిస్తుంటారు’’అని బ్రిటిష్ కంపెనీ డైసన్ పేర్కొంది. ఈ సంస్థ సైతం ఎయిర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తుంటుంది. -
20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ డిమాండ్‌పై అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ఈ పీపీఏల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లలో కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. 2024–25లో 24వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండనున్న మిగులు విద్యుత్.. 2028–29 నాటికి 43 వేల ఎంయూలకు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నివేదించాయని గుర్తు చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తయితే మిగులు విద్యుత్ ఇంకా పెరిగిపోతుందన్నారు. కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్ మరింతగా పెరిగి రాష్ట్ర ప్రజలపై అనవసర భారం పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పీపీఏలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతిచ్చిందని, ఇకపై కొత్త పీపీఏలకు అనుమతి విషయంలో పునరాలోచించాలని సూచించారు. 2024–25లో రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పీడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పై బుధవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వక్తలు పాల్గొని మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలతో ప్రయోజనాలతోపాటే దుష్పరిణామాలూ ఉంటాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తెలిపారు. అవసరానికి మించి ఈ ఒప్పందాలు చేసుకుంటే జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించడం/పూర్తిగా నిలుపుదల చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఒప్పందాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2022–23లో ఏకంగా రూ.5596 కోట్ల చార్జీలను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించిందన్నారు. వాస్తవానికి ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. జెన్కో థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలకు మరమ్మతు లేక ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ముందు తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 28న ఈఆర్సీ కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇలా అయితే పరిశ్రమలు తరలిపోతాయి హెచ్‌టీ కేటగిరీలోని 33 కేవీ, 133 కేవీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను 11 కేవీ వినియోగదారులతో సమానంగా పెంపుతోపాటు కొత్తగా స్టాండ్‌బై చార్జీలు, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు, అన్‌బ్లాకింగ్ చార్జీల ప్రతిపాదనలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ), తెలంగాణ ఐరన్, స్టీల్ మ్యానుఫాక్టర్స్ అసోసియేషన్, ఏపీ, టీజీ ప్లాస్టింగ్ మాన్యుఫాక్టరింగ్ అసోసియేషన్లు వ్యతిరేకించాయి. ఇలా అయితే రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సమానంగా తమ విద్యుత్ చార్జీలను తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే సీఈ కె.థౌర్య విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులపై వక్తల ఆగ్రహంవ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతుల కోసం రవాణా చేసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మ తులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నా రన్నారు. విద్యుత్ సిబ్బంది అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాడి పరిశ్రమను వ్యవసాయ కేటగిరీ కింద చేర్చి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తాం: మధుసూదనాచారితెలంగాణలో 2015–23 మధ్య కాలం కరెంట్ విషయంలో స్వర్ణ యుగమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచలేదన్నారు. చార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతాయని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1220 కోట్ల చార్జీలను పెంచకుండా ప్రభుత్వమే అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నారు.అక్కడికక్కడే ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జైన్ తిరుమలాపూర్లో పొలం వద్ద విద్యుదాఘాతంతో 2022 మార్చి 28న పరగోల యాదయ్య చనిపోయాడు. బహిరంగ విచారణలో ఫిర్యాదు రాగా, అక్కడిక్కడే సీఎండీ రూ.5 లక్షల చెక్‌ను యాదయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు, సభ్యులు మనోహర్, కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన దివ్యాంగులు
మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్ అమలుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాంగులకు కూడా రేషన్ కార్డులివ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. → ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. → ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. → పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. → కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆధునిక అపార్ట్మెంట్ల వైపు మొగ్గు.. ‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. -
టీడీపీ కాలకేయుల నుంచి మహిళలను రక్షించాలి
సాక్షి, అమరావతి/హిందూపురం: రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ అత్యంత దుర్మార్గమని, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆదివారం హిందూపురం డీఎస్పీ మహేష్‌ను ఆయన కార్యాలయంలో కలసి బాధితుల పరామర్శకు అనుమతించాలని కోరారు.ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ఆమె.. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమానుషం జరిగి రెండు రోజులైనా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులకు బాసటగా నిలవలేక పోయారని, నియోజకవర్గాన్ని గాలికి వదిలి సినిమాలకు పరిమితం కావడం బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. -
బియ్యం ధరలు పైపైకి.. వారంలోనే 15% పెరుగుదల
మార్కెట్లో బియ్యం ధరలు చూస్తే గుండె గుభిల్లుమంటోంది. రోజురోజుకీ సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలులేని అన్ సీజన్లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.కేవలం వారం రోజుల్లో దేశంలో బియ్యం ధరలు దాదాపు 10-15 శాతం వరకు పెరిగాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్ వాటా 45 శాతం వరకు ఉంటుంది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. అయితే, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతులపై సుంకాన్ని కేంద్రం మినహాయించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ సెప్టెంబర్ 28న కేంద్రం నిర్ణయం తీసుకుంది.కేంద్రం నిర్ణయంతో భారత్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో దేశంలో వారం వ్యవధిలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆఫ్రికాకు ఎక్కువగా ఎగుమతయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకుముందు రూ.35 కిలో ఉండగా ఇప్పుడు రూ.41కి పెరిగింది. బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల బియ్యం ధరలు 10-15 శాతం పెరిగాయని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారు. -
మహారాష్ట్ర: హస్తం పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్
ముంబై: త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా ఎన్సీపీ,శివసేన(ఉద్ధవ్)పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుంది. పొత్తులో కాంగ్రెస్‌కు సుమారు 100 నుంచి 110 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.ఈ సీట్లలో టికెట్ల కోసం ఇప్పటికే 1800కుపైగా దరఖాస్తులు వచ్చాయని నేతలు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20వేల రుసుము నిర్ణయించారు.ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే తేదీలు ప్రకటించాక వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్అఘాడీ కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రభావంతోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించనుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనా ఫలితంగానే పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొందని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.ఇదీ చదవండి: హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్ -
మధుర ఫలం
రాజానగరం: రుచిలో సిమ్లా యాపిల్ని మరపించే చాగల్నాడు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం)కి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంచి పేరు ఉంది. అయితే చాగల్నాడు ప్రాంతంలో రియలెస్టేట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీతాఫలాల తోటలు అంతరించిపోతున్నాయి. ఫలితంగా చాగల్నాడు సీతాఫలాలకు డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిపోయింది. చాగల్నాడు ప్రాంతంలో తోటలు (మామిడి, జీడిమామిడితో కలసి ఉంటాయి) తరిగిపోవడంతో సీతాఫలాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. సీతాఫలాలు పక్వానికి రావాలంటే శీతలంతో పాటు వర్షాలు కురుస్తూ ఉండాలి. ఈ కారణంగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అక్కడక్కడా లభిస్తున్న సీతాఫలాలతో ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరుకుతున్న సీతాఫలాలను జోడించి వ్యాపారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా రవాణా అవుతున్నాయి. ఈ విధంగా సీజన్లో సీతాఫలాలు క్రయవిక్రయాల ద్వారా సుమారు రూ.7.5 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. గుర్తించడం చాలా కష్టం రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణకు ముందు ఈ ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా సీతాఫలాల తోటలు విస్తారంగా ఉండేవి. రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణించే వారికి లైటింగ్‌లో సీతాఫలాలు నిగనిగలాడుతూ కనిపించేవి. అంతేకాదు సీజన్లో దివాన్‌చెరువు కూడలి క్రయ, విక్రయదారులతో కిక్కిరిసిపోయేది. ఒక్కో సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతూ ఉండేది. అయితే నేడు ఆ పరిస్థితులు లేవు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న సీతాఫలాలు చాగల్నాడు ఫలాలో, ఏజెన్సీవో కూడా తెలియని పరిస్థితి. వీటి మధ్య ఉన్న తేడా స్థానికులకే మాత్రమే కొంత అవగాహన ఉంటుంది. దీంతో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ప్రయాణికులు చాగల్నాడు ఫలాలుగానే భావించి కొనుగోలు చేసుకుని, తమ ప్రాంతాలకు తీసుకెళుతుంటారు. ఎందరికో ఉపాధి సీతాఫలాల ద్వారా సీజన్లో ఎందరికో జీవనోపాధి లభిస్తుంటుంది. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారి వెంబడి విరివిగా వెలసిన దుకాణాలతో పాటు సైకిళ్ల పైన, తోపుడు బళ్లపైన జిల్లా అంతటా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు.చాగల్నాడు సీతాఫలాలు నిల్వకు ఆగవు. పక్వానికి వచ్చిన వెంటనే కళ్లు విచ్చుకున్నట్టుగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అయితే ఏజెన్సీ సీతాఫలాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ సీజన్లో సీతాఫలాల వ్యాపారం రూ.ఏడున్నర కోట్లు దాటుతుందని ఒక అంచనా. జాలై నుంచి అక్టోబరు వరకు ఏజెన్సీ సీతాఫలాలను దిగుమతి చేసుకుని, రూ.4.50 కోట్లకు పైబడి వ్యాపారం చేస్తుంటారు. ఇక తోటలు తగ్గినాగాని చాగల్నాడు సీతాఫలాల ద్వారా ఈ సీజన్లో (అక్టోబరు) రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ఏ విధంగా చూసిన ఈ సీజన్లో సీతాఫలాల ద్వారా జిల్లాలో రూ.ఏడున్నర కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.వంద ఫలాలు రూ.2,500 పైమాటే.. తోటలు విస్తారంగా ఉన్న సమయంలో వంద సీతాఫలాలను రూ.50 నుంచి రూ.వందకు విక్రయించే వారు. కానీ నేడు ఆ ధరకు అడిగితే ఎగాదిగా చూస్తారు. ఎందుకంటే వందల లెక్కన కొనుగోలు చేసే రోజులు పోయాయి. మామిడి పండ్ల మాదిరిగా డజను, పాతిక, పరక చొప్పున కొనాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా వంద ఫలాలు కొనాలంటే రూ.2500 పైనే ధర పలుకుతుంది. అంత మొత్తం పెట్టలేక చాలామంది డజన్ల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కాయల సైజులను బట్టి పరక, డజను లెక్కల్లో డజను రూ.300 నుండి రూ.500కు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వీటిని కొంతమంది స్థానిక వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువచ్చి, జాతీయ రహదారి వెంబడి ఉన్న స్టాల్స్‌కి సరఫరా చేస్తుంటారు. అక్టోబర్ చివర్లో షోలాపూర్ ఫలాలు.. ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల సమయంలో చాగల్నాడు సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయి. అయితే తోటలు తక్కువగా ఉండటంతో అవి ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు అయిపోయాయనే విషయం కూడా తెలియకుండా జరిగి పోతుంటుంది. దీంతో ఈ సీజన్ ప్రారంభంతో ఏజెన్సీ సీతాఫలాలను చాగల్నాడు మార్కెట్‌కి వస్తే, ఆఖరులో (అక్టోబరు, నవంబరు) వ్యాపారులు షోలాపూర్ నుంచి కూడా సీతాఫలాలను దిగుమతి చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు.ఇవి చూడటానికి చాగల్నాడు సీతాఫలాల మాదిరిగానే నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. దీంతో ఈ సీజన్లో షోలాపూర్ కాయల ద్వారా సుమారు రూ.కోటి వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఒక అంచనా. దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌కి షోలాపూర్ నుంచి వచ్చే యాపిల్, దానిమ్మల లోడులో వీటిని తీసుకువస్తుంటారు. సీజన్లో దొరికే ఫలాలను తినాలి సీజన్లో దొరికే ఫలాలను తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రకృతి మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నివారణకు ఫలాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో సీతాఫలాలను తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందుకనే వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. – అద్దంకి సీతారామమ్మ, అచ్యుతాపురం సీజనల్ పండ్లని నిర్లక్ష్యం చేయవద్దు నేటి ఆధునిక సమాజంలో అంతా రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడటం వలన జనం జబ్బుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరి, పండ్లు తిని నయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీజనల్‌గా దొరికే పండ్లని ఒక్కసారైనా తింటే సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. – సత్తి త్రిమూర్తులు, ముక్కినాడపాకలు -
ఆలూ.. సబ్సిడీ ఇస్తే మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్ పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.పంజాబ్ నుంచి కొనుగోలు.. ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్ఆలూ సాగు ఖర్చు పెరిగింది ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లాసబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్ -
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
ఏపీ కాఫీకి ‘భలే’ డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.దేశంలో 2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్‌షాపుల ద్వారా కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది. 2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలారాష్ట్రం పేరు విస్తీర్ణం సాగు (హెక్టార్లు) ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు) కర్ణాటక 2,46,550 2,48,020 కేరళ 85,957 72,425 తమిళనాడు 35,685 18,700 ఆంధ్రప్రదేశ్ 1,00,963 12,265 ఒడిశా 4,868 465 ఈశాన్య ప్రాంతాలు 5,647 125 -
ఆఫీస్ స్పేస్‌కు రికార్డు డిమాండ్.. లిస్ట్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతి) డిమాండ్ 80 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) దాటుతుందని కుష్‌మ్యాన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. 2023లో 74 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.డీఎల్ఎఫ్ రెంటల్ వ్యాపారం ఎండీ, వైస్ చైర్మన్ శ్రీరామ్ ఖట్టర్ ఈ నివేదికపై స్పందిస్తూ.. భారత్ అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన సానుకూల ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. మన దేశంలో యువ, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారని, వీరు నాణ్యమైన రియల్ ఎస్టేట్‌ను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ అనుకూలతలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నట్టు పేర్కొన్నారు.విశ్వసనీయత కలిగిన డెవలపర్ల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల కోసం అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నట్టు ఖట్టర్ తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో 41.9 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైందని.. బహుళజాతి కంపెనీల నుంచి తాజా డిమాండ్ ఇందుకు తోడైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ద్వితీయ ఆరు నెలల్లోనూ ఇదే ధోరణి ఉంటుందని, మరో 40 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదు కావచ్చని అంచనా వేసింది.గ్రేడ్ ఏ డిమాండ్ డౌన్.. గ్రేడ్ ఏ ఆఫీస్ వసతుల లీజింగ్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 0.40 శాతం తగ్గి 17.7 శాతంగా ఉంది. 2021 చివరి మూడు నెలల కాలం తర్వాత ఇంత తక్కువ లీజింగ్ తిరిగి మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐటీ–బీపీఎం రంగం అత్యధికంగా 26 శాతం మేర స్థూల ఆఫీస్ వసతుల డిమాండ్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ రంగం రెండో స్థానంలో ఉంది.‘‘భారత ఆఫీస్ లీజింగ్ మార్కెట్ రికార్డు స్థాయి డిమాండ్‌ను చూస్తోంది. బలమైన ఆర్థిక మూలాలు, అత్యాధునిక డిజిటల్ సాంకేతికత, కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగులు పెరగడం, కరోనా కాలంలో వాయిదా పడిన విస్తరణ ప్రణాళికలు అమల్లోకి రావడం ఇవన్నీ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి’’అని టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. దేశీయ కంపెనీల నుంచి డిమాండ్ స్థిరంగా ఉండగా, అంతర్జాతీయ కంపెనీలను సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు.దీంతో 2024 మొదటి ఆరు నెలల్లో లీజింగ్ కార్యకలాపాలు జోరుగా సాగినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆఫీస్ లీజింగ్ కొత్త రికార్డులను నమోదు చేయవచ్చన్నారు. విభిన్నమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, టెక్నాలజీ అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.. ఇవన్నీ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు వీలు కల్పిస్తున్నట్టు టెనెంట్ రిప్రజెంటేషన్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. కేవలం టెక్నాలజీయే కాకుండా దాదాపు అన్ని రంగాల నుంచి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ నెలకొన్నట్టు చెప్పారు. -
భారీగా పెరుగుతున్న డిమాండ్.. బంగారం కంటే ప్రియం!
సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతదేశపు వెండి దిగుమతులు దాదాపు రెండింతలకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.బంగారం, వెండి వినియోగంలో భారత్ ప్రధానంగా చెప్పుకోదగ్గ దేశం. భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం వెండి దిగుమతి 6500 నుంచి 7000 టన్నుల వరకు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2024 ప్రథమార్థంలోనే భారతదేశపు వెండి దిగుమతులు 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో కారణం ట్యాక్స్ తగ్గించడం కూడా. స్మగ్లింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంని ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం జరిగింది.భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజు దేశీయ మార్కెట్లో రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 91700 రూపాయలకు చేరింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉంది. -
పండుగ డిమాండ్..లక్షల్లో గిగ్ జాబ్స్!
రాబోయే పండుగ సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. కస్టమర్ల నుంచి అంచనాలను మించి డిమాండ్ ఉంటుందనే లెక్కలతో కంపెనీలు తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు)లను పొలోమంటూ నియమించుకుంటున్నాయి. దీంతో గిగ్ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుందనేది హైరింగ్ ఏజెన్సీల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్పండుగల పుణ్యామా అని తాత్కాలిక హైరింగ్ జోరందుకుంటోంది. పరిశ్రమలవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అంచనా. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఇది 15–20 శాతం అధికం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం.. స్టాక్ మార్కెట్లు కూడా మాంచి జోరుమీదుండటంతో వినియోగదారులు పండుగల్లో ఈసారి కొనుగోళ్లకు క్యూ కడతారని కంపెనీలు భావిస్తున్నాయి.పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ కూడా దన్నుగా నిలుస్తుందని లెక్కలేస్తున్నాయి. వెరసి పండుగ అమ్మకాల కోసం కీలక పరిశ్రమలు తాత్కాలిక కొలువులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, సీఈఐఎల్, హెచ్ఆర్ సరీ్వసెస్, టీమ్‌లీజ్ సరీ్వసెస్ తదితర హైరింగ్ సంస్థలు చెబుతున్నాయి.ఈ రంగాల్లో జోష్... రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్లు వేస్తున్నాయి. ఫుల్ డిమాండ్ ఉంటుందనన్న అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్‌కు గేట్లెత్తాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, కన్జూమర్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, తయారీ, పర్యాటకం–ఆతిథ్య రంగాలు కూడా పటిష్టమైన డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయి. ‘పండుగ హైరింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, మండుటెండల ప్రభావంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో, పండుగల్లో దండిగానే ఖర్చు చేసే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల్లోనూ కలిపి 6 లక్షల నుంచి 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నాం’ అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్/గూడ్స్ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పండుగ షాపింగ్‌కు కొత్త కళ తీసుకొస్తున్నాయి. మరోపక్క, బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా మరింత వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలనేది వాటి ప్లాన్. దేశంలోని చాలా కంపెనీల వార్షిక వ్యాపారంలో మూడింట రెండొంతులు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యే జరుగుతుందని అంచనా.చిన్న నగరాల్లో మరింత అధికంపట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం, మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్కృతి విస్తరిస్తుండటం.. వినియోగదారుల ఖర్చు కూడా పుంజుకోవడంతో చిన్న నగరాల్లో కూడా గిగ్ వర్కర్లకు మరింత డిమాండ్ జోరందుకుంది. ‘ముఖ్యంగా గౌహతి, బరోడా, జామ్‌నగర్, వైజాగ్, కటక్, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, భువనేశ్వర్, భోపాల్, లూధియానా, చండీగఢ్ వంటి పలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు తాత్కాలిక ఉద్యోగులకు హాట్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇక్కడ గిగ్ వర్కర్ల డిమాండ్‌లో 25–30 శాతం వృద్ధి కనిపిస్తోంది.పికర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్ల వెంటపడుతున్నాయి కంపెనీలు’ అని హైరింగ్ సంస్థ అడెకో డైరెక్టర్ మను సైగల్ పేర్కొన్నారు. పండుగల్లో ఆఫర్ల జోరు నేపథ్యంలో ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన డెలివరీ సిబ్బంది, కస్టమర్ సరీ్వస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ తెలిపారు. -
షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ (దుకాణాలకు సంబంధించి స్థలం)కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎనిమిది ప్రముఖ నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 6.12 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఎనిమిది నగరాల్లోని ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేడ్ ఏ, బి షాపింగ్ మాల్స్, ప్రముఖ వీధుల్లోని రిటైల్ వసతుల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రధాన వీధుల్లో మరింత డిమాండ్.. రిటైల్ లీజింగ్‌లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ విభాగం తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడం, అధిక నాణ్యత కలిగిన వసతులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గ్రేడ్ ఏ మాల్స్, ప్రధాన వీధుల్లోని (రహదారులపై) రిటైల్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కొనసాగింది. దేశీయ రిటైల్ మార్కెట్ చైతన్యాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధాన వీధుల్లో అద్దెలు కూడా చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో మధ్య కాలానికి అద్దెల ధరలు స్థిరతపడతాయని అంచనా వేస్తున్నాం. ఇది డిమాండ్–సరఫరా పరస్థితులను మారుస్తుంది. అయితే, ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ లీజు కార్యకలాపాలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నది మా అంచనా. లీజింగ్ పరిమాణంలో 53 శాతం వాటా ఆక్రమించే ప్రముఖ బ్రాండ్లు, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) బలమైన పనితీరు చూపిస్తుండడం దేశంలో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు. -
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సందడి
న్యూఢిల్లీ: ఇళ్ల డిమాండ్ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి (టైర్–2) పట్టణాల్లోనూ ఇళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) టాప్30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం పెరిగి 2,07,896 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ తెలిపింది. 2022–23 సంవత్సరంలో 1,86,951 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. ఈ మేరకు ఒక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం విక్రయాల్లో 80 శాతం టాప్–10 టైర్–2 పట్టణాలైన అహ్మదాబాద్, వదోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మోహాలిలో నమోదయ్యాయి. ఈ పది పట్టణాల్లో 2023–24లో 1,68,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 1,51,706 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిగిలిన 20 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భోపాల్, లక్నో, గోవా, రాయిపూర్, విజయవాడ, ఇండోర్, కోచి, త్రివేండ్రం, మంగళూరు, గుంటూరు, భివాండి, డెహ్రాడూన్, లుధియానా, చండీగఢ్, ఆగ్రా, మైసూర్, సోనేపట్, పానిపట్, అమృత్సర్ ఉన్నాయి. ఎన్నో సానుకూలతలు.. ‘‘టైర్–1 పట్టణాల కంటే టైర్–2 పట్టణాల్లోనే ఇళ్ల మార్కెట్ పరంగా మెరుగైన పనితీరు నమోదైంది. దీనికి కారణం ధరలు తక్కువగా ఉండడంతోపాటు, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే. ఈ చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి వాసుల సొంతింటి కలను అందుబాటు ధరలు సాకారం చేస్తున్నాయి’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజ తెలిపారు. చిన్న మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), పరిశ్రమల ఏర్పాటుతో ఈ పట్టణాలు ఆర్థిక బూమ్‌ను చూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మద్దతునిస్తుండడం కూడా ఈ పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపారు. పశి్చమాదిన ఎక్కువ దేశవ్యాప్తంగా టాప్–30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన ఇళ్ల విక్రయాల్లో 70 శాతం వాటా.. పశి్చమాదినే ఉండడం గమనించొచ్చు. ఇక్కడి పట్టణాల్లో విక్రయాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 1,44,269 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని పట్టణాల్లో అధిక డిమాండ్ కనిపించింది. ఉత్తరాదిన విక్రయాలు 8 శాతం పెరిగి 26,308 యూనిట్లుగా ఉంటే, దక్షిణాదిన 8 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. తూర్పు, మధ్య భారత్‌లోని పట్టణాల్లో 18 శాతం అధికంగా 15,372 ఇళ్లు అమ్ముడయ్యాయి. సొంతింటి కల ఆకాంక్షల ఫలితం..మౌలిక వసతులు, ప్రాంతాల మధ్య అనుసంధాన పెరగడంతో పెద్ద ఎత్తున మార్పును చూస్తున్నట్టు ఎల్డెకో గ్రూప్ సీవోవో మనీష్ జైస్వాల్ పేర్కొన్నారు. తమ కంపెనీ లుధియానా, రుద్రాపూర్, సోనిపట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయం కావడంతో టైర్–1 పట్టణాల్లో 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గాయి. కానీ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం పెరిగాయి. ధరలు అందుబాటు ధరల్లో ఉండడంతో మధ్యతరగతి వాసుల సొంతింటి ఆకాంక్ష డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని బెంగళూరుకు చెందిన సముద్ర గ్రూప్ సీఎండీ మధుసూదన్ జి తెలిపారు. -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్‌నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్‌లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విదేశాల్లో.. రయ్ .. రయ్
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ)లకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత చదువులు..ఉద్యోగాలు..టూరిస్ట్ వీసాలపై విదేశాలకు వెళ్లేవారు ఐడీపీ కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన నగరవాసుల్లో ఈ ఏడాది 42,471 మంది ఐడీపీ తీసుకున్నారు. – సాక్షి, హైదరాబాద్అమెరికాకే ఎక్కువగా.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. వారే పెద్దసంఖ్యలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని దేశాల్లోనూ మన డ్రైవింగ్ లైసెన్సులను అనుమతించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో నగరవాసులు తీసుకొనే ఐడీపీలో 60 % వరకు అమెరికాలో డ్రైవింగ్ కోసమే కావడం గమనార్హం. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళుతున్న మహిళలు అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్ తప్పనిసరిగా భావిస్తున్నారు. అలా ఐడీపీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా ఏటా పెరు గుతూనే ఉంది. ‘హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ వస్తే చాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు తీయొచ్చు. అందుకే ఎక్కువ మంది ఐడీపీల కోసం వస్తారు.’అని ఆర్టీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అమెరికా తర్వాత మలేసియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఇటలీ, మారిషస్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను అనుమతిస్తున్నారు. » అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో ఏడాదిపాటు అనుమతిస్తుండగా, యూరోప్ దేశాల్లో 6 నెలల వరకు మాత్రమే అనుమతి ఉంది.» ఐడీపీపై మలేసియాలో బండి నడపాలంటే ఆ దేశ అధికార భాష మలేలోకి ఐడీపీ వివరాలు నమోదు చేసుకోవాలి. భారత రాయబార కార్యాలయం నుంచి ఈ సదుపాయం లభిస్తుంది. » ఫ్రాన్స్‌లోనూ ఐడీపీని ఫ్రెంచిలోకి తర్జుమా చేసుకోవడం తప్పనిసరి. » ఆ్రస్టేలియాలో మూడు నెలల వరకే అనుమతి ఉంటుంది. » కెనడాలో మూడు నెలల్లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాలి. ఐడీపీ ఈజీనే... » అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం ఎంతో తేలిక. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్ప ల్, మెహదీపట్నం, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, కూకట్పల్లి, బండ్లగూడ, తదితర ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఐడీపీ తీసుకోవచ్చు. పాస్‌పోర్టు, వీసాతో పాటు, పర్మనెంట్ లైసెన్సు డాక్యుమెంట్లను అందజేసి రూ.1500 ఫీజు చెల్లించాలి. సాధారణంగా అన్ని రకాల ఆర్టీఏ సేవలు ఆన్లైన్లో లభిస్తుండగా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మాత్రం అధికారులు నేరుగా దరఖాస్తుదారులకే అందజేస్తారు. స్పెయిన్‌లో డ్రైవింగ్ చేశా.. విదేశాలకు ఎక్కువగా వెళతాను. అక్కడికి వెళ్లిన తర్వాత బంధువులు, స్నేహితుల వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి ఐడీపీతో వెళితే ఆ ఇబ్బంది ఉండదు. స్పెయిన్‌లో మూడు నెలలు ఐడీపీతోనే డ్రైవింగ్ చేశాను. – సుబ్బారెడ్డి, టూరిస్టు థాయ్‌లాండ్‌లో రైట్ డ్రైవింగే డాక్యుమెంటరీల షూటింగ్‌కు తరచుగా విదేశాలకు వెళతా. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ డాక్యుమెంటరీ షూటింగ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌తో వెళ్లాను. అక్కడ మన ఇండియాలోలాగే రైట్ డ్రైవింగ్. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కారులో అన్ని చోట్లకు వెళ్లాను. – మిద్దె బాలరాజు, ఆర్టిస్ట్ జర్మనీలో నిబంధనలు కఠినం.. జర్మనీలో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లపై బండి నడపడం చాలా కష్టం. మన డ్రైవింగ్ లైసెన్స్‌ను వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్టూడెంట్‌గా వెళ్లాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉంటున్నారు. మొదట్లో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని వెళ్లగా, 6 నెలలు మాత్రమే అనుమతించారు. ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో అక్కడి నిబంధనల మేరకు మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. జర్మనీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. – తన్యా కొండ -
కార్పొరేట్ రుణాలకు డిమాండ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో నిర్వహణ మూలధనానికి గణనీయంగా డిమాండ్ నెలకొందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. దాదాపు రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో కార్పొరేట్ల దగ్గర మిగులు నిధులు పుష్కలంగా ఉండేవని కానీ ప్రస్తుతం తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సామర్థ్యాల విస్తరణకు కావాల్సిన నిధులను రుణంగా తీసుకునేందుకు అవి బ్యాంకులను సంప్రదిస్తున్నాయని ఖారా వివరించారు. మరోవైపు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఏడాది రిటైల్ వ్యవసాయం, చిన్న .. మధ్యతరహా సంస్థలకు (ఆర్ఏఎం) రుణాలు 16 శాతం పెరగవచ్చని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగ రుణాలు 16 శాతం వృద్ధి రేటుతో రూ. 21 లక్షల కోట్లకు చేరాయి. ఆర్ఏఎం రుణాలిచ్చేటప్పుడు రిసు్కలను మదింపు చేసేందుకు చాలా కఠినతరమైన ప్రక్రియను పాటిస్తామని, వడ్డీ రేట్ల పరిస్థితులు, రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లించే అవకాశాలు మొదలైనవన్నీ పరిశీలిస్తామని ఖారా చెప్పారు. కఠినతరమైన ప్రమాణాల కారణంగా తమకు ఈ విభాగంలో ఎలాంటి సవాళ్లు లేవని వివరించారు. -
ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్లివే?
ప్రధాని మోదీ నాయకత్వంలో కలిసి ఉంటామని మరోమారు ఎన్డీఏ మిత్రపక్షాలు పునరుద్ఘాటించిన దరిమిలా కేంద్ర క్యాబినెట్ బెర్త్‌లపై బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరు కీలక మంత్రిత్వ శాఖల విషయంలో బీజేపీ రాజీపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మంత్రిత్వ శాఖల జాబితాలో రైల్వే, హోం, ఫైనాన్స్, డిఫెన్స్, లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయిని సమాచారం.అదేవిధంగా మిత్రపక్షాలు 10 నుంచి 12 మంత్రిత్వ శాఖలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బీజేపీ తన మిత్రపక్షాల మద్దతును మరింతగా పెంచుకుంది. తాజాగా ఏడుగురు స్వతంత్రులు, మరో మూడు చిన్న పార్టీల నుండి బీజేపీకి మద్దతు లభించింది. తాజాగా మద్దతునందించిన 10 మంది ఎంపీలతో ఎన్డీఏకు మొత్తం 303 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది.మోదీ ప్రభుత్వం వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోనున్నది. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే అంశంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. అందుకే దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగంలో స్వావలంబనకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ ఇటీవలే పునరుద్ఘాటించారు.ఆరు కీలక మంత్రిత్వ శాఖలు మినహా మిత్రపక్షాల మంత్రిత్వశాఖల బెర్త్‌ల డిమాండ్లను బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనున్నదని సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మద్దతు ఒప్పందం తదితర అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినప్పటికీ, మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ, 12 స్థానాలు గెలుచుకున్న జేడీ (యూ) మిత్రపక్షాల నుంచి ప్రధాన డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు శివసేన (షిండే) ఏడు, ఎల్జేపీ (ఆర్వి) ఐదు, హెచ్ఏఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. జూన్ 7న జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించి మిత్రపక్షాల డిమాండ్లు ప్రస్తావనకు రానున్నాయి.జనతాదళ్(యూ) రెండు మంత్రి పదవులను ఆశిస్తోందని, శివసేన (షిండే) తన కేబినెట్ బెర్త్‌తో పాటు రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) ఇంకా తన డిమాండ్లను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు ఒక మంత్రివర్గం, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీ శాంభవి చౌదరితో సహా ఇతర ఎంపీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గయ నుంచి ఎన్నికైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం ఒక కేబినెట్ ర్యాంక్ పదవిని కోరినట్లు సమాచారం. -
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది. -
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
నాగాలాండ్: ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
కోహిమా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ -
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
అరటిలో ఏపీ మేటి
సాక్షి, అమరావతి: ఆంధ్ర అరటికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గ్రోత్ ఇంజన్ క్రాప్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అరటి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగులోనే కాదు.. ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల్లో కూడా అద్భుత ప్రగతిని సాధించింది. గడిచిన నాలుగేళ్లలో 1.80 లక్షల టన్నులు ఎగుమతి కాగా, ఈ ఏడాది లక్ష టన్నుల్ని ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 50 వేల టన్నులు ఎగుమతి అయ్యాయి. మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాలకే ఇప్పటివరకు ఎగుమతయ్యే అరటి ఈసారి మొట్టమొదటిసారిగా రష్యాకు కూడా ఎగుమతి అయ్యింది. ఇకపోతే అరటికి కనీస మద్దతు ధర క్వింటా రూ.800 కాగా, ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950 మధ్య పలుకుతోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న ఎరువు, కర్పూర, చక్కరకేళి, అమృతపాణి, బుడిద చక్కరకేళి, తేళ్ల చక్కరకేళి, సుగంధాలు, రస్తాలి వంటి రకాలు ఏపీలోనే సాగవుతున్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి రకం), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో 2018–19 నాటికి 1.90 లక్షల ఎకరాల్లో సాగవుతూ 50 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అరటి సాగు ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. టిష్యూ కల్చర్ ప్లాంట్ మెటీరియల్, ఫ్రూట్ కేర్ కార్యకలాపాలు, బిందు సేద్యం వంటి అధునాతన సాంకేతిక పద్ధతుల వలన ఉత్పాదకత హెక్టార్‌కు 60 టన్నులకు పైగా వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం 2023–24లో 62 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయని అంచనా వేశారు. ఫలించిన సీడీపీ ప్రాజెక్టు.. ఇక రాష్ట్రంలో అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.269.95 కోట్లతో చేపట్టిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ) సత్ఫలితాలిస్తోంది. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్–ప్రొడక్షన్) వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతరం నిర్వహణ–విలువ ఆధారిత (పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూ ఎడిషన్) కోసం రూ.74.75 కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70 కోట్లు ఖర్చుచేస్తున్నారు. నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం (ఐపీఎం), ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తోట బడుల ద్వారా 15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిచ్చారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. పీపీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన యూఏఈ, బెహ్రాన్, ఈజిప్‌్ట, సౌదీ అరేబియా, కతార్, ఇరాన్ వంటి దేశాలకు అరటి ఎగుమతి అవుతోంది. ♦ 2016–17 వరకు అరటి పంట రాష్ట్రం కూడా దాటే పరిస్థితి ఉండేది కాదు. ఆ ఏడాది తొలిసారి 246 టన్నులు ఎగుమతి చేస్తే 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులు ఎగుమతి చేశారు. ♦ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది (2019–20)లోనే రికార్డు స్థాయిలో 35వేల టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేశారు. ♦ ఆ తర్వాత వరుసగా 2020–21లో 48వేల టన్నులు, 2021–22లో 48,200 టన్నులు, 2022–23లో 49,500 టన్నులు ఎగుమతి అయ్యాయి. ♦ ఇక ఈ ఏడాది 75 వేల టన్నులను ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 50 వేల టన్నుల అరటి ఎగుమతైంది. ♦ ఈ సీజన్ ముగిసే నాటికి లక్ష టన్నులు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్!
ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని వాదిస్తున్నారు. "బెంగళూరు నగరంలో పెరిగిన ఎండ వేడి, తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొని ఉండటం, ఈ నెలలో పెద్దగా వర్షాలు లేనందున వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కర్ణాటక ప్రభుత్వం పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ‘గో బై కర్ణాటక వెదర్’ (@Bnglrweatherman) అనే వాతావరణ ఔత్సాహికుల బృందం ‘ఎక్స్’లో పేర్కొంది. "నీటి సంక్షోభం.. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా? విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తే, చాలా మంది వారి స్వస్థలాలకు వెళతారు. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది!" అని సిటిజన్స్ ఎజెండా ఫర్ బెంగళూరు (@BengaluruAgenda) రాసుకొచ్చింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే దృష్టాంతం ఏర్పడవచ్చని మరికొంత హైలైట్ చేశారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్‌ఫీల్డ్ అని పిలిచే నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది. -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 15వేల మెగావాట్లను దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సరిగ్గా ఇదే రోజు 14,526 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మాత్రమే నమోదైంది. గతేడాది మార్చి 30న రాష్ట్రంలో అత్యధికంగా 15497 మెగావాట్ల గరిష్ట విదుŠయ్త్ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మెగావాట్లకు మించనుందని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు ఏర్పాట్లు 1,600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 800 మెగావాట్ల నుంచి ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వంసిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాలతో 1200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చి మన రాష్ట్రంలో లోటు ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజువారీ విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 256.74 మిలియన్ యూనిట్లకు చేరింది. సాగునీరు లేక పెరగనున్న విద్యుత్ అవసరాలు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో కాల్వల కింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మతుల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ మార్చి చివరిలోగా 16500–17000 మెగావాట్ల మధ్య నమోదు కావచ్చని భావిస్తున్నారు. దక్షిణ డిస్కంల పరిధిలోనూ పెరిగిన వినియోగం దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 9043 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 9253 మెగావాట్లకు పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 158.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది ఇదే కాలంలో 169.36 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గ్రేటర్లో డిమాండ్ పైపైకి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లుగా నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లుగా నమోదయ్యింది. నగరంలో గతేడాది జనవరి, ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 57.34 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్లకు పెరిగింది. -
సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హౌజ్‌లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్ ఐదుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. సభ ప్రారంభంలోనే గందరగోళం ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్‌లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్ఎస్కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
లఢక్‌లో రాష్ట్ర హోదా రగడ
లఢఖ్: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు. లడఖ్ - లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు -
విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రామ భక్తులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈనెల 22న అయోధ్య విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు దిగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే క్యాబ్‌లు, రైళ్లు ఫుల్ ఇప్పటికే జనవరి 22 నాటికి రైల్వే టికెట్ బుకింగ్‌లు 60 శాతం మేర పెరిగాయి. అలాగే అయోధ్యలో క్యాబ్ ఆపరేటర్ల బుకింగ్‌లు 50 శాతం పెరుగుతాయని ట్రావెల్ పోర్టళ్ల అంచనా. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు డిసెంబర్ 30 నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి అయోధ్యకు సాధారణ విమాన సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం అయోధ్యకు రోజుకు నాలుగు విమాన సర్విస్లు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 20–24కు పెరుగుతుందని అయోధ్య విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లయిట్ ఆపరేటర్ల నుంచి 42 ఎంక్వయిరీలు వచ్చినట్లు చెప్పాయి. అయోధ్య విమానాశ్రయంలో విమానాల కోసం తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈనెల 22న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థలు ప్రయాణికులను పికప్, డ్రాప్ మాత్రమే చేయాలని, విమానాలను లక్నో, వారణాసి, ఖుషీనగర్, పాటా్న, ఢిల్లీ వంటి పొరుగు విమానాశ్రయాల్లో పార్కింగ్ చేయాలని సూచించారు. మెట్రో నగరాల నుంచి డిమాండ్ మిలియన్ ఎయిర్, క్లబ్ వన్ ఎయిర్, ఎంఏబీ ఏవియేషన్, జెట్‌సెట్‌గో వంటి ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థలు అయోధ్యకు విమాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చార్టర్డ్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిందని ఎయిర్ చార్టర్డ్ సంస్థ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, అహ్మదాబాద్‌లో వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమిట్‌లతో ప్రైవేట్ చార్టర్డ్ ఆపరేటర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు. తాజాగా రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యకమంతో చార్టర్డ్ ఫ్లయిట్ల కోసం ఎంక్వయిరీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 12 సీట్ల జెట్ ఫాల్కన్ 2000 బుక్ అయిందని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం రోజున చార్టర్డ్ విమానాల కోసం 25 ఎంక్వయిరీలు వచ్చాయని మరో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణే, నాగ్‌పూర్ వంటి మెట్రో నగరాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. సీటింగ్‌ను బట్టి చార్జీలు విమానం సైజు, సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఈ మార్గంలో ధర రూ.10–20 లక్షలు ఉంటుందని ప్రైవేట్ ఎయిర్‌క్రాప్ట్ కంపెనీలు తెలిపాయి. అయితే చలికాలం నేపథ్యంలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా అయోధ్యకు విమాన సర్విసులు సవాలేనని, దీంతో అయోధ్యకు ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అనుమతులపై విమానాశ్రయ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం అయోధ్య విమానాశ్రయం రోజుకు 6 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనెల 22న ఆలయ ప్రారంబోత్సవం రోజున మాత్రం 24 గంటలు తెరిచి ఉండేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. -
బై బై మాల్దీవులు చలో లక్షద్విప్
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్‌కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్‌గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఇప్పటికే ప్యాకేజీలు బుక్ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్‌లు కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్‌లైన్స్, ట్రావెల్స్ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్ కూడా బాగా తగ్గిందన్నారు. లక్షద్విప్ వైపు సిటీ చూపు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్‌కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్‌లో రెండు రోజుల క్రూయిజ్ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు. ప్యాకేజీల్లో భారీ రాయితీలు ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్ సంస్థలు, ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్‌లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్‌లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్‌లు పూర్తిగా స్తంభించాయి. -
ఇంధన డిమాండ్ తగ్గితే ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదా
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది. -
Real Estate: ఈ ఏడాది 20% వృద్ధి ఉండొచ్చు
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఈ పట్టణాల్లో 37–39 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) మేర లీజు నమోదు అవుతుందని అంచనా వేసింది. గతేడాది 38 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థాయిలోనే, ఈ ఏడాది కూడా డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక విడుదల చేసింది. ఆఫీస్ స్పేల్ లీజు డిమాండ్ 2019లో 47.92 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటే, 2020లో 25.38 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 26.03 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘‘2023 జనవరి–సెప్టెంబర్ వరకు ఆఫీస్ స్పేల్ లీజు 26 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022 మొత్తం ఏడాది లీజు పరిమాణంలో ఇది 68 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి లీజు సర్దుబాటు పరిమాణం 37–39 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరుగుతుంది’’అని వెల్లడించింది. 2024లో 47 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజు భారత్‌లో 45–47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఈ ఏడాదితో పోలిస్తే 20–22 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ‘‘ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 2023 చివరికి 800 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్ చివరికి ఇది 792.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్ స్పేస్ లీజింగ్ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజు జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► ఢిల్లీ ఎన్సీఆర్లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. డిమాండ్ కొనసాగుతుంది.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి. దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్‌కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
ఆభరణాల డిమాండ్ ఎలా ఉందంటే..
ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది. 2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి. ► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు. -
గృహాల అద్దెలు పెరిగాయి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గృహాల అద్దెలు పెరిగాయి. ప్రీమియం ఇళ్లకు డిమాండ్, ఆఫీసు కేంద్రాలకు చేరువలో ఉండటం వంటి కారణంగా ప్రధాన నగరాలలో ఇళ్ల అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో 4.6 శాతం, ఏడాదితో పోలిస్తే 22.4 శాతం మేర అద్దెలు పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా థానేలో 57.3 శాతం, గుర్గావ్లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం, హైదరాబాద్‌లో 24.2 శాతం మేర వృద్ధి చెందాయి. దేశంలోని 13 నగరాలో 67 శాతంగా ఉన్న 18–34 ఏళ్ల వయసు ఉన్న మిల్లీనియల్స్ వల్లే గృహాల అద్దెలు పెరిగాయి. సెమీ ఫరి్నష్ గృహాలను రెంట్‌కు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా అద్దెలకు 52.7 శాతం డిమాండ్ ఉండగా.. సప్లయి 48.7 శాతం మాత్రమే ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సు«దీర్ పాయ్ తెలిపారు. నెలకు రూ.10–30 వేలు మధ్య అద్దె ఉన్న మధ్యస్థాయి గృహాలకు 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. -
దారుణం: కట్నం డిమాండ్.. డాక్టర్ ఆత్మహత్య
తిరువనంతపురం: కేరళలో దారుణం జరిగింది. కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. పీజీ డాక్టర్ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. షహానా(26) తిరువనంతపురంలో డాక్టర్ పీజీ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో తన స్నేహితుడితో పెళ్లి సంబంధం కూడా ఏర్పడింది. కానీ పెళ్లి కొడుకు తరుపువారు భారీ స్థాయిలో కట్నం అడిగారు. కానీ షహానా అంత మొత్తంలో కట్నం చెల్లించుకోలేకపోయింది. దీంతో పెళ్లి సంబంధాన్ని వరుడు విరమించుకున్నాడు. ఆ తర్వాత షహానా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. షహానా కుటుంబాన్ని పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మహిళా పీజీ డాక్టర్ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. వరకట్నం డిమాండ్ల కారణంగానే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదీ చదవండి: దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ అంతంతే
ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 32–34 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది. దేశీ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఆఫీస్ స్పేస్ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి వివరించారు. దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్ విభాగాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్ కారణంగా 2023–24లో 32–34 మిలియన్ చదరపు అడుగుల లీజ్ నమోదు కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఉద్యోగుల రాక అనుకూలం.. కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది. సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డేరెక్టర్ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు. తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్ స్పేస్ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 2023 మార్చి నాటికి 705 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్ స్పేస్ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. -
ఇంధన దిగ్గజం కోల్ ఇండియాకు లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్ఎస్ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ'కి (Mukesh Ambani) గత 48 గంటల్లో రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న పంపిన మెయిల్లో రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితుడు.. అదే మెయిల్ నుంచి రూ. 200 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తూ మెయిల్ చేసాడు. ఇండియాలో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, అడిగిన డబ్బు ఇవ్వకుంటే చంపుతామని మెయిల్లో నిందితుడు ప్రస్తావించారు. దీనిపైన యాంటిలియా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దేవేంద్ర మున్షీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉపయోగించాడని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ద్వారా అతడిని గుర్తించాలని లేఖ రాశామని పోలీసు అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింది గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్ 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఒక హాస్పిటల్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రిలో బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నాడు. ఆ తరువాత రోజే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ వారసులు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. -
నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!) ఖతార్‌లో చిక్కుకున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. In August, I had raised the issue of our ex-naval officers stuck in #Qatar. Today they have been sentenced to death. @narendramodi has boasted about how much “Islamic countries” love him. He must bring our ex-naval officers back. It’s very unfortunate that they face the death row pic.twitter.com/qvmIff9Tbk — Asaduddin Owaisi (@asadowaisi) October 26, 2023 -
తడారిన ఎడారి గొంతు వినండి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్, మోర్తాడ్ (బాల్కొండ) : రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న గల్ఫ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధపడుతుతున్నారు. తమ సమస్యలు తీరాలంటే.. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి గల్ఫ్‌దేశాల్లో మరణించిన కుటుంబాల నుంచి ఒకరిని పోటీ చేయించాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు నిర్ణయించాయి. ఇటీవల షార్జాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో దాదాపుగా 32 నియోజకవర్గాల్లో దుబాయ్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా తదితర మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేసి వచ్చిన ఓటర్లు ఉన్నారని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరంతా తమ హక్కుల సాధనకు సంఘటితంగా మారి అసెంబ్లీ ఎన్నికలు వేదికగా తమ డిమాండ్లను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కామారెడ్డి లేదా నిర్మల్ వంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కామారెడ్డిలో 100 మంది విడోలతో, నిర్మల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో విడోతో నామినేషన్ వేయించేలా కసరత్తులు ప్రారంభించారు. ఇందుకోసం అన్ని గల్ఫ్ కుటుంబాలతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి వారిని సంసిద్ధం చేస్తున్నారు. హామీల కోసం పట్టు.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చిన వారి సంఖ్య కూడా 15 లక్షలకుపైగానే ఉంటుందని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరి సంక్షేమానికి, పునరావాసానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల 1,800 మందికిపైగా వలస కారి్మకులు ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల పరిహారం ఇస్తానన్న డిమాండ్‌ను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని ప్రవాసీ సంఘాలు కోరుతున్నాయి. యుద్ధభేరి మోగిస్తాం కామారెడ్డిలో వందమంది మహిళలతో నామినేషన్ వేయిస్తాం కోరుట్ల: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో గల్ఫ్ బాధిత కుటుంబాల నుంచి వంద మంది మహిళలతో నామినేషన్లు వేయిస్తామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గుగ్గిల్ల రవిగౌడ్, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస్‌రావు, మంద భీంరెడ్డి, బూత్కురి కాంత అన్నారు. గల్ఫ్ వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో పార్టీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గల్ఫ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రవాసీ బోర్డు, గల్ఫ్ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబాలను ఆదుకునే అంశాల ప్రస్తావన తేలేదన్నారు. సమావేశంలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు అశోక్, మోహన్‌రెడ్డి, రవి, మారుతి, బీడీ చెన్న విశ్వనాథం, శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్ హయాంలోనే ఆర్థిక సాయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వైఎస్సార్ తన హయాంలో గల్ఫ్ వలస కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. అప్పట్లో 1000 మంది గల్ఫ్ మృతులకు రూ. లక్ష చొప్పున సాయం అందించారు. గల్ఫ్ దేశాలను వీడి ఇంటిబాట పట్టిన వలస కార్మికులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను ఇప్పించారు. వైఎస్ తర్వాత పనిచేసిన సీఎంలు ఎవరూ కూడా గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో గల్ఫ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. వలస కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్‌ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కేసీఆర్.. ఆ డబ్బంతా ఏం చేశారు? : అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.400 కోట్ల మిగులుతో ఉన్న రాష్ట్రం కాస్తా ఇప్పుడు రూ.7.5 లక్షల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు మెట్రో రైలు, హైవేలు, రోడ్లు, ఇరిగేషన్, యూనివర్సిటీలు తదితరాల కోసం రూ.9 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఏడున్నర లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో, ఆ డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ప్రతి పేదవారికీ బియ్యం, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు, వందేభారత్ రైళ్లు, ఇలా అన్నింటినీ కేంద్రమే ఇచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లోని అంశాలను హైదరాబాద్‌లో బహిరంగ వేదికలపై వెల్లడించే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ‘తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను విస్మరించిన మీకు, పాఠశాల విద్య, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయలేని.. రోజువారీ సమస్యలను పరిష్కరించలేని మీకు, తెలంగాణ ప్రజలను ఓట్లడిగే హక్కు, అధికారం లేదు..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం సిఖ్ విలేజీ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివిధ రంగాల వృత్తి నిపుణులు, మేధావులు, సైన్యంలో దేశానికి సేవ చేసినవారు, ఇతర వర్గాలతో నిర్వహించిన సమావేశంలో అమిత్‌షా ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధే బీజేపీ ధ్యేయం: కిషన్‌రెడ్డి తెలంగాణ అభివృద్ధి, వికాసమే బీజేపీ ప్రధాన ధ్యేయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి నిరోధక సర్కార్ ఉందని, ఫాంహౌస్, కుటుంబ రాజకీయాలతో తెలంగాణను ఏలుతోందని ఆరోపించారు. బీజేపీని ఆశీర్వదిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ...మేధావులు మౌనం వీడాలని, బీఆర్ఎస్ నియంతృత్వ, అవినీతి పాలనను అంతమొందించేలా ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఏవీఎన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ డీజీపీలు కృష్ణప్రసాద్, జయచంద్ర, అరవిందరావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఓయూ వీసీ తిరుపతిరావు, విశ్రాంత ఐఏఎస్‌లు రామచంద్రుడు, చంద్రవదన్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీని గెలిపిస్తే ఉత్తమ రాష్ట్రంగా మారుస్తాం ‘కేసీఆర్ పార్టికి ఒక సిద్ధాంతం, విధానం అంటూ ఏమీ లేదు. తన కుమార్తె కవితను జైల్లో వేయొద్దని, కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుకోవడం, కుటుంబ ప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడడం తప్ప ఇంకేమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలలో దేనికి ఓటేసినా వాటిల్లో మరో పార్టికి వేసినట్టే. అందువల్ల తెలంగాణలో బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే అన్నిరంగాల్లో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మారుస్తాం. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి అనుభవాలు, కుటుంబ, నియంతృత్వ పాలన, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడిన తీరు దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృత్తి నిపుణులు, మేధావులు వేసేది కేవలం ఒకే ఓటు కాదు. వారంతా తమ తమ రంగాలు, పరిధుల్లో అనేకమంది ప్రజలకు సరైన మార్గదర్శనం చేయగలరు. కాబట్టి గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని గెలిపించే దిశలో మీ వంతు కృషి చేయాలి..’ అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ‘మొత్తం కుటుంబ, వారసత్వ పార్టీల అవినీతితో కూడిన ఇండియా కూటమి ఏవో కలలు కంటోంది. అయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీతో ముచ్చటగా మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది..’అని ధీమా వ్యక్తం చేశారు. -
కదం తొక్కిన ఆశవర్కర్లు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సోమవారం ఇక్కడి కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలసంఖ్యలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు తరలిరావడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాదర్‌ఘాట్ నుంచి కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బైఠాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు వైద్యశాఖలో పనిచేస్తున్న వివి ధ కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్‌కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్‌వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్‌సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్‌తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్‌లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది. తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది. పోటాపోటీగా వేలం పాటలు.. ♦ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపై గా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది. ♦ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్‌లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్‌పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48లక్షలు, కుత్బుల్లాపూర్‌లో రూ.2.13 కోట్లు, చార్మి నార్ ఏరి యాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్లో 1.50 కోట్లు, సనత్‌నగర్‌లో రూ.12 లక్షలు, గోషామహల్లో రూ.45 లక్షలు, మలక్‌పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్‌లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి. ♦ కాగా.. బడంగ్‌పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపూర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది. ♦వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మ కం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రూ.1.25 కోట్లు పలికి.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. -
టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్సైట్ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. అధికారుల గోప్యతపై అనుమానాలు టెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ..టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు. ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దారుణంగా దెబ్బతిన్న పేపర్–2 అభ్యర్థులు పేపర్–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్ అయినట్టు చెబుతున్నారు. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
సిమెంట్‌కు ఇన్ఫ్రా దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్‌కు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని వెల్లడించింది. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం.. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, నగరాభివృద్ధి, టెలికం, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు వంటి మౌలిక వసతులకు 2022–23తో పోలిస్తే రూ.1.6 లక్షల కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులతో ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో పటిష్ట ప్రయాణాన్ని కొనసాగిస్తూ సిమెంట్ డిమాండ్ 2023–24లో 10–12 శాతం అధికమై 440 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. సిమెంట్ డిమాండ్ 2022–23లో 12 శాతం, 2021–22లో 8 శాతం ఎగసింది. నిర్వహణ లాభం జూమ్.. స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలకుతోడు విద్యుత్, ఇంధన ఖర్చులు కాస్త తగ్గడంతో సిమెంట్ తయారీదారుల నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24లో టన్నుకు రూ.200 పుంజుకునే చాన్స్ ఉంది. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తోంది. సిమెంట్ వార్షిక అమ్మకాల్లో మౌలిక సదుపాయాల వాటా 30 శాతం ఉంది. ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38 శాతం పెరిగాయి. బడ్జెట్ మొత్తంలో చేసిన ఖర్చు 2023 జూలై వరకు 40 శాతంగా ఉంది. సిమెంట్ డిమాండ్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్న గృహ విభాగం స్థిర వృద్ధిని సాధిస్తుందని అంచనా. సరసమైన గృహాలకు ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు డిమాండ్‌ను పెంచుతుంది. రెండంకెల వృద్ధికి.. 2023 ఏప్రిల్–సెప్టెంబర్‌లో సిమెంట్ డిమాండ్ 13–15 శాతంగా ఉంది. అధిక బేస్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రం చేయబోయే మూలధన వ్యయం కొంత మందగించవచ్చు. దీంతో ద్వితీయార్థంలో డిమాండ్ 7–9 శాతానికి మధ్యస్థంగా ఉండవచ్చు. అయితే ఆలస్యమైన, అసమాన రుతుపవనాల కారణంగా గ్రామీణ గృహాల డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే మూడవ త్రైమాసికంలో కార్మికుల పరిమిత లభ్యత కూడా పాత్ర పోషిస్తుంది. బలమైన ప్రథమార్ధం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు 2023 ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 2.5 శాతం పడిపోయాయి. సిమెంట్ ధరలు ఇటీవల స్వల్పంగా పెరగడంతో అధికం అవుతున్న డిమాండ్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది. -
భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో..
ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా యాపిల్ ఐఫోన్స్కి డిమాండ్ భారీగా ఉందనే విషయం తెలిసిందే. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైన రోజు ఈ లేటెస్ట్ ఫోన్ కొనటానికి కస్టమర్లు ఎంత ఉత్సాహం చూపించారనే వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. డిమాండ్ పెరిగే కొత్త ధరలు అమాంతం పెంచుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో ఐఫోన్ 15 మొబైల్స్ మేనియా కొనసాగుతోంది. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి అసలు ధర ఎక్కువ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. రిటైలర్లు కూడా ఇదే అదనుగా చూసుకుని ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎమ్ఆర్పీ ధరలపై రూ. 20వేలు నుంచి రూ. 32వేలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ నేచురల్ టైటానియం కలర్ ఫోన్ మీద రిటైలర్లు రూ. 20,000 ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేదు - కారణం ఇదే! ఐఫోన్ 15 సిరీస్ అసలు ధరలు.. భారతీయ మార్కెట్లో 15 సిరీస్ మొబైల్స్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు స్టోరేజ్ ఆప్సన్స్ మీద ఆధార పది ఉంటాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన 15 ప్రో ధర రూ. 1,34,900. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1 టీబీ ధర రూ. 1,99,900 వరకు ఉంది. -
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గాడిదపాలా మజాకా..!
-
పాత ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. బలమైన అంచనాలు.. దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. -
కస్టడీకి చంద్రబాబు..! సీఐడీ డిమాండ్..
-
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
అధికారికంగా విమోచనదినోత్సవం నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న సమైక్యతా దినోత్సవం కాకుండా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలాదిమంది యువకులు, మహిళలు పెద్దఎత్తున నిజాంపై పోరాడితే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే.. సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్ ముక్తి దివస్ పేరిట కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. మంగళవారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇందులో పాల్గొనా లని తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ విమోచనకు సంబంధించి చారిత్రక పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా పాల్గొంటారని వెల్లడించారు. ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి..విమోచన దినోత్సవాన్ని కాలరాస్తున్నారు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో, మజ్లిస్‌కు వంతపాడుతూ సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవ చరిత్రను కాలరాస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అనుమతి ఉంటేనే కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎద్దేవా చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్ అయితే.. రెండో ద్రోహి బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ’’తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదు? ఎంఐఎంకు లొంగిపోయి, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని’’ 2007లో నాటి అధికార కాంగ్రెస్‌ను ప్రశ్నించిన కేసీఆర్... మరి ఇప్పుడెందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. చరిత్రను ఈ తరానికి అందించడంలో కాంగ్రెస్ కుట్ర చేస్తే.. ఇప్పుడు ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. బాబు అరెస్టుపై నో కామెంట్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పేర్కొన్నారని, ఐతే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. గ్రౌండ్ ఇవ్వలేదనడం మూర్ఖత్వం తమకు గ్రౌండ్ ఇవ్వలేదని కొందరు(కాంగ్రెస్ పార్టీ నేతలనుద్దేశించి) మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ విమో చన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్, ఇతర పార్టీలు కుట్ర చేస్తున్నాయని నిందించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. రాష్ట్రంలోని సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. -
ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
సుల్తాన్ బజార్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్ఎస్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశవర్కర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తామంతా సుశిక్షితులమని, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. రోగుల సర్వే చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జబ్బులు గుర్తించి మందులను రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశావర్కర్లకు హెల్త్ గ్లోబల్ లీడర్స్ అవార్డును కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సబ్ సెంటర్స్, దవాఖానాల్లో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోందని, అయినా తమకు కేవలం రూ.9.750 వేలు మాత్రమే పారితోషకమే ఇస్తోందన్నారు. ఒకవైపు పనిభారంతో, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో ఆశావర్కర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పవన విద్యుత్‌లో అడ్డగోలు ఒప్పందాలు
సాక్షి, అమరావతి : పవన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వద్దని ఆ రంగ నిపుణులు మార్చి 1, 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదించినా పవన విద్యుత్ పీపీఏలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపేసింది. అది కూడా రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవన విద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే అప్పటికి ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ముడుపుల కోసమే పవన విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావటవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. తక్కువకే దొరుకుతున్నా.. టీడీపీ హయాంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. పోటీ పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ఈ పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (సెకీ) ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ.2.48 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేసీ ఎనర్జీ లిమిటెడ్ రూ.1.43కి సరఫరా చేస్తామన్నాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశముంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.41 చొప్పున అదనంగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తయారైపోయింది. ప్రైవేటుకు దోచిపెట్టింది రూ.11,375 కోట్లు.. పవన విద్యుత్ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను నాటి టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. 11 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 810 మెగావాట్లకు 1,232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిస్కంలకు ప్రైవేట్ సంస్థలు అంటగట్టాయి. ఇలా ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.3.41 చెల్లించటం ద్వారా 1,372 మిలియన్ యూనిట్లకు ఏటా రూ.455 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి వస్తోంది. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,375 కోట్లు. ఎలాంటి బిడ్డింగు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడానికి కారణం భారీగా ముడుపులు చేతులు మారడమే. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తంచేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు ఆమోదం లభించిడం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేలేదు.. రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అందనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19 కూడా డిస్కంలు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని అంచనా చేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 98 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 18 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశముంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్ సగటున రూ.3.50లోపే లభిస్తుంది. డిమాండ్ కంటే ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశముంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. ఇదీ రాష్ట్రంలో పవన విద్యుత్ పరిస్థితి.. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే.. జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయెరాలజీ (పూణే)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఇలాంటి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, రానున్నాయని ముందే నిపుణులు చెప్పినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వినకుండా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంది. -
ఏపీలో ప్రజాస్వామ్యమే గెలిచింది
తాడికొండ: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని, బహుజనుల ఉసురు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలువురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాబు అండ్‌కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు. నాయకులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి హాస్టళ్లు, పీజీలకు పెరుగుతున్న గిరాకీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు. క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
హవ్వ.. ఇంత డిమాండా? కేవలం 48 గంటల్లో..
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకటం చాలా కష్టమైపోతోంది. ఒకవేళ దొరికినా రెంట్ ఆకాశాన్నంటేలా ఉంటుంది. అయినా అవసరమున్నవారు ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఇటీవల బెంగళూరులో 35 ప్లాట్లు కేవలం 48 గంటల్లో బుక్ అయిపోయాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇటీవల బెంగళూరు సర్జాపుర ప్రాంతంలో కొత్తగా పూర్తయిన ప్రాజెక్ట్‌లో 35 అపార్ట్మెంట్లు అందుబాటులోకి వచ్చిన 48 గంటల్లోనే బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులో అద్దె ఇళ్లకున్న గిరాకీ ఇట్టే అర్థమైపోతోంది. సర్జాపుర ప్రాంతం దక్షిణ, తూర్పు బెంగళూరులోని ఐటీ ఆఫీసులకు సమీపంలో ఉండటం వల్ల ఇంత డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. 850 చదరపు అడుగుల నుంచి 1150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులోని అపార్ట్మెంట్లు వారం రోజుల క్రితం అద్దెకు సిద్దమయ్యాయి. బుక్ చేసుకున్న వారు వచ్చే నెలలో వీటిలోకి చేరవచ్చు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ వీటి కోసం నెలకు రూ. 35,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటిని రూ. 20 నుంచి రూ. 25వేలకు ఇవ్వాలని ఓనర్ డిసైడ్ చేసుకున్నారు, కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల అద్దె 40 శాతం పెరిగినట్లు తెలిసింది. కేవలం సర్జాపురలో మాత్రమే కాకుండా ఎంజీ రోడ్, కోరమంగళ, వైట్‌ఫీల్డ్ మొదలైన ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లెవెల్లే ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ కోసం రూ. 75,000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. -
పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వ్యవస్థీకృత రంగమే.. యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే. యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు. రెండు నగరాల్లోనే.. భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి. సగటు ధర రూ. 6 లక్షలు.. పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది. 2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు.