న్యూఢిల్లీ: భారీ వర్షాల అంచనాలతో ప్రయాణ ప్రణాళికలు, వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగ ధోరణులు మారిపోవడంతో జూలై ప్రథమార్ధంలో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమ ప్రాథమిక డేటా ప్రకారం .. గతేడాది జూలై 1–15 తేదీల మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో డీజిల్‌కు డిమాండ్ 15 శాతం క్షీణించి 2.96 మిలియన్ టన్నులకు పరిమితమైంది.
నెలవారీగా దాదాపు 20 శాతం క్షీణించింది. పెట్రోల్ అమ్మకాలు 10.5 శాతం తగ్గి 1.25 మిలియన్ టన్నులకు దిగి వచ్చాయి. నెలవారీగా 10.8 శాతం తగ్గాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ సంస్థలు గణనీయంగా కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో దాదాపు ఏడాది కాలంగా ఇంధనాలకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఇదీ చదవండి ➤ IT Dept Clarification On PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
మార్చి ద్వితీయర్ధం నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు మరింతగా పుంజుకున్నాయి. అయితే, రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు జనరేటర్ల వినియోగం తగ్గడం తదితర అంశాలు ఇంధనాల డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment