తాడికొండ: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని, బహుజనుల ఉసురు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి.
రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలువురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
బాబు అండ్‌కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు. నాయకులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment