‘చంద్రబాబు అరెస్ట్‌ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’ | Peddireddy RamacHandra Reddy Comments On Chandrababu arrest | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అరెస్ట్‌ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’

Published Sat, Sep 9 2023 12:18 PM | Last Updated on Sat, Sep 9 2023 1:02 PM

Peddireddy RamacHandra Reddy Comments On Chandrababu arrest - Sakshi

సాక్షి, తిరుపతి: రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా అని విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.  స్కిల్ డెవలప్‌మెంట్‌ పేరుతో.. రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు అని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజెక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారని తెలిపారు. 

ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ, ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడని అన్నారు.  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయని తెలిపారు. -సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు.. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారని, షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారని మండిపడ్డారు.
చదవండి: చంద్రాబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్‌

చంద్రబాబుకే ఆ డబ్బులన్నీ..
‘హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే.. అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు.  అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే.. చంద్రబాబు సీఐడీని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది. ఐటీ నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దొచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది.  అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసింది

చంద్రబాబు బంధువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ళకు స్కాము.. కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం. పురంధేశ్వరి ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలి.  అప్పుడున్న సీపీఐ నారాయణ, ఇప్పుడు ఉన్న నారాయణ వేరు. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు. ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు. 

ఓటుకు కోట్లు కేసులోనూ ఇదే అడ్డగోలు వాదన
ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబుకు మద్దతు తెలిపింది. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు
సీఐడీ ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్  స్కాముల్లో కూడా అవకతవకలు జరిగాయి. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైఎస్సార్‌సపీ కార్యకర్త కూడా లేరు. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరులోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే.. పోలీసులు అడ్డుకున్నారు.  ఆరోజు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement