సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్‌లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా బాబు మాట వినలేదని అన్నారు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ ఇప్పుడు అర్థం అవుతుందన్నారు.
‘స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో జరిగిన స్కామ్‌ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే. ప్రతిపక్షాలుఅనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది. రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే అందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెaiసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు. పురందేశ్వరి అరెస్ట్‌లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి.
పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా..? పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..? ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లు మాట్లాడని పవన్ .. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్‌కు అందుతున్న ప్యాకేజీ ఎంత?’ అని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు.
చదవండి: చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
అధికారం చేపట్టిన రెండు నెలలకే
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్థిక నేరం చేయడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం విస్మయం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, మొత్తం కేబినెట్‌ను తప్పుదోవ పెట్టి 3 వందల కోట్లు కాజేశారని అభియోగాలు రుజువు కావడంతో అరెస్టు జరిగిందన్నారు. అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కేబినెట్‌ను పక్కదోవ పట్టించారని తెలిపారు.
పాలన అంటే పారదర్శకంగా ఉండాలని.. అన్ని అధికారాలను ఓవరూల్డ్ చేసి ఈ సెల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని స్పీకర్ తెలిపారు. సీమెన్స్ నుంచి ఒక్క పైసా కూడా రాకుండా 371 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ఆర్థిక అధికారులు కొర్రి పెడితే చంద్రబాబు స్వయంగా వెంటనే విడుదల చేయాలని అప్పట్లో ఆదేశించారని గుర్తు చేశారు.
చదవండి: ‘చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’
లూటీ చేయటంలో నైపుణ్యం: ఆదిమూలపు సురేష్
చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడని విమర్శించారు. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్లనిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేయటంలో నైపుణ్యం చూపించాడని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఆధారాలు బయటపెట్టి ఇందులో ప్రమేయం ఉన్న కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
18 కేసుల్లో స్టే
చంద్రబాబు తప్పుడు దారిలో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. తప్పు చేశారు కనుకే తలదించుకుని సీఐడీ వెంట వెళ్ళారు. ఇప్పటి కే చంద్రబాబు 18కేసులకు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్రాని కాపాడుకుంటానని యాత్రలు చేసే చంద్రబాబు రాష్ట్రాని దోచ్చుకున్నారు. ఇప్పుటికే చేలా కేసులు చంద్రబాబు పై సిద్దంగా ఉన్నాయి. ఆయన అనేక సార్లు అరెస్టు చేయాల్సి ఉంటుంది. యువగళంలో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది. రాజధాని భూముల కేసులో కూడ చంద్రబాబు అరెస్టు అవుతారు.
-ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్
ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం
చంద్రబాబు నాయుడు 2014 అధికారం చేపట్టిన వెంటనే అక్రమాలకు, అవినీతికి శ్రీకారం చుట్టారు. అన్ని రకాలుగా అవినీతి అక్రమాలలో దొరికిపోయాడు. సిల్క్ డెవలప్మెంట్ సంబందించి 371 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ జరుగుతుండగా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు ఎటువంటి తప్పుచేసినా పవన్ ప్రశ్నించడు. ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేస్తారా అని వింత ప్రశ్న వేస్తున్నాడు. అవినీతి, అక్రమాలలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడుని ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం.
-ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
స్కాం చేయలేదని బాబు చెప్పడం లేదు
చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కక్షసాధింపు లేదు. చంద్రబాబు అరెస్టుతో వైసీపికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు నమ్మబలికి స్కాం చేశారు. ఒక కంపెనీతో ఒప్పందం, మరో కంపెనీకి నిధులు నిచ్చారు. రూ.371 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురూ తామువతీసుకున్న డబ్బంతా చంద్రబాబుకు పంపామని చెప్పారు. అంటే స్కాంలో అసలు సూత్రధారి చంద్రబాబే. తాను స్కాం చేయలేదని చంద్రబాబు కూడా చెప్పటంలేదు. అంటే భారీగా కుంభకోణం జరిగినట్టు ఆయన కూడా నిర్ధారించారు.
ఈ స్కాంలో డబ్బంతా చంద్రబాబుకు వచ్చేసింది. నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే ఇన్ని స్కాంలు ఎలా చేశారు? ఎల్లోమీడియాని అడ్డం పెట్టుకుని నిజాలను అబద్దాలుగా మార్చలేరు. కక్షసాధింపు ఐతే ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్టు చేస్తాం?. ఇప్పుడు అరెస్టు చేయగానే టీడీపీ తెగ హడావుడి చేస్తోంది. కోర్టులో బెయిల్ వస్తే ఒకరకంగా, రాకపోతే ఇంకోరకంగా డ్రామాలు చేయటానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. అమరావతి కేసులు, టిట్కో ఇళ్లు, రింగురోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు కూడా విచారణ జరుగుతాయి. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంతకాలం చంద్రబాబు కథ నడిపించారు. ఇకమీదట అలా నడవదు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు
- ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment