నూరు పాపాలు చేసిన చంద్రబాబు.. ఎట్టకేలకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయ్యారుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబును అభినవ శిశుపాలుడిగా అభివర్ణించిన మంత్రి కొట్టు.. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని అంతా దోచుకోడానికే ఉపయోగించుకున్నారని, ప్రజాధనం వేల కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు అక్రమమార్గంలో తరలించారని ధ్వజమెత్తారు.
మరిది కోసం వదిన పోరాటమా?
రెండెకరాలతో రాజకీయాలను ప్రారంభించిన చంద్రబాబు ఇవ్వాళ లక్ష కోట్లకు ఎదిగాడని, తన పదవులను అడ్డు పెట్టుకోని కోట్లాది రుపాయలను అక్రమంగా సంపాదించారని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ పురందేశ్వరీ చేసిన ట్వీట్ హస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ మూడు సార్లు నోటీసు ఇచ్చినప్పుడు కూడా పురందేశ్వరీ ఖండించినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. బీజేపీలో ఉంటూ, కేంద్ర ప్రభుత్వం నోటీసులిస్తే కూడా పురందేశ్వరీ.. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చంద్రబాబును వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు.
దత్తపుత్రుడికి మెలకువ వచ్చిందా?
చంద్రబాబు అరెస్ట్ కాగానే.. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఖండించడం హస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసుకు సంబంధించి సిఐడి పూర్తి ఆధారాలు సేకరించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు మూడు సార్లు నోటీసులిస్తే.. స్పందించని పవన్ కళ్యాణ్‌కు హఠాత్తుగా ఇప్పుడు మెలకువ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు ఉందని చెప్పుకునే పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుకు కేంద్రం నుంచి నోటీసులిచ్చినా.. దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్... ఏ ఒక్కరికీ సింగిల్‌గా పోటీ చేసే దమ్ములేదన్నారు.
పాదయాత్రలో దండయాత్రనా?
నారా లోకేష్ గుండాలను వెనుక వేసుకుని పాదయాత్ర పేరుతో దాడులు చేస్తున్నాడు. రక్తపాతం, మారణకాండ సృష్టిస్తున్నాడు. బ్యానర్ కనిపిస్తే చాలు వాటిని చింపేయమని అడిస్తున్నాడు. ఇదేంటని అడ్డుకుంటే వాళ్ళని రాళ్లు, కర్రలతో దాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో నారా లోకేష్ పాదయాత్ర చూస్తే అర్ధమవుతుంది. 2014 నుంచి 2019 వరకు మేము చేసిన పరిపాలన చూసి మాకు ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబు కి, నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ గాని ఉందా? అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment