న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందని జేఎల్‌ఎల్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఈ పట్టణాల్లో 37–39 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) మేర లీజు నమోదు అవుతుందని అంచనా వేసింది. గతేడాది 38 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ స్థాయిలోనే, ఈ ఏడాది కూడా డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక విడుదల చేసింది.
ఆఫీస్ స్పేల్ లీజు డిమాండ్ 2019లో 47.92 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటే, 2020లో 25.38 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2021లో 26.03 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. ‘‘2023 జనవరి–సెప్టెంబర్ వరకు ఆఫీస్ స్పేల్ లీజు 26 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022 మొత్తం ఏడాది లీజు పరిమాణంలో ఇది 68 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి లీజు సర్దుబాటు పరిమాణం 37–39 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పెరుగుతుంది’’అని వెల్లడించింది.
2024లో 47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ
ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజు భారత్‌లో 45–47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. ఈ ఏడాదితో పోలిస్తే 20–22 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ‘‘ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 2023 చివరికి 800 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్ చివరికి ఇది 792.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది’’అని జేఎల్‌ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్ స్పేస్ లీజింగ్ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment