JLL India
-
లగ్జరీ ఇళ్లకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస గృహాల(లగ్జరీ ఇళ్లు)కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రూ.50 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న లగ్జరీ ఇళ్లు విక్రయాలు గతేడాదిలో 51% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. అమ్ముడైన మొత్తం 45 లగ్జరీ ఇళ్ల విలువ రూ.4,319 కోట్లుగా ఉంది. వీటిలో 58% అపార్ట్మెంట్లు, 42% బంగ్లాలు. అంతకు ముందు ఏడాది(2022)లో అమ్ముడైన 29 విలాస గృహాల విలువ రూ.2,859 కోట్లుగా ఉంది. మొత్తం 45 యూనిట్లలో ముంబైలో విక్రయమైన 29 లగ్జరీ ఇళ్ల విలువ రూ.3,031 కోట్లు, ఢిల్లీలోని ఎన్సీఆర్లో అమ్ముడైన 12 లగ్జరీ ఇళ్ల విలువ రూ.1,043 కోట్లు, బెంగుళూరు విక్రయమైన 4 లగ్జరీ ఇళ్ల విలువ రూ.245 కోట్లుగా ఉంది. ‘‘అత్యంత సంపన్నల నుంచి అధిక గిరాకీ ఉండటంతో లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అమ్ముడైన 45 లగ్జరీ ఇళ్లలో రూ.100 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న ఇళ్ల సంఖ్య 14గా ఉంది. వీటిలో అత్యధిక అమ్మకాలు ముంబై జరిగాయి. విలాసవంతమైన ఆస్తులపై సంపన్నులకు విశ్వాసం క్రమంగా పెరుగుతుండంతో భవిష్యత్తులోనూ లగ్జరీ అమ్మ కాలు పెరగొచ్చు’’ అని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ తెలిపారు. -
Real Estate: ఈ ఏడాది 20% వృద్ధి ఉండొచ్చు
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఈ పట్టణాల్లో 37–39 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) మేర లీజు నమోదు అవుతుందని అంచనా వేసింది. గతేడాది 38 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థాయిలోనే, ఈ ఏడాది కూడా డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక విడుదల చేసింది. ఆఫీస్ స్పేల్ లీజు డిమాండ్ 2019లో 47.92 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటే, 2020లో 25.38 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 26.03 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘‘2023 జనవరి–సెప్టెంబర్ వరకు ఆఫీస్ స్పేల్ లీజు 26 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022 మొత్తం ఏడాది లీజు పరిమాణంలో ఇది 68 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి లీజు సర్దుబాటు పరిమాణం 37–39 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరుగుతుంది’’అని వెల్లడించింది. 2024లో 47 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజు భారత్‌లో 45–47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఈ ఏడాదితో పోలిస్తే 20–22 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ‘‘ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 2023 చివరికి 800 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్ చివరికి ఇది 792.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్ స్పేస్ లీజింగ్ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది. -
రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే
న్యూఢిల్లీ: ఖరీదైన అపార్ట్మెంట్ల అమ్మకాలు దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో రూ.కోటికి పైన విలువ చేసే ఫ్లాట్ అమ్మకాలు 50,132 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అమ్మకాలు 33,477 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పీటీఐ నివేదించింది. అంతేకాదు 15 ఏళ్లలో తొలిసారి విలాసవంత ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు జెల్ఎల్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. విల్లా, ప్లాట్ల అమ్మకాలను ఇందులో జేఎల్ఎల్ ఇండియా కలపలేదు. కేవలం అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలనే పరిగణనలోకి తీసుకుంది. ►ఏడు పట్టణాల్లో మొత్తం మీద అన్ని రకాల ఫ్లాట్ల అమ్మకాలు 2023 జనవరి–జూన్ కాలంలో 21 శాతం పెరిగి 1,26,500 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,04,926 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి - జూన్ అమ్మకాలు 15 ఏళ్లలో అత్యధికంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగినట్లు స్పష్టం చేసింది. ►రూ.50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చినప్పుడు, 2 శాతం క్షీణించి 24,482 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో అఫర్డబుల్ విభాగం (అందుబాటు ధరల) ఫ్లాట్ల వాటా 24 శాతం నుంచి 17 శాతానికి పరిమితమైంది. ►రూ.50–75 లక్షల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరిగి 30,125 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ అమ్మకాల వాటా మొత్తం అమ్మకాల్లో 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. ►రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన ఫ్లాట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 21,848 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం వాటా 17 శాతంగా ఉంది. ►రూ.1–1.5 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగి 24,121 యూనిట్లుగా ఉన్నాయి. ►ఇక రూ.1.5 పైన ధర కలిగిన ఫ్లాట్లు 26,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 18,993 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ద్వితీయ భాగంలోనూ బలమైన అమ్మకాలు ప్రస్తుత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో పండుగలు ఉండడంతో బలమైన అమ్మకాలు నమోదు అవుతాయని భావిస్తున్నట్టు జేఎల్ఎల్ ఇండియా ఎండీ శివకృష్ణన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం వైపు నుంచి బలమైన ప్రోత్సాహం, వడ్డీ రేట్లను గత రెండు సమీక్షల నుంచి ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగిరావడం ఇళ్ల మార్కెట్ పుంజుకునేందుకు మద్దతుగా నిలిచాయి. మధ్య కాలానికి ఇళ్లకు డిమాండ్ వృద్ధి బాటలోనే ఉంటుంది’’అని శివకృష్ణన్ తెలిపారు. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2023 జనవరిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 32 లక్షల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరితో పోలిస్తే ఇది 93 శాతం అధికం అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ‘హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతలో 2022 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం తగ్గింది. గ్లోబల్ కార్పొరేట్లకు సెలవు కాలం కాబట్టి జనవరి నెల సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించాయి. వృద్ధి అంచనాలూ మందకొడిగా ఉన్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ జనవరి నెల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో ఐటీ, ఐటీఈఎస్ విభాగం అత్యధికంగా 28 శాతం వాటా కైవసం చేసుకుంది. జనవరిలో ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, ముంబై టాప్–3లో నిలిచాయి. ఈ మూడు నగరాల వాటా 77 శాతం’ అని జేఎల్ఎల్ వివరించింది. 2022 మార్చి నాటికి ప్రీమియం గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 73.2 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. అలాగే ఇతర గ్రేడ్స్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 37 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. -
ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్‌లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ ఏడు ప్రధాన నగరాల్లో 41–49 శాతం వృద్ధి చెందుతుందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోల్‌కత, ముంబై, పుణేలో నికర లీజింగ్ 2021లో 2.62 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022లో ఇది 3.7–3.9 కోట్ల చదరపు అడుగులు ఉండే అవకాశం ఉంది. మహమ్మారికి ముందు 2019లో నికర లీజింగ్ ఏకంగా 4.79 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరి–సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల నికర లీజింగ్ మూడేళ్ల గరిష్టం 3.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో మార్కెట్ అయిదేళ్ల (2015–19) సగటు దిశగా వెళ్తోంది. వచ్చే ఏడాది సైతం.. నూతనంగా కార్యాలయ స్థలాలను చేజిక్కించుకునే విషయంలో టెక్ కంపెనీల నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ, తయారీ, ఆరోగ్య సేవలు, ఫ్లెక్స్ విభాగాల నుంచి పెరిగింది. 2023లోనూ ఇదే ట్రెండ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 3.7–4 కోట్ల చదరపు అడుగులు నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక రెసిడెన్షియల్ విభాగంలో ఈ ఏడాది అమ్మకాలు 2 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దంలో అత్యధిక విక్రయాలు నమోదు కావొచ్చు. 2010లో దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2.16 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2022లో ప్రతి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 50,000 యూనిట్లను దాటాయి. గిడ్డంగులు, అసెంబ్లింగ్, విలువ ఆధారిత తయారీ విభాగంలో స్థల డిమాండ్ 2021 కంటే అధికంగా ఈ ఏడాది 4 కోట్ల చదరపు అడుగులు మించనుంది. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్‌ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. -
ఏడు పట్టణాల్లో 1.61 లక్షల ఫ్లాట్స్ విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,61,604 ఫ్లాట్స్ అమ్ముడుపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. ఏడేళ్ల కాలంలో వార్షిక విక్రయాల రేటును ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే అధిగమించినట్టు తెలిపింది. హైదరాబాద్, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై పట్టణాల గణాంకాలు జేఎల్ఎల్ తాజా నివేదికలో ఉన్నాయి. ఇందులో కేవలం ఫ్లాట్స్ విక్రయాలనే పొందుపరిచింది. 2014లో 1,65,791, 2015లో 1,57,794, 2016లో 1,46,852, 2017లో 95,774, 2018లో 1,36,082, 2019లో 1,43,302 యూనిట్లు చొప్పున ఫ్లాట్స్ విక్రయమయ్యాయి. 2020లో కరోనా కారణంగా విక్రయాలు 74,211 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది 1,28,064 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. ఈ విధంగా చూసుకుంటే 2015 తర్వాత ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఎక్కువ ఫ్లాట్స్ అమ్మడైనట్టు తెలుస్తోంది. 2 లక్షలు దాటొచ్చు.. త్రైమాసికం వారీ విక్రయాలు 2021 క్యూ3 నుంచి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఇవి మరింత పెరిగాయి. ప్రతి త్రైమాసికంలోనూ 50,000 కంటే ఎక్కువ ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. ఇక పండుగుల సీజన్ కావడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ విక్రయాలు బలంగా నమోదు కావచ్చు. దీంతో వార్షిక అమ్మకాలు 2 లక్షల యూనిట్లను దాటిపోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు బలపడడంతో వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడింది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్లు చేపట్టిన ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. -
రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గిన సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషన్స్ (సంస్థాగత) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో 27 శాతం తగ్గాయి. 2022 ఏప్రిల్–జూన్ మధ్య 966 మిలియన్ డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సంస్థాగత పెట్టుబడులపై ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో రియల్టీలో సంస్థాగత పెట్టుబడులు 1,329 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు జేఎల్ఎల్ ఒక నివేదిక విడుదల చేసింది. ►ఏప్రిల్–జూన్ కాలంలో కార్యాలయ స్థలాల విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 652 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పెట్టుబడులు 231 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ►హౌసింగ్ విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 60 మిలియన్ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇవి 78 మిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ►రిటైల్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా తగ్గి 51 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 278 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ►డేటా సెంటర్లు, గోదాముల ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 2,630 మిలియన్ డాలర్ల నుంచి 1,909 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ►సంస్థాగత పెట్టుబడులు అంటే.. కుటుంబ సంస్థలు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఫండ్ డెవలపర్స్, విదేశీ నిధులతో నడిచే ఎన్బీఎఫ్సీలను పరిగణిస్తారు. ►బ్యాంకింగ్ రంగం నుంచి రియల్ ఎస్టేట్‌లోకి నిధుల రాక గడిచిన మూడున్నరేళ్లుగా గణనీయంగా పెరగడాన్ని జేఎల్ఎల్ నివేదిక ప్రస్తావించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బ్యాంకుల నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి 4 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరైనట్టు తెలిపింది. కార్యాలయ స్థలాలకు డిమాండ్ ‘‘ఆఫీస్ స్పేస్ విభాగంలో పెట్టుబడులు తిరిగి పుంజుకున్నాయి. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండడం పెట్టుబడులకు డిమాండ్ పెంచింది. కోర్ అసెట్స్‌కు కూడా డిమండ్ నెలకొంది. అంటే అద్దెలు వచ్చే ఆస్తుల పట్ల ఆసక్తి నెలకొందనడానికి ఇది సంకేతం’’అని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. డేటా సెంటర్లు, వేర్‌హౌస్ విభాగాల్లో పెట్టుబడులను గమనించాల్సి ఉందన్నారు. రానున్న త్రైమాసికాల్లో ఈ విభాగాల్లో భూమి/ఆస్తుల కొనుగోళ్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
రియల్ ఎస్టేట్ రంగం ఢీలా, కానీ వీటికి మాత్రం భారీగా పెరిగిన డిమాండ్!
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మే నెలలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా మూడింతలు పెరిగి 6.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఓ నివేదిక విడుదల చేసింది. కార్యాలయాలకు తిరిగి వచ్చి పనిచేయడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడమే డిమాండ్ ఇంతలా వృద్ధి చెందడానికి కారణమని పేర్కొంది. 2021 మే నెలలో ఆఫీస్ స్పేస్ లీజు 2.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అప్పుడు కరోనా రెండో విడత ప్రభావం చూపించడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లోని గణాంకాలను జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో చోటు కల్పించింది. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై నగరాలు మే నెల మొత్తం ఆఫీసు స్పేస్ లీజులో 91 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు 4.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం/ఖరీదైన) స్పేస్ లీజు మార్చి చివరికి 732 మిలియన్ చరదపు అడుగులుగా ఉంది. దీంతో మొత్తం లీజు స్థలం 1.1 బిలియన్ చదరపు అడుగులకు చేరింది. మాంద్యం ఒత్తిళ్లు ఉంటాయేమో చూడాలి.. భౌతికంగా పనిచేసే ప్రదేశాలు కంపెనీలకు ప్రాధాన్యంగా ఉండడమే డిమాండ్ పెరగడానికి కారణమని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్‌దాస్ తెలిపారు. ‘‘కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గిపోవడం, టీకాలను పూర్తిస్థాయిలో ఇవ్వడం, ఆర్థిక కార్యకలపాలను పూర్థి స్థాయిలో అనుమతించడం, రవాణా, పౌరుల కదలికలపై ఎటువంటి ఆంక్షల్లేకపోవడం.. రియల్ ఎస్టేట్ ప్రణాళికలపై మరింత స్పష్టతకు వీలు కల్పించింది’’అని దాస్ చెప్పారు. అయితే, రానున్న నెలల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌పై ప్రభావం ఉండొచ్చన్నారు. ‘‘అంతర్జాతీయంగా అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఒత్తిళ్లు కార్యాలయ స్థలాల డిమాండ్‌పై ఏ మేరకు ఉంటాయో రానున్న కాలంలో మేము సమీక్షిస్తుంటాం. అయితే ఐటీకి ప్రధాన కేంద్రంగా ఉండడం, అవుట్సోర్సింగ్ వల్ల భారత్ ప్రయోజనం పొందొచ్చు’’అని చెప్పారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యయాలు తక్కువగా ఉండడం, పుష్కలమైన నైపుణ్యాలు కార్యాలయ స్థలాల డిమాండ్‌ను నడిపించే కీలక అంశాలుగా పేర్కొన్నారు. -
కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ రెండింతలు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ రెండింతలు అయ్యి 90,200 డెస్క్‌లుగా ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా, క్యూడెస్క్ సంయుక్త నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ఏడు ప్రధాన పట్టణాల్లో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్ స్పేస్ డిమాండ్ 37,300 సీట్లుగా ఉంది. కార్యాలయ స్థలాన్ని పంచుకోవడమే కో వర్కింగ్ స్పేస్. ఒక్కరు విడిగా లేక ఇతరులతో కలసి ఉమ్మడిగా పనిచేసుకునే వేదిక. హైదరాబాద్ మార్కెట్లో కోవర్కింగ్ స్పేస్ డిమాండ్ 2021–22లో 11,312 డెస్క్‌లు (కూర్చుని పనిచేసే స్థానాలు)గా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 15,659, ముంబైలో 14,900 డెస్క్‌లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సానుకూలతలు.. డిమాండ్‌కు తగ్గట్టు సేవలను కాంట్రాక్టుకు ఇచ్చేందుకు కంపెనీలు మొగ్గు చూపిస్తుండడం కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ అధికం కావడానికి కారణమని ఈ నివేదిక తెలిపింది. స్వల్పకాలం పాటు లీజుకు తీసుకునే వెసులుబాటు, పూర్తి స్థాయి సేవలు, సౌకర్యాలు కోవర్కింగ్ స్పేస్‌కు అనుకూలతలుగా పేర్కొంది. 2021–22లో 62 శాతం డెస్క్‌లు ఆఫీస్ స్పేస్ కోసం వినియోగమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 52 శాతంగా ఉంది. సంస్థలు పెరుగుతుండడమే ఈ విభాగంలో కోవర్కింగ్ స్పేస్ వినియోగం పెరగడానికి కారణంగా ఈ నివేదిక తెలిపింది. 2021–22లో మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో సగానికి పైన.. 300 సీట్లు అంతకుమించి లావాదేవీలు ఉన్నాయి. మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో 60 శాతాం వాటాను బెంగళూరు, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్ నగరాలు ఆక్రమిస్తున్నాయి. చార్జీలు.. కోవర్కింగ్ స్పేస్ భవనాల్లో ఒక్కో సీటుకు నెలవారీగా లీజు రూ.6,300 నుంచి రూ.14,300 మధ్య ఉంది. అయితే, ముంబై, ఢిల్లీ వంటి పట్టణాల్లోని కీలక ప్రాంతాల్లో ఉన్న కోవర్కింగ్ స్పేస్ భవనాల్లో ఒక్కో సీటుకు లీజు రేట్లు అధికంగా ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ముంబైలో ఇది రూ.50,000 వరకు ఉంటే, ఢిల్లీలో రూ.25,000–45,000 మధ్య ఉంది. టైర్–2 పట్టణాల్లో ఒక్కో సీటు రూ.4,000–6,800 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా టైర్–1, టైర్–2 పట్టనాల్లో రూ.3,000 వరకు కోవర్కింగ్ సదుపాయ కేంద్రాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇవి 2,300 వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కేంద్రాలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో బెంగళూరు ముందుంటే, ముంబై, ఢిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టైర్–2 పట్టణాలైన వైజాగ్, కాన్పూర్, గోవా, రాయిపూర్, భోపాల్, కోచి, పాట్నా, లక్నో, ఇండోర్ తదితర వాటిల్లో 650 కోవర్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆఫీస్ స్పేస్..గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్‌లను ఐటీ పార్క్‌లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్‌లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని జేఎల్ఎల్ తెలిపింది. ∙గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న హైదరాబాద్.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్ఎల్ సర్వేలో తేలింది. ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. 2019–21 మధ్య కాలంలో నగరంలో కొత్తగా 3.47 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. గత కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు. 81 శాతం వృద్ధి రేటు.. గత కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్‌తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సంగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటును కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉందని జేఎల్ఎల్ తెలంగాణ, ఏపీ ఎంండీ సందీప్ పట్నాయక్ తెలిపారు. చదవండి: తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అదుర్స్! -
హైదరాబాద్‌లో జోరుమీదున్న బిజినెస్ ఇదే!
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పరిమాణాన్ని పెంచుకోవడంతోపాటు, వృద్ధి కొనసాగనున్నట్లు ఎన్ఎక్స్ట్రా, జేఎల్ఎల్ రూపొందించిన నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్, క్లౌడ్ వినియోగం పెరగడం, 5జీ అందుబాటులోకి రానుండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు ఈ సంయుక్త నివేదిక విశ్లేషించింది. డేటా సెంటర్ల బిజినెస్‌లో ప్రధానంగా ముంబై, చెన్నైలలో అధిక వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. ఇందుకు అనువైన మౌలికసదుపాయాలు, వ్యూహాత్మక ప్రాంతాలుకావడం, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు సహకరిస్తున్నట్లు తెలియజేసింది. ఇవన్నీ వృద్ధికి దన్నునిస్తున్నట్లు తెలియజేసింది. ‘దేశీయంగా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం: డేటా సెంటర్లు’ పేరుతో రూపొందించిన నివేదికలోని ఇతర వివరాలు ఇలా.. తీరప్రాంత పట్టణాలు దేశీయంగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటంతో డేటా సెంటర్ల భవిష్యత్ ప్రధానంగా తీరప్రాంత(కోస్టల్) పట్టణాలపై ఆధారపడి ఉంది. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ల్యాండ్లాక్డ్ పట్టణాలు సైతం పరిశ్రమ వృద్ధితో లబ్ది పొందనున్నాయి. డేటా రక్షణ, క్లౌడ్ సంస్థల నుంచి భారీ డిమాండ్, క్యాప్టివ్ నుంచి క్లౌడ్‌కు మార్పు, డిజిటల్‌వైపు ప్రభుత్వ చర్యలు, పెట్టుబడుల వంటి పలు అంశాలు డేటా సెంటర్ల పరిశ్రమకు జోష్‌నిస్తున్నాయి. నివేదికను భారతీ ఎయిర్టెల్ అనుబంధ డేటా సెంటర్ల సంస్థ ఎన్ఎక్స్ట్రా, రియల్టీ కన్సల్టెన్సీ, ప్రొఫెషనల్ సర్వీ సుల కంపెనీ జేఎల్ఎల్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి. చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ! -
హైదరాబాద్‌కి షాకిచ్చిన జేఎల్ఎల్ ఇండియా వార్షిక ఫలితాలు
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రముఖ పట్టణాల్లో కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) 2021లో నామమాత్రంగా 2 శాతం పురోగతే చూపించింది. 2019తో పోలిస్తే 45 శాతం తక్కువగా ఉండడం ఈ మార్కెట్ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని తెలియజేస్తోంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ పని విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. 2021లో 26.17 చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇచ్చినట్టు జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2019లో నికర ఆఫీస్ స్పేస్ లీజు 47.8 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 45 శాతం తక్కువ. 2020లో 25.66 మిలియన్ చదరపు అడుగుల మేర ఉండడం గమనార్హం. భారత కార్యాలయ మార్కెట్‌పై జేఎల్ఎల్ ఇండియా త్రైమాసికం, ఏడాదికోసారి నివేదికలను విడుదల చేస్తుంటుంది. నికర వినియోగ లీజు స్థలాన్ని, మొత్తం వినియోగానికి అందుబాటులో ఉన్న కార్యాలయం స్థలం నుంచి ఖాళీగా ఉన్న దానిని మినహాయించి చెప్తారు. అక్టోబర్–డిసెంబర్లో మెరుగు 2021 అక్టోబర్–నవంబర్ కాలంలో లీజు కింద నికర కార్యాలయ స్థలం వినియోగం 37 శాతం పెరిగి 11.56 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లోనే ఇది అధికమని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. పూర్తి సంవత్సరానికి ఐటీ/ఐటీఈఎస్ రంగం అత్యధిక స్థలాన్ని వినియోగించుకుంది. 38.9 శాతం ఆఫీసు స్థలం ఈ రంగానికి చెందిన కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. ఆ తర్వాత తయారీ/ఇండస్ట్రియల్ రంగం 15.4 శాతం కార్యాలయ స్థలాన్ని వినియోగించుకుంది. హైదరాబాద్‌లో క్షీణత హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాల వినియోగం 2021లో 36 శాతం తగ్గి 4.14 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. అంతకుముందు సంవత్సరంలో ఇది 6.48 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో 14 శాతం వృద్ధితో నికర లీజు 7.82 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో నికర లీజు 44 శాతం పెరిగి 4.72 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. కోల్‌కతాలో మూడు రెట్లు పెరిగి 0.57 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. పుణె నగరంలోనూ 26 శాతం పెరిగి 3.18 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నికర లీజు కింద వినియోగమైంది. చెన్నై నగరంలో నికర లీజు స్థలం 10 శాతం తగ్గి 2.03 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ముంబైలోనూ 10 శాతం తగ్గి 3.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజు కింద వినియోగమైంది. మూడు నెలలు గడిస్తే.. ‘‘నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తిరిగి కార్యాలయానికి వచ్చి ఉద్యోగులు పనిచేయాలనే ప్రణాళికలు వాయిదా పడొచ్చు. మొదటి త్రైమాసికంలో పరిస్థితుల ఆధారంగా స్పష్టత వస్తుంది’’ అని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. చదవండి: రియల్టీ పెట్టుబడులు డౌన్ -
రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గనున్న పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2021లో 20 శాతం మేర తగ్గొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. 2020లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 298 కోట్ల డాలర్లుగా (రూ.22,350కోట్లు) ఉన్నాయి. 2020 ఇదే కాలంలో పెట్టుబడులు 153 కోట్ల డాలర్లతో (రూ11,475) పోలిస్తే సుమారు రెట్టింపయ్యాయి. కానీ, 2020 చివరి మూడు నెలల్లో భారీ ఒప్పందాలు (3.2 బిలియన్ డాలర్ల మేర) నమోదయ్యాయి. దీంతో 2020 మొత్తం మీద ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు దూసుకుపోయాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండకపోవచ్చన్నది జేఎల్ఎల్ అంచనా. భారీ పెట్టుబడుల ఒప్పందాలు చోటు చేసుకుంటే మినహా.. 2021 మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 3.8–4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఆశాజనకమే 2022పై ఆశావహ అంచనాలనే జేఎల్ఎల్ ఇండియా వ్యక్తం చేసింది. 5 బిలియన్ డాలర్ల మార్క్‌ను (రూ.37,500 కోట్లు) అధిగమించొచ్చని పేర్కొంది. 2017–2020 మధ్య పరిశ్రమలోకి ఇదే స్థాయిలో పెట్టుబడులు వార్షికంగా రావడం గమనార్హం. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ఇనిస్టిట్యూషన్స్‌గా పేర్కొంటారు. ఫ్యామిలీ ఆఫీసులు అంటే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల వ్యక్తిగత పెట్టుబడుల వేదికలు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కే కాదండోయ్..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్ పెరిగింది..!
Jll India Says Ev House Demand Increase: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్‌ల్లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్స ల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ ఏ శంకర్ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటుకు 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. అమేయాలో 20 ఈవీ స్టేషన్లు మియాపూర్‌లో నిర్మిస్తున్న అమేయా ప్రాజెక్ట్‌లో 20 హైస్పీడ్ ఈవీ చార్జింగ్ పాయింట్లుంటాయి. కొనుగోలుదారుల అవసరం మేరకు ప్రతి పార్కింగ్ ప్లేస్‌లో అదనంగా మరో పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏరియాలో ఈవీ స్టేషన్లతో నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే. 10 ఎకరాల్లో మొత్తం 1,066 అపార్ట్మెంట్లుంటాయి. – టీవీ నర్సింహా రెడ్డి, సీఎండీ, అస్పైర్ స్పేసెస్ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? -
రియల్టీ పెట్టుబడులు అప్
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ3)లో 72.1 కోట్ల డాలర్ల(రూ. 5,430 కోట్లు)కు చేరాయి. హౌసింగ్ డేటా సెంటర్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులకు ప్రధానంగా నిధులు ప్రవహించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, పీఈ సంస్థలు తదితరాలున్నాయి. వీటితోపాటు ఆర్‌ఈఐటీలలో యాంకర్ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు నివేదికలో జేఎల్ఎల్ తెలియజేసింది. పబ్లిక్ డొమైన్లో ఉంచిన వివరాల ఆధారంగా గణాంకాలను రూపొందినట్లు వెల్లడించింది. టెర్మ్ షీట్‌పై సంతకాలు లేదా లావాదేవీల ప్రకటనల ఆధారంగా పెట్టుబడుల కాలాన్ని పరిగణించినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడుల బదిలీ ఆధారితంకానప్పటికీ డేటా సెంటర్ విభాగంలో మాత్రం వీటిని మదింపు చేసినట్లు వివరించింది. అనిశి్చతులు, అవాంతరాల నేపథ్యంలోనూ క్యూ3లో 17 శాతం పెట్టుబడులు లభించినట్లు ప్రస్తావించింది. అయితే త్రైమాసికవారీగా చూస్తే 47 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. వివరాలిలా రెసిడెన్షియల్ రంగంలో 21.1 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించగా.. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్ఎల్ పేర్కొంది. అయితే కార్యాలయ విభాగంలో పెట్టుబడులు 40.5 కోట్ల డాలర్ల నుంచి 10 కోట్ల డాలర్లకు భారీగా క్షీణించాయి. ఇక వేర్‌హౌసింగ్ విభాగంలో 9.4 కోట్ల డాలర్లు, భూములకు 1.8 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. -
'అద్దె ఇంట్లో ఉండలేం.. 3 నెలల్లో సొంతిల్లే కొనుక్కుంటాం'
న్యూఢిల్లీ: అపార్ట్మెంట్ విస్తీర్ణం, నిర్మాణదారుల గత చరిత్ర (ట్రాక్ రికార్డ్), ఆరోగ్య వసతులు,పచ్చదనానికి తగినంత ఆవరణ, తక్కువ జనసాంద్రత, ప్రజా రవాణా వసతులు, స్కూళ్లు, కార్యాలయాలకు అనుసంధానత.. ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులు వరుస క్రమంలో చూసే అంశాలు ఇవే. కరోనా మమహ్మారి తర్వాత కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య అంశాలుగా మారిపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా, రూఫాండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యత సర్వే 2021: కరోనా ప్రభావం’ పేరుతో ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల పరిధిలోని 2,500 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నాయి. అన్నింటికంటే ముందు ఫ్లాట్ విస్తీర్ణణమే తమకు ముఖ్యమని వీరు చెప్పారు. ఆ తర్వాత డెవలపర్ల చరిత్రను చూస్తామని తెలిపారు. చదవండి: వేలంవెర్రి, చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనా వాల్ కూడా మావే! ప్రాధాన్యతల్లో మార్పులు.: ఇళ్ల కొనుగోలుకు సంబంధించి చూసే అంశాల్లో పెద్దగా మార్పుల్లేవని.. వాటి ప్రాధాన్యతల్లోనే మార్పులు వచ్చినట్టు జేఎల్ఎల్ తన సర్వే నివేదికలో తెలిపింది. కరోనాకు ముందు 2020 మొదటి మూడు నెలల్లో నిర్వహించిన సర్వేలో.. కార్యాలయం, స్కూళ్లకు అనుసంధానం వినియోగదారుల మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది. ఆ తర్వాత ప్రజా రవాణా వసతులు, డెవలపర్ల చరిత్ర, అపార్ట్మెంట్ సైజ్, హెల్త్‌కేర్ వసతులు, వినోద కేంద్రాలు, పచ్చదనం, తక్కువ జనసాంద్రత అంశాలకు వరుస క్రమంలో గతంలో ప్రాముఖ్యమిచ్చారు. కొనుగోలుదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు తగినట్టు డెవలపర్లు డిజైన్లలో మార్పులను అమలు చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. డెవలపర్‌కు మంచి చరిత్ర ఉంటే కాస్త ఎక్కువ వ్యయం చేసేందుకు వినియోగదారులు వెనుకాడడం లేదని పేర్కొంది. ఇళ్ల కొనుగోలుకు సుముఖంగా ఉన్న వారిలో 80 శాతం మంది వచ్చే మూడు నెలల్లోనే ఆ పనిచేస్తామని చెప్పగా.. 80 % మంది రూ.75 లక్షల్లోపు ఇల్లును ఎంచుకుంటామని తెలిపారు. 89% మంది అద్దెకు ఉండడానికంటే సొంత ఇంటికే వోటు వేయడం గమనార్హం. రియల్ ఎస్టేట్‌లోకి మహిళా నిపుణులు రావాలి కేంద్ర పట్టణ వ్యవహారాల కార్యదర్శి మిశ్రా దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగానికి అపార అవకాశాలున్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. కనుక ఈ రంగంలో పనిచేసేం దుకు మహిళా నిపుణులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం ‘నరెడ్కో’ మహిళా విభాగం ‘నరెడ్కోమహి’ విభాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మిశ్రా మాట్లాడారు. ‘‘రియల్ఎస్టేట్ రంగంలో రెరా చట్టం విశ్వాసాన్ని తీసుకొచ్చింది. కనుక మహిళా నిపుణులు ఈ రంగంతో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలి. మహిళలకు అన్ని రకాల సామర్థ్యాలున్నాయి. క్లిష్టమైన, సున్నితమైన నైపుణ్యాలు వారిలో ఉన్నాయి. ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్‌లోనూ వారు తమ సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదు’’ అని మిశ్రా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఈ రంగం కీలకమైనదిగా అభి వర్ణించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మం దికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా పేర్కొన్నారు. చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు -
నంబర్ వన్.. సోనూ సూద్
లండన్: లాక్డౌన్ సమయంలో పేదలకు విశేషమైన సేవలందించిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ‘2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే ప్రథమం. యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార పత్రిక దీన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ అస్జాద్ నాజిర్ ఈ జాబితా రూపొందించారు. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, రెండో స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్‌లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు 7వ స్థానం దక్కింది. మరోమారు పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్ ముంబై: తన చేతికి ఎముకే లేదని ప్రముఖ నటుడు సోనూ సూద్ నిరూపించుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అని కోరుతూ ఇప్పటికీ సోనూ సూద్‌కు పెద్ద సంఖ్యలో లేఖలు వస్తున్నాయట. అందుకే రూ.10 కోట్లు సమీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముంబైలోని 8 ఆస్తులను తాకట్టు(మార్ట్గేజ్) పెట్టినట్లు తెలిసింది. ఇందులో 2 దుకాణాలు, 6 ఫ్లాట్లు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్ట్గేజ్ ఒప్పందం సెప్టెంబర్ 15న కుదిరింది. నవంబర్ 24న రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆయా ఆస్తులు సోనూ సూద్, ఆయన భార్య పేరిటే ఉంటాయి. వాటిపై వచ్చే అద్దెలు వారికే అందుతాయి. ఈ ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణంపై వడ్డీని సోనూ సూద్ దంపతులు చెల్లించాల్సి ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సేవల సంస్థల సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా చెప్పారు. అయితే, తన ఆస్తుల తాకట్టుపై సోనూ సూద్ ఇంకా స్పందించలేదు. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరులో ఈ ఏడాది జూలై–సెప్టెంబరు కాలంలో కొత్తగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 54 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. గతేడాది ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 50% తక్కువ. కరోనా నేపథ్యంలో కార్పొరేట్స్, కో–వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల వాయిదాతోపాటు వర్క్ ఫ్రమ్ హోం విధానమూ ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64% వృద్ధి సాధించింది. ఈ 7 నగరాల్లో 2019 జనవరి–సెప్టెంబరులో పలు కంపెనీలు కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం 3.27 కోట్ల చదరపు అడుగులు. ఈ ఏడాది ఇది 47% తగ్గి 1.73 కోట్ల చదరపు అడుగులకు చేరింది. నగరాల వారీగా ఇలా..: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం విషయంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ నగరంలో 27.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ పోటీపడుతోంది. ఇక్కడ 15.4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కంపెనీలు దక్కించుకున్నాయి. పుణేలో 4.6 లక్షలు, ముంబై 2.8 లక్షలు, చెన్నై 2.1 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 2 లక్షలు, కోల్‌కతాలో 20 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన 6 నగరాల్లో స్థిరంగా ఉన్నట్టు జేఎల్ఎల్ వెల్లడించింది. -
గృహ విక్రయాల్లో 36 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా పడిపోయిన రియల్టీ పరిశ్రమ తిరిగి పట్టాలెక్కింది. ముంబై మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వృద్ధి నమోదైందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. 2019 జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని మిగిలిన నగరాల్లో కంటే హైదరాబాద్‌లో గృహాల విక్రయాల్లో ఏకంగా 36 శాతం వృద్ధి కనిపించింది. 2016లో హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు 29 శాతం వృద్ధి ఉంది. పెద్ద నోట్ల రద్దు జరిగిన మరుసటి ఏడాది 2017లో వృద్ధి శాతం ఒక్కసారిగా 9 శాతానికి పడిపోయింది. కోల్‌కతాలోనూ అంతే. 2016లో 28 శాతంగా ఉన్న వృద్ధి.. 2017 నాటికి 6 శాతానికి పడిపోయింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు వస్తుండటంతో.. నివాస విభాగంలోనూ జోరు మొదలైంది. దీంతో 2019 మొదటి తొమ్మిది నెలల కాలంలో వృద్ధి ఏకంగా 36 శాతానికి చేరుకుంది. -
గిడ్డంగులపై రూ.43వేల కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వృద్ధి చెందటం, జీఎస్టీ అమల్లోకి రావడం తదితర అంశాల నేపథ్యంలో గిడ్డంగుల రంగంలోకి 2020 నాటికల్లా రూ. 43,000 కోట్ల మేర పెట్టుబడులు రావచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో 2 లక్షల మేర ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఒక నివేదికలో పేర్కొంది. గిడ్డంగుల్లో సరుకు నిల్వల పరిమాణం 2017లో 14 కోట్ల చదరపు అడుగులుగా ఉండగా... 2020 నాటికి 24.7 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని జేఎల్ఎల్ పేర్కొంది. కోల్డ్ స్టోరేజి, వ్యవసాయ ఉత్పత్తుల వేర్‌హౌసింగ్‌లోకి రూ. 7,500 కోట్లు, కంటైనర్ స్టోరేజి విభాగంలోకి రూ. 500 కోట్లు రాగలవని అంచనా. వేర్‌హౌసింగ్ వృద్ధితో ఎక్కువగా ప్రథమ, ద్వితీయ శ్రేణి చుట్టుపక్కల ప్రాంతాలు లబ్ధి పొందుతాయని జేఎల్ఎల్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ తెలిపారు. గిడ్డంగులు, లాజిస్టిక్స్ విభాగాలు ఇటీవలి కాలంలో భారీగా వృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు. 2014 నుంచి చూస్తే.. వేర్‌హౌసింగ్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు రూ. 1,25,000 కోట్ల మేర వచ్చాయని నాయర్ వివరించారు. 2017లో మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్‌లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వాటా దాదాపు పది శాతం ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగగలదని నాయర్ తెలిపారు. -
సిటీల్లో భారీగా అమ్ముడుపోని ఇళ్లు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు అతిపెద్ద పట్టణాల్లో 2017 ఆఖరుకు 4.4 లక్షల నివాస భవనాలు అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. వీటిలో ఒక్క ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే అమ్ముడు కాని 1.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక సంఖ్యలో మిగిలిపోవడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషించింది. జేఎల్ఎల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, పుణే, బెంగళూరు, కోల్కత్తా ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీలో నికరంగా 1,50,654 యూనిట్లు అమ్మకం కాకుండా ఉండిపోగా, చెన్నైలో విక్రయం కాకుండా మిగిలిపోయిన వాటిలో ఎక్కువ యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవేనని జేఎల్ఎల్ తెలిపింది. కోల్‌కత్తాలో అతి తక్కువగా 26,000 యూనిట్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ విక్రయం కాని ఇళ్లు, ఫ్లాట్లు 28,000. ముంబైలో 86,000, బెంగళూరులో 70,000, పుణేలో 36,000 మిగిలిపోయాయి. రెరా, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల నిర్మాణ కార్యకలాపాలు మందగించడంతోపాటు డిమాండ్ కూడా తగ్గినట్టు జేఎల్ఎల్ పేర్కొంది. ధరలు స్థిరంగా ఉండడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో విక్రయాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. -
తగ్గిన మాల్స్ సప్లయి!
దేశంలో తొలిసారిగా ప్రతికూలంలో మాల్స్ ⇒ 2016లో 3 లక్షల చ.అ. తగ్గిన మాల్స్ సరఫరా ⇒ దేశంలోని 15 మాల్స్‌లో 35 లక్షల చ.అ. స్థలం తగ్గింపు ⇒ ఆఫీసులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలుగా మారుతున్న మాల్స్ దేశంలో షాపింగ్ మాల్స్‌కు గ్రహణం పట్టింది. ఒకప్పుడు షాపింగ్ ప్రియులతో కిటకిటలాడిన మాల్స్.. ఇప్పుడు ఆఫీసులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, బాంక్విట్ హాల్స్గా స్వరూపం మార్చేసుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మాల్స్ ఈ జాబితాలో చేరిపోయాయని.. ఇందులో 5 మాల్స్ బోర్డు తిప్పేస్తే.. 10 మాల్స్ మాత్రం ఇతరత్రా వినియోగంలోకి చేరాయని మొత్తంగా 35 లక్షల చ.అ. స్థలం తగ్గిందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016లో కొత్తగా 13 మాల్స్ నిర్మాణాలు పూర్తయితే, 15 మాల్స్ వాటి స్వరూపం మార్చుకున్నాయి. ఆశించిన స్థాయిలో కస్టమర్ల నుంచి స్పందన లేకపోవటం, అందుబాటులో ఉన్న మాల్స్‌లో వేకెన్సీలు పడిపోవటం, కొత్త మాల్స్ నిర్మాణంలో జాప్యం వంటివి దేశంలోని మాల్స్ పరిశ్రమ ప్రతికూల స్థితిలోకి చేరడానికి ప్రధాన కారణాలని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ పంకజ్ రెన్జెహాన్ తెలిపారు. ⇒ గతేడాది దేశంలోని మాల్స్‌లో నికరంగా 27 లక్షల చ.అ. రిటైల్ స్థలం నమోదుకాగా.. ఈసారికది 3 లక్షల చ.అ. తక్కువే నమోదైంది. రానున్న రోజుల్లో ఈ జాబితాలో మరిన్ని మాల్స్‌లో చేరే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో మాల్స్‌లో ఉన్నత గ్రేడ్‌లో 9 శాతం, సాధారణ గ్రేడ్‌లో 15 శాతం, తక్కువ గ్రేడ్‌లో 41 శాతం వేకెన్సీలున్నాయి. ⇒ దేశంలో మాల్స్ పరిశ్రమకు ఆన్లైన్ షాపింగ్ ప్రధాన పోటీదారుగా మారింది. ఈ–కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు, బై బ్యాక్లని అందిస్తుండటంతో కొనుగోలుదారులు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో మాల్స్‌లో కస్టమర్ల రాక తగ్గుతుంది. దీంతో వేకెన్సీ లెవెల్స్ పెరిగి మాల్స్ మూతపడుతున్నాయి. ⇒ మాల్స్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే ఉంటే సరిపోదు. వీకెండ్లో కుటుంబంతో సహా డైనింగ్, గేమింగ్, మూవీ ఇలా అన్ని రకాల వసతులూ ఉండాలి. అంతేకాదు ఆయా మాల్స్ కస్టమర్లకు ఎంత దూరంలో ఉన్నాయి? కనెక్టివిటీ ఎలా ఉంది? మాల్స్‌లో పార్కింగ్ స్పేస్ ఎలా ఉంది? వంటివి కూడా కొనుగోలుదారులను మాల్స్ దాకా తీసుకురావటంలో కీలకంగా మారుతున్నాయి. కారణాలేంటంటే? ⇒ మాల్స్ సక్సెస్‌లో ప్రధాన అంశం అది ఉన్న ప్రాంతం. కొనుగోలుదారులకు ఎంత చేరువలో ఉంటే అవి అంత విజయవంతమవుతాయి. ⇒ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న చోట లగ్జరీ మాల్స్ నిర్మించడం సరైంది కాదు. అలాగే జనాభాకు తగ్గట్టుగా మాల్స్ ఉండాలి. తక్కువ జనాభాకు ఎక్కువ మాల్స్ ఉన్నా.. ఎక్కువ జనాభాకు తక్కువ మాల్స్ ఉన్నా ఇబ్బందే. ⇒ నిర్మాణం తీరు, డిజైన్, లే–అవుట్ కూడా మాల్స్ విజయంలో భాగస్వామే. మాల్స్ డిజైన్ సరిగా లేకపోతే అందులోని స్థలం విశాలంగా ఉండదు. ఇరుకిరుగ్గా అనిపిస్తుంటుంది. ⇒ నిర్వహణ చార్జీలు కూడా మాల్స్ సక్సెస్‌లో తోడుంటాయి. కామన్ ఏరియా మెయింటెనెన్స్ (సీఏఎం) చార్జీలు ఎక్కువగా ఉంటే మాల్స్‌లోని భరించలేరు. దీంతో మాల్స్ నిర్వహణ సక్రమంగా ఉండదు. ఫలితంగా మాల్స్ అపరిశుభ్రంగా మారి కొనుగోలుదారులు రారు. -
ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడ బెస్ట్!
ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడలు అత్యుత్తమమని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఒక నివేదికలో సూచించింది. ‘క్రియేటింగ్ వెల్త్ విత్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’ పేరుతో జేఎల్ఎల్ విడుదలచేసిన నివేదికలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు దేశంలో కొన్ని కీలక ప్రాంతాలను సిఫార్సు చేసింది. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడలను సంస్థ సూచించింది. సంస్థ సూచించిన మరికొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, లక్నో, చండీఘర్, జైపూర్, డెహ్రాడూన్, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్‌లు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.2,500-రూ.5000 శ్రేణి ఉత్తమం చదరపు అడుగుకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి అత్యుత్తమమనీ నివేదికలో సూచించింది. అటు పెట్టుబడిపరంగా, ఇటు ధర పెరగడానికి ఈ శ్రేణి తగిన స్థాయి అని నివేదిక వివరించింది. ప్రదేశం కీలకం... ఏ స్థాయి వద్ద హౌసింగ్‌లో పెట్టుబడి పెట్టాలన్న అంశంపై నివేదిక నిర్దిష్ట ప్రమాణాలను ప్రస్తావించింది. కొనుగోలు విషయంలో ‘ప్రదేశం ఎక్కడ’ అనే విషయం కీలకమని తెలిపింది. అక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉండాలనీ, రవాణా వ్యవస్థ బాగుండాలనీ, ఆ ప్రాంతం వృద్ధికి తగిన పరిస్థితులూ కీలకమని జేఎల్ ఇండియా చైర్మన్ అండ్ కంట్రీ హెడ్ అనూజ్ పురి ఈ సందర్భంగా పేర్కొన్నారు. టైర్ 1 ,టైర్ 2 నగరాల్లో పెట్టుబడులు బాగుంటాయనీ వివరించింది. ఇక ఇన్వెస్టరు రియల్టీ అమ్మకాలు జరపాల్సి వస్తే... తగిన లాభాలకు తగిన సమయం కీలకమనీ విశ్లేషించింది. తాము సూచించిన ప్రమాణాలకు లోబడిన కొనుగోళ్లకు ధర వచ్చే మూడేళ్లలో వార్షికంగా 15 శాతం పెరుగుతుందని అంచనావేసింది. ఒక అసెట్‌ను దాదాపు ఎవ్వరూ గరిష్ట స్థాయి వద్ద అమ్మి సొమ్ము చేసుకోలేరనీ, అలాగే కనిష్ట స్థాయి వద్ద ఎవ్వరూ కొనుగోలు చేయలేరన్న విషయాన్ని గుర్తెరగాలని కూడా నివేదిక పేర్కొంది.