
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా పడిపోయిన రియల్టీ పరిశ్రమ తిరిగి పట్టాలెక్కింది. ముంబై మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వృద్ధి నమోదైందని జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. 2019 జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని మిగిలిన నగరాల్లో కంటే హైదరాబాద్‌లో గృహాల విక్రయాల్లో ఏకంగా 36 శాతం వృద్ధి కనిపించింది.
2016లో హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు 29 శాతం వృద్ధి ఉంది. పెద్ద నోట్ల రద్దు జరిగిన మరుసటి ఏడాది 2017లో వృద్ధి శాతం ఒక్కసారిగా 9 శాతానికి పడిపోయింది. కోల్‌కతాలోనూ అంతే. 2016లో 28 శాతంగా ఉన్న వృద్ధి.. 2017 నాటికి 6 శాతానికి పడిపోయింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు వస్తుండటంతో.. నివాస విభాగంలోనూ జోరు మొదలైంది. దీంతో 2019 మొదటి తొమ్మిది నెలల కాలంలో వృద్ధి ఏకంగా 36 శాతానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment