grouth
-
భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు? ఏరోపోనిక్స్ టెక్నాలజీ ఘనత ఏమిటి?
అరబ్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం ఇజ్రాయెల్.. అయితే అది సాధించిన సాంకేతికత కారణంగా నేడు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఈ దేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఈ దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ పుష్కలంగా పంటలు పండటం విశేషం. అయితే భారతదేశంలోని రైతులతో ఈ దేశానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నుంచి టెక్నాలజీ విషయంలో ఇతరదేశాలతో భారత్ పోటీపడే స్థాయిలో లేదు. ఒకప్పుడు మన దేశంలో అన్ని కార్యకలాపాలు సంప్రదాయబద్ధంగా జరిగేవి. ముఖ్యంగా వ్యవసాయం విషయానికివస్తే దేశంలో సాగయ్యే వ్యవసాయంలో అధికశాతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటుంది. ఫలితంగా భారతదేశం ఈ రంగంలో భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే 1993లో ఇజ్రాయెల్, భారతదేశం వ్యవసాయ రంగంలో చేతులు కలిపినప్పటి నుంచి దేశంలోని రైతుల పరిస్థితి మరింతగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఇజ్రాయెల్ సహకారంతో 30కి పైగా వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అలవరచుకుని, అధునాతన వ్యవసాయం చేయాలనుకునే భారతీయ రైతులను శిక్షణకు ఇజ్రాయెల్ ఆహ్వానం పలుకుతుంటుంది. పలువురు భారతీయ రైతులు వ్యవసాయంలో శిక్షణకు ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ఇదే కారణం. శిక్షణ అనంతరం వారు తిరిగి భారత దేశానికి తిరిగివచ్చి తమ వ్యవసాయ ఉత్పత్తులను అనేక రెట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్ సహాయంతో ప్రస్తుతం భారతదేశంలో అనేక వ్యవసాయ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గాలిలో సాగుచేసే వ్యవసాయానికి కూడా ఇజ్రాయెల్ పేరుగాంచింది. ఈ దేశంలో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు. ఈ సాంకేతికతలో వ్యవసాయానికి భూమి లేదా నేల అవసరం లేదు. ఈ పద్ధతిలో పండించిన కూరగాయలను మట్టిలో పండే కూరగాయలతో పోలిస్తే.. వాటికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం -
దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది. దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్‌బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్‌మారిట్జ్‌బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి. గృహాల సంఖ్యలో పెరుగుదల 2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి. అత్యధిక ఆదాయ అసమాన దేశం ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్‌లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
వైర్ నుంచి వైర్లెస్కు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్లెస్ డివైస్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ విషయానికి వస్తే వేరబుల్స్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్ ఊరిస్తోంది. అమ్మకాలు ఎందుకంటే... ఇయర్‌వేర్ డివైస్ వినియోగం పెరగడం, రిస్ట్ బ్యాండ్స్ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్ సేల్స్ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్ నుంచి వైర్లెస్ వైపు మార్కెట్ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్ రంగంలో ఇయర్‌వేర్ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది. రిస్ట్ బ్యాండ్స్ నుంచి.. గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్ బ్యాండ్స్ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు. తగ్గుతున్న ధరలు.. ఇయర్‌వేర్ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్టైన్మెంట్తోపాటు వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్లెస్ స్టీరియో డివైసెస్ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది. -
రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్ ఈ కామర్స్
న్యూఢిల్లీ: దేశంలో ఈకామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 2024 నాటికి రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్లకు (రూ.7.5లక్షల కోట్లు) చేరుకుంటుందని ఓ నివేదిక తెలియజేసింది. అంతర్జాతీయ సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం), సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వినియోగదారుల్లో మారుతున్న కొనుగోళ్ల ధోరణి, ఆన్లైన్లో విక్రేతలు పెరుగుతుండడం తదితర అంశాలు రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని ఈ నివేదిక తెలియజేసింది. తాజా గ్రోసరీల విక్రయాలకు డిమాండ్, ఫుడ్ డెలివరీ కంపెనీల సంఖ్య పెరగడం కూడా వచ్చే ఐదేళ్లలో మార్కెట్ విస్తరణకు మేలు చేస్తుందని పేర్కొంది. సరఫరా వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు అన్నవి భారత్ లో ఈ కామర్స్ మార్కెట్ తదుపరి విస్తరణకు కీలకమని సూచించింది. పదేళ్లలో భారీగా విస్తరణ.. గత పదే?ళ్ల కాలంలో భారత రిటైల్ రంగం శరవేగంగా ప్రగతి సాధించినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘2019 చివరికి రిటైల్ రంగం పరిమాణం 915 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇందుల్ రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 2019 ఆఖరుకు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ 2010లో రిటైల్ రంగంలో ఈ కామర్స్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల కంటే (రూ.7,500 కోట్లు) తక్కువగా ఉండగా, పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరించింది’’ అని ఈ నివేదిక తెలియజేసింది. గత దశాబ్ద కాలంలో ఈ కామర్స్ వృద్ధికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరగడం తోడ్పడినట్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫర్నిచర్, ఫార్మసీ, కాస్మెటిక్స్ మార్కెట్ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిపింది. ‘‘ఈ కామర్స్ రిటైల్ మార్కెట్ (బిజినెస్ టు కస్టమర్/బీటుసీ) 2024 నాటికి 100 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించనుంది. 2019నాటికి దేశంలో ఈ కామర్స్ విస్తరణ 3 శాతమే. విస్తరణకు భారీ అవకాశాలున్నాయి’’ అని ఈ నివేదిక అంచనా వేసింది. అమెరికా, చైనా మార్కెట్లలో ఈ కామర్స్ రిటైల్ వ్యాప్తి 2019 నాటికి వరుసగా 15 శాతం, 20 శాతంగా ఉండగా.. భారత్ లో 2024 నాటికి 6 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ‘‘ఈ కామర్స్ విక్రయాల్లో పెద్ద మొత్తం దేశంలోని అగ్రగామి 30 పట్టణాల నుంచే వస్తున్నా.. వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పైగా అమ్మకాలు టైర్–2, 3 పట్టణాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న పట్టణాలకు కూడా సరుకులను డెలివరీ చేసే విధంగా ఈ కామర్స్ కంపెనీలు విక్రేతల పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది’’ అని ఏఅండ్ఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సైగల్ పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కొనుగోళ్ల ధోరణి, తగిన టెక్నాలజీలు, రవాణా భాగస్వాములపై ఈ కామర్స్ విస్తరణ ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఎఫ్ఎంసీజీ, గ్రోసరీలు, వస్త్రాల విక్రయాలు మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా, చాట్ ఇంజన్స్, ఏఐ బాట్స్ అన్నవి కీలకమవుతాయని పేర్కొంది. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
మారుతీ ఉత్పత్తి అప్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. గతేడాది డిసెంబర్లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొం ది. 2018 డిసెంబర్ నెలలో 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్ తగ్గిపోయిన కారణంగా వరుసగా తొమ్మిది నెలల పాటు ఉత్పత్తిలో కోత విధించిన ఎంఎస్ఐ.. నవంబర్‌లో 4.33 శాతం ఉత్పత్తి పెంపును ప్రకటించింది. -
గృహ విక్రయాల్లో 36 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా పడిపోయిన రియల్టీ పరిశ్రమ తిరిగి పట్టాలెక్కింది. ముంబై మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వృద్ధి నమోదైందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. 2019 జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని మిగిలిన నగరాల్లో కంటే హైదరాబాద్‌లో గృహాల విక్రయాల్లో ఏకంగా 36 శాతం వృద్ధి కనిపించింది. 2016లో హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు 29 శాతం వృద్ధి ఉంది. పెద్ద నోట్ల రద్దు జరిగిన మరుసటి ఏడాది 2017లో వృద్ధి శాతం ఒక్కసారిగా 9 శాతానికి పడిపోయింది. కోల్‌కతాలోనూ అంతే. 2016లో 28 శాతంగా ఉన్న వృద్ధి.. 2017 నాటికి 6 శాతానికి పడిపోయింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు వస్తుండటంతో.. నివాస విభాగంలోనూ జోరు మొదలైంది. దీంతో 2019 మొదటి తొమ్మిది నెలల కాలంలో వృద్ధి ఏకంగా 36 శాతానికి చేరుకుంది. -
40శాతం పెరిగిన లిక్కర్ అమ్మకాలు
నల్లబెల్లం అరికట్టెందుకు ప్రత్యేక బృందాలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య హుస్నాబాద్: జిల్లా వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు 40శాతం పెరిగాయని ప్రోహిబిషన్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ శంకరయ్య అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుబడిన 20 వాహనాలకు మంగళవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టామనిన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని అధికంగా కామారెడ్డి నుంచి పల్లెలకు చేరవేస్తున్నారని, ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహిస్తామని అన్నారు. శనిగరం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. లిక్కర్ కల్తీ నివారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఉధృతం చేస్తామన్నారు. ఈ విషయమై దసరా సందర్భంగా ప్రత్యేక దృష్టిపెడతామన్నారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఎస్సై శర్వాని పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి
నగర పంచాయతీ చైర్మన్ చంద్రయ్య హుస్నాబాద్: మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వాలంభన కోసం అడుగులు వేయాలని నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య అన్నారు. నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో ధర్మతేజ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణలో ప్రావీణ్యం పొందిన మహిళలకు చైర్మన్ గురువారం సర్టిఫికెట్లు అందజేశారు. అంతకముందు సొసైటీ ఆవరణలో మొక్కలను నాటారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వశక్తితో జీవితంలో ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, కౌన్సిలర్ ఇంద్రాల సారయ్య, ఎన్‌వైకే ఇన్చార్జి రవీందర్, సోసైటీ చైర్పర్సన్ జంగ విజయ, నాదమునుల రామరావు, పిడిశెట్టి రాజు, సుభాష్ , మహిళలు పాల్గొన్నారు.