వాహనాలకు వేలం వేస్తున్న సిబ్బంది
-
నల్లబెల్లం అరికట్టెందుకు ప్రత్యేక బృందాలు
-
ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య
హుస్నాబాద్: జిల్లా వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు 40శాతం పెరిగాయని ప్రోహిబిషన్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ శంకరయ్య అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుబడిన 20 వాహనాలకు మంగళవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టామనిన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని అధికంగా కామారెడ్డి నుంచి పల్లెలకు చేరవేస్తున్నారని, ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహిస్తామని అన్నారు. శనిగరం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. లిక్కర్ కల్తీ నివారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు ఉధృతం చేస్తామన్నారు. ఈ విషయమై దసరా సందర్భంగా ప్రత్యేక దృష్టిపెడతామన్నారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఎస్సై శర్వాని పాల్గొన్నారు.