గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది.
దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్‌బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్‌మారిట్జ్‌బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి.
గృహాల సంఖ్యలో పెరుగుదల
2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి.
అత్యధిక ఆదాయ అసమాన దేశం
ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్‌లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్‌లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్‌లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి.
దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్‌లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?
Comments
Please login to add a commentAdd a comment