అరబ్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం ఇజ్రాయెల్.. అయితే అది సాధించిన సాంకేతికత కారణంగా నేడు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఈ దేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఈ దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ పుష్కలంగా పంటలు పండటం విశేషం. అయితే భారతదేశంలోని రైతులతో ఈ దేశానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి నుంచి టెక్నాలజీ విషయంలో ఇతరదేశాలతో భారత్ పోటీపడే స్థాయిలో లేదు. ఒకప్పుడు మన దేశంలో అన్ని కార్యకలాపాలు సంప్రదాయబద్ధంగా జరిగేవి. ముఖ్యంగా వ్యవసాయం విషయానికివస్తే దేశంలో సాగయ్యే వ్యవసాయంలో అధికశాతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటుంది. ఫలితంగా భారతదేశం ఈ రంగంలో భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే 1993లో ఇజ్రాయెల్, భారతదేశం వ్యవసాయ రంగంలో చేతులు కలిపినప్పటి నుంచి దేశంలోని రైతుల పరిస్థితి మరింతగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఇజ్రాయెల్ సహకారంతో 30కి పైగా వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం అలవరచుకుని, అధునాతన వ్యవసాయం చేయాలనుకునే భారతీయ రైతులను శిక్షణకు ఇజ్రాయెల్ ఆహ్వానం పలుకుతుంటుంది. పలువురు భారతీయ రైతులు వ్యవసాయంలో శిక్షణకు ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ఇదే కారణం. శిక్షణ అనంతరం వారు తిరిగి భారత దేశానికి తిరిగివచ్చి తమ వ్యవసాయ ఉత్పత్తులను అనేక రెట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్ సహాయంతో ప్రస్తుతం భారతదేశంలో అనేక వ్యవసాయ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
గాలిలో సాగుచేసే వ్యవసాయానికి కూడా ఇజ్రాయెల్ పేరుగాంచింది. ఈ దేశంలో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు. ఈ సాంకేతికతలో వ్యవసాయానికి భూమి లేదా నేల అవసరం లేదు. ఈ పద్ధతిలో పండించిన కూరగాయలను మట్టిలో పండే కూరగాయలతో పోలిస్తే.. వాటికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
Comments
Please login to add a commentAdd a comment