![Maruti Suzuki is production rises 8persant in December - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/9/MARUTI-SUZUKI-PLANT.jpg.webp?itok=e0cZyJLo)
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. గతేడాది డిసెంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొం ది. 2018 డిసెంబర్ నెలలో 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్ తగ్గిపోయిన కారణంగా వరుసగా తొమ్మిది నెలల పాటు ఉత్పత్తిలో కోత విధించిన ఎంఎస్‌ఐ.. నవంబర్‌లో 4.33 శాతం ఉత్పత్తి పెంపును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment