ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.
మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.
మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment