new record
-
రూపాయి మరింత క్రాష్ ..
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్‌ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అమెరికా టారిఫ్‌లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు. -
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్: సియామ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన (హోల్‌సేల్) వాహనాల సంఖ్య 2024లో 11.6 శాతం పెరిగి 2,54,98,763 యూనిట్లకు చేరుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని సియామ్ తెలిపింది.2023లో హోల్‌సేల్‌గా అమ్ముడైన మొత్తం వాహనాల సంఖ్య 2,28,39,130 యూనిట్లు. ‘2024 ఆటో పరిశ్రమకు సహేతుకంగా మంచిదే. వినియోగదారుల సానుకూల సెంటిమెంట్, దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం అన్ని వాహన విభాగాలలో వృద్ధిని అందించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వ స్థిర విధాన పర్యావరణ వ్యవస్థ కొన్నేళ్లుగా కొనసాగడం 2024లో పరిశ్రమకు కలిసి వచ్చింది.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ద్వారా సానుకూల సెంటిమెంట్‌తో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఊపు 2025లో వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.విభాగాలవారీగా ఇలా.. ద్విచక్ర వాహన విభాగం హోల్‌సేల్‌లో గత ఏడాది 14.5 శాతం దూసుకెళ్లి 1,95,43,093 యూనిట్లు నమోదైంది. స్కూటర్స్ విక్రయాలు 20 శాతం అధికమై 66,75,231 యూనిట్లు, మోటార్‌సైకిల్స్ 12 శాతం ఎగసి 1,23,52,712 యూనిట్లకు చేరుకున్నాయి.ప్యాసింజర్ వెహికిల్స్ 4 శాతం ఎగసి 43 లక్షల యూనిట్లు, త్రీవీలర్స్ 7 శాతం పెరిగి 7.3 లక్షల యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్ ఒక ఏడాదిలో ఈ స్థాయిలో హోల్‌సేల్ అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య వాహనాల విక్రయాలు 3 శాతం క్షీణించి 9.5 లక్షల యూనిట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
పుష్ప-2, దేవర రికార్డులు బద్దలు కొట్టిన గేమ్ ఛేంజర్
-
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024హ్యుందాయ్ ఐయోనిక్ 5హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2
-
ఐపీవో బూమ్!
స్టాక్ మార్కెట్లో ఐపీఓలు దుమ్ముదులిపేస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్నాయి. కేవలం లిస్టింగ్ మాత్రమే కాదు బంపర్ లాభాలతో ఇన్వెస్టర్లను రారమ్మని ఊరిస్తున్నాయి. ఈ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో క్యూ కట్టారు. వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూసినప్పటికీ ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్ (బీఎస్ఈ) తొలిసారి సెపె్టంబర్ 27న 85,978 పాయింట్లకు చేరగా.. నిఫ్టీ (ఎన్ఎస్ఈ) 26,277ను తాకింది. ఈ బాటలో ఐపీవో మార్కెట్ మరింత కళకళలాడింది. ప్రధాన విభాగంలో ఏకంగా 91 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. తద్వారా మొత్తం రూ. 1,60,500 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందుకు ఆరి్థక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, లావాదేవీల సులభతర నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో పలు ఐపీవోలకు గరిష్ట స్థాయిలో బిడ్డింగ్ లభించగా.. లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలిచాయి. 17 మాత్రమే నష్టాలతో ముగిశాయి. భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి. వచ్చే ఏడాదీ మెరుపుల్... సెబీకి దాఖలైన 89 కంపెనీల ఐపీవో దరఖాస్తుల ప్రకారం 2025లో రూ. 2.5 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటికే 34 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. ఈ జాబితాలో రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, హీరో ఫిన్‌కార్ప్, ఎన్ఎస్డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, కెనరా రోబెకో, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ వంటివి . దీంతో కొత్త ఏడాది ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయనే ఆసక్తి నెలకొంది!సగటు పరిమాణం అప్...ఈ ఏడాది చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. దీంతో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,700 కోట్లను దాటింది. 2023లో ఇది కేవలం రూ. 867 కోట్లుగా నమోదైంది. ఏడాది చివరి నెల (డిసెంబర్)లోనూ 15 కంపెనీలు ఐపీవోలకు రాగా.. సెకండరీ మార్కెట్లో నికర అమ్మకందారులుగా నిలుస్తూనే విదేశీ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కట్టడం విశేషం! ఈ నెల 24 వరకూ ముగిసిన 90 ఇష్యూల ద్వారా అన్‌లిస్టెడ్ కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సమీకరించాయి.సోమవారం (23న) ప్రారంభమైన యూనిమెక్ ఏరోస్పేస్ మరో రూ. 500 కోట్లు అందుకోనుంది. గతేడాది (2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ బాటలో మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది! -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా, 400 బిలియన్ డాలర్లు అధిగమించిన మొదటి వ్యక్తిగా.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.మస్క్ తరువాత జాబితాలో జెఫ్ బెజోస్ (249 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (198 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (181 బిలియన్ డాలర్లు) ఉన్నారు. మస్క్ సంపద పెరగటానికి టెస్లా, స్పేస్ఎక్స్ మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ కూడా దోహదపడింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
వెండి మిలమిల..
న్యూఢిల్లీ: వెండి కేజీ ధర న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఒకేరోజు రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరింది. వెండి ధర ఒకేరోజు ఈ స్థాయిలో ఎగియడం ఒక రికార్డు. తద్వారా ఈ మెటల్ ధర రెండు వారాల తర్వాత తిరిగి రూ.95,000పైకి చేరింది. కాగా, ఇంతక్రితం అక్టోబర్ 21న వెండి ధర ఒకేరోజు రూ.5,000 పెరగడం ఒక రికార్డు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్థానిక ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ దీనికి కారణం. రెండు రోజుల తర్వాత పసిడి ఇక గడచిన రెండు రోజుల్లో రూ.2,250 పడిపోయిన బంగారం ధర బుధవారం తిరిగి పుంజుకుంది. 99.9 ప్యూరిటీ పసిడి ధర రూ.650 ఎగసి రూ.78,800కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 శాతం స్వచ్ఛత ధర రూ.950 ఎగసి రూ.78,700కు ఎగసింది. డాలర్ విలువలో ఒడిదుడుకులు తాజా పసిడి పరుగుకు కారణం. అబాన్స్ హోల్డింగ్స్ సీఈఓ చింతన్ మెహతా పసిడి భవిష్యత్ ధరలపై మాట్లాడుతూ, బులియన్ ధరలకు మరింత దిశానిర్దేశం చేసే రష్యా–ఉక్రెయిన్ వివాదం, పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయని అన్నారు. ఫ్యూచర్స్‌లో పరుగు.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో 1% పెగా (32 డాలర్లు) పెరిగి 2,679 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఇటీవలే పసిడి 52 వారాల గరిష్టం 2,826 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ, ట్రంప్ గెలుపు, డాలర్ స్థిరత్వం వంటి పరిణామాలతో ఎల్లో మెటల్ కొంత వెనక్కు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ. 900 లాభంతో రూ. 76,870 వద్ద ట్రేడవుతోంది. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
దేవర సరికొత్త రికార్డ్.. మిడ్ నైట్ షోల కలెక్షన్స్ తో
-
అంతరిక్షంలో 370 రోజులకు పైగా!
మాస్కో: రష్యా వ్యోమగాములు ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్ఎస్లో ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా అస్ట్రోనాట్స్ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ బద్ధలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనొకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1,110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు. -
పసిడి రికార్డుల పరుగు అంతర్జాతీయ అంశాల దన్ను
న్యూఢిల్లీ: బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా మంగళవారం పరుగుపెట్టాయి. అంతర్జాజీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో చరిత్రాత్మక రికార్డు 2,570.2 డాలర్ల స్థాయిని తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 20 డాలర్ల లాభంతో పటిష్టంగా 2,562 డాలర్ల పైన ట్రేడవుతోంది. అమెరికా మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం.దేశంలోనూ దూకుడే.. ఇక అంతర్జాతీయ అంశాల దన్నుతో దేశీయంగా కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పూర్తి 99.9 స్వచ్ఛత ధర రూ.1,400 పెరిగి రూ.74,150కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.73,800 స్థాయిని చూసింది. వెండి కేజీ ధర సైతం రూ.3,150 ఎగసి రూ.87,150కి చేరింది. ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు రూ.837, రూ.834 చొప్పున పెరిగి వరుసగా రూ.71,945, రూ.71,657కు చేరాయి. వెండి ధర రూ.2,030 పెరిగి రూ.85,321కు పెరిగింది. -
యూపీఐ సరికొత్త రికార్డ్.. రోజుకు రూ .65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ తెలిపింది.ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. -
వెండే బంగారమాయెగా..
న్యూఢిల్లీ: వెండి ధర దేశంలో సరికొత్త రికార్డులను చూస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ ధర క్రితం ముగింపుతో పోల్చితే బుధవారం రూ.1,150 ఎగిసి రూ.97,100కి ఎగసింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3,707 ఎగసి రూ.94,118కి చేరింది. చెన్నైసహా పలు నగరాలు, కొన్ని పట్టణాల స్పాట్ మార్కెట్లలో ఏకంగా రూ.లక్ష దాటినట్లు కూడా సమాచారం అందుతోంది. గడచిన పది రోజుల్లో వెండి ధర దాదాపు రూ.11,000 పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు విలువైన మెటల్స్ ధర పెరగడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీలో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర క్రితంతో పోలి్చతే రూ.250 పెరిగి రూ.73,200కు చేరగా, ముంబైలో రూ.222 ఎగసి రూ.72,413కి చేరింది. -
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. -
భారత్‌లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి. -
కొత్త రికార్డులు నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ
-
Taylor Swift: గ్రామీ అవార్డుల్లో రికార్డు
అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా 2024 గ్రామీ అవార్డుల్లో మరోసారి తన సత్తా చాటింది. వరుసగా నాలుగో సారి బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకుంది. తన మిడ్నైట్స్ ఆల్బమ్‌కు గాను ఈ అవార్డు దక్కింది. వరుసగా నాలుగు అవార్డులను దక్కించుకున్న తొలి మహిళా సింగర్ 66 ఏళ్ల గ్రామీ అవార్డు చరిత్రలోనే ఇది రికార్డు. ఇది తన జీవితంలో గొప్ప క్షణాలన్ని టేలర్ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు "ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్" అనే కొత్త ఆల్బమ్‌ను కూడా ఏప్రిల్ 19వ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక ఎస్జెడ్ఏ ఆర్ అండ్ బి పాట కోసం ఎస్జెడ్ఏ అవార్డును దక్కించుకోవడంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంకా మోనెట్, బిల్లీ ఎలిష్, మైలీ సైరస్ వంటి మహిళా కేటగిరీలో నామినేషన్లలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉండటం విశేషం.మైలీ సైరస్ ఎట్టకేలకు తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది "ఫ్లవర్స్" అనే సాంగ్ ఉత్తమ పాప్ సోలో అవార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఎనిమిది సార్లు నామినేట్ అయింది. కానీ అదృష్టం వరించలేదు. కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 66వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగా విక్టోరియా మోనెట్ ఉత్తమ నూతన కళాకారిణిగా అవార్డును స్వీకరించింది. Taylor Swift just took the album of the year trophy from Celine Dion without batting an eye and/or acknowledging that a legendary 🐐 was handing her the award. So cringey for my soul 🫠 pic.twitter.com/J7LggDVQD8— eazy e (@estefs) February 5, 2024 -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
హనుమాన్ దెబ్బకు రికార్డులన్నీ ఉఫ్..
-
ఎయిర్‌లైన్స్‌కు కలిసొచ్చిన వరల్డ్‌కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్‌కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్‌కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్‌కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
Macallan: విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు!
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట. -
జగనన్న ఆరోగ్య సురక్ష సరికొత్త రికార్డ్..!
-
ప్రసవాల్లో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు నెలలో నమోదైన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నెలవారీ సమీక్షను నిర్వహించారు. అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రిలో 89% అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రి 89 శాతం, ములుగు 87, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84, వికారాబాద్ 83, గద్వాల ఆస్పత్రి 85 శాతం ప్రసవాలతో మంచి పనితీరు కనబర్చాయని హరీశ్‌రావు అభినందించారు. అతి తక్కువగా డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. మొత్తంగా మంచి సామర్థ్యపు స్కోర్ విషయంలో తొలి వరుసలో నిలిచిన మెదక్ (84.4), జోగుళాంబ గద్వాల (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్‌కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానాల్లో ఉన్న జగిత్యాల, కొమురంభీం, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు. ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్! భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు.. ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది. ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. -
మువ్వన్నెల చంద్రహాసం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా–25 విఫలమైన చోటే భారత్ విజయపతాక ఎగురవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. అత్యంత అరుదైన ఘనత ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాలు తీవ్ర ఉత్కంఠ చంద్రయాన్–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ తన నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్ హొరిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే? చంద్రయాన్–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్ ల్యాండింగ్. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్ క్రాష్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు. బయటకు వచి్చన రోవర్ సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాబిల్లిపై గర్జించిన సింహాలు..! చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్ రైజర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. -
లేటెస్ట్ రికార్డ్ - హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులు ఎన్ని లక్షలంటే?
హైదరాబాద్, 4 జూలై, 2023: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) 3 జూలై 2023, సోమవారం నాడు 5.10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డు సంఖ్య పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం, ఆమోదాన్ని సూచిస్తుంది. ఈ మైలురాయిని సాధించినందుకు హెచ్ఎమ్ఆర్ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపిన.. L&TMRHL, MD & CEO, శ్రీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిజంగా ఒక ముఖ్యమైన సందర్భం, మా విలువైన ప్రయాణికులకు మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) కొవిడ్-19 సమయంలో ప్రయాణికుల సంఖ్య కొంత మందగించినా.. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి నిరంతర సహకారం, మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం మాకు సాధ్యపడిందని అన్నారు. -
టీసీఎస్ ఉద్యోగుల సరికొత్త రికార్డ్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్‌లు కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 22 లక్షల గంటలు టీసీఎస్ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది. హోప్ చొరవలో భాగంగా టీసీఎస్ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు. సేవా కార్యక్రమాలు ఇవే.. సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్‌లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్‌లను టీసీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
బాక్సాఫీస్ కింగ్...దేశంలోనే ఒకే ఒక్కడు
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఎవరెస్ట్: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే
కఠ్మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది. గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు. సీనియర్ మౌంటేన్ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. -
ఉత్పత్తిలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇచ్చిన 'టాటా పంచ్'
Tata Motors: ఎక్కువమంది ప్రజలకు నమ్మికైన భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఇప్పటికే అనేక ఆధునిక ఉత్పత్తులు ప్రవేశపెట్టి తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ టాటా పంచ్ మైక్రో SUV ఉత్పత్తిలో కొత్త రికార్డ్ సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ న్యూ రికార్డ్.. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి సేఫ్టీలో కూడా అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధించింది. ఈ కారణంగానే ఈ కారు అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారు ఉత్పత్తిలో 'రెండు లక్షల' యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వారియర్ అవుతోంది. 2021 అక్టోబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన టాటా పంచ్ కేవలం 20 నెలల కాలంలో ఉత్పత్తిలో ఏకంగా 2,00,000 మైలురాయిని చేరుకుంది. ఇందులో కంపెనీ 2023 మార్చి వరకు 1,86,535 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 10,930 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి ఇప్పుడు ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. టాటా పంచ్ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ALFA) ఆర్కిటెక్చర్ మీద రూపొందించారు. కావున ఇది అద్భుతమైన డిజైన్ అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ఆటోమాటిక్ ప్రొజెక్టర్ హెడ్లాంప్, LED DRL, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, రియర్ వ్యూ కెమరా, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మోంటెడ్ కంట్రోల్స్, USB ఛార్జింగ్ సాకేట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఇది 5 స్టార్ రేటింగ్ పొంది దేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) టాటా పంచ్ సిఎన్జి (Tata Punch CNG) ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇది మార్కెట్లో విడుదలైతే టాటా సిఎన్జి విభాగంలో నాల్గవ మోడల్ అవుతుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ కలిగి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సిఎన్జి ట్యాంకుల కోసం కంపెనీ కొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!) టాటా పంచ్ ఎలక్ట్రిక్ (Tata Punch EV) ఇక టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలకావడానికి కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల వెలువడ్డాయి. ఇది కూడా మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. టాటా పంచ్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రికార్డు బ్రేక్ చేసిన సాయి ధరమ్ తేజ్
-
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు... కోహ్లీ నయా రికార్డు
-
కార్గోలో అదానీ పోర్ట్స్ రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కార్గో పరిమాణంలో సరికొత్త రికార్డు సాధించింది. 33.9 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధికాగా.. తద్వారా అత్యధిక పోర్ట్ కార్గోను నమోదు చేసింది. (ఇది కూడా చదవండి: సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కంపెనీ వివరాల ప్రకారం గత నెల(మార్చి)లోనే 9.5 శాతం అధికంగా 3.2 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. 2022 జులై తదుపరి కార్గో పరిమాణంలో తొలిసారి 3 కోట్ల టన్నుల మార్క్‌ను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దేశీ కార్గో పరిమాణంలో మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తున్నట్లు అదానీ పోర్ట్స్ తెలియజేసింది. (ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు) పశ్చిమ తీరప్రాంతంలో ఆరు, తూర్పుతీరంలో ఐదు పోర్టులను కలిగి ఉన్న కంపెనీ మరిన్ని పోర్టులను జత చేసు కుంటోంది. తద్వారా అతిపెద్ద పోర్టుల నిర్వాహక కంపెనీగా నిలుస్తోంది. ఈ బాటలో ఈ వారం మొదట్లో కరైకాల్ పోర్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11 పోర్టులతో మొత్తం కార్గో పరిమాణంలో 25 శాతాన్ని హ్యాండిల్ చేస్తోంది. శ్రీలంకలోని కొలంబో, కేరళలోని విజింజంలో ట్రాన్షిప్మెంట్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. -
సేఫెస్ట్ కార్ల జాబితాలో ఆ రెండు కార్లు
భారతీయ మార్కెట్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను సెలక్ట్ చేసుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నప్పటికీ తాజాగా ఈ జాబితాలో మరో రెండు కార్లు చేరాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. దేశీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ గ్లోబల్ ఎన్‌సిఏపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. GNCAP కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ క్రింద 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మిడ్ సైజ్ సెడాన్లు ఈ స్లావియా & వర్టస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) స్లావియా, వర్టస్ రెండూ కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో మొత్తం 34 పాయింట్లకు గానూ 29.71 పాయింట్లు సాధించాయి. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 42 పాయింట్లు పొంది మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కొత్త గ్లోబల్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ & చైల్డ్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రియన్ ప్రొటక్షన్ (పాదచారుల రక్షణ), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిలో కూడా ఉత్తమ స్కోరింగ్ పొందినప్పుడే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అన్ని పరీక్షల్లో మంచి స్కోరింగ్ సాధించిన స్లావియా, వర్టస్ రెండూ అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరటం నిజంగా హర్షించదగ్గ విషయం. -
టీవీఎస్ ఐక్యూబ్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్‌తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్పాయింట్లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. -
రికార్డు సృష్టించిన సింగరేణి.. చరిత్రలోనే తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్‌టైం రికార్డుగా ఉంది. అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. -
JK Cements: ఇది కదా రికార్డ్ అంటే..
ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఒకటైన జేకే సిమెంట్స్ (JK Cements) ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కేవలం ఒకేరోజులో రాజస్థాన్‌లోని 249 పాఠశాలల్లో 249 ర్యాంప్‌లను నిర్మించడం వల్ల ఈ ఘనత దగ్గింది. రండి ప్రతీ మార్గాన్ని సులభతరం చేద్దాం (Banaye Har Raah Aasaan)’ అనే కార్యక్రమం ద్వారా జేకే సిమెంట్స్ 249 ర్యాంప్‌లను నిర్మించింది. ఇందులో సంస్థ ఉద్యోగులు, డీలర్స్, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ హెడ్ లవ్ రాఘవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాఘవ్ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి మనవంతు తప్పనిసరిగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంగా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) రాజస్థాన్‌లో నిర్మించిన 249 ర్యాంప్‌లు జేకే సిమెంట్స్ నిర్వహించింది. ఇందులో ఇతర సంస్థలు, ప్రభుత్వ విభాగాల జోక్యం లేదని కూడా ఈ సందర్భంగా జేకే సిమెంట్స్ క్లస్టర్ హెడ్ హరీశ్ ఖుషలని తెలిపారు. సుమారు రెండు వేలమంది కార్మికుల సహకారంతో ఇది విజయవంతమైందని కూడా వెల్లడించారు. -
టాటా మోటార్స్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. ఇదే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఒకప్పటి నుంచి, ఇప్పటి వరకు కూడా అధిక ప్రజాదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఇటీవల కంపెనీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఈ రోజు వెల్లడించింది. టాటా మోటార్స్ 1998 నుంచి ఇప్పటి వరకు ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో 5 మిలియన్లకు చేరుకుంది. గత 2.5 సంవత్సరాలలో 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు, ఆ తరువాత 2004లో 1 మిలియన్, 2010లో రెండవ మిలియన్‌ను సాధించి, 2015లో 3 మిలియన్ల మార్కును చేరుకుంది. 2020 నాటికి కంపెనీ 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. మొత్తం మీద ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిలో ఎట్టకేలకు 5 మిలియన్ మార్కుని చేరుకుంది. టాటా మోటార్స్ చరిత్రలో ఈ రోజు మరచిపోలేని రోజు. కంపెనీ ఇలాంటి గొప్ప రికార్డ్స్ సాధించడంలో ఎప్పుడు ముందు ఉంటుందని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. గత కొంత కాలంలో ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో నలుగుతున్న సమయంలో, సెమికండక్టర్ చిప్ కొరత ఉన్నప్పటికీ కంపెనీ ఈ 5 మిలియన్ ప్రొడక్షన్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఈ రికార్డ్ సృష్టించడానికి కారకులైన ఉద్యోగులకు, కష్టమరలకు కంపెనీ కృతఙ్ఞతలు తెలిపింది. ఐదు మిలియన్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా టాటా మోటార్స్ భారతదేశంలోని కస్టమర్లు మరియు ఉద్యోగుల కోసం ఒక వేడుక ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే కంపెనీ తమ తయారీ ప్రదేశాలు, ప్రాంతీయ కార్యాలయాల్లో నెల రోజుల పాటు వేడుకలను కొనసాగిస్తుంది. -
Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి
భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్‌లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్‌బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. -
వన్డేల్లో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డు
-
మంచు కొండల్లో మహీంద్రా కారు బీభత్సం.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్ చేస్తే రికార్డ్ బుకింగ్స్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది. మహీంద్రా కారా మజాకా మార్కెట్లో ఇంకా అఫిషియల్‌గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్‌ను తన పేరిట నమోదు చేసుకుంది. ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్‌తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది. ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్‌ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్‌ను అందుకోగలదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది. మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
హిందుస్తాన్ షిప్‌యార్డ్ రికార్డ్
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ షిప్‌యార్డ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 755 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. కోవిడ్–19 రెండు, మూడు దశలు, పాక్షిక లాక్డౌన్లు, ఆంక్షలు తదితర వివిధ సవాళ్లలోనూ ప్రోత్సాహక పనితీరును చూపగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ హేమంత్ ఖత్రి పేర్కొన్నారు. కంపెనీకి గల మూడు విభాగాలూ ఇందుకు సహకరించినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మరింత అధికంగా రూ. 1,000 కోట్ల విలువైన ఉత్పాదకతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. నౌకా నిర్మాణ విభాగం నుంచి రూ. 613 కోట్ల విలువైన ప్రొడక్షన్ సాధించడం ద్వారా కొత్త రికార్డ్‌కు తెరతీసినట్లు పేర్కొన్నారు. గతేడాది రూ. 50.78 కోట్ల నికర లాభం ఆర్జించగా.. రూ. 10.69 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించినట్లు తెలియజేశారు. అయితే అంతక్రితం ఏడాది(2020–21) రూ. 14 కోట్ల నికర నష్టంతోపాటు.. రూ. 73 కోట్లమేర నిర్వహణ నష్టాలు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్‌గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది. -
ఓటీటీలోనూ 'విక్రమ్' సరికొత్త రికార్డు..
Kamal Haasan Vikram New Record In OTT: ఉలగ నాయగన్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత 'విక్రమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. జులై 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన 'విక్రమ్' రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో 'బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్' సాధించిందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న 'ఓపెనింగ్ వ్యూస్' రికార్డును ఈ మూవీ తిరగరాసిందని తెలిపారు. ఇంకా హైయెస్ట్ స్ట్రీమింగ్‌తో (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో) ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం పట్ల కమల్ హాసన్ కూడా స్పందించారు. ''డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా 'విక్రమ్' ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విక్రమ్ బృందానికి శుభాకాంక్షలు'' అని తెలిపారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. Consider this your sign to watch #VikramOnHostar now! pic.twitter.com/Me6UamDUhn — Disney+ Hotstar (@DisneyPlusHS) July 12, 2022 Thank you for all your love. You can now enjoy Vikram on @DisneyPlusHS . https://t.co/5HSjLWiBHO@Dir_Lokesh @RKFI @turmericmediaTM @DisneyPlusHS @disneyplusHSTam @DisneyPlusHSTel @DisneyplusHSMal — Kamal Haasan (@ikamalhaasan) July 7, 2022 -
గోల్డ్ లోన్స్: ఎస్బీఐ సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుత్తడి రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన రికార్డు సృష్టించింది. రూ.1 లక్ష కోట్ల బంగారు రుణాలను మంజూరు చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. గోల్డ్ లోన్ విభాగంలో భారత్‌లో సంస్థకు 24 శాతం మార్కెట్ వాటా ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. క్రితంతో కంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా రుణం పొందే విషయంలో పుత్తడి మరింత ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా మారుతుందన్నారు. ఈ విభాగంలో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2021-22లో రిటైల్ లోన్స్ విభాగం 15 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అన్ని రకాల వృద్ధి అవసరాలను తీర్చగల స్థితిలో బ్యాంక్ ఉందని ఖరా పేర్కొన్నారు. -
వారెవ్వా నీరజ్ చోప్రా.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తద్వారా అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా.. ఓవరాల్‌గా వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు. చదవండి: బంగారు కొండ.. టైలర్ కలను నెరవేర్చిన కొడుకు Olympic Champion Neeraj Chopra settles for a Silver Medal with a New National Record Throw of 89.30m at the Paavo Nurmi Games in Finland.@afi We can see several performance hikes in various events this season. Hope for more further. @Adille1 @Media_SAI @SPORTINGINDIAtw pic.twitter.com/cBLg4Ke8nh — Athletics Federation of India (@afiindia) June 14, 2022 -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్‌పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అలాగే 1.2 మిలియన్స్‌కుపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో 603 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీస్ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ Super🌟 @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️🔥❤️🔥#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes! - https://t.co/AMjXMIUh7F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/DulbFZZssX — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. -
వృద్ధి రేటులో ఏపీ సరికొత్త రికార్డ్
-
2021లో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే..
Pushpa New Record As Biggest Grosser At All Over Country In 2021: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటూ కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అలా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. తాజాగా 'పుష్ప: ది రైజ్' చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం (డిసెంబర్ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 21) తిరుపతిలో సక్సెస్ పార్టీ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష్ప'. ఈ సినిమా సెకండ్ పార్ట్ 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: 'పుష్ప రాజ్'పై 'చిట్టిబాబు' రియాక్షన్.. ఏమన్నాడంటే ? -
కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ కొత్త రికార్డు
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్లో మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా నేడు కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డులు సృష్టించి దేశంలోనే నంబర్‌వన్ గా ఉన్న ఏపీ సర్కార్ నేడు తన రికార్డును తానే అధిగమించి వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డులను తిరగరాసింది. ఉద్యమంగా ప్రజలకు చేరువయ్యేలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఆదివారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. సుమారు 8 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించేలా పకడ్బందీగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకి లక్ష్యాన్ని నిర్దేశిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్యర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమంగా ప్రజలకు చేరువయ్యేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక డ్రైవ్‌గా నిర్వహించింది. వాస్తవానికి నిర్దేశించుకున్న 8 లక్షల లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం 2 గంటలకే చేరుకుంది. సాయంత్రం వ్యాక్సినేషన్ ముగిసే సమయానికి నిర్దేశించిన లక్ష్యానికి మించి 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి తాము గతంలో వేసిన 6 లక్షల రికార్డ్‌ని తిరగరాశారు. రాష్ట్రంలో కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన పరిస్థితుల్లో ముందుస్తుగానే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న సీఎం జగన్ ఆదేశాలతో నేడు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అవ్వడానికి కారణమైంది. ఒకే రోజు 13 లక్షల మందికి.. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సిననేషన్‌ను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్ఎంలకు వ్యాక్సినేషన్లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాభై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యాన్ని ఏపీ సొంతం చేసుకుంది. స్పెషల్ డ్రైవ్‌లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో1.45 లక్షల మందికి, కృష్ణాలో 1.30 లక్షలు, విశాఖలో 1.10 లక్షలు.. గుంటూరులో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ధర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌లో ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షలకి పైగా చిన్నారుల తల్లులు ఉంటారని గుర్తించి ఇప్పటికే 5.5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌లో మరో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని తెలిపారు. జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డు.. ఇదిలా ఉంటె గత రెండు స్పెషల్ డ్రైవ్ లలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించి వైద్య, ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం తమ సామర్ద్యాన్ని చాటుకుంది. నేడు ఆ రికార్డులను తిరగ రాసేలా పదమూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలన్న నిర్ణయంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి జిల్లాలకు వ్యాక్సిన్ అత్యంత తక్కువ సమయంలోనే రవాణా అవుతోంది. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ను గన్నవరం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్‌కు తరలించడం, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెషల్ డ్రైవ్‌కి అనూహ్య స్పందన.. గన్నవరం సెంటర్ నుంచి ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ చేరుకున్న వెంటనే, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వాటిని పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ సేపు కూడా వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ప్రణాళికాబద్దంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏ కేంద్రంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారో ముందుస్తుగానే వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియచేస్తుండటంతో, ప్రజలకు చేరువగానే ఏర్పాటు చేసే శిబిరాల్లో వ్యాక్సిన్ అందించే ప్రక్రియని అధికార యంత్రాంగం చేపడుతోంది. అందరి సమిష్టి కృషితో తాము ఈ సరికొత్త రికార్డు సాధించగలిగామని.. ప్రజల నుంచి స్పెషల్ డ్రైవ్‌కి అనూహ్య స్పందన లభించిందని. అన్ని విభాగాలు మెగా స్పెషల్ డ్రైవ్‌లో భాగస్వామ్యమయ్యాయని ఏపి ఎల్త్ డైరక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని తెలిపారు. మొత్తానికి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డ్రైవ్ సత్ఫాలితాల్ని ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సమాయత్తం చేస్తూ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తిస్ధాయిలో విజయవంతం చేసింది. #AndhraPradesh has administered more than 1.3 Million people with #COVIDVaccine till 7:00PM in today's ongoing vaccination drive. #LargestVaccineDrive #APFightsCorona pic.twitter.com/GQoAVHRIGe — ArogyaAndhra (@ArogyaAndhra) June 20, 2021 -
విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
భారత ఉసేన్ బోల్ట్ శ్రీనివాస గౌడ మరో రికార్డు
బెంగళూరు: భారత ఉసేన్ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు సృష్టించాడు. గతేడాది కంబాళ పోటీల్లో దున్నలతో పాటు142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో(100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి) పూర్తి చేసిన ఆయన.. తాజాగా జరిగిన పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. శ్రీనివాస గౌడ గతేడాది జరిగిన పోటీల్లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు(9.58 సెకన్లు) బ్రేక్ చేయగా, తాజాగా జరిగిన పోటీల్లో ఊహకు అందని స్పీడ్‌లో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి మరోసారి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. కాగా, ఈ అభినవ బోల్ట్‌ను ఒలింపిక్స్‌కు సిద్దం చేయాలని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహ్వానం పంపినప్పటికీ.. అతను దాన్ని సున్నితంగా తిరస్కరించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని ప్రకంపనలు సృష్టించాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతను లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధృవీకరించారు. గతవారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తి చేసిన ఆయన.. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా.. కంబాళ అనేది దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాళ ఆటలో ఎద్దులను ఉసికొల్పుతూ పోటీదారుడు బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. చదవండి: ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో.. -
వందల టీఎంసీల పంపింగ్‌లో కాళేశ్వరం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్‌లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్‌ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది. దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే? భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్‌ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్‌లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్‌ను పార్వతి పంప్ హౌస్‌కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్‌ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్‌లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్‌లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్ కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్‌తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్‌లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్ యూనిట్లు, సుందిళ్ల పార్వతి పంపింగ్ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి. అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపిగ్ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్‌లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. -
670 కోట్ల అరుదైన చిత్రం!
కళాచరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే చిత్రకారుల్లో ఇటాలియన్ చిత్రాకారుడు సాండ్రో బాటిచెలి ఒకరు. ఆయన చిత్రించిన అలనాటి చిత్రం ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 15 వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రం న్యూయార్క్‌లోని సోత్బీస్ యాక్షన్ హౌజ్‌లో 670 కోట్లకు అమ్ముడుపోయి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘యంగ్ మ్యాన్ హోల్టింగ్ ఏ రౌండెల్’ అని పేరుగల ఈ చిత్రరాజాన్ని వేనోళ్ల పొగుడుతుంటారు కళాభిమానులు. ఈ చిత్రం మార్కెటింగ్ కోసం నాలుగు నెలల సమయాన్ని వెచ్చించారు. లాస్ ఎంజెల్స్, లండన్, దుబాయ్‌లలో ప్రదర్శించారు. కళా, సాంకేతిక విషయాలకు సంబంధించిన విశ్లేషణతో 100 పేజీల కేటలాగ్ కూడా ప్రచురించారు. మొత్తానికైతే ఫలితం వృథా పోలేదు. చిత్రంలో ఉన్న వ్యక్తి గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు అనేది పక్కన పెడితే ఆ కాలానికి చెందిన సంపన్న, శక్తిమంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అంత పెద్ద మొత్తం పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కళాభిమాని పేరు, వివరాలు ఇప్పటికైతే గోప్యంగా ఉన్నాయి. -
జీఎస్టీ వసూళ్లలో నూతన రికార్డు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం నూతన గరిష్టాలకు చేరింది. 2021 జనవరి నెలకు రూ.1.20 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘2021 జనవరి నెలకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,19,847 కోట్లు (జనవరి 31 సాయంత్రం 6 గంటల సమయానికి) వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.29,014 కోట్లు ఐజీఎస్టీ రూ.60,288 కోట్లు (ఇందులో దిగుమతులపై వచ్చిన రూ.27,424 కోట్లు కూడా) వసూలైంది. మరో రూ.8,622 కోట్లు సెస్సు రూపంలో వచ్చింది’’ అంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరిన్ని జీఎస్టీ విక్రయ రిటర్నులు నమోదైతే వసూళ్ల ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 5 నెలలుగా జీఎస్టీ వసూళ్లు పుంజుకుంటున్న ధోరణి జనవరిలోనూ కొనసాగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. -
చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్
వాషింగ్టన్: నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా హోదాలో పని చేసిన డొనాల్డ్ ట్రంప్ చివరివరకు టెంపరితనంతోనే ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజు కూడా సంప్రదాయాలు పాటించకుండా తన వ్యవహార శైలిలోనే నడుచుకున్నారు. వాస్తవంగా కొత్తగా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమంలో అధ్యక్ష పదవిని వీడే వ్యక్తి పాల్గొనాల్సి ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వారికి అభినందనలు తెలపాలి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారని ఒక ప్రకటన విడుదల చేయాలి. కానీ అలాంటివేమీ లేకుండా చివరి వరకు జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎక్కడా ధ్రువీకరించలేదు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే బృందానికి శుభాకాంక్షలు అని చెప్పారు. శతాబ్దంన్నర సంప్రదాయం తూచ్ కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం సంప్రదాయం. అయితే బైడెన్‌కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని గతంలోనే ట్రంప్ ప్రకటించారు. 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ తూట్లు పొడిచారు. అయితే తన ప్రమాణానికి ట్రంప్ హాజరుకాకపోవడమే మంచిదని బైడెన్ తెలిపారు. 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ తదుపరి అధ్యక్షుడు ఎస్ గ్రాంట్ ప్రమాణానికి హాజరుకాలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ జాబితాలో చేరిపోయాడు. -
మార్కెట్ విలువలో బీఎస్ఈ సరికొత్త రికార్డ్
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. సోమవారానికల్లా మార్కెట్లు వరుసగా 9 రోజులపాటు లాభపడుతూ వచ్చాయి. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,623 పాయింట్లు జంప్‌చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12,89,863 కోట్లకుపైగా జత కలిసింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ విలువ అంటే లిస్టెడ్ కంపెనీల విలువ తొలిసారి రూ. 191 లక్షల కోట్లను తాకింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్ల రూపేణా 2.6 ట్రిలియన్లకు సమానంకావడం విశేషం! (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) పలు అంశాల సపోర్ట్ కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రధానంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత రెండు నెలల్లోనే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీనికితోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెంటిమెంటు బలపడిందని తెలియజేశారు. డిసెంబర్లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవర్ అవుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా అభిప్రాయపడటం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించారు. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 2020లోనూ బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 191 ట్రిలియన్ మార్క్‌ను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ. 12,49,218 కోట్లను అధిగమించింది. ఈ వెనుకే సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 11,50,106 కోట్ల విలువతో రెండో ర్యాంకును సాధించింది. కాగా.. కోవిడ్-19 సంక్షోభంలోనూ 2020లో సెన్సెక్స్ దాదాపు 16 శాతం పురోగమించిన విషయం విదితమే. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 32.49 లక్షల కోట్లమేర వృద్ధి చెందింది! -
మెస్సీ ప్రపంచ రికార్డు
బార్సిలోనా (స్పెయిన్): ఫుట్‌బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా 33 ఏళ్ల మెస్సీ గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 643 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును గత ఆదివారం మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్ క్లబ్ తరఫున ఆడిన పీలే 643 గోల్స్ సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన స్పానిష్ లీగ్‌లో రియల్ వాలాడోలిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3–0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్ (బయెర్న్ మ్యూనిక్–564 గోల్స్) మూడో స్థానంలో... ఫెర్నాండో పెరోటియో (స్పోర్టింగ్ లిస్బన్–544 గోల్స్) నాలుగో స్థానంలో... జోసెఫ్ బికాన్ (స్లావియా ప్రాగ్–534 గోల్స్) ఐదో స్థానంలో ఉన్నారు. -
బీఎస్ఈ మార్కెట్ విలువ- సరికొత్త రికార్డ్
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సానుకూల ప్రపంచ సంకేతాల నేపథ్యంలో ఇటీవల జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డును సాధించాయి. వారాంతాన ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 40,509 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 160.68 ట్రిలియన్లను తాకింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. తద్వారా ఈ ఏడాది(2020) జనవరి 17న సాధించిన రూ. 160.57 ట్రిలియన్ల రికార్డును అధిగమించింది. ఈ బాటలో జనవరి 20న నమోదైన 42,274 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని అందుకునేందుకు సెన్సెక్స్ దాదాపు 4 శాతం దూరంలో నిలిచింది. డాలర్ల రూపేణా చూస్తే గత మూడేళ్లలో 14 శాతం పుంజుకోవడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లలో ముందంజలో ఉన్నాయి. కాగా.. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 20 శాతం దూరంలో నిలవడం గమనార్హం! ఐటీ, ఫార్మా దన్ను కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సెన్సెక్స్ విలువకు రూ. 4.67 ట్రిలియన్లను జమ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఈ బాటలో ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కలసికట్టుగా రూ. 5.08 ట్రిలియన్ల విలువను అందించాయి. ఇక ఫార్మా దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, దివీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోకాన్ రూ. 2 ట్రిలియన్లను సమకూర్చగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ రూ. 1.75 ట్రిలియన్లతో సహకరించాయి. న్యూ లిస్టింగ్స్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఆరు కంపెనీల నుంచి సెన్సెక్స్ మార్కెట్ క్యాప్‌నకు రూ. 1.01 ట్రిలియన్లు జమయ్యింది. వీటిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో 177 స్టాక్స్ జనవరి 17 స్థాయిలను అధిగమించగా.. 19 షేర్ల మార్కెట్ విలువలో సగానికిపైగా క్షీణించింది. జాబితాలో ఇండస్ఇండ్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఫ్యూచర్ రిటైల్, స్పైస్‌జెట్ తదితరాలు చేరాయి. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
రోమ్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం ముగిసిన ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీకి ముందు రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ 35 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో నాదల్‌ను వెనక్కి నెట్టి జొకోవిచ్ 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7–5, 6–3తో విజయం సాధించాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 2,05,200 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్లలో కూడా ఈ సెర్బియా స్టార్ విజేతగా నిలిచాడు. చాంప్ హలెప్... ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ప్లిస్కోవా తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. విజేత హలెప్‌కు 2,05,190 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కాయి. -
మరో మైలురాయి అధిగమించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను మోదీ అందుకున్నారు. అటల్ బిహార్ వాజ్‌పేయి పలుమార్లు ప్రధానిగా 2268 రోజులు వ్యవహరించగా మోదీ ఆ రికార్డును చెరిపివేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు అత్యున్నత పదవిని చేపట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు సాధించారు. ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశానికి దిశానిర్ధేశం చేశారు. ఆపై మన్మోహన్ సింగ్ వరుసగా ఐదేళ్లపాటు రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఇక మరో రెండు రోజుల్లో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీలే కావడం గమనార్హం. చదవండి : నిజాయితీగా పన్ను చెల్లించేవారికి లబ్ధి : మోదీ -
ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియా కొత్త రికార్డు
క్రైస్ట్‌చర్చి : ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే టీమిండియాపై 3-0 తేడాతో వన్డే సిరీస్, 10 వికెట్ల తేడాతో తొలి టెస్టును కైవసం చేసుకొన్న కివీస్ రెండో టెస్టులోనూ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు టెస్టు చాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి తర్వాత కనీసం రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. అయితే రెండో టెస్టు జరగనున్న క్రైస్ట్‌చర్చి నగరంలోనే రెండు మైదానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎంఐ స్టేడియం కాగా మరొకటి హెగ్లే ఓవల్ స్టేడియం ఉన్నాయి. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) టీమిండియా ఇప్పటివరకు ఏఎంఐ స్టేడియంలో నాలుగు టెస్టులు ఆడగా రెండు ఓటమిపాలై రెండు డ్రాగా ముగించింది. కాగా హెగ్లే ఓవల్ మైదానంలో మాత్రం ఇంతవరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శనివారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు తొలి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే క్రైస్ట్‌చర్చిలో తొలి విజయంతో పాటు టీమిండియా పేరిట కొత్త రికార్డు నమోదవుతుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇక్కడ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలుచుకొని, ఒక మ్యాచ్‌లో ఓటమి చెంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. (టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం) (‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’) -
హైదరాబాద్ మెట్రోరైలు ఆల్‌టైమ్ రికార్డు
-
టీమిండియా సరికొత్త రికార్డు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టి20లో ‘సూపర్’ విజయం సాధించిన టీమిండియా కొత్త రికార్డు సృష్టించింది. టి20 చరిత్రలో ‘సూపర్’ రికార్డును తిరగరాసింది. సూపర్ ఓవర్లో ఛేజింగ్ చేస్తూ వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు లిఖించింది. ఇంతకుముందు వెస్టిండీస్ పేరిట రికార్డును బద్దలు కొట్టింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా సూపర్ ఓవర్లో ముందుగా కివీస్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ‘హిట్‌మాన్’ రోహిత్ శర్మ చివరి రెండు బంతులకు వరుస సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. కాగా, ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురుకావడం గమనార్హం. (చదవండి: ఊహించని ప్రదర్శన.. అద్భుత విజయం) ‘సూపర్’ విశేషాలు.. ►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేయగా, నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం. ►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు. చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు -
టి20ల్లో థాయ్ అమ్మాయిల ప్రపంచ రికార్డు
దుబాయ్: థాయ్‌లాండ్ మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. వరుసగా 17వ విజయంతో ఆసీస్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న నాలుగు దేశాల టి20 టోర్నీలో థాయ్ జట్టు ఆతిథ్య జట్టును 54 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్పలక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలోనే ఛేదించింది. ఇది థాయ్‌లాండ్ అమ్మాయిలకు వరుసగా 17వ విజయం. ఈ నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ మిగతా జట్లు... కాగా గత ఏడాది జూలైలో యూఏఈని ఓడించడం ద్వారా థాయ్‌లాండ్ జైత్రయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు ఆసీస్ మహిళలు 2014–15 సీజన్లో 16 వరుస విజయాలతో రికార్డు సృష్టించగా ఇప్పుడు థాయ్ జట్టు ఆ రికార్డును చెరిపేసింది. అత్యధిక వరుస విజయాల జాబితాలో థాయ్, ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, జింబాబ్వే మహిళల జట్లు 14 విజయాలతో నిలువగా, న్యూజిలాండ్ 12 విజయాలతో టాప్–5లో ఉంది. -
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడీ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. దీంతో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. 2011లో డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ఆడిన సంగక్కర 19 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019లో బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ కూడా 19 డిసిమిసల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీతో ఆదివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండు అద్భుత క్యాచ్‌లు పట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ కీపింగ్‌లో మాత్రం మెరిశాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టి క్లాసెన్, గురుకీరత్ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతేడాది ఐపీఎల్లో కూడా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్(684)గా నిలిచాడు. -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
జపాన్ ప్రధాని షింజో అబే కొత్త రికార్డు
-
భారత షూటర్ల కొత్త చరిత్ర
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో పదహారేళ్ల విజయ్‌వీర్ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. టీమ్ విభాగంలో విజయ్‌వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్‌ప్రీత్ సింగ్, విజయ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు. -
ఎం అండ్ ఎం సరికొత్త రికార్డు
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డును సాధించింది. మంగళవారం నాటి లాభాలతో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్లో చేరింది. వాతావరణ శాఖ అందించిన సాధారణ వర్షపాత అంచనాలు ( 97 శాతం వర్షపాతం) ఎం అండ్ ఎండ్ షేర్‌కు పాజిటివ్ సంకేతాలను అందించాయి. దీంతో ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడింది. ట్రాక్టర్ల దిగ్గజం ఎం అండ్ ఎం కౌంటర్లో కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. వెరసి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) నిన్నటి రూ .99,605 కోట్ల నుంచి ,225.32 కోట్ల రూపాయల మేర పెరిగి రూ .1,01,829.91 కోట్లకు చేరింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా కంపెనీ తాజాగా 30వ ర్యాంకును అందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ. 812 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 819 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు సైతం చేరువైంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ డీవీఆర్లతో కలిపి రూ. 1.08 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్చిలో వాహన విక్రయాలు 10 శాతం పుంజుకున్న నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఈ నెలలో 9 శాతం లాభపడింది. -
ఒక్కరోజు.. 11 వాయిదాలు!
న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించింది. నిరసనలతోపాటు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా బుధవారం ఒక్కరోజే 11 సార్లు వాయిదా పడింది. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు–2013పై చర్చ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య వివాదంతో రికార్డు స్థాయిలో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11గంటలకు సమావేశమైన రాజ్యసభ 20 నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనా.. సభలో నిరసనలు కొనసాగటంతో మూడు గంటల వ్యవధిలోనే మరో 10 సార్లు వాయిదా పడింది. దేశ ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని.. అయితే ప్రభుత్వమే చర్చ జరగకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. -
సురేశ్ రైనా అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిదహాస్ ట్రోఫిలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో సిక్సు బాది అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో భారత ఆటగాడిగా కొనసాగుతున్న రైనా తాజా సిక్సుతో 50 సిక్సుల ఘనతను సొంతం చేసుకున్నాడు. 27 బంతుల్లో 28 పరుగులు చేసిన రైనా ఇందులో ఒక ఫోరు, సిక్సు బాదాడు. భారత ఆటగాళ్లలో 74 సిక్సులతో యువరాజ్ తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(69) సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్ జాబితాలో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం
సాక్షి, స్పోర్ట్స్ : మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. విదర్భ జట్టు మీడియం పేస్ బౌలర్ కోమల్ జన్జాద్ బంతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎనిమిది పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చారు. గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొంది. మొత్తం 9.4 ఓవర్లలో 5 మెయిడెన్లు కాగా.. 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. కోమల్ దెబ్బకు హరియాణా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హరియాణా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. 32 పరుగుల్లో ఓపెనర్ ఎల్ఎం ఇనామ్దార్ 30 పరుగులు(18 బంతుల్లో ఏడు ఫోర్లు) సాధించగా.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ ఉమన్ రెండు పరుగులు సాధించారు.