న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కార్గో పరిమాణంలో సరికొత్త రికార్డు సాధించింది. 33.9 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధికాగా.. తద్వారా అత్యధిక పోర్ట్ కార్గోను నమోదు చేసింది.
(ఇది కూడా చదవండి: సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?)
కంపెనీ వివరాల ప్రకారం గత నెల(మార్చి)లోనే 9.5 శాతం అధికంగా 3.2 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. 2022 జులై తదుపరి కార్గో పరిమాణంలో తొలిసారి 3 కోట్ల టన్నుల మార్క్‌ను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దేశీ కార్గో పరిమాణంలో మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తున్నట్లు అదానీ పోర్ట్స్ తెలియజేసింది. (ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు)
పశ్చిమ తీరప్రాంతంలో ఆరు, తూర్పుతీరంలో ఐదు పోర్టులను కలిగి ఉన్న కంపెనీ మరిన్ని పోర్టులను జత చేసు కుంటోంది. తద్వారా అతిపెద్ద పోర్టుల నిర్వాహక కంపెనీగా నిలుస్తోంది. ఈ బాటలో ఈ వారం మొదట్లో కరైకాల్ పోర్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11 పోర్టులతో మొత్తం కార్గో పరిమాణంలో 25 శాతాన్ని హ్యాండిల్ చేస్తోంది. శ్రీలంకలోని కొలంబో, కేరళలోని విజింజంలో ట్రాన్షిప్‌మెంట్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment