Cargo Services
-
కార్గోలో అదానీ పోర్ట్స్ రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కార్గో పరిమాణంలో సరికొత్త రికార్డు సాధించింది. 33.9 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధికాగా.. తద్వారా అత్యధిక పోర్ట్ కార్గోను నమోదు చేసింది. (ఇది కూడా చదవండి: సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కంపెనీ వివరాల ప్రకారం గత నెల(మార్చి)లోనే 9.5 శాతం అధికంగా 3.2 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. 2022 జులై తదుపరి కార్గో పరిమాణంలో తొలిసారి 3 కోట్ల టన్నుల మార్క్‌ను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దేశీ కార్గో పరిమాణంలో మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తున్నట్లు అదానీ పోర్ట్స్ తెలియజేసింది. (ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు) పశ్చిమ తీరప్రాంతంలో ఆరు, తూర్పుతీరంలో ఐదు పోర్టులను కలిగి ఉన్న కంపెనీ మరిన్ని పోర్టులను జత చేసు కుంటోంది. తద్వారా అతిపెద్ద పోర్టుల నిర్వాహక కంపెనీగా నిలుస్తోంది. ఈ బాటలో ఈ వారం మొదట్లో కరైకాల్ పోర్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11 పోర్టులతో మొత్తం కార్గో పరిమాణంలో 25 శాతాన్ని హ్యాండిల్ చేస్తోంది. శ్రీలంకలోని కొలంబో, కేరళలోని విజింజంలో ట్రాన్షిప్మెంట్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. -
ఆదాయం బాటలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి. కార్గో సేవలతో ఊపు ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయవాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా. ఇతర ఆదాయ వనరుల ద్వారా.. అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచిపెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది. -
ఆర్టీసీ కార్గో రికార్డు రాబడి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) కార్గో రవాణా సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. సత్వరం డోర్ డెలివరీ సౌలభ్యంతో ప్రవేశపెట్టిన కార్గో రవాణా సేవల ద్వారా ఆర్టీసీ రికార్డుస్థాయిలో రాబడి సాధిస్తోంది. 2022లో ఏకంగా రూ.122.33 కోట్ల రాబడి సాధించి రికార్డు సృష్టించింది. 2021 కంటే ఇది 30 శాతం అధికం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ 2021–22లో కార్గో రవాణా ద్వారా రూ.122.19 కోట్ల రాబడి సాధించింది. 2022–23లో డిసెంబర్ 25 నాటికే రూ.122.33 కోట్ల రాబడి సాధించడం విశేషం. ఆర్థిక సంవత్సరం ఇంకా మూడునెలలు ఉండటంతో ఈ రాబడి రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2022లో కార్గో రవాణా రాబడిలో తిరుపతి కేంద్రంగా ఉన్న జోన్–4 అత్యధికంగా రూ.34.28 కోట్లు సాధించింది. రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహిస్తున్న 329 బస్స్టేషన్లలో.. 249 బస్స్టేషన్ల నుంచి కార్గో సేవలను అందిస్తోంది. బస్స్టేషన్ల వద్ద కాకుండా ఇతర ప్రదేశాల్లో ఆర్టీసీకి 525 మంది పార్సిల్ బుకింగ్ ఏజెంట్లను నియమించింది. మరోవైపు డోర్ డెలివరీ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. దీంతో ఆర్టీసీ కార్గో రవాణా సేవలకు సానుకూల స్పందన లభిస్తోంది. -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం) -
ఆర్టీసీ కార్గో విస్తరణకు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పార్సిల్, కార్గో విభాగాన్ని భారీగా విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించటంతో ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 18 వేల పార్సిళ్లను తరలిస్తూ రూ.25 లక్షల మేర ఆదాయాన్ని పొందుతోంది. ప్రస్తుతం దీనిని రూ.కోటికి పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని తెలిసింది. దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్సిళ్లను తరలించేలా పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో తపాలా శాఖ, రైల్వేలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని బహుళజాతి కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్వర్క్ ఉంది. ఈ ప్రాంతాల్లో సరుకుల తరలింపు బాధ్యతను ఆర్టీసీ సునాయాసంగా చేపడుతుంది. ఇక రాష్ట్రం వెలుపల నెట్వర్క్ లేని ప్రాంతాల్లో తాను ఆర్డర్లు తీసుకుని, పార్సిళ్ల తరలింపు ఇతర సంస్థలకు అప్పగిస్తుంది. ఇలా ఇతర సంస్థల సహకారంతో రోజువారీ ఆదాయం రూ.కోటికి చేరేలా వ్యాపారాన్ని వృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసుగా ఉన్న పేరును టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్‌గా మార్చింది. మరోవైపు ప్రత్యేకంగా వస్తువులు తయారయ్యే ప్రాంతాల నుంచి వాటిని డోర్ డెలివరీ చేసే పనిపై కూడా దృష్టి సారించింది. లాజిస్టిక్స్ విభాగం బిజినెస్ హెడ్ బదిలీ.. ఈ విభాగం బిజినెస్ హెడ్‌గా ఉన్న జీవన్ ప్రసాద్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బదిలీ చేశారు. ఆయనను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్‌గా పంపించారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంఈ (ఓఅండ్‌పీ)గా ఉన్న పి.సంతోష్‌కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. -
ప్రత్యేక కంపెనీగా స్పైస్‌ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను విడదీయనున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్‌జెట్ తెలియజేసింది. తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్‌జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది. -
APSRTC: చౌకగా ఆర్టీసీ కార్గో సేవలు.. పెరుగుతున్న ఆదరణ
ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ప్రయాణం సురక్షితంగా.. సుఖవంతంగా సాగుతుందన్న భరోసా. ఇప్పుడు కార్గో సేవల్లోనూ ఆ సంస్థ అధికారులు అదే మంత్రాన్ని పఠిస్తున్నారు. సరుకులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. చౌకగా రవాణా సేవలు అందిస్తున్నారు. అందుకే... ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సుస్థిర ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. దీనికి పార్వతీపురం మన్యం జిల్లాలో కార్గో సేవలతో ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయమే నిదర్శనం. పార్వతీపురం టౌన్: ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. సరకు రవాణా పెరుగుతుండడంతో సంస్థకు అదనపు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో కార్గో ఆదాయం గతేడాది కంటే పెరిగింది. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో సురక్షితంగా సేవలందుతుండడంతో వినియోగదారులు కార్గోపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. చౌకగా రవాణా.. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తదితరవి తక్కువ చార్జీలతో రవాణా చేస్తుండడంతో ఆర్టీసీ కార్గోసేవలు వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. జిల్లాలో కార్గో సేవల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.90లక్షల ఆదాయం సమకూరింది. పార్సిల్స్, కొరియర్ కవర్లు రవాణా చేయడంతో ఈ ఆదాయాన్ని సముపార్జించింది. రోజూ సుమారు మూడు డిపోల ద్వారా 90 పార్సిళ్లు ఉంటున్నాయి. పార్సిళ్లను జిల్లాలో అయితే సుమారు 8 గంటల్లోపు, రాష్ట్రంలో అయితే 24 గంటల్లోపు గమ్య స్థానాలకు చేర్చుతోంది. 2021–22లో సరుకు రవాణాతో రూ.1.16 కోట్ల ఆదాయం ఆర్జించింది. యువతకు ఉపాధి.. కార్గో సేవలతో ఓ వైపు ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. జిల్లాలో ని 3 డిపోల నుంచి సరకు రవాణా చేయడమే కాకుండా పార్వతీపురం డిపోకు అనుసంధానంగా బొబ్బిలి బస్టాండ్‌లో కార్గో పాయింట్లలో ఆరుగురు, సాలూరు డిపోలో ఆరుగురు, పాలకొండలో ఆరుగురు మొత్తం 18 మంది ఏజెంట్లను నియమించింది. వారికి కార్గో వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది. 180 మంది కళాసీలకు పని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన మరింతమంది నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఏజెన్సీలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా కేవలం సరకు బుకింగ్, డెలివరీ సదుపాయాలే కాకుండా ఆర్టీసీ బస్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రూ.10వేలు డిపాజిట్‌గా, మిగిలిన ప్రాంతాల్లో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఏజెన్సీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నమ్మకంతో రవాణా ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగింది. అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఆదాయం గణనీయంగా వృద్ధిచెందింది. వ్యాపారులకు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు వారి సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం -
ఇంటికెళ్లి.. మామిడిపండ్లు అందించి..
నిజాంపేట్: విశ్వసనీయతకు మారుపేరైన టీఎస్ ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ సేవలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదటి మ్యాంగో ప్యాకెట్‌ను బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎన్‌జేఆర్ సుఖీ–9లో నివాసముంటున్న మల్లిపూడి కిరణ్‌రాజ్, హేమలత దంపతుల గృహానికి సజ్జనార్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రసిద్ధి చెందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను అందిస్తున్నామని, కొనుగోలు దారులు 5 కిలోలకు తక్కువ కాకుండా ఆన్లైన్ (tsrtcparcel.in)లో బుక్ చేసుకుంటే 4 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌లో 12 వేల మంది మామిడి పండ్లను బుక్ చేసుకున్నారని చెప్పారు. -
టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఏస్ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈవోజెన్ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. చదవండి👉తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..! -
ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి
సాక్షి, హైదరాబాద్: మేలు రకం బంగినపల్లి మామిడి పండ్లు కావాలా.. అయితే ఆర్టీసీకి ఆర్డరివ్వండి.. మీ ఇంటికే వచ్చేస్తాయి. తెలంగాణలో బంగినపల్లి మామిడికి జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాలు ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోని రైతులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి తోటల్లో పండిన మేలు రకం పండ్లను కోరిన వారి ఇంటికి చేర్చే పని ఆర్టీసీ కార్గో విభాగం ప్రారంభించింది. ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించి.. మామిడి పండ్లంటే ఎంతో ఇష్టమున్నా.. కార్బైడ్ లాంటి నిషిద్ధ రసాయనాలతో బలవంతంగా మగ్గించిన పండ్లే ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంటుండటంతో వాటిని తినేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇలాంటి భయాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించిన బంగినపల్లి మామిడి పండ్లనే సరఫరా చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే కనీసం ఐదు కిలోలకు తగ్గకుండా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. 5, 10, 15, 20 కిలోలు.. ఇలా టన్నుల్లో ఆర్డర్ ఇచ్చినా సరఫరా చేస్తామని కార్గో విభాగం చెప్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఆర్టీసీపీఏఆర్సీఈఎల్.ఇన్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి సరిపడా నగదు చెల్లిస్తే ఆర్డర్ ఇచ్చిన ఏడో రోజు నాటికి పండ్లతో కూడిన పార్శిల్ బాక్సులను చిరునామాకు తీసుకొచ్చి అందిస్తామని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు పేర్కొంటున్నారు. 5 కిలోలకు రూ.581, 10 కేజీలకు రూ.1,162, 15 కిలోలకు రూ.1,743, 500 కేజీలకు రూ.58,075 చొప్పున ధర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ కార్గో విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. మధురమైన బంగినపల్లి మామిడిని ఎలాంటి ప్రయాస లేకుండా సులభంగా ఆర్టీసీ కార్గో విభాగం ద్వారా ఇంటికే తెప్పించుకోవాలని, తద్వారా వాటిని పండించే రైతులను ప్రోత్సహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. కావాల్సిన వారు 040–23450033/ 040–69440000 టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
రైల్వే–ఆర్టీసీ కలసి సరుకు రవాణా!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ–రైల్వేలు కలసి సరుకు రవాణా దిశగా అడుగులు వేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగం ఏర్పడ్డా, ఇంతకాలం పెద్దగా ఆదాయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో మార్చి ఆదాయాన్ని పెంచేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే కార్గో విభాగానికి జీవన్‌ప్రసాద్ అధికారిని బిజెనెస్ హెడ్‌గా నియమించారు. ఇటీవలే కర్ణాటకలో, అక్కడి ఆర్టీసీ కార్గో విభాగం పని తీరును పరిశీలించి వచ్చిన ఆయన, తాజాగా రైల్వేతో అనుసంధానంపై కసరత్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ విద్యాధర్‌రావుతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్గో బిజినెస్ హెడ్ జీవన్‌ప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఈ మేరకు రైల్వే–ఆర్టీసీ సరుకు రవాణా అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏంటీ ఆలోచన...: కొంతకాలంగా సరుకు రవాణాను మరింత పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈమేరకు వివిధ సం స్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీతో కూడా ఒప్పందంపై యోచిస్తోంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్ల వరకు సరుకును బుక్ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇది పెద్ద లోటుగా ఉంది. దీనిని ఆర్టీసీ భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపారకేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును సేకరిస్తారు. అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. సరుకును నిర్ధారిత రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైల్వే సిబ్బందికి అప్పగిస్తారు. దీనివల్ల సరుకు బుక్ చేసుకున్న వారికి దాన్ని స్టేషన్ వరకు తరలించే భారం తప్పుతుంది. ఆ బాధ్యతను తీసుకున్నందుకు ఆర్టీసీ తన వంతు చార్జీలు తీసుకుంటుంది. దీనివల్ల రైల్వేకు సరుకు రవాణా పార్శిళ్ల సంఖ్య పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీకి కూడా భారీ డిమాండ్ వస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఇక ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో బుకింగ్
సాక్షి, అమరావతి: ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కొరియర్, కార్గో బుకింగ్ చేయాలంటే ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సు వద్దకే వెళ్లి కొరియర్, కార్గో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్ సేవలు అందిస్తున్నది. రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఆర్జిస్తోంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలన్నది ఆర్టీసీ ప్రణాళిక. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది. ఇకనుంచి ఖాతాదారులు సంబంధిత బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్ వద్దే పార్సిల్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం కలిగించనుంది. బుకింగ్ చేసుకున్న తరువాత సత్వరమే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. ఇందుకోసం టిమ్ మెషిన్ల ద్వారా కొరియర్ బుకింగ్ చేయడం, రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కొరియర్ బుకింగ్ మొత్తాన్ని టికెట్ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా.. విడిగా నమోదు చేస్తారు. కొరియర్ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొదటగా గుంటూరు జిల్లా ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభిస్తామని, అనంతరం నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
మేడారం వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి కార్గో పార్శల్ సర్వీసులు.. ఎప్పటినుంచంటే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. కోరుకుంటే మొక్కు బంగారాన్ని మేడారం చేర్చి అమ్మ వారికి సమర్పించనుంది. మేడారంలో సమక్క-సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్తనందించింది. మేడారం వెళ్లి మొక్కు చెల్లించలేని వారికి ఆర్టీసీ కార్గో ద్వారా పార్శల్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. దేవాదాయ శాఖ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఈ కార్యక్రమానికి నాంది పలికింది. మేడారం జాతర సందర్భంగా ‘బంగారం పంపించడం మీ వంతు. అమ్మ వారికి సమర్పించడం మా తంతు" అనే నినాదంతో ఆర్టీసీ ఈ సేవల్ని ప్రారంభిస్తోంది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు. అంతేగాక అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బస్ స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫోటోకూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చన్నారు. #TSRTC & TS దేవాదాయ శాఖ సహకారంతో పవిత్ర కార్యానికి నాంది. #Medaram లో సమక్క-సారక్క అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకున్నారా? అయితే, అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించలేకపోతున్నారా ? దిగులెందుకు, #TSRTC Cargo & Parcel Services ఉండగా. #MedaramPrasadamWithTSRTC @TSRTCHQ @TribalArmy pic.twitter.com/Hq9OPXV4on — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 7, 2022 -
ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను లాంచ్ చేసిన మెజెంటా!
ప్రముఖ భారతీయ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్(CPO) కంపెనీ అయిన మెజెంటా(Magenta), ఒమేగా సైకి (Omega Seiki) మొబిలిటీ భాగస్వామ్యంతో బెంగళూరులో తన ఎలక్ట్రిక్ వెహికల్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ బ్రాండ్ క్రింద 100 ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. తమ "ఛార్జ్‌గ్రిడ్" బ్రాండ్ క్రింద ప్రత్యేకమైన ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్న మెజెంటా ఈ సంవత్సరం ప్రారంభంలో " ఎలక్ట్రిక్ వెహికల్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్(EVET)" బ్రాండ్ క్రింద తమ ఈ-మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. మెజెంటా ఇప్పటికే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి 110 ఎలక్ట్రిక్ కార్గో రవాణా సేవలను నిర్వహిస్తోంది. మెజెంటా ఈవీఈటీ అధికారికంగా ఫ్లీట్ యాజ్ ఎ సర్వీస్ అందించనున్నట్లు తెలిపింది. గత నెలలో 150 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను మెజెంటా బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో లాజిస్టికల్ అడ్డంకులను తగ్గించాలని, లాస్ట్ మైల్ డిస్ట్రిబ్యూషన్ సేవలకు సమగ్ర పరిష్కారాలను అందించాలని మెజెంటా భావిస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఫ్లీట్‌ను ఒక సేవగా అందించడం, వాణిజ్య వాహనాల ఆపరేటర్ల కోసం మెజెంటా స్మార్ట్ ఛార్జింగ్ సేవలను, ఓవర్‌నైట్ పార్కింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ సేవల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. (చదవండి: చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!) -
TSRTC: ‘చింత ఎందుకు దండగ’ అంటున్న సజ్జనార్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్గో సేవలను మరింత విస్తరిస్తూ లాభాలలో దూసుకుపోతుంది. కార్గో ద్వారా ఇప్పటికే రైతుల పంట ఉత్పత్తులను కల్లాల నుంచే నేరుగా మార్కెట్‌కు రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. అతితక్కువ ధరకే రైతు ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తూ.. సంస్థకూ ఆదాయం సమకూర్చుకుంటుంది. కార్గో ద్వారా తక్కువ ఖర్చుతోనే సరుకును రవాణా చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేగాక రైతు కల్లాల నుంచే పంట ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా రైతులకు దళారుల బెడద తప్పుతుంది. నేరుగా మార్కెట్‌కు తరలించడంతో గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. చదవండి: ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ కాగా ఇటీవల వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరవేస్తున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికులకు నచ్చడంతోపాటు పాటు ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ వినూత్న వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీఆఎస్ఆర్టీసీ కార్గో సదుపాయం ఉండగా.. చింత అవసరం లేదని ట్విటర్లో పేర్కొన్నారు. ‘సరసమైన ధరలకే రైతు చెంతకే కార్గో సదుపాయం ఉంది, రైతే రాజు, అన్నదాత సుఖీభవ. టీఆఎస్ఆర్టీసీ రైతు నేస్తం. జై జవాన్! జై కిసాన్!!’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రైతులనే కాకుండా నెటిజన్లందరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆర్టీసీ అభివృద్ధి కోసం సజ్జనార్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు. చింత ఎందుకు దండగ #TSRTC కార్గో సదుపాయం ఉండగా సరసమైన ధరలకే రైతు చెంతకే కార్గో సదుపాయం, రైతే రాజు, అన్నదాత #సుఖీభవ #TSRTC రైతు నేస్తం. జై జవాన్! జై కిసాన్!!#IchooseTSRTC #farming #Sukhibhava #tuesdayvibe #tuesdaymotivations @puvvada_ajay @Govardhan_MLA @SingireddyTRS @AgriGoI pic.twitter.com/QELgptOISE — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 9, 2021 -
సత్ఫాలితాలిస్తోన్న కార్గో సర్వీసులు
-
ఇంటికే ఆర్టీసీ కార్గో.. యాప్ వచ్చేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: కార్గో సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. కార్గో సేవల బుకింగ్ కోసం వారం, పదిరోజుల్లో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఇక ఇంటి వద్ద నుంచే కార్గో సేవలను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజసంస్థలు అందజేస్తున్న తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో కార్గో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి సేవలను విస్తృతపరచనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వినియోగదారులు తమ పార్శిళ్ల కోసం బస్స్టేషన్లకు, ఆర్టీసీ పార్శిల్ కేంద్రాలకు పరుగెత్తాల్సిన పరిస్థితి ఇక ఉండదు. బుకింగ్‌ల కోసం కూడా బస్స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడదు. యాప్‌తో మరింత చేరువ ఇప్పటివరకు 15 లక్షలకుపైగా పార్శిళ్లను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తరలించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచి 60 శాతానికిపైగా పార్సిళ్లు్ల తెలంగాణ జిల్లాలకు, ఏపీలోని వివి ధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇప్పటికీ వినియోగదారులే తాము పంపించాల్సిన వస్తువులను సమీప బస్స్టేషన్ల వరకు తీసు కొస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు కొంతమేర భారంగానే ఉంది. దీంతో వినియోగదారులు ఇంటి నుంచి బస్స్టేషన్ల వరకు వెళ్లడాన్ని అదనపు ఖర్చుగా భావిస్తున్నారు. ‘‘ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్గోకు, వినియోగదారులకు మధ్య మరో సంస్థను అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం. ఈ సంస్థ వినియోగదారుల నుంచి సేకరించిన వస్తువులను ఆర్టీసీ కార్గోకు అందజేస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కార్గోకు వచ్చిన వస్తువులను తిరిగి వినియోగదారుల ఇళ్ల వద్ద అందజేస్తుంది’’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 150 బస్సుల ద్వారా కార్గో సేవలను అందిస్తున్నారు. -
ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..
-
ఇక ఇంటికే ఆర్టీసీ పార్సిళ్లు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ తమ సేవల పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. లాజిస్టిక్స్ సేవల ద్వారా ఆదాయ పెంపుదలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. రోజుకు రూ.50 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 2017 నుంచి ఆర్టీసీ అందిస్తోన్న కార్గో రవాణా సేవల విధానం ప్రకారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు వచ్చి పార్సిల్ బుక్ చేసుకుంటే గమ్య స్థానానికి చేరుస్తుంది. అక్కడ సంబంధిత వ్యక్తులు వచ్చి ఆ పార్సిళ్లను తీసుకువెళ్లాలి. కాగా కార్గో రవాణా పార్సిళ్లను గమ్యస్థానంలో డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెడితే మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చని ఆర్టీసీ భావించింది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోలు, ఇతర వ్యవస్థాగత సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కార్గో రవాణా కోసం ఆర్టీసీ 10 టన్నుల బరువు సామర్థ్యం ఉన్న కంటైనర్లను ఉపయోగిస్తోంది. ఈ వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు సంస్థల కంటే ఆర్టీసీ తక్కువ చార్జీలతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. అందుకే కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలపై మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి ఓ ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. ప్రైవేటు సంస్థల కంటే మెరుగ్గా... కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆర్టీసీ బస్ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇక పార్సిళ్లకు ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్ చేసిన పార్సిల్ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్సిల్ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు కూడా ఏజంట్ల ద్వారా డోర్ డెలివరీ సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. రోజుకు రూ.50 లక్షల రాబడి లక్ష్యం లాజిస్టిక్ సేవల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. కార్గో రవాణా ద్వారా ఆర్టీసీకి 2019–20లో రూ.97.44 కోట్ల రాబడి వచ్చింది. లాక్డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్ సేవల ద్వారా రూ.87.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో పార్సిల్ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం రోజుకు సగటున 18 వేల పార్సిల్ బుకింగుల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షల రాబడి వస్తోంది. కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు ప్రవేశపెట్టడం ద్వారా పార్సిల్ బుకింగులను రోజుకు 32 వేలకు పెంచుకోవాలని...తద్వారా రోజుకు రూ.50 లక్షల రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. -
పోర్టుల్లో సరుకు రవాణా డీలా
న్యూఢిల్లీ: గత నెలలోనూ దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రధాన నౌకాశ్రయాలలో సరుకు రవాణా తగ్గింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య కాలంలో 12 ప్రధాన పోర్టులలో కార్గో ట్రాఫిక్ దాదాపు 7 శాతం క్షీణించింది. 600.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో 643 ఎంటీకిపైగా సరుకు రవాణా నమోదైంది. దేశీ పోర్టుల అసోసియేషన్(ఐపీఏ) రూపొందించిన తాజా నివేదిక వెల్లడించిన వివరాలివి. పారదీప్, మార్మగోవా మినహా మిగిలిన పోర్టులన్నీ కార్గో ట్రాఫిక్‌లో వెనకడుగు వేశాయి. పారదీప్‌లో 0.3 శాతం పుంజుకుని దాదాపు 103 ఎంటీకీ చేరగా.. 31 శాతం వృద్ధితో మార్మగోవా 19.3 ఎంటీ సరుకును హ్యాండిల్ చేసింది. ప్రధానంగా ఎన్నోర్‌లోని కామరాజార్ పోర్ట్ సరుకు రవాణా 23.3 శాతం తక్కువగా 22.23 ఎంటీకి పరిమితంకాగా.. ముంబై, వీవో చిదంబరనార్‌లోనూ 12 శాతం చొప్పున ట్రాఫిక్ తగ్గింది. ఈ బాటలో కొచిన్, చెన్నై పోర్టు 10 శాతం వెనకడుగు వేయగా.. జేఎన్పీటీ 8 శాతం, దీన్‌దయాళ్(కాండ్లా) పోర్ట్, కోల్‌కతా(హాల్దియా) 6 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి. ఇదేవిధంగా న్యూమంగళూరు 5.3 శాతం, విశాఖపట్టణం 4.9 శాతం తక్కువగా కార్గోను హ్యాండిల్ చేశాయి. కాగా.. కోవిడ్–19 నేపథ్యంలో వరుసగా 11వ నెలలో అంటే ఫిబ్రవరిలో సైతం సరుకు రవాణా బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. గత 11 నెలల్లో ప్రధానంగా కంటెయినర్ల హ్యాండ్లింగ్ తగ్గిపోవడంతోపాటు.. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర కమోడిటీల కార్గో భారీగా క్షీణించినట్లు తెలియజేసింది. -
హోం డెలివరీ బై ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా జంట నగరాల్లో సరుకుల హోం డెలివరీ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే ఏ ప్రాంతం నుంచైనా సరుకులు, పార్శిళ్లను నగరంలో సంబంధిత ఇళ్లకు చేరవేయడానికి అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆర్టీసీ కార్గో విభాగం హోం డెలివరీలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్, స్మార్ట్‌యాప్ లాజిస్టిక్స్, అడ్నిగమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలకోసం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఏజెంట్లను నియమించుకోవటం విశేషం. హోం డెలివరీ చార్జీలు ఇలా.. 10 కేజీల వరకు రూ.80, 11 కేజీల నుంచి 30 కేజీల వరకు రూ.150, 31 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.225, 51 కేజీల నుంచి 100 కేజీల వరకు రూ.300, 101 కేజీలను మించితే అదనపు ప్రతి కిలోకి రూ.2 చొప్పున చార్జీ్జ చేస్తారు. పార్సిల్ కవర్ల ధరలు.. 500 గ్రాముల వరకు రూ.30, 501 నుంచి వేయి గ్రాముల వరకు రూ.50 వసూలు చేస్తారు. -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలను బుధవారం వరుసగా ఏడోరోజు రైతులు దిగ్బంధించారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఢిల్లీ–నోయిడా మార్గాన్ని అధికారులు మూసేశారు. ఢిల్లీ–హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీల వద్ద ట్రాఫిక్‌ను నిలిపేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్లను అంగీకరించేంతవరకు నిరసన కొనసాగుతుందని రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి. ప్రభుత్వంతో మరో విడత చర్చలను నేడు రైతులు జరప నున్న విషయం తెలిసిందే. రైతుల నిరసనలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సూటు, బూటు సర్కారు హయాంలో రైతుల ఆదాయం సగమయిందన్నారు. మరోవైపు, రైతుల నిరసనలకు మద్దతుగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా రవాణా సేవలు నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) హెచ్చరించింది. రైతుల డిమాండ్లను నెరవేర్చనట్లయితే డిసెంబర్ 8 నుంచి రవాణా సేవలు ఆగిపోతాయని స్పష్టం చేసింది. రవాణా(కార్గో, ప్యాసెంజర్) సేవలందించే దాదాపు 95 లక్షల ట్రక్కు యజమానులు, సుమారు 50 లక్షల ట్యాక్సీ, బస్ ఆపరేటర్లకు, ఇతర సంబంధిత వర్గాలకు ఏఐఎంటీసీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘రవాణా సేవలు నిలిచిపోతే ఆహారధాన్యాలు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, పాలు, పళ్లు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల రవాణా ఆగిపోతుంది. ప్రస్తుతం యాపిల్ పళ్ల సీజన్ నడుస్తోంది. రవాణా నిలిచిపోతే అవి పాడైపోతాయి’ అని ఏఐఎంటీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక సమావేశాలు పెట్టండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండ్లను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర మార్గాలను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. గురువారం జరగనున్న చర్చల్లో తమ అభ్యంతరాలను పాయింట్లవారీగా వివరిస్తామన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దూకి సీఎం నివాసం వైపు వెళ్తున్న కార్యకర్తలపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరీందర్ ధిల్లాన్, పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. మంత్రుల చర్చలు ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలను ఏ విధంగా తొలగించాలనే విషయంపై వారు చర్చించారు. సింగూ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో గుమిగూడిన రైతులు -
ప్రధాన పోర్టుల్లో పడిపోయిన రవాణా
న్యూఢిల్లీ: దేశంలోని 12 ప్రధాన నౌకాశ్రయాల్లో (పోర్టులు) కార్గో రద్దీ(నౌకా రవాణా) సెప్టెంబర్ నెలలోనూ క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నౌకా రవాణా (ఏప్రిల్–సెప్టెంబర్) 14 శాతం తగ్గి 298.55 మిలియన్ టన్నులుగా (ఎంటీ) నమోదైంది. ఈ వివరాలను పోర్టుల అసోసియేషన్ (ఐపీఏ) తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 348 ఎంటీల రవాణా నమోదు కావడం గమనార్హం. మార్చి నుంచి నౌకా రవాణా 12 పోర్టుల్లో చెప్పుకోతగినంత పడిపోయిందని, కరోనా వైరస్సే కారణమని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఒక్క మర్ముగావో పోర్ట్ మినహాయించి మిగిలిన ప్రధాన పోర్టులు అన్నింటిలోనూ సెప్టెంబర్ వరకు రవాణా ప్రతికూలంగానే ఉంది. నౌకాశ్రయాల వారీగా పరిశీలిస్తే.. కామరాజర్ పోర్ట్ (ఎన్నోర్)లో రవాణా ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 32 శాతం మేర పడిపోయి 10.77 ఎంటీలుగా ఉంది. అదే విధంగా చెన్నై నౌకాశ్రయంలో 26 శాతం వరకు తగ్గి 18.38 ఎంటీలుగా నమోదైంది. కొచ్చిన్ పోర్టులో 24 శాతం తగ్గి 12.58 ఎంటీలుగా ఉండగా.. జేఎన్ పీటీలో నౌకా రవాణా పరిమాణం 22 శాతం మేర తగ్గి 27 మిలియన్ టన్నులుగా నమోదైంది. కోల్‌కతా పోర్టులో 19 శాతం క్షీణించి 25.56 ఎంటీలుగా, ముంబై పోర్టులో 19 శాతం తగ్గి 24.45 ఎంటీలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహణలోని 12 ప్రధాన పోర్టుల్లో దీనదయాళ్ (కాండ్లా), ముంబై, జేఎన్ పీటీ, మర్ముగావో, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజర్ (ఎన్నోర్), వీవో చిదంబర్ నార్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కతా (హాల్దియా కలిపి) ఉన్నాయి. -
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం సనత్‌నగర్ స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్ స్టేషన్లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సరుకు రవాణా రేక్ మొత్తాన్ని బుక్ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే సదుపాయం రైల్వే కల్పించింది. ఎంత సరుకు లోడ్ అయిందన్న విషయంతో ప్రమేయం లేకుండా నిర్ధారిత సమయాల ఆధారంగా రైలు నడుస్తుంది. ఇంతకాలం చిన్న వ్యాపారులు ఢిల్లీకి సరుకు పంపాలం టే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రైలు అందుబాటులోకి రావటంతో ఖర్చులో 40 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.