
శంషాబాద్ కార్గో టెర్మినల్ రన్‌వే వద్ద ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం
శంషాబాద్: డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యవసర సమయాల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు వినియోగిస్తున్నారు. ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూఆర్–8311 విమానం గురువారం రాత్రి 1.30 గంటలకు వైద్య పరికరాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా.. తిరుగు ప్రయాణంలో 28 టన్నుల నిత్యావసరాల సరుకులతో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి వెళ్లింది. విపత్కర పరిస్థితుల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు ఉపయోగించుకునేలా డీజీసీఏ అనుమతించడం మంచి పరిణామమని విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు.