qatar airways
-
200 వైడ్‌బాడీ జెట్లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ
మిడిల్ ఈస్ట్ ఎయిర్ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్‌బస్ ఏ350ఎస్, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.జులై నెల చివరినాటికి బ్రిటన్‌లో జరగబోయే ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్‌బాడీ జెట్లుగా పేరున్న ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్‌బాడీ జెట్లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఈ డీల్ వివరాలకోసం ఎయిర్‌బస్‌ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్‌బాడీ జెట్లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్‌బర్గ్ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది. -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
ఖతార్ ఎయిర్వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరోయిన్
న్యూఢిల్లీ: దుబాయ్‌కి చెందిన ఖతార్ ఎయిర్వేస్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను తమ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సందర్బంగా ఖతార్‌కు మించింది మరేదీ లేదు అంటూ కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్వెస్ 'ఆంట్ నో బడీ' ప్రచార వీడియోను ట్వీట్ చేసింది. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటిఫుల్ లుక్‌లో దీపికా పడుకొణె మెరిసింది. ప్రీమియం అనుభవంతో, ఎక్సలెన్స్‌కు, లగ్జరీకి పర్యాయపదంగా ఉన్న ఖతార్‌కు దీపిక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమని, ఇందుకు ప్రఖ్యాత నటి దీపికా సరియైన ఎంపిక అంటూ ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హిస్ ఎక్సలెన్సీ అక్బర్ అల్ బేకర్ సంతోషాన్ని ప్రకటించారు. ఖతార్ ఎయిర్వేస్ ఇటీవలే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ అందించే 2022 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో 'ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకోవడం వరుసగా ఇది ఏడోసారి (2011, 2012, 2015, 2017, 2019, 2021 2022). వీటితో పాటు వరల్డ్ బెస్ట్ బిజినెస్ క్లాస్, వరల్డ్ బిజినెస్ క్లాస్ లాంజ్ డైనింగ్, బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అవార్డులను కూడా అందుకుంది. కాగా ఖతార్ఎయిర్వేస్ దోహా హబ్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ ద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150 కంటే ప్రదేశాలకు విమానాల్ని నడుపుతోంది. There's nothing else quite like the luxury of travelling with Qatar Airways ✈️ Introducing our brand-new film featuring our global brand ambassador @deepikapadukone pic.twitter.com/NjAgXInl7v — Qatar Airways (@qatarairways) February 28, 2023 -
సోషల్ మీడియా పైత్యం.. ‘బైకాట్ ఖతర్ ఎయిర్వేస్’..
స్వియ నియంత్రణ. స్వియ నియంత్రణ అని చెవులు చిల్లలు పడేలా మొత్తుకుంటున్నా సోషల్ మీడియాలో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. వాక్ స్వాతంత్రం పేరుతో కొందరు ట్రోలింగ్ పేరుతో మరికొందరు సున్నితమైన అంశాలపై కూడా ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు. వీడియోలు షేర్ చేస్తున్నారు. స్పూఫ్‌లు వండివారుస్తున్నారు. చిత్రంగా ఇలాంటివన్నీ వైరల్‌గా మారిపోతున్నాయ్.. అసలైన అంశాలు పక్కదారి పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహారణ హ్యాష్‌టాగ్ బైకాట్ఖతర్ఎయిర్వేస్ ఉదంతం. కొందరు బీజేపీ నేతలు ఓ మతంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయి. కొన్ని దేశాలు ఇప్పటికే భారత ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తుండగా మరికొన్ని దేశాలు క్షమాపణలకు పట్టుబడుతున్నాయి. పార్టీ చేసిన తప్పుకు దేశం తరఫున క్షమాపణలు చెప్పేది ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పార్టీ నేతలు చేసిన బాధ్యతారాహిత్య వాఖ్యల వల్ల కలుగున్న నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం కిందామీదా అవుతోంది. ఓవైపు దేశ ప్రతిష్టను కాపాడుతూనే విదేశాల్లో ఉన్న భారతీయుల క్షేమం, వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. చాలా సున్నితమైన అంశంలోకి సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా కామెంట్లు చేస్తున్నారు. వాసుదేవ్ అనే ఓ యువ ట్విటర్ యూజర్.. ఓ వీడియో చేశాడు. అందులో భారత ఉత్పత్తులపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ... ఖతార్ ఎయిర్‌వేస్‌ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాడు. అతని వాలకం చూస్తే అతనెప్పుడు విమాన్ ఎక్కినట్టుగా అనిపిండచం లేదు. సాధ్యాసాధ్యాలను మరిచిపోయి ఆవేశంలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. పైగా బాయ్‌కాట్ అనే పదాన్ని కూడా ఇంగ్లీష్‌లో తప్పుగా రాశాడు. వాసుదేవ్ వీడియోను ట్రోల్ చేస్తూ స్పూఫ్ వీడియోను నెట్టింట్లోకి వదిలారు మరికొందరు. అల్‌జజీరా ఛానల్‌కి ఖతార్ ఎయిర్వేస్ సీఈవో అక్బర్ అల్ బకర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూని దీని కోసం వాడుకున్నారు. ఈ స్పూఫ్ వీడియోలో వాసుదేవ్ ఇచ్చిన వార్నింగ్‌కి ఖతర్ సీఈవో భయపడిపోయి గజగజ వణికిపోతున్నాడనే రేంజ్లో స్పూఫ్ వీడియోను రూపొందించారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్‌గా మారింది. అసలు విషయాన్ని పక్కన పెట్టి వాసుదేవ్ వార్నింగ్, దానికి కౌంటర్‌గా వచ్చిన స్పూఫ్ వీడియోపై ఫోకస్ చేస్తున్నారు. The CEO of Qatar airways now gives an interview to Aljazeera on the call for #BycottQatarAirwaysQatar by Vashudev Watch till the end! https://t.co/ezBC8wYcv6 pic.twitter.com/8dkRZsCPHp — Ahad (@AhadunAhad11111) June 7, 2022 సున్నితమైన అంశాలపై ఎలా ముందుకు పోవాలో తెలియక ప్రభుత్వాలే తలలు పట్టుకుంటున్నాయ్. అంతర్జాతీయంగా భారత్ వాణిజ్య ప్రయోజనాలు, వలస కార్మికుల భద్రతతో ముడిపడిన అంశాలపై ఇష్టారీతిగా సోషల్ మీడియాలో పోస్టులు రావడాన్ని చాలా మంది తప్పుపడుతుండగా మరికొందరు ఏ అంశంపైన అయినా చర్చ జరగాల్సిందే అంటున్నారు. Those who are trending Boycott Qatar Airways, do they know that the per capita GDP of Qatar is more than 25 times India's per capita GDP? Indian labor force working in Qatar sends $5Billion home every year, more than double the price of Air India. — Ashok Swain (@ashoswai) June 7, 2022 చదవండి: Virtual Influencer Kyra Story: వావ్ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్? -
ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. పాకిస్తాన్లో అత్యవసర ల్యాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసరంగా పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది. ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానంలో పొగలు రావడంతో కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానం కార్గో విభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్ అయింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే విమానంలో ప్రయాణిస్తున్న 283 మందిని మరో విమానంలో దోహాకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. విమానంలో పొగలు రావడంపై సదరు ఖతార్ ఎయిర్వేస్ సంస్థ స్పందించింది. ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపట్టినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. -
వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..
దోహా: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతా భావంగా లక్ష టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్ల సేవా భావానికి ప్రతిఫలంగా తమవంతుగా కాప్లిమెంటరీ రౌండ్‌ట్రిప్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్..‘‘ కష్టకాలంలో కఠిన శ్రమకోర్చి పూర్తి నిబద్ధతతో, సేవా నిరతితో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఖతార్ ఎయిర్వేస్ ధన్యవాదాలు తెలుపుతోంది. వారు చూపుతున్న దయ, అంకితభావం విలువకట్టలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు వారు కాపాడుతున్నారు. అలాంటి వారికోసం లక్ష టికెట్లు కేటాయించాం’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.(మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు) వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి రెండు చొప్పున టికెట్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారు అప్లికేషన్ ఫాం నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో పాటు మరొకరు ఎకానమీ క్లాసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో ఈ వెసలుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించేందుకు టికెట్లు బుక్‌చేసుకున్న హెల్త్ వర్కర్లకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు అల్ బాకర్ తెలిపారు. అయితే నవంబరు 26కు ముందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 10 వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఆఫర్ వివరాల కోసం ఖతార్ ఎయిర్వేస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని... మే 11 నుంచి మే 18 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించారు. United in dedication, we share our gratitude. On the occasion of International Nurses Day, from tomorrow until 18 May we're giving away 100,000 complimentary return tickets to healthcare professionals to anywhere on our network at https://t.co/DmXa4ZXLqp. #ThankYouHeroes pic.twitter.com/d88GIaOmZo — Qatar Airways (@qatarairways) May 11, 2020 -
ప్యాసింజర్ విమానంలో అత్యవసరాల తరలింపు
శంషాబాద్: డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యవసర సమయాల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు వినియోగిస్తున్నారు. ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూఆర్–8311 విమానం గురువారం రాత్రి 1.30 గంటలకు వైద్య పరికరాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా.. తిరుగు ప్రయాణంలో 28 టన్నుల నిత్యావసరాల సరుకులతో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి వెళ్లింది. విపత్కర పరిస్థితుల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు ఉపయోగించుకునేలా డీజీసీఏ అనుమతించడం మంచి పరిణామమని విమానాశ్రయ సీఈవో ఎస్జీకే కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
టాప్ టెన్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్ 20లో కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్, కెనడాలోని బిల్లీ బిషప్ విమానాశ్రయాలు నిలిచాయి. ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. విమాన ప్రయాణికుల హక్కులు, పరిహారాలు, కేసులు, విమానాల ఆలస్యం, రద్దు తదితర అంశాలపై ఎయిర్‌హెల్ప్ సేవలందిస్తోంది. ఖతార్ రెండోసారి.. ఇక ఎయిర్‌లైన్స్ సేవల్లో కూడా ఖతార్ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిరోమెక్సికో, ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్ ఎయిర్‌లైన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో ర్యానైర్ ఎయిర్వేస్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, యూకేకు చెందిన ఈస్ట్ జెట్, థామస్ కుక్ టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. టాప్ టెన్ ఎయిర్‌పోర్టులు.. 1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - ఖతర్ 2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - జపాన్ 3. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - గ్రీస్ 4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ 5. డాన్సిక్ లెచ్ వాటెసా ఎయిర్‌పోర్టు - పోలెండ్ 6. మాస్కో షెరెమ్త్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - రష్యా 7. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్ 8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా 9. టెనెరిఫ్ నార్త్ ఎయిర్‌పోర్టు - స్పెయిన్ 10. విరాకోపోస్/కాంపినాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ -
విమానం టేకాఫ్ అవుతుండగా..
కోల్‌కతా : ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కోల్‌కతా- దోహ విమానాన్ని గురువారం తెల్లవారుజామున టేకాఫ్ అవుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ ఢీకొంది. కో్ల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నారు. ఘటన జరిగిన వెంటనే వారందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేశారు. విమానం పాక్షికంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. కాగా ఉదయం 2.30 గంటలకు ప్రయాణీకులు విమానంలోకి ఎక్కుతున్న క్రమంలో వాటర్ ట్యాంకర్ విమానం ల్యాండింగ్ గేర్‌కు సమీపంలో మధ్య భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులను దించివేసి తనిఖీలు చేపట్టారని, ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమీప హోటల్లో ప్రయాణీకులందరికీ వసతి సౌకర్యం కల్పించామని, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానంలో వారిని దోహా తరలిస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే విమానాన్ని ఢీ కొట్టిందని ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఏఏఐ అధికారులు పేర్కొన్నారు. -
విమానంలో కూడా మొదలు పెట్టేశారు
-
విమానాన్ని వదల్లేదు; వీడియో వైరల్
దోహా : ‘కాదేది కవితకనర్హం’ అన్నట్లు అడుక్కోవడానికి కూడా ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 50 ఏళ్ల మధ్య వయస్కుడు. ఇంతకూ ఇతను అడుక్కున్నది ఎక్కడనుకుంటున్నారు...ఆకాశంలో ఎగురుతున్న విమానంలో. అవును విమానంలోనే అడుక్కుంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తూ వైరల్‌గా మారింది ఈ వీడియో. వీడియోలో ఉన్న దాని ప్రకారం దోహా నుంచి షిరాజ్ ప్రయాణిస్తున్న విమానంలో ఆకస్మాత్తుగా ఓ మధ్యవయస్కుడు లేచి చేతిలో ప్లాస్టిక్ పౌచ్ పట్టుకుని తన తోటి ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అడుక్కోవడం ప్రారంభించాడు. కొందరు అతనికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇంతలో ఎయిర్‌లైన్ సిబ్బంది వచ్చి అతన్ని వారించడంతో వెళ్లి తన సీటులో కూర్చున్నాడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియో గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొందరైతే ఏకంగా అడుకుంటున్న వ్యక్తిని పాకిస్తానీగా భావించి...‘ఈ ప్రయాణికుడు ప్రస్తుతం మన దేశంలో ఉన్న అవినీతికి నిదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మనకంటూ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోకపోతే నిజంగా అది మన దేశానికి అవమానకరం’ అంటూ కామెంట్ చేసాడు. అయితే దన్యాల్ గిలానీ అనే ఒక పాకిస్తానీ అధికారి ఈ వీడియోలో అడుక్కుంటున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను పోస్టు చేసాడు. ‘దోహా షిరాజ్ విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి పాకిస్తానీ కాదు. అతను ఒక ఇరానియన్. అతను మాట్లాడుతున్న భాషా పార్సీ. అతన్ని ఉన్న పళంగా దేశం నుంచి తరలించారు. దాంతో చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో ఆ వ్యక్తి తన తోటి ప్రయాణికులను అడుక్కుంటున్నాడు’ అని పోస్టు చేసాడు. దోహా నుంచి షిరాజ్ వరకు ఖతార్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్ ధర 2,000 - 3,000 ఖతారీ రియాల్స్(రూ. 55,875) వరకూ ఖర్చవుతుంది. టికెట్టు కొనే స్తోమత లేక అలా చేస్తున్నాడని కొందరు సానుభూతి తెలపుతన్న నేపధ్యంలో ఈ వ్యక్తి తమకు పేయింగ్ కస్టమర్(అంటే టికెట్టు కొన్న ప్రయాణికుడి)గా నిర్ధారించింది ఖతార్ ఎయిర్వేస్. -
విమానంలో ఇరాన్ జంట బాహాబాహి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కట్టుకున్న భర్త మరికొందరు మహిళలపై ఆకర్షణ పెంచుకోవడాన్ని ఏదేశానికి చెందిన భార్య అయినా సహించలేదనే సత్యాన్ని చాటే సంఘటన ఖతార్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. భర్త సెల్‌ఫోన్‌లోని అశ్లీల చిత్రాలు, పలువురు మహిళ ఫొటోలను చూసిన భార్యకు ఆగ్రహం కట్టలు తెంచుకోగా ఆకాశంలో ఎగురుతున్న విమానంలోనే పరస్పర దాడులకు దిగారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖతార్ ఎయిర్వేస్ విమానం దోహా నుంచి బయల్దేరి సోమవారం ఉదయం ఇండోనేషియాలోని పాల్దీవులకు వెళుతోంది. ఈ విమానంలో 284 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇరాన్ దేశానికి చెందిన ఓ యువజంట చంటిబిడ్డను వెంటబెట్టుకుని వెళుతోంది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో కాలక్షేపం కోసం భార్య అతని సెల్‌ఫోన్ తీసుకుని ఆమె ఆన్ చేసింది. భర్త వేలిముద్రలే పాస్వర్డ్ కావడంతో అతని వేలిని ఉపయోగించి సెల్‌ఫోన్ ఓపెన్ చేయగలింది. సెల్ఫోన్లో లెక్కలేనన్ని అశ్లీల చిత్రాలు, కొందరు మహిళల ఫొటోలు ఉండడంతో భార్య ఖిన్నురాలైంది. కోపంతో ఊగిపోతూ భర్తను నిద్రలేపి ఏమిటీ ఫొటోలు అంటూ నిలదీసింది. నా అనుమతి లేకుండా సెల్‌ఫోన్ ఎందుకు తీసుకున్నావని కోపగించుకున్న భర్త, భార్యను కొట్టాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన భార్య భర్తపై చేయిచేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ విమానంలో కిందపడి దొర్లాడారు. ఈ ఘర్షణ జరుగుతున్నపుడు విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ఎయిర్‌హోస్టెస్, ప్రయాణికులపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ఘర్షణ ఆపకుంటే విమానం నుంచి మధ్యలోనే దించేయాల్సి వస్తుందని పైలట్ హెచ్చరించినా మానుకోలేదు. ప్రస్తుతం తాము ఎక్కడ ప్రయాణిస్తున్నామని కెప్టెన్ విచారించి సమీపంలో చెన్నై ఎయిర్‌పోర్టు ఉన్నట్లు తెలుసుకున్నారు. కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చి సోమవారం ఉదయం 10.15 గంటలకు చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేశారు. భార్యాభర్తలిద్దరిని బలవంతంగా దించివేసి 282 ప్రయాణికులతో విమానం ఎగిరిపోయింది. భారత్‌తో పర్యటించేందుకు ఆ దంపతులకు అనుమతి లేకపోవడంతో అధికారులను బతిమాలుకుని 11.05 గంటలకు మలేషియాకు వెళ్లి అక్కడి నుంచి మరో విమానంలో పాల్దీవులకు వెళ్లారు. -
భర్తతో భార్య గొడవ.. విమానం మళ్లింపు.!
మద్యం మత్తులో ఓ మహిళ తనని మోసం చేశాడని భర్తపై గొడవపడి ఏకంగా విమానాన్నేదారి మళ్లించింది. వివరాల్లోకి వెళితే.. ఇరాక్ చెందిన ఓ మహిళ భర్త, కుమారుడితో ఢిల్లీ నుంచి బాలి వెళ్లేందుకు ఆదివారం ఖతార్ ఎయిర్వేస్కు చెందిన దోహా-బాలి క్యుఆర్ - 962 విమానం ఎక్కారు. భర్తపై అనుమానంతో భార్య తాను నిద్రపోతున్న సమయంలో భర్త ఫోన్‌ని అతని వేలిముద్రతో అన్‌లాక్ చేసి చూసింది. తీరా అందులో వేరే యువతి ఫోటోలు, కాల్ లిస్ట్ చూసింది. దీంతో భర్త తనను మోసంచేశాడని అందరి ముందు గొడవ పడి నానా రచ్చ చేసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె తోటి ప్రయాణికులు, ఎయిర్వేస్ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు, వారిపై తిరగబడింది. అదుపు చేయలేని స్థితిలో సిబ్బంది దారి మళ్లించి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఆ కుటుంబాన్ని దింపేశారు. అనంతరం విమానాన్ని బాలికి తరలించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ విమానం చెన్నైలో ల్యాండ్ అయినట్లు సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సెక్యురిటీ ఫోర్స్) అధికారులు వెల్లడించారు. -
డెలివరీ ఆలస్యం.. 7 వేల కోట్ల నష్టం!
పారిస్: కంపెనీ తీసుకున్న ఆర్డర్ల డెలివరీలో ఆలస్యం కారణంగా ఎయిర్‌బస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. నాలుగు భారీ జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన ఆర్డర్లను ఖతార్ ఎయిర్వేస్ వెనక్కి తీసుకుని ఎయిర్‌బస్ సంస్థకు ఊహించని షాకిచ్చింది. డెలివరీలో ఆలస్యం అయినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ ఆర్డర్ల రద్దు కారణంగా ఎయిర్‌బస్ సంస్థకు భారత కరెన్సీలో సుమారు రూ. 7,751 కోట్ల (1.2 బిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనుంది. 'ఎయిర్‌బస్ సంస్థకు మేం నాలుగు జెట్ విమానాల కోసం ఆర్డరిచ్చాం. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆర్డర్ సకాలంలో ఇవ్వకపోవడం లాంటి వాటికి ఎయిర్‌బస్ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. కానీ డెలివరీ ఆలస్యమైన కారణంగా మా ఆర్డర్లను రద్దు చేసుకున్నామని' ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అక్బర్ అల్ బకార్ వివరించారు. మరోవైపు గత బుధవారం 140 ఎయిర్‌బస్ జెట్ విమానాల కొనుగోలుకు చైనా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్‌బస్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ.. ఏ350-900 జెట్ విమానాలను సరైన సమయంలో డెలివరీ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. వేరొక ఆర్డరిచ్చే కంపెనీకి వీటిని రీ డిజైన్ చేసి వారికి అనుకూలమైన మార్పులతో విక్రయించాల్సి ఉంటుంది. ఇది అంత సులువైన విషయం కాదు. జరిగే నష్టాన్ని ఎంతో కొంత మేర తగ్గించుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అధిక ఆర్డర్ల కారణంతో పాటు పరికరాల కొరత, అత్యంత నాణ్యత కోసం పాకులాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందని కంపెనీ పేర్కొంది. -
ఖతార్‌కు దెబ్బపై దెబ్బ
-
ఖతార్‌కు దెబ్బపై దెబ్బ
ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కార్యాలయాలన్నింటిని 48 గంటల పాటు మూసేయాలని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్ ఎయిర్వేస్ ఉద్యోగులకు జారీ చేసిన లైసెన్స్‌లను ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఖతార్ నుంచి రాకపోకలను సౌదీ నిషేధించింది. సాదీ తాజా నిర్ణయంతో ఖతార్‌కు మరో షాక్ తగిలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలపై ఖతార్‌తో దౌత్యపరమైన సంబంధాలను ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్, లిబియా, మాల్దీవులు పేర్కొన్న విషయం తెలిసిందే. -
16.23 గంటలు.. 14,535 కి.మీ.
అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం ప్రారంభం వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్వేస్ ఆదివారం ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం గం.5.02 నిమిషాలకు (స్థానిక కాలమానం) బయలుదేరిన క్యూఆర్920 విమానం సోమవారం ఉదయం గం.7.25 నిమిషాలకు (స్థానిక కాలమానం) న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ పయనించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆక్లాండ్‌లో విమానానికి ఘనస్వాగతం పలికారు. ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదిగా చెబుతారు. భూపరితలంపై దూరాన్ని కొలిస్తే మాత్రం ఖతార్ ఎయిర్వేస్ విమానమే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. -
'అవి లేకుంటే అమెరికా తీసుకెళ్లలేం'
దోహా: ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ప్రతిచర్యలకు ఉపక్రమిస్తుంటే ఖతార్ మాత్రం అందుకు భిన్నంగా చేసింది. ట్రంప్ నిర్ణయానికి అణువుగా ఇప్పటి వరకు అమెరికాకు వెళ్లడానికి ఉన్న నిబంధనలు మార్చి కొత్త నిబంధనలు బలవంతంగా తమ దేశ పౌరులకు ప్రవేశపెడుతోంది. దాదాపు అమెరికాలోని 15 నగరాలకు ఖతార్ నుంచి విమానాలు వెళుతుంటాయి. కేవలం ప్రయాణీకులను మాత్రమే ఇవి తీసుకెళుతుంటాయి. చదవండి.. (ట్రంప్‌కు టిట్ ఫర్ టాట్: ఇరాన్ సంచలన నిర్ణయం) అయితే, అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ శుక్రవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఖతార్ నుంచి అమెరికాకు వెళ్లే వారికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ కఠినతరం చేసింది. తాము సూచించినట్లుగా సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తేనే అమెరికా తీసుకెళతామని, లేదంటే తామేం చేయలేమని ఖతార్ ఎయిర్వేస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రావెల్ అలర్ట్ అంటూ ప్రకటన చేయడమే కాకుండా ప్రయాణీకులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో ప్రత్యేక జాబితాను తన అధికారిక సైట్లో పేర్కొంది. మరోపక్క, ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై ప్రతిబంధకాలు విధిస్తూ ఆ దేశం ఆదేశాలు జారీ చేసింది. -
వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు
ఖతార్: ఏకబిగిన 18 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసులో ప్రయాణించి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకు అత్యధికంగా 16 గంటల 55 నిమిషాలు ఏకబిగిన ప్రయాణించే వీలుంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిద్ధమవుతోంది. ఎక్కువసేపు ప్రయాణించే డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దోహ నుంచి ఆక్లాండ్ కు నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రయత్నిస్తోందని 'ది గార్డియన్' వెల్లడించింది. దోహా నుంచి ఆక్లాండ్ కు 9,034 మైళ్ల దూరం ఉంది. ఎక్కడా ఆగకుండా విమానంలో వెళితే 18 గంటల 34 నిమిషాలు పడుతుంది. డల్లాస్-సిడ్నీ ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది 2 గంటలు ఎక్కువ. ఈ మార్గంలో ఖంటాస్ సంస్థ డైరెక్ట్ విమాన సర్వీసు నడుపుతోంది. 8,578 మైళ్ల దూరం ప్రయాణించడానికి 16 గంటల 55 నిమిషాల సమయం పడుతోంది. దోహ-ఆక్లాండ్ డైరెక్ట్ సర్వీసుకు 259 ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 777-ఎల్ ఆర్ విమానాన్ని నడపాలని ఖతార్ ఎయిర్ భావిస్తోంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు పట్ల ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఖతార్ ఎయిర్వేస్కు టోపీ.. రూ. 12.84 లక్షల మోసం
బంజారాహిల్స్: ఖతార్ ఎయిర్వేస్ను మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పాతబస్తీకి చెందిన సయ్యద్ మోజంఅలీ బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 లోని ఖతార్ ఎయిర్వేస్లో టికెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత ఆగస్టు 2 నుంచి 15వ తేదీల మధ్య ఆయన కొందరు ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేశారు. ఇందుకుగాను వారి నుంచి నగదు తీసుకొని టికెట్ ప్రింట్ కూడా ఇచ్చాడు. అయితే ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ టికెట్లను కేన్సిల్ చేసి గంట తర్వాత తిరిగి మళ్లీ అవే సీట్లను వేరేవాళ్లకు విక్రయించేవాడు. ఈ సమయంలో టికెట్ల అసలు ధరను సున్నాగా చేసి సేవా పన్నులు మాత్రమే సంస్థకు చెల్లించేవాడు. మిగతా డబ్బు తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ రకంగా సుమారు రూ. 12.84 లక్షలను జేబులో వేసుకున్నాడు. ఇటీవల ఖతార్ ఎయిర్వేస్ ఆడిటింగ్‌లో ఈ మోసం బట్టబయలైంది. దీంతో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.