ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు

Published Sun, May 26 2024 9:56 PM

12 Injured After Turbulence Hits Qatar Airways flight To Dublin

డబ్లిన్‌: ‌ఖతర్‌ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్‌ వెళ్లిన ‌ఖతర్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.

ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్‌ అయింది.‌ ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానం ల్యాండ్‌ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్‌, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. 

విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి  గాయాలయ్యాయి’అని డబ్లిన్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్‌ మరణించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement