turbulance
-
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో....
చైనాకి చెందిన ఓ విమానం మలేషియా గగనతలంపై ప్రయాణిస్తూండగా ఉన్నట్టుండి భారీగా షేక్ అయింది. కొన్నినిమిషాల పాటు సాగిన ఈ షేకింగ్ వల్ల దాదాపు 20 మంది ప్రయాణికులు విమానంలోనే చెల్లాచెదరై అటూ ఇటూ పడిపోయారు. కొందరు ఏకంగా విమానం సీలింగ్ ను ఢీ కొన్నారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి జటిలంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ విమానం సౌత్ ఆఫ్రికా లోని జోహానెస్ బర్గ్ నుంచి హాంకాంగ్ కి వస్తోంది. ఇందులో 165 మంది యాత్రికులు ఉన్నారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది విమానం వెనుక భాగంలో కూర్చున్న వారే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. విమానంలోపలి ప్యానెల్స్ దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు.