మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో.... | Severe turbulance in plane, 20 injured | Sakshi
Sakshi News home page

మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో....

Published Thu, Jul 17 2014 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో....

మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో....

చైనాకి చెందిన ఓ విమానం మలేషియా గగనతలంపై ప్రయాణిస్తూండగా ఉన్నట్టుండి భారీగా షేక్ అయింది. కొన్నినిమిషాల పాటు సాగిన ఈ షేకింగ్ వల్ల దాదాపు 20 మంది ప్రయాణికులు విమానంలోనే చెల్లాచెదరై అటూ ఇటూ పడిపోయారు. కొందరు ఏకంగా విమానం సీలింగ్ ను ఢీ కొన్నారు. దీంతో వారికి గాయాలయ్యాయి.
 
ఇద్దరి పరిస్థితి జటిలంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. 
 
ఈ విమానం సౌత్ ఆఫ్రికా లోని జోహానెస్ బర్గ్ నుంచి హాంకాంగ్ కి వస్తోంది. ఇందులో 165 మంది యాత్రికులు ఉన్నారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది విమానం వెనుక భాగంలో కూర్చున్న వారే కావడం గమనార్హం. 
 
ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. విమానంలోపలి ప్యానెల్స్ దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement