passengers suffers
-
HYD: మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్‌లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ ఫీడర్లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ -
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
రన్‌వేపైనే భోజనం.. ఇండిగోకు నోటీసులు
ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది. passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS — JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024 పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్‌కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్‌కి బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్‌కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్‌కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్‌లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!
IRCTC down: ఐఆర్సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్సైట్, యాప్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్షాట్లతో సోషల్ మీడియా హోరెత్తితింది. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్‌ల కోసం కేటాయించిన స్లాట్లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E) తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదులు మొదలైనాయి. "సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము." ఐఆర్సీటీసీ ట్వీట్లో తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్మైట్రిప్ తదితర B2C ప్లేయర్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. Not able to tatkal booking ticket... Facing some error in #IRCTC app... Please dot the something... I have emergency to back to my home...@IRCTCofficial @RailwaySeva#railways — Vijay Arya (@Im_vijayarya) July 25, 2023 #irctc As usual down ... Can't book tickets Two times banking transactions failed.... Waiting for refund and no further booking @AshwiniVaishnaw@RailwaySeva @RailMinIndia pic.twitter.com/TOPJdXiuy8 — Dhimant Bhatt (@dhimantbhatt) July 25, 2023 కాగా ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా. Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.— IRCTC (@IRCTCofficial) July 25, 2023 -
ఇదేందయ్యా పోలీస్ సార్..!
-
ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ స్టాక్‌హోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు. చదవండి: స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఆటో.. ఛేజ్ చేసిన పోలీసులకు షాక్
వైరల్: ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం. అంతేనా.. మరో ఏడాదిలో మన జనాభా.. చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతోందని సర్వేలు వెల్లడించాయి కూడా. అదే సమయంలో సోషల్ మీడియాలో జనాభా పెరుగుదల మీద ఇవాళ రకరకాల చర్చలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. రోడ్డు మీద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు.. స్పీడ్ గన్ వేగాన్ని మించి దూసుకుపోయిన ఓ ఆటో కనిపించింది. దీంతో ఆ ఆటోను ఛేజ్ చేశారు పోలీసులు. ఎట్టకేలకు దానిని ఆపి.. అందులోంచి ప్యాసింజర్లను దించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 27 మంది(డ్రైవర్‌తో పాటు) ప్రయాణికులు దిగారు ఆ ఆటో నుంచి. ఇంకేం షాక్ కావడం పోలీసుల వంతు అయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేకున్నా.. ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ బిండ్‌కీ కోట్వాలి రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలను పెద్దలతో కలిపి కుక్కేసి మరీ ఆ త్రీవీలర్‌లో తీసుకెళ్లే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అశ్విని ఉపాధ్యాయ అనే ట్విటర్ యూజర్ దానిని పోస్ట్ చేయగా.. విపరీతమైన లైకులు,షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. जनसंख्या विस्फोट का दुष्परिणाम ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp — Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022 -
స్పైస్‌జెట్: ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లిమిటెడ్‌కు ఊరట లభించింది. క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదానికి తెర దించింది. దీంతో బుధవారంనాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 4 శాతం లాభపడింది. క్రెడిట్ సూయిస్‌తో పాటు, ఇటీవల కెనడా లిమిటెడ్, బోయింగ్, సీడీబీ ఏవియేషన్, బీఓసీ ఏవియేషన్, అవోలాన్లతో సెటిల్మెంట్లతో సంస్థ వృద్ధికి, విస్తరణకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్ఛేంజ్లకిచ్చిన సమాచారం ప్రకారం స్పైస్‌జెట్ లిమిటెడ్, క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య వివాద సెటిల్మెంట్, అంగీకారం నిబంధనలపై (మే 23) సంతకాలు ముగిసాయి. తుది ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిసింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ ఇప్పటికే 5 మిలియన్ల డాలర్ల బ్యాంక్ గ్యారెంటీని అందించిందని, దీనికి సంబంధించి తమపై ఎలాంటి ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉండదని తెలిపింది. స్విస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాలింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎస్ఆర్ టెక్నిక్స్‌కు 24 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లింపులు చేయడంలో ఎయిర్‌లైన్ విఫలమవడంతో క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్‌పై గత సంవత్సరం మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737లు, క్యూ-400లు,ఫ్రైటర్ విమానాలను నడుపుతుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద 63 రోజువారీ విమాన సర్వీసులతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ప్రవేశ పెడుతుందని, త్వరలో తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఎండీ అజయ్ సింగ్ సోమవారం తెలిపారు. కాగా కరోనా సంబందిత ప్రయాణ ఆంక్షలు సడలింపులతో దేశీయ విమానయాన ట్రాఫిక్ కోలుకుంటోంది. ఏప్రిల్‌లో దాదాపు 1.08 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారని, మార్చిలో ప్రయాణించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైగా 2 శాతం ఎక్కువ అని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇటీవల వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిరిండియా,ఎయిర్ ఏషియా ఇండియా ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 85.9 శాతం, 78.7, 82.9, 80.3, 79.5, 79.6 శాతంగా ఉన్నాయన్నారు. ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై ర్యాన్సమ్వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్ వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు రాన్సమ్వేర్ అటాక్‌తో బుధవారం ఉదయం స్పైస్‌జెట్ డిపార్చర్స్ ఇబ్బందులు, ప్రయాణికులు చిక్కుకుపోవడంపై అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అటాక్ కారణంగా బుధవారం ఉదయం నాటి విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని ట్విట్ చేశారు. ఈ పరిణామాన్ని తమ ఐటీ టీం సరిదిద్దిందని, విమాన సేవలు సజావుగానే ఉన్నాయంటూ స్పైస్‌జెట్ ట్విట్ చేసింది. Operating normally?? We are stuck here since 3 hrs and 45 mins? Neither cancelling nor operating, sitting in the flight not even the airport. No breakfast, no response! pic.twitter.com/dAfdIjzVzH — Mudit Shejwar (@mudit_shejwar) May 25, 2022 #ImportantUpdate: Certain SpiceJet systems faced an attempted ransomware attack last night that impacted and slowed down morning flight departures today. Our IT team has contained and rectified the situation and flights are operating normally now. — SpiceJet (@flyspicejet) May 25, 2022 Hi @flyspicejet we were supposed to depart from IXB at 9 am today and there are still no updates from anyone. Worst part we boarded the flight and then this update came when the attack was last night and my wife is here with me with fractured leg waiting in vain pic.twitter.com/UBZmxCaWCu — Himanshu Maheshwari (@himannshum) May 25, 2022 -
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్
పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్లాట్ఫారం ఎత్తు పెంచేదెన్నడో..? పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్ ఎక్కేందుకు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చదవండి: అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్ లేఖ -
మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్ కోసం ఓ ట్రావెల్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు. అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! -
ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
క్విటో: ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెజోనియన్ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బొల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందినవారిని మార్చురీకి తరలించారు. కాగా, బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్ -
ట్వీట్ చేస్తే.. బస్సొచ్చె.. భలె భలె!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. డిపాజిట్ కూడా రద్దు చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణికులు ఇటీవల ట్వీట్ చేసిన సమస్యలపై అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన సమస్యలివీ... సమయానికి బస్సు రావడం లేదంటూ ఓ ప్రయాణికుడి ఫిర్యాదు.. మా ఊరికి బస్సు రాక ఏళ్లు అయితుంది.. మీరు బస్సు వేయిస్తారా?.. ఓ గ్రామ యువకుడి ప్రశ్న.. బస్సు సమయానికి రాక కాలేజీకి టైంకు చేరుకోలేకపోతున్నం.. పాఠ్యాంశాలు నష్టపోతున్నం.. ఓ విద్యార్థి వినతి.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.. మెస్సేజ్ రావడమే ఆలస్యం అన్నట్లు.. వెంటనే ఆయన స్పందించి రిప్లయ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సాక్షి,నెన్నెల(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్ 16 నుంచి బస్సు ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్‌ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది. కష్టాలు దూరమయ్యాయి మా ఊరికి 30ఏళ్ల కిందట సర్కార్ బస్సు వచ్చేది. అప్పట్లో రాకపోకలకు సౌలత్ ఉండేది. అధికారులు బస్సు బంద్ చేయడంతో ఇబ్బంది పడ్డాం. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడక, ఎడ్లబండే దిక్కయ్యేది. ప్రస్తుతం మా ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి. – చాపిడి పెంటక్క, కోనంపేట చదువులు మానొద్దని.. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర బస్సు ప్రారంభించారు. దీంతో 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంతోషంగా ఉంది దాదాపు 26 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు బాగాలేక ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 108 వాహనం కూడా వస్తోంది. పోలీసులకు రుణపడి ఉంటాం. – బోజ్జిరావు, ఉప సర్పంచ్, మంగి రెండ్రోజుల్లోనే.. సిరికొండ(బోథ్): మండల కేంద్రంతోపా టు చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇక్కట్లకు గురయ్యేవాళ్లం. మండల కేంద్రం నుంచి నిత్యం దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఉన్నత చదువులకోసం వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులేక పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సామాజిక కర్యకర్త రాథోడ్ మౌనిక సమస్యను ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేసింది. సజ్జనార్ రెండు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించారు. నిర్మల్ నుంచి బోథ్‌కు లింక్బస్సు బోథ్: హైదరాబాద్ నుంచి బోథ్‌కు రాత్రి సమయంలో నడిచే బస్సును లాభాలు రావడం లేదని గతంలో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ప్రజల ఇబ్బందులు గమనించిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్‌కుమార్ బస్సు పునరుద్ధరించాలని అక్టోబర్ 29న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ నిర్మల్ నుంచి బోథ్‌కు ఉదయం 5 గంటలకు లింక్ బస్సును ఏర్పాటు చేశారు. గిరి గ్రామాలకు ఆర్టీసీ బస్సు పెంచికల్పేట్: మండలంలోని గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ గ్రామాలకు గతేడాది మే నుంచి ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలు లేక పడుతున్న ఇబ్బందులపై నవంబరు 16న ‘సాక్షి’లో ‘అందని ఆర్టీసీ సేవలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన యువకులు కథనాన్ని ఎండీ సజ్జనా ర్కు ట్వీట్ చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత అధికారులు నవంబరు 19 నుంచి గిరి గ్రామాలకు బస్సు పునరుద్ధరించారు. హైదరాబాద్ బస్సు పునరుద్ధరణ ఖానాపూర్: ప్రతీరోజు ఉదయం 5 గంటలకు కడెం, ఖానాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోయింది. బస్సు సేవలు పునరుద్ధరించాలని గత నెల 19న ఖానాపూర్‌కు చెందిన బీసీ యువజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోట సుమీత్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్ చేశాడు. స్పందించిన ఆర్టీసీ అధికారులు ఈ నెల 22 నుంచి బస్సు పునరుద్ధరించారు. చదవండి: డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి.. -
హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా (డెల్టా వేరియంట్) వైరస్....తాజాగా ‘ఒమిక్రాన్’ రూపంలో నగరవాసులను మళ్లీ కలవర పెడుతోంది. ఇప్పటికే యూకే సహా సింగపూర్, కెనడా, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన 13 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గ్రేటర్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందని, వైరస్ తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతోందని ప్రభుత్వం సహా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభలు, సమావేశాలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకల పేరుతోపెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, వినోదాలు, విహార యాత్రల పేరుతో ఇష్టారీతిగా తిరుగుతున్నారు. మధ్య వయస్కులు, యువతీ, యువకుల నిర్లక్ష్యానికి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు వారికి ఇప్పటి వరకు టీకాలు రాకపోవడంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతుండటంతో ప్రత్యక్ష హాజరు శాతం తగ్గిపోతోంది. చదవండి: (Omicron: హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు) స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే... ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదైనప్పటికీ..ఆ తర్వాతి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రజల ఆర్థిక ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిని సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దశల వారీగా కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడం...మార్కెట్లు సహా వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం..ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌ను ఎత్తేవేయడంతో. సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు సిటిజన్లు భావించారు. ఇక కోవిడ్ పీడ విరగడైందని భావించి మాస్క్‌లను పక్కన పడేశారు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే...ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అప్రమత్తమై విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తోంది. వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపుతోంది. 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. ప్రధానోపాధ్యాయురాలికి కోవిడ్ కంటోన్మెంట్: తిరుమలగిరి మండలం మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐరిన్ సుప్రదకు కరోనా సోకింది. ఈ మేరకు ర్యాపిడ్ టెస్టులో ఈ విషయం తేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి ఆర్టీపీసీఆర్ టెస్టుకు శాంపిళ్లు పంపించారు. ఇదిలా ఉండగా ఇదే పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి కుమారుడికి ఇటీవల కరోనా సోకగా, 15 రోజుల పాటు సెలవు తీసుకుంది. సదరు ఉపాధ్యాయురాలికి సైతం కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్నాక, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి గురువారమే పాఠశాలలో చేరింది. శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు కరోనా బారిన పడటం గమనార్హం. చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) విద్యాసంస్థలపై దృష్టి విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, గురు కులాలను హాట్స్పాట్ల జాబితాలో చేర్చి ఆమేరకు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది. విద్యార్థులంతా మాస్క్‌లు ధరించేలా..ప్రతి పీరియడ్ తర్వాత విధిగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకునేలా..జాగ్రత్తలు సూచిస్తోంది. నిన్న మొన్నటి వరకు బెంచికి నలుగురైదుగురు విద్యార్థులు కూర్చోగా..ప్రస్తుతం ఇద్దరు,ముగ్గురికే పరిమితం చేసింది. పాఠశాలలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆయా యాజమాన్యాలు ఇప్పటికే ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం కోవిడ్ పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాల నుంచి వచ్చిన కోవిడ్ పేషెంట్లకు గాంధీలోనే సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం 150 మంది చికిత్స పొందుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సమకూర్చాం. వైరస్ తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు పడకలు సమకూరుస్తాం. ప్రజలు గతంలో మాదిరిగా కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. లేకుంటే మూల్యం చెల్లించక తప్పదు. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు.