Hyderabad Crime News Today: Travel And Tour Company Fraud Over Maldives Trip In Hyderabad - Sakshi
Sakshi News home page

మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే

Published Tue, Dec 14 2021 10:15 AM | Last Updated on Tue, Dec 14 2021 12:39 PM

Travel And Tour Company Fraud Over Maldives Trip In Hyderabad - Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్‌ కోసం ఓ ట్రావెల్‌ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్‌ వెళ్లేందుకు ఫ్లైట్‌ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు.

అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.    

చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్‌.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement