Travel Company
-
ఈజ్‌మైట్రిప్ ఫ్రాంచైజీ స్టోర్లు, బుకింగ్ ఈజీ
హైదరాబాద్: ఈజ్‌మైట్రిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఫ్రాంచైజీ విధానంలో కస్టమర్లకు ట్రావెల్, ఇతర బుకింగ్ సేవలు అందించనుంది. స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోగలమన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ట్రావెల్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆసక్తితోపాటు, ధనికులైన క్లయింట్ల నెట్వర్క్, కస్టమర్లు, సొసైటీల నెట్వర్క్, అసోసియేషన్లతో సంబంధాలు కలిగిన వారు ఫ్రాంచైజీ ప్రారంభించొచ్చని సంస్థ తెలిపింది. అన్ని బుకింగ్ లావాదేవీలపై మెరుగైన కమీషన్ ఇస్తామని పేర్కొంది. రోజులో 24 గంటల పాటు సపోర్ట్ సేవలతో, మూడు, నాలుగు నెలల్లోనే లాభనష్టాల్లేని స్థితికి చేరుకునేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపింది. ఈజ్‌మైట్రిప్ ద్వారా ఫ్లయిట్ల బుకింగ్, హోటల్ రూమ్‌లు, ఐఆర్సీటీసీ, క్యాబ్, బస్‌లు, క్రూయిజ్‌లు, చార్టర్ల సేవలు పొందొచ్చు. -
కోవిడ్ అంటే కరోనా కాదు మనిషి పేరు అని తెలుసా!!
2020కి ముందు వరకు కరోనా అనేది మార్కెట్లో లభించే ఒక బీర్ పేరు. కరోనాని మనం కోవిడ్ అని కూడా వ్యవహరిస్తున్నాం. అయితే ఈ కోవిడ్ అనే పేరును మనుషులు పెట్టుకుంటారని, పైగా ఆ పేరుతో ఒక మనిషి ఉన్నాడని కూడా మనం ఊహించి ఉండం. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) అసలు విషయంలోకెళ్లితే.....హోలిడిఫై అనే ఆన్లైన్ టూర్ ట్రావెల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడి పేరు కోవిడ్ కపూర్. అయితే ఎప్పుడైతే ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడించడం మెదలైందో అప్పటి నుంచి ఈ కోవిడ్ కపూర్‌కి తన పేరుతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్లో అతను "నా పేరు కోవిడ్ నేను వైరస్ కాదు" అని పెట్టుకున్నాడు. ఇటీవల అతను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని ఆశ్చర్యపోవడమే కాక రకరకాలు జోక్‌లు వేసుకుంటున్నారు. దీంతో ఇక తాను భవిష్యత్తులో విదేశాలకు వెళ్లినపుడల్లా తన పేరు తనకి ఒక ఎంటెర్టైన్మంట్ మారి పర్యాటన మొత్తం సరదా సరదాగా సాగిపోతుందని అంటున్నాడు. అయితే తన పేరుకి అర్థం "పండితుడు" లేదా "ప్రావీణ్యం ఉన్న వ్యక్తి" అని హనుమాన్ చాలీసాలో ఉంటుందని వివరించాడు. అఖరికి అతని పుట్టిన రోజుకి తన స్నేహితులు కేక్‌ని ఆర్డర్ చేశారు. పాపం ఆ కేకు మీద కోవిడ్(kovid) అని కాకుండా covid అని బేకరి వాళ్లు తప్పుగా రాశారని చెప్పాడు. దీంతో మిస్టర్ కపూర్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కబీర్ కపూర్ అనే పేరుని కూడా మార్చుకున్నాడు. ఎవరైన ఒక్కసారో రెండోసార్లో మనపై జోక్‌లు వేస్తే సహించగలం. ఇలా ప్రతిసారి అందరూ మూకుమ్మడిగా వ్యంగ్యంగా జోక్‌లు వేస్తుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదా.! (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!) Now that you mention it.... pic.twitter.com/90FutdBcnF — Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022 For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. 🎂 pic.twitter.com/3jrySteSbC — Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022 -
మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్ కోసం ఓ ట్రావెల్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు. అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! -
యాత్ర ఆన్లైన్ చేతికి కార్పొరేట్ ట్రావెల్ వ్యాపారం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్ర ఆన్లైన్ ఇన్‌కార్పొ.... చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎల్ వరల్డ్‌వేస్ కంపెనీకి చెందిన కార్పొరేట్ ట్రావెల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను యాత్ర కంపెనీ వెల్లడించలేదు. ఈ డీల్ కారణంగా దక్షిణ భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని యాత్ర పేర్కొంది. ప్రస్తుతం 700గా ఉన్న కార్పొరేట్ క్లయింట్ల సంఖ్య అదనంగా మరో వందకు పైగా పెరుగుతుందని వివరించింది. -
అందుబాటు ధరలో చందమామ!
2023 అమెరికన్ స్పేస్–ట్రావెల్ కంపెనీ ‘స్పేస్–ఎక్స్’ తొలి ప్రైవేట్ ప్యాసింజర్‌ను చంద్రుడి పైకి పంపింది. ఆ ప్యాసింజర్ పేరు యుసకు మాయిజవా. జపాన్ బిలియనీర్. ఈ యుసకు భూమి మీద ల్యాండయ్యాడో లేదో కనిపించిన టీవీ స్టూడియోల్లోకి దూరి ‘ఆహా చంద్రమండలం’ ‘ఓహో చంద్రమండలం’ అంటూ స్పీచ్‌లు మొదలుపెట్టాడు. ఇల్లు దాటి ఎప్పుడూ పక్క ఊరికి పోనివారు కూడా యుసకు స్పీచ్‌లు విని తెగ ఇదై పోయారు. జీవితంలో ఒక్కసారైనా చంద్రుడి మీదికి వెళ్లి రావాలని కలలు కన్నారు. కానీ ఏం లాభం? యుసకులాంటి బిలియనీర్లకు తప్ప సామాన్యులకు ‘స్పేస్–ఎక్స్’ ధరలు అందుబాటులోకి లేవు. 2025 బిలియనీర్లు, మిలియనీర్లకే కాదు సామాన్యజనానికి కూడా ధరలు అందుబాటులోకి తెచ్చి చారిత్రక విప్లవానికి శ్రీకారం చుట్టింది స్పేస్–ఎక్స్.అదిగో ఆ ఊళ్లో ఏదో అలికిడి అవుతుంది. ఒక్కసారి లుక్కేద్దామా మరీ...‘‘ఏం ఎంకయ్య మామా, ఏటో పయనమైనట్లున్నావు’’‘‘నాకు ఒక్కగానొక్క కూతురు అనే విషయం నీకు తెలుసుకదరా అల్లుడు..’’‘‘ఎటు వెళుతున్నావో చెప్పరా మామా అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు అంటావేమిటి నీ యెంకమ్మ. చెవుడుగానీ వచ్చిందా ఏమిటి?’’‘‘నీకు తొందరెక్కువ, ఆగెహే. నేను చెప్పేది ఓపిగ్గా విను. నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేశాను అనే విషయం నీకు తెలుసు కదా. నువ్వు అడిగినంత కట్నం ఇస్తాను కోరుకో అల్లుడు అని అల్లుడుగారికి బంపర్ ఆఫర్ ఇచ్చాను. ‘నీ కట్నం ఎవరికి కావాలి! నన్ను చంద్రుడి మీదికి పంపించు చాలు’ అని కోరాడు. రెండు సంవత్సరాల క్రితం కోటీశ్వరులకు తప్ప మనలాంటోళ్లకు చంద్రుడిపైకి వెళ్లే అవకాశం లేనేలేదు. అందుకే తరువాత చూద్దాంలే అల్లుడు అని వాయిదా వేశాను. ఇది దృష్టిలో పెట్టుకొని పోయిన ఏడాది సంక్రాంతికి ఆయన మా ఇంటికి రాలేదు, అమ్మాయిని కూడా పంపలేదు. ఎలారా దేవుడా అని తెగ బాధ పడుతుండగా స్పేస్–ఎక్స్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన తీపి వార్త తెలిసింది. ఇప్పుడు ఒక్కసారేమిటి? సంవత్సరానికి ఆరుసార్లు అల్లుడిని చంద్రుడి పైకి పంపించగలను. రేపే మా అల్లుడి చంద్రమండల యాత్ర. అందుకే పట్నం వెళుతున్నాను’’(సరిగ్గా ఆరు నెలల మూడు రోజుల తరువాత...) ‘‘ఏం మామా, దిగులుగా కూర్చున్నవ్? మీ అల్లుడిని చంద్రుడి మీదికి పంపాలనేది నీ ఏకైక కోరిక. అది కూడా నెరవేరింది కదా. ఇంకా దిగులెందుకు?’’‘‘ఏం చంద్రయాత్రో ఏమో...మా అమ్మాయి కాపురం బుగై్గపోయింది’’‘‘ఏమైంది మావా?!’’‘‘మా అల్లుడు చంద్రుడిపైకి వెళ్లి ఆరునెలలు దాటింది. రెండు నెలలు తిరక్కుండానే రావాల్సిన వాడు ఆరునెలలైనా రాకపోయేసరికి ఆందోళన మొదలైంది...’’‘‘ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమిటి?’’ ‘‘ప్రమాదమా పాడా! ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ చంద్రమండలం అధికారులతో మాట్లాడితే అల్లుడిని మాతో మాట్లాడించారు. కోషియా మూడుమాజియా అనే కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, చావైనా బతుకైనా ఆమెతోనే అన్నాడు అల్లుడు. మీ పెళ్లిని నేను ఆమోదిస్తున్నాను...ముందైతే భూమి మీదికి రావయ్యా మగడా అన్నాను. ‘నేనేమన్నా చెవిలో రాకెట్ పెట్టుకున్నాననుకుంటున్నావా! భూమి మీదికి రాగానే మా ఇద్దరినీ విడదీయాలనేదే కదా నీ రావుగోపాల్రావు ప్లాను. నేను రాను గాక రాను. కూలో నాలో చేసుకొని మేమిద్దరం ఇక్కడే బతుకుతాం’ అన్నాడు గట్టిగా.ఇక ఆరోజు నుంచి రాత్రి కాగానే మా అమ్మాయి ఇంటి నుంచి పరుగెత్తుకు రావడం, ఆకాశంలో చందమామను చూస్తూ...‘చందమామ రావేనా మొగుడిని తేవే’ అని శోకాలు తీస్తూ పాడటం.దాని పాటలు వినలేక ఛస్తున్నాననుకో!’’ మరో ఊళ్లో... ‘‘ఏంటయ్యా కోటేశ్వర్రావు అలా నెత్తి మీద వైట్క్లాత్ వేసుకొని ఏడుస్తున్నావు?’’‘‘చంద్రుడి మీద అడుగు మోపితే నీ ఆస్తులు రెట్టింపు అవుతాయని ఒక జ్యోతిష్యుడు చెబితే ఛలో చంద్రమండలం అంటూ పరుగులు తీశాను. అక్కడికి వెళ్లాక అర్థమైంది....’’‘‘ఏమైంది?’’‘‘నీకు మొదటి నుంచి చెప్పాలి. చంద్రమండలంలోని ముఖ్యమైన ప్రాంతాలను మన ఇండియన్ కంపెనీ ‘మస్కా’కు కాంట్రాక్ట్ ఇచ్చారట. ఈ ‘మస్కా’వాళ్లు అక్కడ తమ తడాఖా చూపిస్తున్నారు. బిగ్ ఫాల్కాన్ రాకెట్లో నుంచి చంద్రుడిపై అడుగుపెట్టగానే... ఆహా! ఎంత అందంగా ఉంది ఈ చంద్రలోకం అన్నాను అక్కడ కనిపించిన వాడితో. ఓకే సార్ అని ఒక చీటీ చేతిలో పెట్టాడు. అందులో 33 డాలర్లు అని ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 2,490 రూపాయలన్నమాట. ఎందుకు ఇది? అని అడిగితే...హియరింగ్ ట్యాక్స్. ఈలోకంలో ఏది వృథాగా వినరు. ట్యాక్స్ ఉంటుంది... అని చెప్పాడు. ఆ తరువాత... చంద్రమండలంలో ఒక వీధిలో నడిచి నడిచి ఫుట్‌పాత్‌పై ఉన్న ఒక బెంచిపై కూలబడ్డాను. ఇంతలో నా దగ్గరకు ఒక ఆఫీసర్ వచ్చి రసీదు చేతిలో పెట్టాడు. 249 డాలర్లు అని ఉంది. అనగామన ఇండియన్ కరెన్సీలో 18,290 రూపాయలు. ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచాను. ‘ఇక్కడ ఫ్రీగా కూర్చోవడం కుదరదు. బెంచి ట్యాక్స్ ఉంటుంది’ అన్నాడు. ఆ ట్యాక్స్ కూడా కట్టాను. వెంటనే మరో చీటీ చేతిలో పెట్టాడు. ‘ఇది ఎందుకు?’ అని అడిగాను. ఇంతకు ముందు ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచారు. ఇది ‘అరుపు ట్యాక్స్’ అన్నాడు. అదీ కట్టాను.‘‘ఛీ... పొరపాటున చంద్రలోకానికి వచ్చాను.భూమి మీద టోల్ట్యాక్స్లాంటి అయిదారు ట్యాక్స్‌లు కడితే సరిపోయేది. ఇక్కడేమిటి? ప్రతిదానికి తొక్కలో ట్యాక్సు’’ అన్నాను.మరో చీటీ చేతిలో పెట్టాడు.‘ఇది ఏమిటి?’ అన్నాను భయంగా.‘ఇన్సల్ట్ ట్యాక్స్.... పది లక్షల నలభైవేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు’ అన్నాడు గంభీరంగా.అదీ కట్టాను.చంద్రుడిపైకి అడుగు పెట్టి మళ్లీ తిరుగురాకెట్ ఎక్కేవరకు... కూర్చుంటే ట్యాక్స్, లేస్తే ట్యాక్స్, తుమ్మితే ట్యాక్సు, దగ్గితే ట్యాక్సు... మాట్లాడితే టాకింగ్ ట్యాక్స్, మాట్లాడకపోతే సైలెన్స్ ట్యాక్స్... ఇలా రకరకాల ట్యాక్స్‌లతో తడిసి మోపెడైంది. నా ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదీ సంగతి!’’ – యాకుబ్ పాషా -
తెలుసు..కానీ ఏమీ తెలియదు!
సర్వే ‘సమాచార యుగంలో ఉన్నాం’ అని గొప్పగా చెప్పుకుంటాంగానీ, కొన్ని విషయాల్లో మన జ్ఞానం అంతంతమాత్రమేనని ఇటీవల ఒక సర్వే నిరూపించింది. ‘‘గొప్ప అన్వేషకుడిగా కొలంబస్కు ఎందుకు పేరు?’’ అని అడిగితే బ్రిటన్‌లో 70 శాతం మంది తెల్లముఖం వేశారు. కొందరు ‘‘అతడి గురించి తెలుసు’’ అన్నా వివరాలు మాత్రం చెప్పలేకపోయారు. కొలంబస్ విజయాల గురించి తప్పుగా చెప్పారు. ‘‘కొలంబస్ ఏ దేశస్థుడు?’’ అని అడిగితే- ‘‘ఏ దేశమో ఏమిటి? మనవాడే కదా’’ అన్నారు కొందరు ఆయన ఇటలీయుడనే విషయాన్ని మరచి! ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ‘మార్క్‌టై్వన్ సృష్టించిన గొప్ప పాత్ర’ అన్నారు. బ్రిటన్‌కు చెందిన ఒక ట్రావెల్ కంపెనీ ఈ సర్వేను నిర్వహించింది. ‘‘ప్రపంచ ప్రసిద్ధ ప్రయాణాలు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. అయితే... ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లారు? అనేది మాత్రం అందరూ చెప్పలేకపోవచ్చు’’ అంటున్నారు ట్రావెల్ కంపెనీ వాళ్లు. ‘‘గుర్తుంటేనేం లేకుంటేనేం... ఆ అన్వేషకుల కృషి మనల్ని ఎంతో ప్రభావితం చేసింది. వాళ్లు మనకంటూ ఒక మార్గం ఏర్పరిచారు. ఆ అన్వేషణ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’’ అన్నాడు ఒక ప్రయాణ ప్రేమికుడు. అది సరేగానీ, బిబిసిలో ఏ ఎడ్వెంచర్ ప్రోగ్రాం గురించి అడిగినా ఠకీమని చెప్పే బ్రిటన్ ప్రజలు కొలంబస్ గురించి ఇన్ని రకాలుగా చెప్పడం ఏమిటి అనేది ఒక వింత!