![EaseMyTrip to set up offline retail stores through franchise model - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/24/Easy-my-trip.jpg.webp?itok=Qxqh5gdi)
హైదరాబాద్: ఈజ్‌మైట్రిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఫ్రాంచైజీ విధానంలో కస్టమర్లకు ట్రావెల్, ఇతర బుకింగ్ సేవలు అందించనుంది. స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోగలమన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ట్రావెల్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆసక్తితోపాటు, ధనికులైన క్లయింట్ల నెట్‌వర్క్, కస్టమర్లు, సొసైటీల నెట్‌వర్క్, అసోసియేషన్లతో సంబంధాలు కలిగిన వారు ఫ్రాంచైజీ ప్రారంభించొచ్చని సంస్థ తెలిపింది. అన్ని బుకింగ్ లావాదేవీలపై మెరుగైన కమీషన్ ఇస్తామని పేర్కొంది.
రోజులో 24 గంటల పాటు సపోర్ట్ సేవలతో, మూడు, నాలుగు నెలల్లోనే లాభనష్టాల్లేని స్థితికి చేరుకునేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపింది. ఈజ్‌మైట్రిప్ ద్వారా ఫ్లయిట్ల బుకింగ్, హోటల్ రూమ్‌లు, ఐఆర్‌సీటీసీ, క్యాబ్, బస్‌లు, క్రూయిజ్‌లు, చార్టర్ల సేవలు పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment