బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్‌ఫాస్ట్, ఆమ్‌స్టర్‌డామ్, రోట్టర్‌డామ్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్‌లో (ఫుట్‌బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్‌ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్‌ను మరింత చేరువ చేస్తుంది.
ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది.
వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్‌లు..
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్
బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)
గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)
ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)
లంక ప్రీమియర్ లీగ్
మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్‌ఏ)
నేపాల్ ప్రీమియర్ లీగ్
పాకిస్తాన్ సూపర్ లీగ్
SA20 (సౌతాఫ్రికా)
సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)
టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్)
Comments
Please login to add a commentAdd a comment