franchise
-
ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్‌పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు) -
IPL 2024: ఫ్రాంఛైజీ ఓనర్ల పేర్లు తెలుసా? వీరు స్పెషల్ అట్రాక్షన్!
-
తాజ్ కృష్ణ లో ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచెస్ ఎక్స్పో (ఫొటో గ్యాలరీ)
-
బాలీవుడ్లో కిక్ ఇస్తున్న ఫ్రాంచైజీ మూవీస్
బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీ మూవీస్ ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళితే.. మరికొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది విశేషం ఏంటంటే... వివిధ ఫ్రాంచైజీస్లోని మూడో భాగాలు కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరికొన్ని సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇలా ‘ఏక్ దో తీన్..’ అంటూ థర్డ్ పార్డ్తో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ టైగర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పదేళ్ల క్రితం విడుదలైన ‘ఏక్తా టైగర్’ ఒకటి. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ జిందా హై’ (2017)లోనూ సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇక సల్మాన్, కత్రినా ‘టైగర్ 3’కి కూడా జోడీ కట్టారు. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల మాదిరి ‘టైగర్ 3’ కూడా స్పై ఫిల్మే. ‘ఏక్తా టైగర్’కు కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించగా, ‘టైగర్ 3’కు మనీష్ శర్మ దర్శకుడు. ‘టైగర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించగా, హీరో హీరోయిన్లు మాత్రం సల్మాన్, కత్రినాలే కావడం ఓ విశేషం. ఓ వైపు దశ్యం.. మరోవైపు సింగమ్ హిందీ తెరపై ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్. హిందీ ‘దృశ్యం’ (2015), ‘దృశ్యం 2’ (2022) చిత్రాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మలయాళంలో హీరో మోహన్‌లాల్– దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు హిందీ రెండు భాగాల ‘దృశ్యం’ రీమేక్. అయితే ఈసారి మలయాళంలో మోహన్‌లాల్‌తో, హిందీలో అజయ్ దేవగన్‌తో ఒకేసారి ‘దృశ్యం 3’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట జీతూ జోసెఫ్. ఇక హిందీ ‘దృశ్యం’కు నిషికాంత్ కామత్, ‘దృశ్యం 2’కి అభిషేక్ పాతక్ దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి–హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్లో ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ల తర్వాత ‘సింగమ్ వన్స్ ఎగైన్’ చిత్రం తెరకెక్కనుంది. ఇలా డైరీలో రెండు థర్డ్ పార్ట్ చిత్రాలకు డేట్స్ కేటాయించారు అజయ్ దేవగన్. బిజీ కిలాడి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఈ బిజీ హీరో మూడు ఫ్రాంచైజీస్లోని మూడు థర్డ్ పార్ట్ సినిమాలకు అసోసియేట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హిట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘వెల్కమ్’ తప్పక ఉంటుంది. 2007లో వచ్చిన ‘వెల్కమ్’, 2015లో విడుదలైన ‘వెల్కమ్ బ్యాక్’ (వెల్కమ్ 2) చిత్రాల తర్వాత ‘వెల్కమ్ టు ది జంగిల్ (వెల్కమ్ 3)’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘వెల్కమ్, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాలకు అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించగా, ‘వెల్కమ్ టు ది జంగిల్’ను దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘హేరా ఫేరీ’ (2000), ‘ఫిర్ హేరా ఫేరీ’ (2006) చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హేరా ఫేరీ’ థర్డ్ పార్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని.. ఈ మూడో భాగంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటించనున్నామని ఇటీవల సునీల్ శెట్టి పేర్కొన్నారు. మరోవైపు ‘జాలీ ఎల్ఎల్బీ 3’ ఉంటుందని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటిస్తామన్నట్లుగా అర్షద్ వార్సీ ఇటీవల పేర్కొన్నారు. 2013లో ‘జాలీ ఎల్ఎల్బీ’, 2017లో ‘జాలీఎల్ఎల్బీ 2’ చిత్రాలు వచ్చాయి. కొత్త డాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చాడు. ఈ డాన్ పేరు రణ్వీర్ సింగ్. హిందీలో ‘డాన్’ అనగానే తొలుత అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుక్ ఖాన్ గుర్తొస్తారు. రచయితలు సలీమ్–జావేద్‌లు సష్టించిన డాన్ క్యారెక్టర్‌తో అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో చంద్ర బరోత్ తెరకెక్కించిన ‘డాన్’ (1978) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ తొలి డాన్‌గా అమితాబ్‌ని నిలిపింది. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు ‘డాన్’ సినిమా ఆధారంగానే ఫర్హాన్ అక్తర్ 2006లో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ తీశారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. షారుక్ కూడా బెస్ట్ డాన్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ (2011) వచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే ‘డాన్ 3’ తెరకెక్కనుంది. అయితే ఇందులో షారుక్ నటించడంలేదు. డాన్‌గా రణ్వీర్ íసింగ్ నటిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్రం ఒక సినిమా హిట్ సాధించిన తర్వాత, ఆ సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చిన సినిమాలు బాలీవుడ్లో చాలా ఉన్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే వెల్లడించారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ట్ 1 శివ’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 2: దేవ్’, ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 3’ చిత్రాలకు సంబంధించిన ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. అయితే సెకండ్, థర్డ్ పార్ట్ షూటింగ్ ఒకేసారి జరుగుతుందని వరు సగా 2026, 2027లో ఈ సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజా ్రపాజెక్ట్ ‘వార్ 2’ కాబట్టి ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇటు ప్రేమ.. అటు భయం ‘ప్రేమ.. జీవితాన్ని జీవించేలా చేస్తుంది’ అంటూ 1990లో వచ్చిన ‘ఆషికీ’కి బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కాగా రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఆషికీ 2’ (2013) సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ‘ఆషికీ 3’కి శ్రీకారం జరిగింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. మరోవైపు హారర్ ఫిల్మ్ ‘భూల్ భూలెయ్య 3’లో కూడా హీరోగా నటిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. ‘భూల్ భూలెయ్య 2’ను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ, ఆ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లోనే ‘భూల్ భూలెయ్య 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియ దర్శన్ దర్శకత్వంలో 2007లో ‘భూల్ భూలెయ్య’ చిత్రం విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ ఫుక్రే హీరో పుల్కిత్ సామ్రాట్, దర్శకుడు మగ్దీప్ సింగ్ లంబా కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఫుక్రే 3’ ఈ నెల 28న విడుదల కానుంది. 2013లో వచ్చిన ‘ఫుక్రే’, 2017లోని ‘ఫుక్రే రిటర్న్స్’ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ‘ఫుక్రే రిటర్న్స్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఇలా బాలీవుడ్లో ముస్తాబు అవుతున్న మూడో భాగం చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్‌తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
ఈజ్‌మైట్రిప్ ఫ్రాంచైజీ స్టోర్లు, బుకింగ్ ఈజీ
హైదరాబాద్: ఈజ్‌మైట్రిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఫ్రాంచైజీ విధానంలో కస్టమర్లకు ట్రావెల్, ఇతర బుకింగ్ సేవలు అందించనుంది. స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోగలమన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ట్రావెల్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆసక్తితోపాటు, ధనికులైన క్లయింట్ల నెట్వర్క్, కస్టమర్లు, సొసైటీల నెట్వర్క్, అసోసియేషన్లతో సంబంధాలు కలిగిన వారు ఫ్రాంచైజీ ప్రారంభించొచ్చని సంస్థ తెలిపింది. అన్ని బుకింగ్ లావాదేవీలపై మెరుగైన కమీషన్ ఇస్తామని పేర్కొంది. రోజులో 24 గంటల పాటు సపోర్ట్ సేవలతో, మూడు, నాలుగు నెలల్లోనే లాభనష్టాల్లేని స్థితికి చేరుకునేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపింది. ఈజ్‌మైట్రిప్ ద్వారా ఫ్లయిట్ల బుకింగ్, హోటల్ రూమ్‌లు, ఐఆర్సీటీసీ, క్యాబ్, బస్‌లు, క్రూయిజ్‌లు, చార్టర్ల సేవలు పొందొచ్చు. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!
Triumph Tiger 900 Bond Edition: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. నిర్మాణ సంస్థలు అదే స్థాయిలో విలువలను పాటిస్తూ బాండ్ సినిమాలను రూపొందిస్తాయి. సినిమా అయ్యే ఖర్చు గురించి అసలు పట్టించుకోరు. త్వరలోనే జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ చిత్రం‘నో టైం టూ డై’ ప్రేక్షకులకు ముందు రానుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! జేమ్స్ బాండ్ 007 ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంఫ్ మోటార్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను ప్రకటించింది. ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ని మార్కెట్లలోకి కంపెనీ టీజ్ చేసింది. ట్రయంఫ్ మోటార్స్ కేవలం 250 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. గతంలో ట్రయంఫ్ మోటార్స్ జేమ్స్ బాండ్ ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంప్ స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది. టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ విషయానికి వస్తే..ప్రత్యేకమైన మాట్ సఫైర్ బ్లాక్ పెయింట్‌తో 007 గ్రాఫిక్స్‌తో ఈ బైక్ రానుంది. బిల్లెట్ మెషిన్డ్ హ్యాండిల్ బార్ క్లాంప్‌తో పాటు బైక్ ప్రత్యేకమైన లిమిటెడ్-ఎడిషన్ నంబర్‌తో వస్తుంది. బైక్‌లో ఫ్రేమ్, హెడ్‌లైట్ ఫినిషర్లు, సైడ్ ప్యానెల్లు, సంప్ గార్డ్, పిలియన్ ఫుట్‌రెస్ట్ హ్యాంగర్లు, ఇంజిన్ గార్డ్లు అన్నీ ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్‌తో రానున్నాయి. బైక్ స్పీడో మీటర్ 007బాండ్ సిగ్నేచర్‌ను ఏర్పాటుచేశారు. అదనపు పెర్ఫార్మెన్స్ కోసం మిచెలిన్ అనకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్స్‌ను అమర్చారు. కాగా ఈ బైక్ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు, టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ యూరోప్, యుఎస్ఏ, కెనడాలోని కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: No Time Time To Die: గన్నులున్న జేమ్స్‌బాండ్ కారు.. అమ్మకానికి రెడీ ! -
కోట్లకు... ఆటకు కుదరని మైత్రి
ఐపీఎల్ అంటేనే అంకెలు... పరుగులు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కలు కూడా కీలకం. డబ్బే ముఖ్యం కాదు అంటూ బయటకు ఎన్ని మాటలు చెప్పినా, క్రికెటర్లు సహజంగానే భారీ మొత్తాలను కోరుకుంటారు. అటు టీమ్ యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగి నంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తాయి. దాంతో క్రికెటర్లపై కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి ఉంటుంది. చాలాసార్లు ఆ భారాన్ని మోయలేక క్రికెటర్లు విఫలమైతే, కొన్నిసార్లు మాత్రం వారు అంచనాలు అందుకుంటారు. చేసే ప్రతీ పరుగును, తీసే ప్రతీ వికెట్‌ను ఇచ్చిన మొత్తంతో గుణింతాలు, భాగహారాలతో లెక్కించి పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఐపీఎల్–2020లో ఇప్పటివరకు ‘భారీ’ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే.... ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వేలంలో విలువ: రూ. 15 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బౌలర్‌గా కమిన్స్ ఈసారి బరిలోకి దిగాడు. టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిన్స్ టి20లకు వచ్చేసరికి తేలిపోయాడు. యూఏఈలోని నెమ్మదైన పిచ్‌లు కూడా అతని శైలికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఇప్పటికీ లయ అందుకునేందుకు అతను తిప్పలు పడుతూనే ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో ఒక్కసారీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శన లేకపోగా... 2 వికెట్లే తీసిన అతను కనీసం ఒక్క ఓవర్ కూడా మెయిడిన్‌గా వేయలేకపోయాడు. 111 సగటు అతి పేలవం కాగా... 8.53 ఎకానమీ చూస్తే భారీగా పరుగులిచ్చినట్లు అర్థమవుతోంది. ఇది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సమస్యగా మారింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) వేలంలో విలువ: రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రదర్శన: ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్‌వెల్ ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. నిజానికి ఇంత మొత్తం చెల్లించి తీసుకున్న ఆటగాడిని ఎలా వాడుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో పంజాబ్ ఉంది. 8 మ్యాచ్‌లలో కలిపి అతను ఆడింది 61 బంతులే... దాదాపు మ్యాచ్ ముగిసే సమయంలో క్రీజ్‌లోకి వస్తున్న అతను బంతులకంటే తక్కువ పరుగులు (58) చేయడం ఆశ్చర్యకరం. కోల్‌కతాతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా మ్యాక్స్‌వెల్‌కంటే ముందు కనీసం ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అనుభవం కూడా లేని ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంపించారంటే మ్యాక్స్‌వెల్‌పై ఎంత అపనమ్మకమో అర్థమవుతుంది. లీగ్‌లో అతను ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. అతనికి చెల్లించిన మొత్తంతో పోలిస్తే మ్యాక్సీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్. షెల్డన్ కాట్రెల్ (పంజాబ్) వేలంలో విలువ: రూ. 8 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ప్రధాన పేసర్‌గా పంజాబ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘సెల్యూట్’ కాట్రెల్ దానికి తగినట్లుగా రాణించలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా... 8.80 ఎకానమీ చూస్తే పరుగులు నిరోధించడంలో కూడా అతను విఫలమైనట్లు కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో తుది జట్టు నుంచి తప్పించడాన్ని చూస్తే సీజన్లో మిగిలిన మ్యాచ్‌లలో కూడా పంజాబ్ అతడికి అవకాశం ఇస్తుందా లేదా అనేది సందేహమే. జైదేవ్ ఉనాద్కట్ (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో ఐపీఎల్ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన ఉనాద్కట్... వాటితో పోలిస్తే ఈసారి తక్కువ మొత్తానికే రాజస్తాన్‌కు అందుబాటులోకి వచ్చాడు. లీగ్‌కు ముందు సౌరాష్ట్ర కెప్టెన్‌గా జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను లీగ్‌కు వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే. చెప్పుకోదగ్గ స్పెల్ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్ 9.57 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆరోన్ ఫించ్ (బెంగళూరు) వేలంలో విలువ: రూ. 4 కోట్ల 40 లక్షలు ప్రదర్శన: ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఓవరాల్ ప్రదర్శన పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నా, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ నుంచి ఆశించింది మాత్రం ఇది (ఒక అర్ధసెంచరీ) కాదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి స్ట్రయిక్‌రేట్ 113.69 మాత్రమే, అదీ ఓపెనర్‌గా ఉంటూ చేయడం అంటే వైఫల్యం కిందే లెక్క. ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్ కూడా అతడినుంచి రాలేదు. రాబిన్ ఉతప్ప (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో కోల్‌కతా జట్టులో కీలక సభ్యుడిగా ఆ జట్టు రెండు టైటిల్స్ సాధించడంలో భాగమైన రాబిన్ ఉతప్పలో జోరు తగ్గినా... రాజస్తాన్ పెద్ద మొత్తానికి అతడిని తీసుకుంది. అయితే ఉతప్ప మరింత పేలవంగా ఆడి ఫ్రాంచైజీని నిరాశపర్చాడు. 6 మ్యాచ్‌లలో కలిపి ఉతప్ప చేసింది 83 పరుగులే (84 బంతుల్లో). తుది జట్టులో భారత ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో ఉతప్ప వైఫల్యం రాయల్స్ కూర్పును దెబ్బ తీసింది. ఇది భిన్నమైన పరిస్థితి... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ నాథన్ కూల్టర్‌నైల్‌ను ముంబై రూ. 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అతడిని తుది జట్టులో ఆడించేందుకు వారికి అవకాశం లభించడం లేదు. బౌల్ట్ చక్కగా రాణిస్తుండగా, ముంబై తుది జట్టు చక్కగా కుదురుకోవడంతో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. పూర్తి ఫిట్‌గా ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం లభించని కూల్టర్‌నైల్ పర్సులో మాత్రం భారీ మొత్తం చేరడం విశేషం. రూ. 10 కోట్లు ఇచ్చిన క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)ను బెంగళూరు ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడించింది. ఇకపై అతడికి వరుసగా అన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. -
లిన్, ఉనాద్కట్, మిల్లర్లకు గుడ్‌బై
ముంబై: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం జరగనుండగా ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది. మొత్తం 71 మంది ఆటగాళ్లను జట్లు విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 8.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8.4 కోట్లు), ఆండ్రూ టై (రూ. 7.2 కోట్లు), స్యామ్ కరన్ (రూ. 7.2 కోట్లు), ఉతప్ప (రూ. 6.4 కోట్లు)లను ఫ్రాంచైజీలు వద్దనుకోవడం విశేషం. ఫ్రాంచైజీలు విడుదల చేసిన కొందరు గుర్తింపు ఉన్న ఆటగాళ్లను చూస్తే... చెన్నై: స్యామ్ బిల్లింగ్స్, మోహిత్ శర్మ. ఢిల్లీ: మోరిస్, మున్రో, ఇంగ్రామ్, విహారి. పంజాబ్: మిల్లర్, టై, స్యామ్ కరన్, వరుణ్ చక్రవర్తి. కోల్‌కతా: లిన్, ఉతప్ప, చావ్లా, బ్రాత్‌వైట్. ముంబై: యువరాజ్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్. రాజస్తాన్: ఉనాద్కట్, బిన్నీ. బెంగళూరు: గ్రాండ్‌హోమ్, స్టెయిన్, స్టొయినిస్, కూల్టర్ నీల్, హెట్‌మైర్, సౌతీ. హైదరాబాద్: యూసుఫ్ పఠాన్, గప్టిల్, షకీబ్, రికీ భుయ్, దీపక్ హుడా. -
షావోమికు ఝలక్ : నకిలీ ఎంఐ స్టోర్లు
సాక్షి, న్యూఢిల్లీ : షావోమి ఇండియాకు నకిలీల బెడద తప్పలేదు. ఏకంగా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్‌కు దేశీయంగా అక్రమార్కులు భారీ ఝలక్ ఇచ్చింది. తప్పుడు సంతకాలతో, నకిలీ పత్రాలతో ఫ్రాంచైజీలను ఓపెన్ చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ స్కాం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనికి సంబంధించి పత్రాలను కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ నకిలీలు స్టోర్లు, మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది రీటైలర్లు తమను మోసం చేశారని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎంఐ స్టోర్లు కొనుగోలుకు సంబంధించిన ఈ స్కాంలో కొంతమంది రీటైలర్ల అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ట్వీట్ చేశారు. దీనిపై విచారణ సాగుతోందని వెల్లడించారు. FRAUD ALERT! I have come across a scam where few retailers have been cheated into buying fake franchises of @XiaomiIndia Mi Stores! Shocking to see forged documents, with my fake signatures. We have filed a case with cyber crime department & police is investigating this matter. pic.twitter.com/AbK6Pvfbei — Manu Kumar Jain (@manukumarjain) February 12, 2019 -
ఆ నిర్ణయం ఫ్రాంచైజీదే
మొహాలి: ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‘మెంటార్ అండ్ హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్’ పదవి నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తనంతట తానుగా బయటకు రాలేదని వెల్లడించాడు. ఈ నిర్ణయం ఫ్రాంచైజీదేనని అతను స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టు తమకు బ్రాండ్ అంబాసిడర్ లేదా మెంటార్ అవసరం లేదని భావించి సెహ్వాగ్ సేవలకు ముగింపు పలికింది. ‘ఫ్రాంచైజీ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. తమకు ఇకపై బ్రాండ్ అంబాసిడర్ కానీ లేదా మెంటార్ కానీ అవసరం లేదని వారు అందులో తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు పంజాబ్ జట్టులో భాగంగా ఉండటం సంతోషం. నేను తప్పుకోవాలనేది వారి నిర్ణయం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. గతంలో ఒకసారి ప్రీతి జింటాతో చెలరేగిన వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వారు కొత్త మెంటార్ లేదా కొత్త అంబాసిడర్ కావాలని కోరుకుంటే అది వారి ఇష్టం’ అని సెహ్వాగ్ చెప్పాడు. -
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సచిన ఎంట్రీ
-
కంట్రీ ఓవెన్ ఫ్రాంచైజీ బాట
♦ దేశవ్యాప్తంగా ఔట్లెట్ల ఏర్పాటు ♦ యూఎస్‌లోనూ మరిన్ని స్టోర్లు ♦ ఏడాదే ప్యాకేజ్డ్ విభాగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బేకరీ ఉత్పత్తుల తయారీ, విక్రయంలో ఉన్న కంట్రీ ఓవెన్ ... ఫ్రాంచైజీ బాట పట్టింది. 1993 నుంచి ఈ రంగంలో ఉన్న కంపెనీ ప్రస్తుతం యూఎస్‌లో 4, భారత్‌లో 26 కేంద్రాలను సొంతంగా నిర్వహిస్తోంది. రెండేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో మొత్తం ఔట్లెట్ల సంఖ్యను 100కు చేర్చాలని నిర్ణయించింది. ఫ్రాంచైజీ ఏర్పాటుకు వివిధ నగరాల నుంచి చాలా మంది ఔత్సాహికులు సంసిద్ధత వ్యక్తం చేశారని కంట్రీ ఓవెన్‌ను ప్రమోట్ చేస్తున్న పొల్సాని గ్రూప్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. చాలా కాలం నుంచి వినతులు వచ్చినప్పటికీ బ్రాండ్‌ను స్థిరపరిచిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించామన్నారు. కంట్రీ ఓవెన్‌కు 8 లక్షలకుపైగా రెగ్యులర్ కస్టమర్లున్నారని చెప్పారు. ఒక్కో స్టోర్‌కు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరం అవుతుందన్నారు. చిన్న నగరాల కు విస్తరణ.. కేక్స్, కన్ఫెక్షనరీ, ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ వంటి 500లకుపైగా రకాలు కంట్రీ ఓవెన్ ఔట్లెట్లలో లభిస్తాయి. భారతీయ ఫాస్ట్ ఫుడ్, కేక్స్‌కు యూఎస్‌లో మంచి ఆదరణ ఉందని కంపెనీ తెలిపింది. కస్టమర్లలో 70 శాతం ఎన్నారైలు, 30% స్థానికులని సుధాకర్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ మరో 10 స్టోర్లను తెరుస్తామని చెప్పారు. భారత్‌లో ఔట్లెట్ల ఏర్పాటుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశిస్తామని వెల్లడించారు. కంట్రీ ఓవెన్‌తోపాటు ఫుడ్ రిటైల్ షాపుల ద్వారా వీటిని విక్రయిస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణ పూర్తి అయితే మరో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. భారత్‌లో తొలి ఈ-కామర్స్ సైట్ కంట్రీ ఓవెన్దేనని గుర్తు చేశారు. -
బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతూ తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎలా ఓటు వేస్తారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాకు చెందిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ డివిజన్లో ఓటు వేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసనసభకు పోటీ చేయొచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం లోక్ సభకు పోటీ చేయడానికి దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాగే ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే సంబంధిత జిల్లాలో ఓటరై ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాలకృష్ణ మరో రాష్ట్రంలో ఓటు వేయడం చట్ట వ్యతిరేక చర్య అవుతుందని, తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తన ఫిర్యాదును అందించారు. -
గర్జించిన ఇషాంత్
ఆరు వికెట్లతో చెలరేగిన పేసర్ షమీకి 4 వికెట్లు న్యూజిలాండ్ 192 ఆలౌట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 100/2 రెండో టెస్టు పేసర్లు ఇషాంత్, షమీ విశ్వరూపం చూపడంతో రెండో టెస్టులో న్యూజిలాండ్ కుప్పకూలింది. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమై మ్యాచ్‌లో వెనుకబడింది. మరోవైపు ధావన్ దూకుడుతో భారత్ రెండో టెస్టులో తొలిరోజే పట్టు సాధించింది. వెల్లింగ్టన్: వన్డే జట్టులో చోటు దక్కలేదు... ఐపీఎల్ వేలంలో పెద్దగా ధర పెట్టని ఫ్రాంచైజీలు... అసలు జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని తీవ్రమైన విమర్శలు... ఈ నేపథ్యంలో భారత పేసర్ ఇషాంత్ శర్మ (6/51) గర్జించాడు. ‘పచ్చిక’ వికెట్‌తో దెబ్బతీస్తామన్న ఆతిథ్య జట్టును బుల్లెట్ బంతులతో నిలువెల్లా వణికించాడు. ఇన్నాళ్లూ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఫలితంగా బేసిన్ రిజర్వ్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 52.5 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. విలియమ్సన్ (100 బంతుల్లో 47; 6 ఫోర్లు), నీషమ్ (35 బంతుల్లో 33; 7 ఫోర్లు), సౌతీ (32 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. షమీ 4 వికెట్లతో రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. ధావన్ (87 బంతుల్లో 71 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్సర్), ఇషాంత్ (16 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో 3 వికెట్లు న్యూజిలాండ్‌లో వరుసగా ఏడోసారి టాస్ గెలిచిన ధోని... కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఆరంభంలో జహీర్, షమీ లైన్ దొరక్క ఇబ్బంది పడటంతో 8వ ఓవర్లోనే ఇషాంత్ బౌలింగ్‌కు దిగాడు. పిచ్‌పై ఉండే తేమను సద్వినియోగం చేసుకుంటూ తొలి నాలుగు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్ (12), ఫుల్టన్ (13), లాథమ్ (0)లను అవుట్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు. విలియమ్సన్తో జత కలిసిన మెకల్లమ్ (8) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇషాంత్‌ను 9 ఓవర్లపాటు కొనసాగించిన కెప్టెన్... జహీర్ స్థానంలో షమీని రెండో స్పెల్‌కు దించాడు. ఈ వ్యూహం ఫలించింది. షమీ వేసిన బంతిని పేలవ షాట్ ఆడిన మెకల్లమ్ మిడాఫ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. లంచ్‌కు ముందు ఓవర్లో విలియమ్సన్ అవుటైనా... నో బాల్ కావడంతో బతికి బయటపడ్డాడు. ఫలితంగా కివీస్ 51/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. విలియమ్సన్ నిలకడ తొలి సెషన్లో జరిగిన నష్టాన్ని నివారించేందుకు విలియమ్సన్, అండర్సన్ (24)లు లంచ్ తర్వాత నిలకడకు ప్రాధాన్యమిచ్చారు. అయితే కొద్దిసేపటి తర్వాత భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అండర్సన్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు. కానీ 34వ ఓవర్లో ఇషాంత్ వేసిన బంతి ఇన్సైడ్ బ్యాట్, ప్యాడ్లకు రాసుకుంటూ నేరుగా గల్లీలో ఉన్న కోహ్లి చేతిలోకి వెళ్లింది. దీంతో వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు నెలకొన్న 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తన తర్వాతి ఓవర్లోనే ఇషాంత్... వాట్లింగ్ (0)ను డకౌట్ చేసి ఐదో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఓవర్లో విలియమ్సన్ క్యాచ్ అవుటైనా... నో బాల్ కావడంతో మరోసారి గట్టెక్కాడు. చివరకు నీషమ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించి... షమీ ఓవర్లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌతీతో కలిసి కాసేపు నిలకడగా ఆడిన నీషమ్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాక షమీ బౌలింగ్‌లోనే ధోని క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. చెలరేగిన ధావన్ టీ తర్వాత వచ్చి రావడంతోనే సౌతీ దూకుడుగా ఆడాడు. జడేజా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే బౌల్ట్ (2)ను షమీ పెవిలియన్‌కు పంపడంతో ఓ మోస్తరు స్కోరుకే కివీస్ ఆలౌటైంది. తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత ఓపెనర్లలో విజయ్ (2) వెంటనే అవుటైనా... ధావన్ ఆకట్టుకున్నాడు. పుజారా (19)తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. అడపాదడపా బౌండరీలు బాదిన ఓపెనర్ ధావన్.. వాగ్నేర్ వేసిన 23వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిపోయాడు. అయితే ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా పుజారా అవుటయ్యాడు. నైట్ వాచ్‌మన్ ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. 1 న్యూజిలాండ్‌లో రెండుసార్లు ఆరు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఇషాంత్. గత 30 ఏళ్లలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత పేసర్లు కలిపి పది వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 1983లో కపిల్ (9/83), బల్విందర్ సంధు(1/45) ఈ ఫీట్‌ను సాధించారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 13; రూథర్‌ఫోర్డ్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 12; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) షమీ 47; లాథమ్ (సి) ధోని (బి) ఇషాంత్ 0; బి.మెకల్లమ్ (సి) జడేజా (బి) షమీ 8; అండర్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 24; వాట్లింగ్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; నీషమ్ (సి) ధోని (బి) షమీ 33; సౌతీ (సి) విజయ్ (బి) ఇషాంత్ 32; వాగ్నేర్ నాటౌట్ 5; బౌల్ట్ (సి) పుజారా (బి) షమీ 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (52.5 ఓవర్లలో ఆలౌట్) 192. వికెట్ల పతనం: 1-23; 2-26; 3-26; 4-45; 5-84; 6-86; 7-133; 8-165; 9-184; 10-192 బౌలింగ్: జహీర్ 17-3-57-0; షమీ 16.5-4-70-4; ఇషాంత్ 17-3-51-6; జడేజా 2-1-12-0 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ బ్యాటింగ్ 71; విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 2; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 19; ఇషాంత్ బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (28 ఓవర్లలో 2 వికెట్లకు) 100. వికెట్ల పతనం: 1-2; 2-89 బౌలింగ్: బౌల్ట్ 9-4-18-1; సౌతీ 7-0-20-1; వాగ్నేర్ 7-0-36-0; అండర్సన్ 3-0-14-0; నీషమ్ 2-0-8-0. సెషన్-1: ఓవర్లు: 26; పరుగులు: 51; వికెట్లు: 4 సెషన్-2: ఓవర్లు: 23; పరుగులు: 115; వికెట్లు: 4 సెషన్-3: ఓవర్లు: 3.5; పరుగులు: 26; వికెట్లు: 2 (కివీస్) ఓవర్లు: 28; పరుగులు: 100; వికెట్లు: 2 (భారత్) -
‘పిచ్’ నెమ్మదించింది!
అత్యుత్సాహం చూపించని ఫ్రాంచైజీలు వేలంలో ఆచితూచి అడుగులు వేలంలో కొన్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 154 భారత ఆటగాళ్లు: 104 విదేశీ ఆటగాళ్లు: 50 వేలంలో అయిన ఖర్చు: రూ. 262.60 కోట్లు సాక్షి క్రీడా విభాగం ఐపీఎల్ కోసం గతంలో కనిపించిన ‘వేలం’వెర్రికి ఈ సారి అన్ని ఫ్రాంచైజీలు దూరంగా ఉన్నాయి. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి కాకుండా జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకున్నట్లుగా అర్థమవుతోంది. తమ వద్ద అందుబాటులో ఉన్న డబ్బును కూడా విచ్చలవిడిగా కాకుండా ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వాడుకున్నాయి. గతంలో చెన్నై, ముంబైవంటి జట్లు 30కి పైగా ఆటగాళ్ల బృందంతో లీగ్ బరిలోకి దిగేవి. ఇందులో చాలా మంది ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోయేది. రెండేళ్ల క్రితమైతే ముంబై జట్టు లీగ్ మధ్యలో తమ జట్టులో సగం మంది ఆటగాళ్లను జట్టు బస చేసిన హోటల్లోనే ఉంచి 15 మందితో మిగతా నగరాల్లోని మ్యాచ్‌లకు వెళ్లింది. ఆటగాళ్ల సంఖ్యను ఈ సారి 27కు పరిమితం చేసినా... ఏ జట్టూ 25 మందికి మించి క్రికెటర్లను తీసుకోకపోవడం విశేషం. నిలకడే కీలకం... గతంలో ఎంత గొప్ప రికార్డు ఉన్నా...ప్రస్తుత ఫామ్‌పైనే ఎక్కువ జట్లు దృష్టి పెట్టాయి. సెహ్వాగ్ విలువ భారీగా తగ్గేందుకు కారణమిదే. యువరాజ్‌కు కూడా ఇటీవల వైఫల్యాలు ఉన్నా, టి20 ఫార్మాట్లో అతను ఇప్పటికీ ప్రమాదకరమైన ఆటగాడే. దినేశ్ కార్తీక్‌కు మాత్రం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఇవి మినహా ఇతర ఆటగాళ్ల ఎంపిక పూర్తిగా క్యాలిక్యులేటెడ్‌గా సాగిందనే భావించాలి. అండర్సన్ గురించి భారీగా మీడియాలో అంచనాలు పెరిగినా...జట్ల యజమానులు ఎగబడిపోలేదు. కాబట్టే అతనికి రూ. 4.5 కోట్లు దక్కాయి. ఎప్పుడో మెరుపులు మెరిపించిన దిల్షాన్‌లాంటి ఆటగాళ్లపై కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. జంబో టీమ్‌ను తీసుకొని డగౌట్లో ఖాళీగా కూర్చోబెట్టలేమంటూ తమ ఉద్దేశాన్ని బయట పెట్టాయి. దేశవాళీ స్టార్లు... ఈ సారి వేలానికి వచ్చే ముందు అన్ని జట్లు దేశవాళీ క్రికెటర్ల గురించి కూడా మంచి హోమ్‌వర్క్ చేసినట్లున్నాయి. గత ఏడాది బెస్ట్ అండర్-25 ప్లేయర్ అవార్డు అందుకున్న కరణ్ శర్మ, ఈ ఏడాది రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన కేదార్ జాదవ్, అత్యధిక వికెట్లు తీసిన రిషి ధావన్‌లకు కనిపించిన డిమాండే ఇందుకు ఉదాహరణ. రంజీ ట్రోఫీలో కర్ణాటక విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లకు భారీ మొత్తమే లభించగా...ఈ సీజన్లో ఆకట్టుకున్న గౌతమ్, మయాంక్ అగర్వాల్, గురుకీరత్, పర్వేజ్ రసూల్‌లతో పాటు బుమ్రాకు కూడా మంచి విలువే దక్కింది. విదేశీయులపైనా కన్ను... గత ఐపీఎల్ వేలంతో పోలిస్తే ఈ సారి విదేశీ ఆటగాళ్లు ఎవరూ రికార్డు మొత్తాలను మూటగట్టుకోలేరు. అయితే టి20ల్లో చక్కటి నైపుణ్యం ఉన్న క్రికెటర్లపై వేలంలో ఆసక్తి కనిపించింది. దక్షిణాఫ్రికా దేశవాళీ టి20లో అత్యధిక వికెట్లు తీసిన హెండ్రిక్స్, బిగ్‌బాష్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బెన్ డంక్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన కృష్మార్ సాంటోకిలకు ఐపీఎల్లో గుర్తింపు దక్కింది. మాడిసన్, డి కాక్, కూపర్, హెన్రిక్స్ ఈ జాబితాలోనివారే. -
కుర్రాళ్లపైనా... కాసుల వర్షం!
స్పిన్నర్ కరణ్ శర్మకు జాక్‌పాట్ రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు వెచ్చించిన పంజాబ్ టేలర్‌ను కరుణించిన ఢిల్లీ పెద్దగా అనుభవం లేకపోయినా... ఆటలో నైపుణ్యం ఉన్న కుర్రాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. రెండో రోజు జరిగిన వేలంలోనూ... జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో సమానంగా దేశవాళీ ఆటగాళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంగా డబ్బును ఖర్చు చేశాయి. దాదాపు తొమ్మిది మంది అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలకుపైగా చెల్లించి ఔరా అనిపించాయి. కళ్లు బైర్లుకమ్మే రీతిలో ఆల్‌రౌండర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేస్తే... రిషి ధావన్ అంచనాలను మించిపోయాడు. మొత్తానికి కుబేరునికి కూడా అసూయ పుట్టేలా నోట్ల కట్టలతో క్రికెట్ ఆడుకున్నారు. బెంగళూరు: అంతర్జాతీయ స్టార్లపై పెద్దగా ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. దేశవాళీ కుర్రాళ్లపై మాత్రం కాసుల వర్షం కురిపించాయి. ఓ స్థాయి మేరకు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో గురువారం కొనసాగిన ఐపీఎల్-7 వేలంలో రైల్వేస్ లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శర్మను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ రిషి ధావన్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నా... పంజాబ్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లను రెండోసారి వేలంలో పెట్టినా ఒకరిద్దరిపై మాత్రమే ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. హైదరాబాద్ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, విహారి ఈసారి అమ్ముడుపోలేదు. వేలం విశేషాలు వేలంలో మొదటగా ఎస్.అనిరుధ పేరును పిలవగా, ఎలాంటి పోటీ లేకుండా సన్‌రైజర్స్ కనీస ధరకే దక్కించుకుంది. గురుకీరత్ సింగ్ (రూ. 1.3 కోట్లు) కోసం ముంబై, రాజస్థాన్, కోల్‌కతా పోటీపడినా.. పంజాబ్ సొంతమయ్యాడు. మొదట ఉన్ముక్త్ చంద్ (రూ.65 లక్షలు)పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఢిల్లీ ఆలస్యంగా స్పందిస్తే.. ముంబైతో పోటీపడి రాజస్థాన్ గెలుచుకుంది. మనీష్ పాండే (రూ. 1.70 కోట్లు) కోసం ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే కోల్‌కతా అత్యధికంగా చెల్లించింది. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు)ను సన్‌రైజర్స్ కొనుక్కున్నా.. ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది. ఆదిత్య తారే (రూ. 1.60 కోట్లు) కోసం ముంబై చివరి వరకు పోరాడి సొంతం చేసుకుంది. గత సీజన్లో కోల్‌కతాకు ఆడిన రజత్ భాటియా (రూ. 1.70 కోట్లు)కు రాజస్థాన్ భారీ మొత్తాన్ని ఇచ్చింది. మన్దీప్ (రూ. 80 లక్షలు)ను సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నా... పంజాబ్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా తీసేసుకుంది. పర్వేజ్ రసూల్ (రూ. 95 లక్షలు) కోసం ఢిల్లీ చివరి వరకు పోరాడినా... సన్‌రైజర్స్ ప్రయత్నం సఫలమైంది. టెన్ డస్కెట్ (రూ. 1 కోటి), మిథున్ మన్హాస్ (రూ. 30 లక్షలు)ను వారి కనీస ధరలకే కోల్‌కతా, చెన్నైలు సొంతం చేసుకున్నాయి. ధావల్ కులకర్ణి (రూ. 1.10 కోట్లు) కోసం ఢిల్లీ తీవ్రంగా పోరాడి... రాజస్థాన్ చేతిలో భంగపడింది. గత సీజన్లో తమ జట్టుకు ఆడిన 20 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా (రూ. 1.20 కోట్లు) కోసం ముంబై భారీగా ఖర్చు చేసింది. ప్రవీణ్ తాంబే (రూ. 10 లక్షలు)ను కనీస ధరకే పంజాబ్ కొనుక్కున్నా... రాజస్థాన్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డును ఉపయోగించుకుంది. సన్‌రైజర్స్ దక్కించుకున్న షాబాజ్ నదీమ్ (రూ. 85 లక్షలు)ను ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది. ఇటీవల భారత జట్టుకు ఎంపికైన ఈశ్వర్ పాండే (రూ. 1.50 కోట్లు) కోసం సన్‌రైజర్స్ పోటీపడినా చెన్నై దక్కించుకుంది. హైదరాబాద్ ఆటగాళ్లు విహారి, తిరుమల శెట్టి సుమన్ ఈసారి అమ్ముడుపోలేదు. ఆశిష్ రెడ్డి (రూ. 20 లక్షలు)ని సన్‌రైజర్స్ తీసుకుంది. జలజ్ సక్సేనా (రూ. 90 లక్షలు)ను ముంబై సొంతం చేసుకుంది. రాజస్థాన్ పట్టేసిన హర్షల్ పటేల్ (రూ. 40 లక్షలు)ను ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా బెంగళూరు దక్కించుకుంది. రెండోసారి వేలంలోకి వచ్చిన రాస్ టేలర్ (రూ. 2 కోట్లు-ఢిల్లీ), దక్షిణాఫ్రికా ఆటగాడు బెరాన్ హెండ్రిక్స్ (రూ. 1.80 కోట్లు-పంజాబ్), క్రిస్ లిన్ (రూ. 1.30 కోట్లు-కోల్‌కతా), ప్యాట్ కమిన్స్ (రూ. 1 కోటి-కోల్‌కతా)లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. జయవర్ధనే, గుప్టిల్, డారెన్ బ్రేవో, మార్లన్ శామ్యూల్స్, వైట్, టిమ్ పైన్, రోంచీ, బెహర్డిన్, హెన్రీ డేవిడ్, పాల్ వాల్తాటీ, డేవిడ్ హస్సీ, అజహర్ మహమూద్, మాథ్యూస్, బద్రీనాథ్‌లను ఎవరూ కొనలేదు. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఆటగాళ్లు: 20 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59.40 కోట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ మొత్తం ఆటగాళ్లు: 23 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 60 కోట్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మొత్తం ఆటగాళ్లు: 23 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 55. 90 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59 కోట్లు ముంబై ఇండియన్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59.95 కోట్లు రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఆటగాళ్లు: 25 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 54.45 కోట్లు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 60 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు: 24 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 59 కోట్లు రూ. 467. 70 కోట్లు అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్ల కోసం చేసిన ఖర్చు (రిటైన్ చేసుకున్న వారితో కలిపి) 178 ఐపీఎల్ -7తుది జాబితాలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య (రిటైన్ చేసిన ఆటగాళ్లతో కలిపి) ‘ఎవరో ఒకరు నాకోసం బిడ్ వేయాలని కోరుకున్నా. ఒక్కసారి బిడ్ వచ్చాక ఎంత మొత్తం అన్న విషయాన్ని పట్టించుకోలేదు. నాకు భారీ మొత్తం లభించినందుకు సంతోషంగా ఉంది. నా బాధ్యత మరింత పెరగనుంది. ’ - కరణ్ శర్మ -
ఐదుగురిని కొనసాగించొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఇవ్వాలన్న ఫ్రాంచైజీల విజ్ఞప్తిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మన్నించింది. గతంలో ఈ సంఖ్య నాలుగుగా ఉండగా ఇప్పుడు దీనిని ఐదుకు పెంచారు. పైగా ‘రైట్ టు మ్యాచ్’ పేరుతో ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఐపీఎల్-2014కు సంబంధించిన కొత్త నిబంధనలు, మార్పుచేర్పులను గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్-7 కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న వేలం నిర్వహిస్తారు. అవసరమైతే దీనిని మరో రోజు పొడిగించవచ్చు. వేలం నిర్వహించే వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఐపీఎల్-2014 ప్రధాన నిబంధనలు ప్రతీ జట్టులో 16కు తగ్గకుండా, 27కు మించకుండా ఆటగాళ్లు ఉండాలి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 9 మంది మాత్రమే. జట్టులో ఎంచుకునే అండర్-19 స్థాయి ఆటగాళ్లు కనీసం ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఆటగాళ్ల కోసం ఒక ఫ్రాంచైజీ రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. 2013 ఐపీఎల్ ఆడిన జట్టునుంచి ఐదుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ విడుదల చేయకుండా తమ వద్దే కొనసాగించవచ్చు. మొదటి ఆటగాడికి రూ. 12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 9.5 కోట్లు...ఇలా తగ్గిస్తూ ఐదుగురు ఆటగాళ్లకు గవర్నింగ్ కౌన్సిల్ విలువ నిర్ధారించింది. ఇదే మొత్తాన్ని ఫ్రాంచైజీ ఫీజునుంచి (ఆటగాళ్లతో చేసుకున్న ఒప్పందంతో సంబంధం లేకుండా) తగ్గిస్తారు. ఉదాహరణకు చెన్నై జట్టు ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే కొనసాగిస్తే ఆ జట్టు మొత్తం రూ. 39 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మిగిలిన రూ. 21 కోట్లతోనే ఆ జట్టు మిగతా 22 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ‘రైట్ టు మ్యాచ్’ అంటే.... ఫ్రాంచైజీలు ఐదుగురిని అట్టి పెట్టుకోవడంతో పాటు ఆసక్తి ఉంటే వేలం తర్వాత ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశం ఉంది. 2013 సీజన్లో ఒక జట్టుకు ఆడిన ఆటగాడిని వేలంలో మరో జట్టు సొంతం చేసుకుందనుకుందాం. అయితే అప్పుడు కూడా ఆ క్రికెటర్ వేలంలో అమ్ముడైన మొత్తం చెల్లించి పాత ఫ్రాంచైజీయే తీసుకోవచ్చు. -
కోల్‌కతాపై షారుక్ ఆసక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ దృష్టి ఇప్పుడు ఫుట్‌బాల్‌పై పడింది. ఐఎంజీ-రిలయన్స్ ఆధ్వర్యంలో జరుగబోయే లీగ్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు షారుక్ ఆసక్తి చూపుతున్నాడు. ‘గతంలో గోవా ఐ లీగ్ క్లబ్ డెంపోలో వాటాలను తీసుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్రాంచైజీల ఆధారంగా లీగ్ రాబోతోంది. ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టి ఓ ఫ్రాంచైజీని తీసుకుందామని భావిస్తున్నాను. ముఖ్యంగా కోల్‌కతా ఫుట్‌బాల్ క్లబ్‌ను తీసుకుంటే ఇంకా బావుంటుంది’ అని షారుక్ తన మనసులో మాట బయటపెట్టాడు. ముంబైలో తొలి మ్యాచ్ ఐపీఎల్ తరహా ఫుట్‌బాల్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 18న జరిగే తొలి మ్యాచ్‌కు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఎనిమిది ఫ్రాంచైజీల వేలం, నవంబర్‌లో ఆటగాళ్ల వేలం జరుగనుంది. అన్ని ఫ్రాంచైజీలు క్లబ్స్గా రిజిష్టర్ అవుతాయి. జట్లను కొనుగోలు చేసిన వారు పదేళ్లు యజమానులుగా ఉంటారు. ప్రతీ జట్టులో పది మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి 22 మంది ఆటగాళ్లు ఉంటారు.