ముంబై: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం జరగనుండగా ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది. మొత్తం 71 మంది ఆటగాళ్లను జట్లు విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 8.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8.4 కోట్లు), ఆండ్రూ టై (రూ. 7.2 కోట్లు), స్యామ్ కరన్ (రూ. 7.2 కోట్లు), ఉతప్ప (రూ. 6.4 కోట్లు)లను ఫ్రాంచైజీలు వద్దనుకోవడం విశేషం.
ఫ్రాంచైజీలు విడుదల చేసిన కొందరు గుర్తింపు ఉన్న ఆటగాళ్లను చూస్తే...
చెన్నై: స్యామ్ బిల్లింగ్స్, మోహిత్ శర్మ. ఢిల్లీ: మోరిస్, మున్రో, ఇంగ్రామ్, విహారి. పంజాబ్: మిల్లర్, టై, స్యామ్ కరన్, వరుణ్ చక్రవర్తి. కోల్‌కతా: లిన్, ఉతప్ప, చావ్లా, బ్రాత్‌వైట్. ముంబై: యువరాజ్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్. రాజస్తాన్: ఉనాద్కట్, బిన్నీ. బెంగళూరు: గ్రాండ్‌హోమ్, స్టెయిన్, స్టొయినిస్, కూల్టర్ నీల్, హెట్‌మైర్, సౌతీ. హైదరాబాద్: యూసుఫ్ పఠాన్, గప్టిల్, షకీబ్, రికీ భుయ్, దీపక్ హుడా.
Comments
Please login to add a commentAdd a comment