players List Release
-
డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది
ముంబై: వచ్చే నెలలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు బరిలో ఉన్నాయి. గరిష్టంగా 90 బెర్త్‌ల కోసం మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈనెల 13న ముంబైలో మధ్యాహ్నం 2:30 నుంచి వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1525 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా... చివరకు 409 మందిని ఎంపిక చేశారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు... 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 24 మంది క్రికెటర్లు గరిష్ట కనీస ధర రూ. 50 లక్షల విభాగంలో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు రూ. 12 కోట్లు చొప్పున వేలంలో వెచ్చించడానికి వీలు ఉంది. ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు. వేలం బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, షబ్నమ్, శరణ్య, నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ దీప్తి, కట్టా మహంతి శ్రీ, వై.హేమ, బారెడ్డి అనూష, చల్లా ఝాన్సీలక్ష్మీ, విన్నీ సుజన్... హైదరాబాద్ నుంచి అరుంధతి రెడ్డి, గొంగడి త్రిష, యషశ్రీ, మమత, ప్రణవి, కోడూరి ఇషిత ఉన్నారు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ . -
IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే..
1214 Players Registered For IPL 2022 Mega Auction: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కొత్త జట్లు(లక్నో, అహ్మదాబాద్) కలుపుకుని మొత్తం 10 జట్లు ఈసారి వేలంలో పాల్గొంటాయి. వేలంలో పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 20తో గడువు ముగియడంతో బరిలో ఉండే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ శనివారం విడుదల చేసింది. ఈ వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్ఘానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. All players Indian and overseas with 2 Crores base price for the IPL 2022 mega auction. (Source - ESPNcricinfo). pic.twitter.com/ixA0R6yv7i — CricketMAN2 (@man4_cricket) January 22, 2022 విదేశీ ఆటగాళ్లు కలుపుకుని మొత్తం 49 మంది 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో ఉండగా, భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్‌తో పాటు 17 మంది ఈ విభాగంలో పోటీపడనున్నారు. ఈ విభాగంలో అశ్విన్, చహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్ప, ఉమేశ్ యాదవ్ వంటి భారత క్రికెటర్లుండగా.. పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), వార్నర్, డికాక్(దక్షిణాఫ్రికా), డెప్లెసిస్, రబాడ, ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి విదేశీ ఆటగాళ్లున్నారు. Full list of players with 2 Crores, 1.5 Crore, 1 Crore base price for the IPL 2022 Mega auction. •2 Crore. - 49 players. •1.5 Crore. - 20 players. •1 Crore. - 31 players. pic.twitter.com/C3NgSsthlQ — CricketMAN2 (@man4_cricket) January 22, 2022 మరోవైపు 1.5 కోట్ల విభాగంలో 20 మంది(విదేశీ ఆటగాళ్లతో పాటు), కోటి విభాగంలో 31 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. కోటిన్నర విభాగంలో ఫించ్, బెయిర్‌స్టో, మోర్గన్, డేవిడ్ మలాన్, హెట్‌మైర్, పూరన్ వంటి విదేశీ క్రికెటర్లు, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ వంటి దేశీయ స్టార్లు ఉండగా.. కోటి విభాగంలో నటరాజన్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్ వంటి లోకల్ స్టార్స్.. మహమ్మద్ నబీ, డెవాన్ కాన్వే, లివింగ్‌స్టోన్ డస్సెన్ వంటి ఓవర్ సీస్ ప్లేయర్స్ ఉన్నారు. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్‌కు జాక్‌పాట్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ -
నేడు ఐపీఎల్ వేలం
చెన్నై: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీల ఫేవరెట్‌గా మారాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. మ్యాక్సీతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఇతని సహచరుడు, నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌లు కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. వేలానికి వెయ్యిమందికి పైగా ఆటగాళ్లు ఆసక్తి చూపగా... వడపోత అనంతరం చివరకు 292 మంది వేలంలోకి వచ్చారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లయితే... 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా... ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. -
లిన్, ఉనాద్కట్, మిల్లర్లకు గుడ్‌బై
ముంబై: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం జరగనుండగా ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది. మొత్తం 71 మంది ఆటగాళ్లను జట్లు విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 8.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8.4 కోట్లు), ఆండ్రూ టై (రూ. 7.2 కోట్లు), స్యామ్ కరన్ (రూ. 7.2 కోట్లు), ఉతప్ప (రూ. 6.4 కోట్లు)లను ఫ్రాంచైజీలు వద్దనుకోవడం విశేషం. ఫ్రాంచైజీలు విడుదల చేసిన కొందరు గుర్తింపు ఉన్న ఆటగాళ్లను చూస్తే... చెన్నై: స్యామ్ బిల్లింగ్స్, మోహిత్ శర్మ. ఢిల్లీ: మోరిస్, మున్రో, ఇంగ్రామ్, విహారి. పంజాబ్: మిల్లర్, టై, స్యామ్ కరన్, వరుణ్ చక్రవర్తి. కోల్‌కతా: లిన్, ఉతప్ప, చావ్లా, బ్రాత్‌వైట్. ముంబై: యువరాజ్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్. రాజస్తాన్: ఉనాద్కట్, బిన్నీ. బెంగళూరు: గ్రాండ్‌హోమ్, స్టెయిన్, స్టొయినిస్, కూల్టర్ నీల్, హెట్‌మైర్, సౌతీ. హైదరాబాద్: యూసుఫ్ పఠాన్, గప్టిల్, షకీబ్, రికీ భుయ్, దీపక్ హుడా. -
క్రీడాకారుల జాబితా విడుదల
కడప స్పోర్ట్స్: డా.వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల జాబితాను శనివారం ప్రకటించారు. జూలై 25, 26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జాబితాను ఈనెల 26న డీఎస్డీఓ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థుల ప్రగతిని పరిశీలించిన వైఎస్ఆర్ క్రీడాపాఠశాల అధికారులు స్క్రూటినీ చేపట్టి జిల్లాల వారీగా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాలను ఆయా డీఎస్‌డీఓలకు పంపారు. దీంతో శనివారం డీఎస్డీఓ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులకు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో కోచ్‌ల పర్యవేక్షణలో అసెస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం ఆగష్టు 6 న ఎంపికలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ లక్ష్మినారాయణ శర్మ తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల జాబితా: ఎస్. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (ప్రొద్దుటూరు), ఎం.హిమబిందు (కడప), టి.శ్రీవిద్య (బయనపల్లె, సీకేదిన్నె), కె.రాజ్యలక్ష్మి (బుగ్గలపల్లి, సీకేదిన్నె), కె. వెన్నెల (దిరసవంచ, బి.మఠం), టి. పావని (బయనపల్లె, సీకే దిన్నె), డి.కల్యాణి (ప్రొద్దుటూరు).