క్రీడాకారుల జాబితా విడుదల | The players' List Release | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల జాబితా విడుదల

Published Sat, Jul 30 2016 11:14 PM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

The players' List Release

కడప స్పోర్ట్స్‌:
డా.వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల జాబితాను శనివారం ప్రకటించారు. జూలై 25, 26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జాబితాను ఈనెల 26న డీఎస్‌డీఓ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థుల ప్రగతిని పరిశీలించిన వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల అధికారులు స్క్రూటినీ చేపట్టి జిల్లాల వారీగా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాలను ఆయా డీఎస్‌డీఓలకు పంపారు. దీంతో శనివారం డీఎస్‌డీఓ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులకు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో కోచ్‌ల పర్యవేక్షణలో అసెస్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. అనంతరం ఆగష్టు 6 న ఎంపికలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ లక్ష్మినారాయణ శర్మ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారుల జాబితా:

ఎస్‌. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (ప్రొద్దుటూరు), ఎం.హిమబిందు (కడప), టి.శ్రీవిద్య (బయనపల్లె, సీకేదిన్నె), కె.రాజ్యలక్ష్మి (బుగ్గలపల్లి, సీకేదిన్నె), కె. వెన్నెల (దిరసవంచ, బి.మఠం), టి. పావని (బయనపల్లె, సీకే దిన్నె), డి.కల్యాణి (ప్రొద్దుటూరు).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement