రెండో రోజూ..
కడప స్పోర్ట్స్:
డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియకు సంబంధించిన అసెస్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం కొనసాగింది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో గురువారం రూ.30లక్షలకు పైగా విలువచేసే స్పోర్ట్స్ విజన్ టెస్ట్ మిషన్‌ను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. ఈ పరికరం ద్వారా విద్యార్థి ఫిట్‌నెస్‌తో సంబంధం లేకుండా విద్యార్థుల హ్యాండ్–ఐ కోఆర్డినేషన్, ఏకాగ్రత, రియాక్షన్ టైం తదితర అంశాలను పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్నట్లు కెనెడియన్ అకాడమీ సభ్యులు అమిత్, నీరజ్‌లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్యాట్ టెస్ట్ నిర్వహించారు. కాగా ఈ అసెస్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని కెనెడియన్ అకాడమీ సభ్యులు సోథీ, పంకజ్, కపిల్, క్రీడాపాఠశాల కోచ్‌లు పర్యవేక్షించారు.