YSR sports school
-
వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి,వైఎస్సార్ కడప: క్రీడలపై ఆసక్తి ఉన్న చిన్నారుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు మంచి వేదికగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. తొలుత మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలుంటాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి.. విద్యార్థులను ఎంపిక చేస్తారు. మండల, జిల్లా పోటీల తేదీలను ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశముంది. ఎంపిక విధానమిలా.. తొలుత మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగుపందెంలో 15 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 8 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికలను డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, 6గీ10 షటిల్రన్, మెడిసిన్ బాల్‌ఫుట్‌లో 21 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 11 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లతో కలిపి మొత్తం 27 పాయింట్లకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో 14 పాయింట్లకు పైగా సాధించాలి. బాలురకు 20, బాలికలకు 20 నాలుగవ తరగతిలో ప్రవేశాలకు 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు కేటాయించారు. కోవిడ్ వల్ల 2020–21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది 5వ తరగతికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. 5వ తరగతిలో కూడా 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్‌లో నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక్కడి విద్యార్థులు ఏటా పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎవరు అర్హులంటే.. 4వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 1–8–2012 నుంచి 31–7–2013 మధ్యలో పుట్టినవారై ఉండాలి. 5వ తరగతిలో చేరాలనుకునే వారు 1–8–2011 నుంచి 31–7–2012 మధ్యలో జన్మించినవారై ఉండాలి. బర్త్ సర్టిఫికెట్, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఎంపిక ప్రదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడమంటే చక్కటి భవిష్యత్‌కు బాట వేయడమే. అన్ని రకాల వసతులు, విద్యతో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో శిక్షణ అందిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రామచంద్రారెడ్డి, ప్రత్యేకాధికారి, డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల, కడప చదవండి: సాగర తీరం.. సుందర దృశ్యం -
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
దుమ్మురేపిన ‘దుర్గ’
కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు చెందిన క్రీడాకారిణి దుర్గ ఫుట్‌బాల్ క్రీడాంశంలోదుమ్మురేపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన కామసాని దుర్గ.. తాజాగా 2020లో నిర్వహించే ప్రపంచ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఇండియాజట్టు ఎంపికల కోసం నిర్వహించే వరల్డ్‌కప్ ప్రిపరేషన్ నేషనల్ క్యాంపునకు ఎంపికైంది. క్యాంపులో ఈమె చక్కటి ప్రతిభ కనబరిస్తే 16 దేశాల క్రీడాకారిణులు పాల్గొనే ఈ ప్రపంచ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో రాష్ట్రం నుంచి ఈమె ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో పదోతరగతి చదువుతున్న కామసాని దుర్గ ఫుట్‌బాల్ క్రీడలో చక్కగా రాణిస్తోంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కె.ఎన్.పెంట గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి, రోశమ్మల కుమార్తె అయితే ఈమె తొలుత హకీంపేటలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం పొందింది. రాష్ట్ర విభజన అనంతరం స్థానికత ఆధారంగా 2014లో ఈమెను కడప వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఫుట్‌బాల్ శిక్షకుడు ఎం. హరి వద్ద ఫుట్‌బాల్‌లో మెలకువలు నేర్చుకోవడంతో పాటు పలు టోర్నమెంట్లలో రాణిస్తూ వచ్చింది. ఎస్జీఎఫ్, అసోసియేషన్ రాష్ట్రస్థాయి, సౌత్‌జోన్, జాతీయస్థాయి పోటీల్లో నిలకడగా రాణిస్తూ వస్తోంది. కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈమె సత్తాచాటారు. అదే విధంగా 2015–16లో భోపాల్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో ఈమె రాణించారు. 2016–17లో చెన్నైలో నిర్వహించిన ఖేలోఇండియాలోను, సబ్‌జూనియర్ విభాగంలో సత్తాచాటారు. 2017–18లో బెంగుళూరు, పూణేలో నిర్వహించిన ఎస్జీఎఫ్, ఊర్జా మీట్లలో సత్తాచటారు. 2018–19లో కటక్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్స్‌లోను, త్రిపురలో నిర్వహించిన ఎస్జీఎఫ్ నేషనల్ పోటీల్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు. 2019–20 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు. మలుపు తిప్పిన సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్.. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించిన సుబ్రతో ముఖర్జీ టోర్నమెంట్లో ఈమె ఆటతీరుకు చక్కటి గుర్తింపు లభించింది. దీంతో ఆమెను 2020 ఉమెన్స్ వరల్డ్‌కప్ ప్రిపరేషన్ నేషనల్ క్యాంపునకు ఎంపిక చేశారు. ఏపీ నుంచి ఈ క్యాంపునకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణి ఈమె కావడం విశేషం. ఈ క్యాంపు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కత సమీపంలోని కల్యాణి నగరంలో ఈనెల 4 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఇండియా అండర్–17 ఉమెన్స్ ఫుట్‌బాల్ టీంనకు ఎంపిక చేశారు. 2020 నవంబర్ 2 నుంచి 21వ తేదీ వరకు మనదేశంలో నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ క్రీడాపాఠశాల క్రీడాకారిణి ఇండియన్ ఫుట్‌బాల్ క్యాంపునకు ఎంపికకావడం పట్ల క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి ఎస్.బాషామోహిద్దీన్, ఫుట్‌బాల్ కోచ్ హరి సంతోషం వ్యక్తం చేశారు. -
భోజన వేళ.. నిలబడే తినాలి
కడప స్పోర్ట్స్ : రాష్ట్రానికే తలమానికంగా నిలు స్తున్న ఏకైక క్రీడాపాఠశాల వైఎస్ఆర్ క్రీడాపాఠశాల.. క్రీడల పరంగా ఉన్న వసతులతో చక్కటి ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు వసతుల పరంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళ కఠోర సాధన చేసి వచ్చే క్రీడాకారులు డైనింగ్హాల్లో ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసే అవకాశం కూడా లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. డైనింగ్హాల్లో అందరికీ సరిపడా కుర్చీలు లేకపోవడంతో కొందరు కూర్చుంటే.. మరికొందరు నిల్చుని తినాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న కుర్చీలు సైతం చాలా వరకు చీలిపోయి.. పగిలిపోయి ధ్వంసమై ఉన్నాయి. ఇక నీరు తాగాలంటే కనీసం ఒక్క గ్లాసు కూడా లేకపోవడంతో మగ్గులతో ఎత్తుకుని తాగాల్సిన పరిస్థితి ఉంది. లేనిపక్షంలో వారు సొంతంగా కొనుగోలు చేసి తెచ్చుకున్న బాటిల్స్‌తో నీరు పట్టుకుని తాగాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం క్రీడాపాఠశాల విద్యార్థులకు భోజనం అందించేందుకు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరికీ కేటాయించకపోవడంతో గతంలో ఉన్నవారే ప్రస్తుతం తాత్కాలికంగా భోజనం అందిస్తున్నారు. మళ్లీ వీరికే టెండర్ వస్తుందా.. లేక మరెవరికైనా ఇస్తారో.. తేలకపోవడంతో కొత్త గ్లాసులు, కుర్చీలు కొనుగోలు చేసేందుకు వీరు ముందుకు రావడం లేదు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. -
వైజాగ్ మ్యాచ్.. టికెట్లు బ్లాక్‌లో అమ్మేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఉక్కునగరం విశాఖపట్నం వేదికగా భారత్-శ్రీలంక మధ్య కీలక వన్డే మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇరుజట్లు చెరో వన్డే గెలిచి సమంగా ఉండటంతో సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖలోని వైఎస్సార్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం నుంచి అభిమానుల కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, మూడు వన్డేల సిరీస్‌లో విజేత ఎవరో తేల్చే ఆఖరి వన్డే కావడంతో సహజంగానే ఈ వన్డేపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ టికెట్లు కొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. అయితే, నేరుగా టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. ఈ మ్యాచ్ సంబంధించి పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్లు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ మ్యాచ్ కోసం 27వేల టికెట్లను ‘మీ-సేవా’ ద్వారా అమ్మాల్సి ఉంది. కానీ, ఐదువేల టికెట్లు మాత్రమే ఇప్పటివరకు విక్రయించారు. మిగతా 22వేల టికెట్లు అధికారులు బ్లాక్ చేసి.. అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లు దొరకకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ ఫేవరెట్ భారత్... విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది ధోనినే. ఇక్కడికి ఓ అనామకుడిగా వచ్చి అసాధారణ కెప్టెన్‌గా ఎదిగిన వైనం మనకందరికీ తెలుసు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ అన్నట్లు ‘అతని భవిత ఈ వేదికతో’ మారిపోయింది. అంతేకాదు అతనితో పాటు చాలా మంది ఆటగాళ్లకు అచ్చొచ్చిన స్టేడియం ఇది. పైగా టీమిండియాకు ఫేవరెట్ వేదిక కూడా. ఇక్కడ ఏడు మ్యాచ్‌లాడిన భారత్ ఐదింట గెలిచి, ఒక్కసారే ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇక్కడ జరిగే నిర్ణాయక మూడో మ్యాచ్‌లో తమ ‘ఫేవరెట్ ఇజం’తో లంకను ఓడించి సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది టీమిండియా. రెండేళ్లుగా సొంతగడ్డపై భారత్ రికార్డు అజేయంగా ఉంది. 2015 అక్టోబర్ తర్వాత భారత్ ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు. అన్నీ చేజిక్కించుకుంది. ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్... తొలి మ్యాచ్‌లో ఒక్క ధోని మినహా మూకుమ్మడిగా విఫలమైన టీమిండియా బ్యాట్స్‌మెన్ మొహలీలో కదంతొక్కారు. కెప్టెన్, ఓపెనర్ రోహిత్, మరో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ధావన్, కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్ పిచ్ పరిస్థితుల్ని చక్కగా ఆకలింపు చేసుకొని చెలరేగారు. టాపార్డర్ అంతా ఫామ్‌లోకి రావడంతో భారత్ ఇక్కడ కూడా మరో భారీ స్కోరును ఆశిస్తోంది. రెండో వన్డేలో ధోని, పాండ్యా ఇన్నింగ్స్ చివర్లో తక్కువ పరుగులకే నిష్క్రమించినా... అదేమంతా కలవరపెట్టే అంశం కాదు. ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన సమయంలో ధోని ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలుసు. ఇక బౌలింగ్‌లో భువీ, బుమ్రా తమ సత్తాను పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు. ఒకట్రెండు వికెట్లు తీసినప్పటికీ కీలకమైన నిర్ణాయక పోరులో ఇదే మాత్రం సరిపోదు. ఆరంభంలో, డెత్ ఓవర్లలో తమ జోరు చాటితే మిగతా పనిని చహల్, హార్దిక్ పాండ్యాలు చూసుకుంటారు. పిచ్, వాతావరణం ఎపుడైనా సరే విశాఖ పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశాలిస్తుంది. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లకు ఇది మంచి వికెట్. ధర్మశాల, మొహాలీలతో పోల్చుకుంటే ఇది కోస్తా ప్రాంతం కాబట్టి శ్రీలంకకు కొలంబోను తలపించవచ్చు. వర్షం ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్/సుందర్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్. ► మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్చరీ పోటీల్లో ప్రతిభ
కడప స్పోర్ట్స్ : రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాల విద్యార్థి ఇంద్రకళ్యాణ్రెడ్డి చక్కటి ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 8, 9 తేదీల్లో కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన పోటీల్లో అండర్–14 ఇండియన్ రౌండ్ విభాగంలో చక్కటి ప్రదర్శన కరబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్‌లో తిరుపతిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఆ విద్యార్థిని జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి అభినందించారు. -
ఫుట్‌బాల్ ఎంపికలకు చక్కటి స్పందన
కడప స్పోర్ట్స్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ ఎంపికలకు చక్కటి స్పందన లభించింది. మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతేడాది రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా ఫుట్‌బాల్ జట్టు చక్కటి ప్రతిభ కనబరిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ యేడాది విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్లను ప్రకటించారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల కోచ్ హరి, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి అమృత్‌రాజ్, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుపాల్‌రెడ్డి, సంపత్, ఎజాజ్, నిత్యప్రభాకర్, మహబూబ్‌బాషా, బీసీవీ సుబ్బయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులు అండర్–14 బాలికలు : వి.శ్రీదేవి, కె.దుర్గ, డి. నిరీక్షణ, ఎస్.చందుప్రియ, కె.సునీత, టి.స్వప్న, జి.లేఖన, ఎ.భవిత. ఆర్.సుకన్య, ఎస్.సమీర, డి.పావని, బి.అరుణ, ఆర్.గంగోత్రి, ఐ.కీర్తి, పి.యామిని, వి.గంగోత్రి, వి.నాగమునెమ్మ, ఎం.నందిని. స్టాండ్‌బై : వి.గాయత్రి, ఎం.పల్లవి, జి.విజయ, వెంకటలక్ష్మి, శివరంజని. అండర్–17 బాలికలు : యు.వరలక్ష్మి, జి.మానస, సీమెచ్ రాజ్యలక్ష్మి, పి.గాయత్రి, బి. దివ్య, ఎన్.కమాల్‌బీ, పి.వీరలావణ్య, జి.వి.సౌమ్య, సి.సుహాన్బేగం, ఎ.కౌసల్య, ఎం.శిరీష, యు.హరిణి, సి.వెంకటనవిత, జె.ప్రవళ్లిక, డి.చంద్రవదన, కె.ఉమాదేవి, ఎస్.శ్రావణి, ఎం.హవిల. స్టాండ్‌బై : కె.నందిని, హరిప్రియ, భూదేవి, మనోరంజని. అండర్–14 బాలురు : జి. రాజేష్, ఎన్.బాషా, బి.ఉదయ్‌కిరణ్‌రెడ్డి, ఎం.సంతోష్, వి.సాయిరాం, కె.పరమేష్‌రెడ్డి, సతీష్, బి.జె.వెస్లీ, ఎస్.మహమ్మద్‌రఫి, సి.హరికిరణ్, ఎస్.మహేష్, జె. బన్నీ, యు. ప్రణయ్, ఎ. రవితేజ, మనోజ్‌కుమార్‌రెడ్డి, టి. దినేష్, ఎస్. అహ్మద్, జి.దివాకర్, వెంకటనాయుడు, పూజిత్. అండర్–17 బాలురు : బి. మేఘనాథ్, కొండారెడ్డి, కె.జగదీష్, కె.రామాంజి, ఎస్. దిలీప్, ఎ.వెంకటసాయికిరణ్, ఎస్.సొహైల్, కె.అజయ్కుమార్సంజీవ్, ఎస్.మోహన్, ఎస్. రాము, ఎస్.కె. గైబుసా, పి.సాయికుమార్, ఎం.జయచంద్ర, ఆర్, సుధాప్రియదర్శన్, ఎన్.శివకుమార్, డి.అశోక్, ఎస్. ఇంతియాజ్, కె.వంశీ, ఎస్.మహమ్మద్యాసీన్, జి.వి.అశోక్ -
వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల
కడప స్పోర్ట్స్: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ఎంపికల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం కడప నగరంలోని కొత్త కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, క్రీడాపాఠశాల చైర్మన్ కేవీ సత్యనారాయణ, క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్ సాహెబ్‌లు ఫలితాల జాబితాను విడుదల చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 20లోపు క్రీడాపాఠశాలకు హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అన్ని జిల్లాల డీఎస్‌డీఓలకు పంపినట్లు ప్రత్యేకాధికారి తెలిపారు. 20 మంది బాలికలు, 20 మంది బాలురును 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపికచేసినట్లు తెలిపారు. ఎంపికైన బాలికలు : ఎం. హిమబిందు (కడప), కె. రాజ్యలక్ష్మి (కడప), టి.శ్రీవిద్య (కడప), కె. వెన్నెల (కడప), బి. జయలక్ష్మి (కడప), కె. దీపిక (కడప), ఎస్. సరస్వతి (కడప), ఎన్. శివనందిని (కడప), కె. లావణ్య (ప్రకాశం), ఆర్. నాగవేణి (ప్రకాశం), పి. రామలక్ష్మి (విశాఖపట్టణం), కంచిపాటి దేవి (విశాఖపట్టణం), పి. హిమవర్షిణి (విశాఖపట్టణం), టి.సాయిలత (శైలజ) (విశాఖపట్టణం), పి.రమ్య (విశాఖపట్టణం), ఎస్. రేష్మ (విశాఖపట్టణం), రంగోలి గాయత్రి (విజయనగరం), వి. శాంతి (విజయనగరం), గండి తనూజ (విజయనగరం), సీహెచ్ పూజిత (ప్రకాశం). ఎంపికైన బాలురు : సి.శేషాద్రి (చిత్తూరు), జి.గౌతమ్కిశోర్ (కడప), నాగిరెడ్డి పృధ్వీనాథ్రెడ్డి (కడప), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (కడప), డి. కిశోర్‌కుమార్‌రెడ్డి (కడప), ఎ.పృధ్వీ (కడప), డి. భానుతేజ (కడప), డి. నాగచైతన్య (కడప), బి.జనార్ధన్ (కడప), మాడా శ్రీనివాస్ (కడప), పి. అభిషేక్‌నాయక్ (కర్నూలు), కరపాటి చైతన్య (నెల్లూరు), కె.చైతన్యారెడ్డి (ప్రకాశం), వై.మధుకిశోర్ (ప్రకాశం), కె.వి.మాధవరావు (ప్రకాశం), ఎస్వీఎస్ సంతోష్ (ప్రకాశం), పి. రామునాయుడు (విశాఖపట్టణం), వై. గంగునాయుడు (విశాఖపట్టణం), గండిచందు (విజయనగరం), సీహెచ్ రాజేష్ (విజయనగరం). ఎంపికైన అభ్యర్థులు తీసుకురావాల్సిన జాబితా.. ఎంపికైన అభ్యర్థులు బర్త్ సర్టిఫికెట్ (మీసేవ/మున్సిపాలిటీ ద్వారా పొందినది), టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డ్ జిరాక్స్, 20 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రూ.1000 (కాసిన్ డిపాజిట్టు), మెడికల్ సర్టిఫికెట్ (ఫిట్నెస్ సర్టిఫికెట్), పర్సనల్ స్పోర్ట్స్ కిట్, డిక్లరేషన్ బాండ్‌పేపర్లు (రూ.10 విలువచేసే రెండు స్టాంపుపేపర్లు), ఆదాయ ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాల్సి ఉంటుంది. -
రెండో రోజూ..
కడప స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియకు సంబంధించిన అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం కొనసాగింది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో గురువారం రూ.30లక్షలకు పైగా విలువచేసే స్పోర్ట్స్ విజన్ టెస్ట్ మిషన్‌ను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. ఈ పరికరం ద్వారా విద్యార్థి ఫిట్నెస్తో సంబంధం లేకుండా విద్యార్థుల హ్యాండ్–ఐ కోఆర్డినేషన్, ఏకాగ్రత, రియాక్షన్ టైం తదితర అంశాలను పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్నట్లు కెనెడియన్ అకాడమీ సభ్యులు అమిత్, నీరజ్‌లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్యాట్ టెస్ట్ నిర్వహించారు. కాగా ఈ అసెస్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని కెనెడియన్ అకాడమీ సభ్యులు సోథీ, పంకజ్, కపిల్, క్రీడాపాఠశాల కోచ్‌లు పర్యవేక్షించారు. -
రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ
కడప స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే క్రీడా ఎంపికల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల నుంచి 103 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 127 మంది అభ్యర్థులకు గాను బుధవారం 103 మంది విద్యార్థులు హాజరై పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడాపాఠశాల సిబ్బంది హాజరైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు రెసిడెన్షియల్ విధానంలో మూడురోజుల పాటు అసెస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ శిక్షణలో ఏమి నేర్పనున్నారంటే... గతానికి భిన్నంగా ఈ ఏడాది మూడురోజుల పాటు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించేందుకు శాప్ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు 7 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడాకారుల ఫిజికల్ అసెస్మెంట్ను ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. – స్పోర్ట్స్ విజన్‌లో భాగంగా రూ.30 లక్షలతో దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్ విజన్ టెస్ట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం ఏశారు. ఈ పరికరం ద్వారా క్రీడాకారుల రియాక్షన్ టైం, హ్యాండ్–ఐ కో–ఆర్డినేటర్, ఏకాగ్రత తదితర అంశాలను పరీక్షించనున్నారు. – ఫిట్నెస్ టెస్ట్‌ల్లో భాగంగా 6 X 10 షటిల్ రన్, 30 మీటర్స్ స్పింట్, ‘టీ’ (ఇంగ్లీషు లెటర్ టీ) షేప్ మూమెంట్ స్కిల్స్, సర్కూట్ టెస్ట్ ఫార్ ఫండమెంటల్ మూమెంట్ స్కిల్స్ పరిశీలిస్తారు. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లో భాగంగా సిట్ అండ్ రీచ్, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ విభాగాల్లో క్రీడాకారుల సహజ ప్రతిభను పరీక్షిస్తారు. పైన తెలిపిన అంశాల్లో మూడురోజుల పాటు శిక్షణ ఇచ్చి ఈనెల 6న రాష్ట్రస్థాయి ఎంపికలు చేపట్టనున్నారు. పర్యవేక్షించిన కెనెడియన్ అకాడమీ సభ్యులు... ఈ అసెస్మెంట్ ట్రైనింగ్‌ను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన కెనెడియన్ అకాడమీ క్రీడాప్రతినిధులు అమిత్, పంకజ్, సోథి, కపిల్, నీరజ్‌లు విచ్చేశారు. వీరు విద్యార్థులకు సంబంధించిన పలు పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల పాదాలు, మోకాలు, వెన్నెముకకు సంబంధించి శాస్త్రీయ విధానాల ద్వారా పరిశీలించారు. ఎంపికల ప్రక్రియను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ పరిశీలించారు. ఎంపికల పర్యవేక్షణకు శాప్ బృందం... రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియను పరిశీలించేందుకు శాప్ బృందం రానుంది. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, వీసీ ఎండీ జి. రేఖారాణితో పాటు సభ్యులు సత్తిగీత, హనుమంతరావు, షకీల్‌షఫీ, రవీంద్రబాబు, జయచంద్ర రానున్నారు. -
క్రీడాకారుల జాబితా విడుదల
కడప స్పోర్ట్స్: డా.వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల జాబితాను శనివారం ప్రకటించారు. జూలై 25, 26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జాబితాను ఈనెల 26న డీఎస్డీఓ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థుల ప్రగతిని పరిశీలించిన వైఎస్ఆర్ క్రీడాపాఠశాల అధికారులు స్క్రూటినీ చేపట్టి జిల్లాల వారీగా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాలను ఆయా డీఎస్‌డీఓలకు పంపారు. దీంతో శనివారం డీఎస్డీఓ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులకు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో కోచ్‌ల పర్యవేక్షణలో అసెస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం ఆగష్టు 6 న ఎంపికలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ లక్ష్మినారాయణ శర్మ తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల జాబితా: ఎస్. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (ప్రొద్దుటూరు), ఎం.హిమబిందు (కడప), టి.శ్రీవిద్య (బయనపల్లె, సీకేదిన్నె), కె.రాజ్యలక్ష్మి (బుగ్గలపల్లి, సీకేదిన్నె), కె. వెన్నెల (దిరసవంచ, బి.మఠం), టి. పావని (బయనపల్లె, సీకే దిన్నె), డి.కల్యాణి (ప్రొద్దుటూరు). -
ఉత్సాహంగా క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం నిర్వహించిన ఎంపికల ప్రక్రియను డీఎస్డీఓ ఎం.ఎస్ఎల్.ఎన్. శర్మ, శాప్ డైరెక్టర్ డి. జయచంద్ర పర్యవేక్షించారు. రెండోరోజు నిర్వహించిన ఎంపికలకు 14 మండలాల నుంచి 27 మంది బాలురు 10 మంది బాలికలు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో మూడురోజుల అసెస్మెంట్ ట్రైనింగ్ అనంతరం 6వ తేదీ తుది ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, నూర్, డీఎస్ఏ సిబ్బంది అక్బర్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ క్రీడాపాఠశాల రాష్ట్రస్థాయి ఎంపికలు వాయిదా
కడప స్పోర్ట్స్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాఎంపికలను వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. కెనెడియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించాలని శాప్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ ఎంపికలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి నిర్వహించాల్సిన ఈ ఎంపికలను ఆగస్టు మొదటివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులకు అసెస్మెంట్ ట్రైనింగ్ (రెసిడెన్షియల్) ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం 6వ తేదీ రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. క్రీడాపాఠశాల లోగోకు కాంపిటీషన్స్ డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు లోగో (చిహ్నం) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి లోగోను రూపొందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తాము రూపొందించిన లోగోలను ఆగస్టు 1వ తేదీలోపు వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కార్యాలయానికి చేరేలా చూడాలన్నారు. ఎంపికైన తొలి మూడు లోగోలు రూపొందించిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలుసోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని 23 మండలాల నుంచి 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 42 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. తొలుత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన పిమ్మట పదిమంది చొప్పున బృందాలుగా ఏర్పాటుచేసి క్రీడాఎంపికలను నిర్వహించారు. క్రీడాకారుల ఎత్తు, బరువుతో పాటు వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, మెడిసినల్‌బాల్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 6 ఇంటూ 10 మీటర్ల పరుగుపందెం, 800 మీటర్ల పరుగుపందెం తదితర అంశాల్లో ఎంపికల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ ఎం.ఎస్.ఎల్.ఎన్. శర్మ మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు ఎంపికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోనే క్రీడాపాఠశాల ఉన్నందున పెద్దసంఖ్యలో విద్యార్థులు ఎంపికలకు వస్తారని విస్తున్నామన్నారు. శాప్ డైరెక్టర్ డి.జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో క్రీడాపాఠశాల ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తగిన ప్రచారం లేకపోవడంతో ఆశించిన మేర క్రీడాకారులు రాలేదన్నారు. ప్రతి యేడాది క్రీడాఎంపికల క్యాలండర్ ప్రకటించి జూన్‌లోనే ఎంపికల ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ తోటకృష్ణ మాట్లాడుతూ క్రీడాపాఠశాలలో సీటు సాధిస్తే క్రీడల్లో రాణించేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, సుదర్శన్, షఫీ, డీఎస్ఏ సిబ్బంది అక్బర్, బాలనాగయ్య రాజు, బాషా, క్రీడాకారులు పాల్గొన్నారు. -
25 నుంచి జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల అయిన వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జిల్లాస్థాయి ఎంపికలు ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. కడప నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా... 4వ తరగతిలో 20 బాలురు, 20 బాలికల సీట్లకు ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రస్థాయి ఎంపికలను కడప నగరంలోని డా.వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలోనిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి ఎంపికలు ఈనెల 27 నుంచే ప్రారంభమవుతున్నా.. వైఎస్ఆర్ జిల్లావిద్యార్థులకు ఈనెల 29న నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపికచేసి వీరికి ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. అనంతరం తుది ఎంపికలు నిర్వహించి 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులకు ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ప్లయింగ్స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6 ఇంటూ 10 మీటర్స్ షటిల్రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, మెడిసినల్‌బాల్ త్రో, 800 మీటర్ల పరుగు పందెం అంశాల్లో ప్రతిభను పరీక్షించి పాయింట్లు కేటాయిస్తారు. 4వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థులు 8 సంవత్సరాలు పూర్తయి 2008 ఫిబ్రవరి 28 నుంచి 2009 మార్చి1 మధ్యలో జన్మించిన వారు అర్హులు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు ఫొటోలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
చిత్తూరు, కర్నూలు జట్ల విజయం
వైవీయూ : కడప నగరం నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్‌లలో చిత్తూరు, కర్నూలు జట్లు విజయం సాధించాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. జట్టులోని నాగమణి 39 పరుగులు చేసింది. చిత్తూరు బౌలర్ శరణ్య 2, రమ 2 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగుల విజయలక్ష్యం చేరుకుంది. జట్టులోని ప్రవళ్లిక 64 పరుగులు, శరణ్య 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో చిత్తూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు పొందింది. అనంతపురంపై కర్నూలు విజయం... కేఎస్‌ఆర్‌ఎ క్రీడామైదానంలో అనంతపురం, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌట్ అయింది. కర్నూలు బౌలర్ అంజలి 8 వికెట్లు తీసి అనంతపురం జట్టును కుప్పకూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు కేవలం 3.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని శ్రావణి 20, అనూషారాణి 9 పరుగులతో సునాయాసంగా విజయలక్ష్యం చేధించారు. దీంతో కర్నూలు 10 వికెట్ల తేడాతో అనంతపురంపై ఘన విజయం సాధించింది. దీంతో కర్నూలుకు 4 పాయింట్లు లభించాయి. -
విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్..
విశాఖపట్నం: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైంది. దీంతో సాగర తీరంలో సందడి నెలకొంది. మే 10 నుంచి మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించారు. దీంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు విశాఖ వైఎస్సార్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌గా ఎంచుకుంది. పుణే, ముంబాయిలకు చెందిన జట్ల ఫ్రాంచైజీ ప్రతినిధులు ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. ముంబాయి ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియం, పుణే జట్టు మహారాష్ట్ర స్టేట్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌లుగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పుణే ఫ్రాంచైజీ కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలుకున్నా అవాంతరాలు ఏర్పాడ్డాయి. దీంతో పుణే జట్టు విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈ సీజన్లో ఐపీఎల్ లీగ్‌లో పుణే ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్‌లకు వైఎస్సార్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రైజింగ్ పుణే జట్టుకు కెప్టెన్‌గా ధోని, కోచ్‌గా స్టీపెన్ ఫ్లెమింగ్ వ్యవహారిస్తున్నారు. షెడ్యూల్ మే 10 - రైజింగ్ పుణే VS సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 17 - రైజింగ్ పుణే VS ఢిల్లీ డేర్‌డెవిల్స్ మే 21 - రైజింగ్ పుణే VS కింగ్స్ ఎలెవన్ పంజాబ్ -
పొట్టి క్రికెట్టు గట్టి పోటి
టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధం రేపు విశాఖ చేరనున్న ఇండియా, శ్రీలంక జట్లు ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు... విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం సరికొత్త రికార్డును సొంతం చేసుకోనుంది. ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని నిర్వహించే స్టేడియం కానుంది. ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ ఇందులో తొలిది కాగా ఏడాది చివరిలోగానే మరో రెండు అంతర్జాతీయ జట్లు ఇక్కడ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ ఐదు వన్డేలు భారత్‌లో ఆడనుండగా... ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటించనుంది. నవంబర్-డిసెంబర్లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఒకే ఏడాది విశాఖ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ను...న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌ను విశాఖ క్రీడాభిమానులు వీక్షించనున్నారు. విశాఖ వేదికగా తొలిసారిగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటను ఆస్వాదించనున్నారు. విశాఖపట్నం : విశాఖ వేదికగా పొట్టి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు శనివారం విశాఖ చేరుకోనున్నాయి. ఆ రోజు ప్రాక్టీస్ అనంతరం ఆదివారం ఇరుజట్లు రాత్రి ఏడున్నర గంటలకు సిరీస్‌లో చివరిదైన టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. విశాఖలో జరిగే టీ20 మ్యాచ్ తర్వాత ఇరుజట్లు ఆసియా కప్ టీ20లోనే ఆడనున్నాయి. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించిన జట్టుగా భారత్ పేరుగడిస్తే...టీ20 వరల్డ్ రాంకింగ్స్‌లో తొలి స్థానంలో కొనసాగుతున్న జట్టు శ్రీలంక. దీంతో ఇరు జట్లకు విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది. టీ20 ఎలా అయింది... క్రికెట్‌కు పుట్టిల్లు ఇంగ్లండ్ అని అందరికి తెలిసిందే. 1744 నాటికి క్రికెట్ ఆడేందుకు నిబంధనల్ని రూపొందించారు. 1962 నాటికి నిర్ణీత ఓవర్ల క్రికెట్ పురుడు పోసుకుంది. 71లో డొమెస్టిక్ టోర్నీ నిర్వహించారు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ నలభై ఓవర్ల ఇన్నింగ్స్‌తో జరిగింది. అప్పట్లో ఓవర్‌కి ఎనిమిది బంతులుండేవి. ఇక 1990 వచ్చేనాటికి మరింత కుదించి ఇరుజట్లు పదేసి ఓవర్లతో (ఓవర్‌కు పది బంతులు) ఆడే విధంగా న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రో ప్రవేశపెట్టాడు. ఆస్ట్రేలియన్లు సూపర్ 8గా మార్చగా పొట్టి క్రికెట్‌పై పరిశోధన జరిగింది. ఇరవై ఓవర్ల ఇన్నింగ్స్‌తో ఆడే విధంగా రూపకల్పన జరిగింది. 2003లో హాంప్‌షైర్‌తో ససెక్స్ ఈ పొట్టి ఫార్మేట్ మ్యాచ్‌లో తలపడింది. తొలి విజేత భారతే... అప్పటికే ఐదు రోజులు ఆడినా కొన్ని సందర్భాల్లో ఫలితం రాకపోతుండడంతో మ్యాచ్ కాస్తా వన్డేగా రూపాంతరం చెందింది. ఇక టీ20గా మారిపోయిన తర్వాత క్రికెట్ వీక్షించే అభిమానులు పెరిగిపోయారు. దీంతో 2007లో తొలి అంతర్జాతీయ టీ20 టోర్నీ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్స్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత్ తొలి టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది. టోర్నీ విజయవంతం కావడంతో రెండేళ్ళ అనంతరం నిర్వహించేందుకు తీర్మానం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి రెండేళ్ళకు ఒకసారి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహిస్తున్నారు. భారత్‌దే పై చేయి... ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ రాంకింగ్లో శ్రీలంక జట్టే ముందుంది. ఇంగ్లండ్‌తో కలిసి భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇక శ్రీలంక-భారత్ జట్లు టీ20 మ్యాచ్‌ల్లో పలుసార్లు తలపడ్డాయి. రెండు దేశాల మధ్య మూడుసార్లు సిరీస్ జరిగింది. రెండుసార్లు భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. ఒకే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరగ్గా రెండు సార్లు భారత్‌నే విజయం వరించింది. అయితే శ్రీలంక జట్టు భారత్‌లో ఓసారి పర్యటించగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. ఆరేళ్ళ అనంతరం మళ్ళీ భారత్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక వచ్చింది. ఈసారి మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన శ్రీలంక మంచి ఊపు మీదుంది. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనుండడంతో ఉత్కంఠ రేపుతున్నది. రికార్డు స్కోర్... టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ రికార్డు శ్రీలంక పేరిటే ఉంది. 2007లో కెన్యాపై ఏకంగా ఆరు వికెట్లకు 260 పరుగులు చేసేసింది. అత్యధిక మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌కూడా అదే. అయితే అత్యధిక రికార్డుతోపాటు అత్యల్ప రికార్డు కూడా శ్రీలంకదే. నెదర్లాండ్స్ జట్టు 2014లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 39 పరుగులకే చుట్టేశారు. క్రికెట్ ఫీవర్ మొదలైంది విశాఖపట్నం : భారత్, శ్రీలంక టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు గురువారం తెలవారక ముందే మీ సేవా కౌంటర్ల వద్ద పడిగాపులు పడీ మరీ టిక్కెట్లను సొంతం చేసుకున్నారు. నగరంలోని 16 సెంటర్లలో లోయర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.300, రూ.600 టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే హాట్‌కేక్‌ల్లా అమ్ముడు పోయాయి. వాస్తవానికి మ్యాచ్ జరిగే వైఎస్ఆర్ స్టేడియంలో 27వేల సీట్ల సామర్ధ్యం ఉన్నా...వాటిలో సగం టిక్కెట్లు మాత్రమే విక్రయించనున్నారు. రెండు వందల రూపాయల టిక్కెట్లును కేవలం క్రీడా క్లబ్‌లకు మాత్రమే ఇవ్వనుండగా హైయ్యర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.1500, రూ. 2000, రూ.మూడువేల టిక్కెట్లను ఆన్లైన్ ద్వారాను అమ్మకాలు జరిపారు. మిగిలిన టిక్కెట్లతో పాటు వెయ్యి రూపాయిల టిక్కెట్లను శుక్రవారం విక్రయించనున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాట్టు చేసి టిక్కెట్ల విక్రయాలు జరిపారు. టీ20 క్రికెట్ రాంకింగ్ తొలి స్థానంలో నిలిచిన శ్రీలంక జట్టుతో అతిథ్య జట్టు భారత్ అమీ తుమీ తేల్చుకునే ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. -
విశాఖ స్టేడియానికి టెస్టు హోదా
ముంబై: విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ -వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పిస్తూ బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్తగా విశాఖతో పాటు రాంచీ, ఇండోర్, రాజ్ కోట్, పుణే స్టేడియాలకు టెస్టు హోదా కల్పించారు. దీంతో పాటు టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాను తిరిగి అదే స్థానంలో కొనసాగించాలని వార్షిక సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకూ భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వారి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరభ్ గంగూలీని నియమించారు. -
ఆంధ్రుల హక్కులు కాపాడాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి ఆంధ్రుల హక్కులు కాపాడాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ సాగిం ది. అక్కడ మానవహారం నిర్వహించి తిరిగి టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.యోగీశ్వర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రకాష్ మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం తెలుగుజాతిని రెండుగా విడదీస్తామంటే ఎన్డీఏ మద్దతు ఇచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కనబర్చలేదని, తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఎన్నికల ముందు మాట్లాడిన నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి మద్ధతునిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం ఢిల్లీ నడివీధుల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తన పార్టీకి చెందిన ఎంపీలతో ఏ రోజైనా ప్రత్యేక హోదా విషయంపై ప్రధానమంత్రితో చర్చించారా? అని ప్రశ్నించారు. సింగపూర్, జపాన్ అంటూ పర్యటనలకే పరిమితమవుతున్నారన్నారు. కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, లోకేష్‌శెట్టి, నగర అధ్యక్షులు జంగాలపల్లి రఫి, పెద్దన్న, మంజునాథ్, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు, నాయకులు గోపి, సాకే నవీన్, సురేష్‌రెడ్డి, రాజునాయక్, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, బాబ్జాన్, హరి తదితరులు పాల్గొన్నారు. సమష్టిగా పోరాడుదాం: కాపు రాయదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న ఎన్డీఏ ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాలు సమష్టి పోరుకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో శని వారం అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా లేకపోతే రాయలసీమ జిల్లాలు మరింత వెనుకపడిపోతాయ న్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఈనెల 10న ఢిల్లీలో దీక్షచేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 11న జిల్లా బంద్ : సీపీఐ కళ్యాణదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఈనెల 10లోగా సీఎం చంద్రబాబు స్పందించకపోతే 11న జిల్లా బంద్ నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ సంజీవప్ప, సర్పంచ్ తిరుపాల్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అసోం, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు విభజన సం దర్భంగా ప్రత్యేక హోదా కల్పించారని అదే తరహాలోనే రాష్ట్రానికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోవ్యవసాయ రుణాలకు బీమా గడువు సెప్టెంబర్ వరకు పొడిగించాలని కోరారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలి: డీసీసీ పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివా రం పట్టణంలోని కోటా కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పక్షాలతో కలసి టీడీపీ, బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు కలసి వస్తే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారన్నారు. -
మరో కుట్రకు తెరతీసిన టీడీపీ నేతలు
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో అధికార టీడీపీ నేతలు మరో కుట్రకు తెరతీశారు. సౌత్జైలు రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ పేరును తొలగించేందుకు సదరు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ పార్కును వుడా సెంటర్ పార్క్‌గా మార్చేందుకు అధికారులతో కలసి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఆ విషయం బయటకు పొక్కడంతో టీడీపీ నేతల వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు వైఎస్ అభిమానులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అందుకు నిరసనగా సౌత్ జైలు రోడ్డు వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ కోల గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. -
ఐపీఎల్ పండగ
ఆతిథ్యమివ్వనున్న విశాఖ నగరం మూడు మ్యాచులకు వేదిక సిద్ధమవుతున్న వైఎస్సార్ స్టేడియం విశాఖపట్నం: ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. ఇందులో విశాఖ నగరం తనవంతు పాత్ర పోషించనుంది. ఐపిఎల్ టీ20 మూడు మ్యాచులకు వేదిక కానుంది. రానున్న సీజన్లోనే తొలి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వైఎస్ఆర్ స్టేడియానికి అప్పుడే పండుగ కళ వచ్చేసింది. అటు ప్రపంచకప్ పోటీలు ఊపందుకుంటుంటే విశాఖ ఐపిఎల్‌కు రెడీ అవుతోంది. వన్డేల్లో ఆతిథ్యజట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగా పేరుపడ్డ వైఎస్ఆర్ ఏసిఏవీడీసీఏ స్టేడియంలో ఐపిఎల్‌కు మరోమారు వేదికగా నిలవనుంది. గతంలో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ హోదాలో రెండు ఐపిఎల్ మ్యాచ్ లాడగా ఈసారి స్దానిక ఫ్రాంచైజీ హోదాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్ని ఆడనుంది. ఏప్రిల్ 8 నుంచి మే 24వరకు జరిగే ఈ సీజన్లో మొత్తంగా 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎనిమిది జట్లు డబుల్ రౌండ్ రాబిన్ తర్వాత పాటు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. కెప్టెన్‌గా శిఖర్ ధావన్... ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో శిఖర్ ధావన్‌తో పాటు మరో పదముగ్గుర్ని స్దానిక ఫ్రాంచైజి తిరిగి సొంతం చేసుకోగా పదకొండు మంది ఆటగాళ్ళను వదులుకుంది. స్థానిక అంతర్జాతీయ ఆటగాడు వేణుగోపాలరావుని వదులుకోగా రికీబుయ్‌ను జట్టుకు తీసుకుంది. శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించనుండగా డేల్ స్టెయిన్, భువనేశ్వర్‌లు జట్టుకు ఆడనున్నారు. లక్ష్మణ్ పర్యవేక్షణ సన్‌రైజర్స్ జట్టును వివిఎస్ లక్ష్మణ్ మెంటర్‌గా పర్యవేక్షించనుండగా మాజీ డాషింగ్ బాట్స్మెన్ శ్రీకాంత్ సహకరించనున్నాడు. ప్రధాన కోచ్‌గా టామ్ మూడీ సేవలందిచనుండగా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ముత్తయ్యమురళీదరన్ బౌలింగ్ కోచ్‌గా విశాఖ రానున్నారు. జట్టు సభ్యులు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, మోర్గాన్, కేవిన్ పీటర్సన్, హనుమ విహారీ, కరణ్ శర్మ, లక్ష్మిశుక్లా, మోసెస్ హెరిక్, పద్మనాభన్ ప్రశాంత్, పర్వేజ్ రసూల్, రికీబుయ్ బ్యాట్ ఝళిపించనున్నారు. డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, చమా మిలింద్, ప్రవీణ్‌కుమార్, రవిబొపారా, ఆశిష్‌రెడ్డి,సిద్దార్దకౌల్ బంతితో చెలరేగిపోనున్నారు. నమన్ ఓజాతోపాటు లోకేష్ రాహుల్ వికెట్ల వెనుక నిలవనున్నారు. ఇవీ మ్యాచ్‌లు... గతంలో విశాఖ వేదికగా 2012లో డెక్కన్ చార్జర్స్‌తో చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబయ్ ఇండియన్స్ జట్లు ఆడగా ఈసారి సన్‌రైజర్స్‌తో రాజస్థాన్, ఢిల్లీ,కోల్‌కతా జట్లు ఆడనున్నాయి. ఏప్రిల్- 16న రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి 8గంటలకు ఏప్రిల్- 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు ఏప్రిల్ -22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు -
హైదరాబాద్ x ఆంధ్ర
తొలి పోరులో ‘ఢీ’ నేటి నుంచి రంజీ ట్రోఫీ షురూ మొదటి రౌండ్లో 12 మ్యాచ్‌లు సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2014-15 సీజన్ మ్యాచ్‌లు ఆదివారం ప్రారం భం కానున్నాయి. తొలి రౌండ్లో భాగంగా వివిధ మైదానాల్లో నేటి నుంచి 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ వైఎస్ఆర్ స్టేడియంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడబోతున్నాయి. గత ఏడాది ఫార్మాట్‌నే కొనసాగిస్తూ మొత్తం 27 జట్లను మూడు గ్రూప్‌లుగా విభజించారు. సాధారణంగా ప్రతి ఏటా వన్డే టోర్నీలకు ముందే రంజీ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. అయితే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో ముందుగా వన్డేలు జరిపారు. దాంతో కాస్త ఆలస్యంగా రంజీ ట్రోఫీ మొదలవుతోంది. ఫిబ్రవరి 8నుంచి 12 వరకు జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులు మినహా ఇతర ఆటగాళ్లంతా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. పలువురు వెటరన్, సీనియర్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో టీమిండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు కూడా ఈ నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. రాత మారుతుందా... రంజీ ట్రోఫీలో చాన్నాళ్లుగా హైదరాబాద్, ఆంధ్ర జట్లది ఒకే రకమైన కథ, వ్యథ. ఇరు జట్లు ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్నాయి. ఎప్పుడో ఒక మెరుపు తప్ప దేశవాళీలో నిలకడగా, చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. గత సీజన్లో గ్రూప్ ‘సి’ నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్, ఆంధ్ర మెరుగ్గా రాణించలేక అక్కడే చతికిలపడ్డాయి. ఫలితంగా ఈసారీ గ్రూప్‘సి’ బరిలో దిగాల్సి వస్తోంది. రంజీ నిబంధనల ప్రకారం ‘సి’ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’కి ప్రమోట్ అవుతాయి. గత ఏడాది అక్షత్ రెడ్డి సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇప్పుడు రవితేజను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన కైఫ్‌కు ఆంధ్ర జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇరు జట్లలోనూ స్వల్ప మార్పులు మినహా ఎక్కువ మంది పాతవారే ఉన్నారు. ఈ రెండు జట్లలో ఏదైనా ముందుకు వెళుతుందో చూడాలి. రంజీ ట్రోఫీ గ్రూప్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: కర్ణాటక, బెంగాల్, ముంబై, రైల్వేస్, యూపీ, బరోడా, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘బి’: మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, సౌరాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, హర్యానా, ఒడిషా. గ్రూప్ ‘సి’: హైదరాబాద్, ఆంధ్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, అస్సాం, త్రిపుర, జార్ఖండ్, సర్వీసెస్. -
జేసీ ఘెరావ్
క్రీడా పాఠశాలలో ఐదు గంటల పాటు ఆందోళన జాయింట్ కలెక్టర్‌కు చుక్కెదురు జేసీని ముట్టడించి బైఠాయింపు సూపర్వైజర్లపై చర్యలకు పట్టు చర్యలు తీసుకుంటామన్న హామీతో ఆందోళన విరమణ వైవీయూ : వైఎస్ఆర్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. క్రీడాపాఠశాలలో ఇన్సూరెన్స్ సొమ్ము స్వాహాతో పాటు, సూపర్వైజర్ల దురుసు ప్రవర్తనపై విచారణాధికారిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావుకు చుక్కెదురైంది. దాదాపు నాలుగు గంటలకు పైగా ఆయన్ను కదలనివ్వకుండా బైఠాయించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఘెరావ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘటనలతో పాటు హాస్టల్ సూపర్వైజర్ల దురుసు ప్రవర్తనపై విచారణ కోరుతూ క్రీడాపాఠశాల విద్యార్థులు పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. దీనిపై విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్ రామారావును నియమించారు. ఈయన నాలుగు రోజుల క్రితం ఓమారు క్రీడాపాఠశాలకు వెళ్లి విచారించారు. తిరిగి గురువారం 10.45 గంటల సమయంలో మరోసారి పూర్తిస్థాయి విచారణ నిర్వహించేందుకు క్రీడాపాఠశాలకు వెళ్లారు. తొలుత కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు ప్రవేశించడంతో సమస్య తీవ్రస్థాయికి చేరుకుంది. వెంటనే క్రీడాపాఠశాల విద్యార్థులు ఆయన విచారిస్తున్న కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. బయటకు వచ్చి బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు. జేసీ ఎక్కడ వెళ్లిపోతారోనని ఆయన కారు చుట్టూ అడ్డంగా విద్యార్థులు బైఠాయించారు. దీంతో జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ప్రత్యేకాధికారి ప్రసన్నాంజనేయులు ఇరువురూ మెట్ల వద్దే కూర్చున్నారు. సమస్యలను చెప్పాలని విద్యార్ధులను కోరారు. దీంతో విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, హాస్టల్ వార్డెన్స్ వ్యవహరిస్తున్న దురుసుప్రవర్తనను వివరించడంతో పాటు లిఖితపూర్వకంగా అందజేశారు. విచారణ సమయంలో కొందరు విద్యార్థులు కన్నీరు పెట్టుకోవడం అధికారులను కదిలించింది. తాము చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు జేసీ హామీ ఇచ్చారు. నాలుగు గంటల పాటు సాగిన హైడ్రామా... విద్యార్థులు స్వయంగా జాయింట్ కలెక్టర్‌కు సమస్యలను చెప్పినప్పటికీ వెంటనే చర్యలు ఎందుకు తీసుకోరంటూ డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. వీరికి జతగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శృతి కలపడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాన్ని డీవైఎఫ్ఐ నాయకులు తిడుతుండగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వారి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. అనంతరం పది రోజులుగా విచారణ చేపడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతోందంటూ డీవైఎఫ్ఐ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి సిబ్బందికి అండగా నిలుస్తున్న అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జేసీ డౌన్‌డౌన్ అంటూ వెంటనే హాస్టల్ వార్డెన్స్‌ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన వీడమంటూ భీష్మించుకు కూర్చున్నారు. హాస్టల్ సూపర్వైజర్లను పిలిపించి విద్యార్థుల సమక్షంలో విచారించాలని కోరారు. దీంతో హాస్టల్ సూపర్వైజర్లుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి, భారతిలను జేసీ పిలిపించి విచారించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘ నాయకులు బైఠాయించారు. దీంతో బయటకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో పాటు మధ్యాహ్నం సమయంలో కావడంతో విద్యార్థులు, అధికారులకు ఆందోళన కారణంగా ఆకలిబాధలు తప్పలేదు. అనంతరం జేసీ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. విచారణ నివేదికను అందజేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు పట్టువీడలేదు. వెంటనే సస్పెండ్ చేయాలంటూ బైఠాయించారు. దీంతో జేసీ చేసేదీమీ లేక కూర్చుండిపోయారు. విద్యార్థులు సైతం అర్ధాకలితోనే ఓవైపు వర్షం కురుస్తున్నా ఆందోళనను కొనసాగించారు. వీరికి తోడుగా కోచ్‌లు, అధ్యాపకులు సైతం జాయింట్ కలెక్టర్‌కు పలు విషయాలు విన్నవించారు. ఎట్టకేలకు 4.30 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్ సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవడానికి నివేదిక సాయంత్రంలోపు అందజేసి చర్యల వివరాలను పత్రికలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన వీడారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నగర అధ్యక్షుడు విజయ్, భరత్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వేణుగోపాల్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా రాజ‘యోగం
కడప స్పోర్ట్స్: ప్రపంచ వ్యాప్తంగా నేడు యోగకు ప్రాధాన్యత పెరుగుతోందని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేకాధికారి ఎం. రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ‘క్రీడల్లో యోగ ప్రాధాన్యత’ అన్న అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో వేళ ఏళ్ల కిందటే యోగులు, బ్రహ్మర్షులు మనకందించిన సంస్కృతి యోగ అన్నారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి, చేస్తున్న రంగంలో ఉన్నతస్థానం పొందడానికి యోగ చక్కటి సాధనమన్నారు. క్రీడాకారులు వారి క్రీడల్లో రాణించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి యోగ తోడ్పడుతుందన్నారు. నేడు క్రీడల్లో సైతం యోగాసనాల పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇతర క్రీడలతో పాటు యోగలో కూడా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ స్కూల్ యోగ కోచ్ డాక్టర్ ఆర్. రంగనాథ్ రెడ్డి మాట్లాడుతూ యోగసాధనకు కొంత సమయం కేటాయించడం వల్ల క్రీడాకారుల్లో ఏకాగ్రత, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనోస్థైర్యం సిద్ధిస్తుందన్నారు. అనంతరం క్రీడాకారులు యోగాలో పలు ఆసనాలు వేసి అలరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కోచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.