ముంబై: భారత్, వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం విశాఖపట్నంకు దక్కింది. వచ్చే నెల 24న ఈ మ్యాచ్ జరుగుతుంది. వైజాగ్‌లో వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆఖరి సారిగా 2011, డిసెంబర్ 2న భారత్, వెస్టిండీస్ మధ్యే వన్డే మ్యాచ్ జరిగింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నవంబర్ 21న కొచ్చిలో జరుగుతుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 27న జరిగే మూడో వన్డే వేదికను ఖరారు చేయలేదు. ఈ మ్యాచ్ బరోడా లేదా కాన్పూర్‌లో నిర్వహిస్తారు. టెస్టు సిరీస్‌కు ముందు 31 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు కటక్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుతో వెస్టిండీస్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. టెస్టు, వన్డే సిరీస్‌లో పాల్గొనే వెస్టిండీస్ జట్టు ఈ నెల 28న భారత్ చేరుకుంటుంది.
వైజాగ్‌లో భారత్, విండీస్ వన్డే
Published Wed, Oct 16 2013 12:47 AM | Last Updated on Tue, May 29 2018 6:13 PM
Advertisement
Advertisement