west indies series
-
పాక్ ఫైనల్‌కు రావడంలో ఆశ్చర్యం లేదు
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్థాన్ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని.. క్రికెట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు లేకపోవడంపై బుమ్రా స్పందించాడు. వంద శాతం ఫిట్‌గా ఉన్నానని కానీ విశ్రాంతి అవసరమని సెలెక్టర్లు భావించడంతో వెస్టీండిస్ పర్యటనకు ఎంపిక చేయలేదని ఈ స్పీడ్‌స్టార్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో ఈ నెల 23 నుంచి జరిగే 5 వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌లకు ఓపెనర్ రోహిత్ శర్మ, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, కానీ సెలక్టర్లు, టీం మెనెజ్‌మెంట్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని బుమ్రా పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని స్పష్టం చేశాడు. ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందలేదని చెప్పుకొచ్చాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఏకంగా 41 డాట్ బంతులు వేశాడు. డాట్ బంతుల వల్ల బ్యాట్స్‌మెన్ కు ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు వికెట్లు దక్కుతాయని బుమ్రా అభిప్రాయపడ్డాడు. యార్కర్లు వేయడం కష్టమని దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా కృషి చేశానని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ గుజరాతీ చాంపియన్స్ ట్రోఫీలో రివర్స్ స్వింగ్ బంతులతో డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. -
ఇంగ్లండ్‌కు ఊరట విజయం
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో తొలి రెండు టి20 మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్... చివరి మ్యాచ్‌లో గెలిచి ఊరట పొందింది. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ (9 బంతుల్లో 27 నాటౌట్; 4 సిక్స్‌లు; 3/39) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో ఇంగ్లండ్ 5 పరుగులతో నెగ్గింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిమ్మన్స్ (55 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జోర్డాన్ మూడు వికెట్లతో విండీస్‌ను కట్టడి చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. -
కోల్‌కతా మొత్తం మాస్టర్‌మయం
వన్డే సిరీస్‌లో భారత్ విజయం తర్వాత ఇప్పుడు పరుగుల వేదిక టెస్టులకు మారింది. సొంత గడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ అంటే క్రికెట్ వీరాభిమాని కూడా దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. అయితే ఇప్పుడు జరగబోయేది అలాంటిలాంటి సిరీస్ కాదు! ప్రపంచ క్రికెట్లో పాతికేళ్ల పాటు తనదైన ముద్ర వేసిన ఒక దిగ్గజ క్రికెటర్ రంగం నుంచి తప్పుకుంటున్న సందర్భమిది. కాబట్టి రెండు టెస్టుల్లో అతని ప్రతి కదలిక, ప్రతి పరుగుపై చర్చ సహజం... అందరికీ ఆసక్తికరం. ఈ నేపథ్యంలో 199వ టెస్టు వేదిక అయిన కోల్‌కతా ఇప్పుడు మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నామమే జపిస్తోంది. -
వైజాగ్‌లో భారత్, విండీస్ వన్డే
ముంబై: భారత్, వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం విశాఖపట్నంకు దక్కింది. వచ్చే నెల 24న ఈ మ్యాచ్ జరుగుతుంది. వైజాగ్‌లో వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆఖరి సారిగా 2011, డిసెంబర్ 2న భారత్, వెస్టిండీస్ మధ్యే వన్డే మ్యాచ్ జరిగింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నవంబర్ 21న కొచ్చిలో జరుగుతుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 27న జరిగే మూడో వన్డే వేదికను ఖరారు చేయలేదు. ఈ మ్యాచ్ బరోడా లేదా కాన్పూర్‌లో నిర్వహిస్తారు. టెస్టు సిరీస్‌కు ముందు 31 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు కటక్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుతో వెస్టిండీస్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. టెస్టు, వన్డే సిరీస్‌లో పాల్గొనే వెస్టిండీస్ జట్టు ఈ నెల 28న భారత్ చేరుకుంటుంది.