బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో తొలి రెండు టి20 మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్... చివరి మ్యాచ్‌లో గెలిచి ఊరట పొందింది. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ (9 బంతుల్లో 27 నాటౌట్; 4 సిక్స్‌లు; 3/39) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో ఇంగ్లండ్ 5 పరుగులతో నెగ్గింది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిమ్మన్స్ (55 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జోర్డాన్ మూడు వికెట్లతో విండీస్‌ను కట్టడి చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
ఇంగ్లండ్‌కు ఊరట విజయం
Published Sat, Mar 15 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement
Advertisement