విశాఖపట్నం, న్యూస్‌లైన్: సినీ తారల క్రికెట్ మ్యాచ్‌లో బాలీవుడ్ జట్టు విజేతగా నిలిచింది. పరుగుల వేటలో బోల్తా పడిన టాలీవుడ్ 67 పరుగుల తేడాతో ఓడింది. వైఎస్సార్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ డే నైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బాలీవుడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
వరుణ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. రాజా శర్వాణి 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు సాధించాడు. ఆదర్శ్ 2 వికెట్లు తీయగా, రాజీవ్, ప్రిన్స్‌లు చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన టాలీవుడ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
విజేత బాలీవుడ్
Published Sun, Dec 22 2013 2:55 AM | Last Updated on Wed, Apr 3 2019 7:12 PM
Advertisement
Advertisement