
బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్(Sanjay Dutt) హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్ డాగ్స్’. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.
ఈ రీమేక్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్‌లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సల్మాన్ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ వేషంలో ఉండగా... సంజయ్ సూటు ధరించి ఉన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్ ఈస్ట్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్‌లో నటింపజేస్తున్నారట హాలీవుడ్ మేకర్స్. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment