ఫుట్‌బాల్‌ ఎంపికలకు చక్కటి స్పందన | more responce to football selections | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ ఎంపికలకు చక్కటి స్పందన

Published Tue, Sep 20 2016 11:15 PM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

ఫుట్‌బాల్‌ ఎంపికలకు చక్కటి స్పందన - Sakshi

ఫుట్‌బాల్‌ ఎంపికలకు చక్కటి స్పందన

కడప స్పోర్ట్స్‌:
స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ ఎంపికలకు చక్కటి స్పందన లభించింది. మంగళవారం నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌.ఎ. సునీల్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతేడాది రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు చక్కటి ప్రతిభ కనబరిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ యేడాది విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్లను ప్రకటించారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల కోచ్‌ హరి, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అమృత్‌రాజ్, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుపాల్‌రెడ్డి, సంపత్, ఎజాజ్, నిత్యప్రభాకర్, మహబూబ్‌బాషా, బీసీవీ సుబ్బయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులు
అండర్‌–14 బాలికలు :
 వి.శ్రీదేవి, కె.దుర్గ, డి. నిరీక్షణ, ఎస్‌.చందుప్రియ, కె.సునీత, టి.స్వప్న, జి.లేఖన, ఎ.భవిత. ఆర్‌.సుకన్య, ఎస్‌.సమీర, డి.పావని, బి.అరుణ, ఆర్‌.గంగోత్రి, ఐ.కీర్తి, పి.యామిని, వి.గంగోత్రి, వి.నాగమునెమ్మ, ఎం.నందిని. స్టాండ్‌బై : వి.గాయత్రి, ఎం.పల్లవి, జి.విజయ, వెంకటలక్ష్మి, శివరంజని.
అండర్‌–17 బాలికలు : యు.వరలక్ష్మి, జి.మానస, సీమెచ్‌ రాజ్యలక్ష్మి, పి.గాయత్రి, బి. దివ్య, ఎన్‌.కమాల్‌బీ, పి.వీరలావణ్య, జి.వి.సౌమ్య, సి.సుహాన్‌బేగం, ఎ.కౌసల్య, ఎం.శిరీష, యు.హరిణి, సి.వెంకటనవిత, జె.ప్రవళ్లిక, డి.చంద్రవదన, కె.ఉమాదేవి, ఎస్‌.శ్రావణి, ఎం.హవిల. స్టాండ్‌బై : కె.నందిని, హరిప్రియ, భూదేవి, మనోరంజని.
అండర్‌–14 బాలురు :
జి. రాజేష్, ఎన్‌.బాషా, బి.ఉదయ్‌కిరణ్‌రెడ్డి, ఎం.సంతోష్, వి.సాయిరాం, కె.పరమేష్‌రెడ్డి, సతీష్, బి.జె.వెస్లీ, ఎస్‌.మహమ్మద్‌రఫి, సి.హరికిరణ్, ఎస్‌.మహేష్, జె. బన్నీ, యు. ప్రణయ్, ఎ. రవితేజ, మనోజ్‌కుమార్‌రెడ్డి, టి. దినేష్, ఎస్‌. అహ్మద్, జి.దివాకర్, వెంకటనాయుడు, పూజిత్‌.
అండర్‌–17 బాలురు :
బి. మేఘనాథ్, కొండారెడ్డి, కె.జగదీష్, కె.రామాంజి, ఎస్‌. దిలీప్, ఎ.వెంకటసాయికిరణ్, ఎస్‌.సొహైల్, కె.అజయ్‌కుమార్‌సంజీవ్, ఎస్‌.మోహన్, ఎస్‌. రాము, ఎస్‌.కె. గైబుసా, పి.సాయికుమార్, ఎం.జయచంద్ర, ఆర్, సుధాప్రియదర్శన్, ఎన్‌.శివకుమార్, డి.అశోక్, ఎస్‌. ఇంతియాజ్, కె.వంశీ, ఎస్‌.మహమ్మద్‌యాసీన్, జి.వి.అశోక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement