భోజన వేళ.. నిలబడే తినాలి | Sport School Hostel Students Suffering With Meal Supply | Sakshi
Sakshi News home page

భోజన వేళ.. నిలబడే తినాలి

Published Mon, Sep 10 2018 1:08 PM | Last Updated on Mon, Sep 10 2018 1:08 PM

Sport School Hostel Students Suffering With Meal Supply - Sakshi

కుర్చీలు లేక నిల్చునే భోజనం చేస్తున్న క్రీడాకారులు

కడప స్పోర్ట్స్‌ : రాష్ట్రానికే తలమానికంగా నిలు స్తున్న ఏకైక క్రీడాపాఠశాల వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల.. క్రీడల పరంగా ఉన్న వసతులతో చక్కటి ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు వసతుల పరంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళ కఠోర సాధన చేసి వచ్చే క్రీడాకారులు డైనింగ్‌హాల్‌లో ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసే అవకాశం కూడా లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. డైనింగ్‌హాల్‌లో అందరికీ సరిపడా కుర్చీలు లేకపోవడంతో కొందరు కూర్చుంటే.. మరికొందరు నిల్చుని తినాల్సిన పరిస్థితి ఉంది.

ఉన్న కుర్చీలు సైతం చాలా వరకు చీలిపోయి.. పగిలిపోయి ధ్వంసమై ఉన్నాయి. ఇక నీరు తాగాలంటే కనీసం ఒక్క గ్లాసు కూడా లేకపోవడంతో మగ్గులతో ఎత్తుకుని తాగాల్సిన పరిస్థితి ఉంది. లేనిపక్షంలో వారు సొంతంగా కొనుగోలు చేసి తెచ్చుకున్న బాటిల్స్‌తో నీరు పట్టుకుని తాగాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం క్రీడాపాఠశాల విద్యార్థులకు భోజనం అందించేందుకు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరికీ కేటాయించకపోవడంతో గతంలో ఉన్నవారే ప్రస్తుతం తాత్కాలికంగా భోజనం అందిస్తున్నారు. మళ్లీ వీరికే టెండర్‌ వస్తుందా.. లేక మరెవరికైనా ఇస్తారో.. తేలకపోవడంతో కొత్త గ్లాసులు, కుర్చీలు కొనుగోలు చేసేందుకు వీరు ముందుకు రావడం లేదు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement