![Two Students Missing In Penna River At YSR Kadapa District - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/12/crime.jpg.webp?itok=bKVKa5rF)
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు వద్ద పెన్నా నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడగా మరో ఇద్దరు నదిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు ఒకరిని మాత్రమే ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరు విద్యార్థులు నీటి ప్రవాహం కొట్టుకుపోగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మరో విద్యార్థి కోసం జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
గడ్డకు చేరిన విద్యార్థి కడప రవీంద్రనగర్కు చెందిన విద్యార్థి షేక్ జహీర్‌గా పోలీసులు గుర్తించారు. గల్లంతై మృతి చెందిన విద్యార్థి కోడూరు చైతన్య కడప ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొండయ్య కుమారుడుగా తెలిపారు. గల్లంతైన మరో విద్యార్థి కమలాపురం మండలం నేటపల్లె గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీనాథ్‌రెడ్డి (16) అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment